సంపాదకీయం

శశికళాభ్యుదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు ముఖ్యమంత్రిగా వి.కె.శశికళా నటరాజన్ అనే ‘చిన్నమ్మ’ ఎంపిక కావడం వేగవంతంగా సంభవించిన పరిణామక్రమానికి పరాకాష్ఠ. ఇది ఊహించని పరిణామ పరంపర.. ఊహించిన పరిణామ పరంపర కూడ! ‘చిన్నమ్మ’ అనే పేరు ఒకటి ఉందని కూడా దాదాపు రెండునెలల క్రితం వరకూ ఎవరికీ తెలీదు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు ‘చిన్నమ్మ’ అనే బిరుదు నామం హఠాత్తుగా ఏర్పడడం ఊహించని పరిణామం! జయలలితకు, శశికళకు మధ్య గల ‘అభేదం’ గురించి మాత్రమే జయ బతికుండిన సమయంలో ప్రచారమైంది. ‘త్వమేవ అహం, త్వమేవ అహం..’- ‘నీవే నేను, నీవే నేను’ అన్న సంస్కృత సూక్తి అద్వైతస్థితికి సూచకం. అంటే ఇద్దరి మధ్య ఏకత్వానికి సూచకం. జీవుడికి దేవుడికి మధ్య, ప్రకృతికీ పురుషుడికీ మధ్య, ఆత్మకు పరమాత్మకు మధ్య, వ్యక్తికీ సమాజానికీ మధ్య ఏకత్వాన్ని చెప్పడం ఈ సూక్తి స్ఫూర్తి. అధికారానికీ, రాజకీయ వేత్తకూ మధ్య ఈ అద్వైతస్థితి ఏర్పడడం విపరిణామ క్రమం. కానీ, ఇద్దరు మహిళల మధ్య ఈ ‘అద్వైతస్థితి’ నెలకొనడం ఊహించని పరిణామం. జయలలిత, శశికళ ఇలా ఒకే వ్యక్తికి రెండు రూపాలుగా నడయాడడం దశాబ్దుల చ రిత్ర. కానీ, అ ప్పుడు జయలలిత ‘అ మ్మ’గా మాత్రమే పేరుపొందింది. శశికళను ‘చిన్నమ్మ’ అని ఎవ్వరూ పిలిచినట్టు ఎవ్వరికీ ‘గ్నాపకం’ లేదు. అన్నా డిఎంకె పార్టీ కార్యకర్తలు కానీ, తమిళ ప్రజలు కానీ జయను ‘అమ్మ’ అని పిలిచారే తప్ప, ఆమె బతికి ఉన్నంత కాలం శశికళను ‘చిన్నమ్మ’ అని సంబోధించిన దాఖలా లేదు. ‘జయ మాత్రమే ‘అమ్మ’, మరో ‘అమ్మ’ పార్టీలో లేదు’- అని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిసెంబర్ ఎనిమిదవ తేదీన వ్యాఖ్యానించినట్టు ప్రచారమైంది. కానీ, జయకు జరిగిన అంతిమ సంస్కార కార్యక్రమంలో ‘అంతా తానే’ అన్నట్టుగా శశికళ ఆర్భాటించినప్పుడు సైతం ఆమెను ‘చిన్నమ్మ’ అని ఎవరూ అభివర్ణించ లేదు. శశికళ, ఆమె భర్త నటరాజన్, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రముఖంగా కనిపించినప్పటికీ ‘అదిగో.. చిన్నమ్మ’ అని ఎవ్వరూ ఆమెను సంబోధించ లేదు. డిసెంబర్ ఎనిమిదవ తేదీన- ‘అన్నా డిఎంకె పార్టీని సైనిక క్రమశిక్షణతో నడిపించడానికి శశికళ నాయకత్వం అవసరం... ‘అమ్మ’ లేనందున ఏర్పడిన శూన్యస్థితిని ఆమె పూరించాలి..’ అని చెప్పిన సిఎం పన్నీర్ సెల్వం ‘చిన్నమ్మ’ అనే మాటను వాడలేదు. హఠాత్తుగా డిసెంబర్ చివరివారంలో ‘చిన్నమ్మ’ అనే మాట ప్రచారం కావడం, డిసెంబర్ ఇరవై తొమ్మిదిన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడం పరిణామ క్రమంలో కీలకఘట్టాలు. ఇంతత్వరగా జయలలిత మరణిస్తుందని నాలుగు నెలల క్రితం ఎవ్వరూ ఊహించలేదు. అందువల్ల ‘చిన్నమ్మ’ పుట్టుకొచ్చి, పార్టీని గుప్పిట పట్టుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు.
శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి కాగలరన్నది డిసెంబర్‌లో సాగిన ప్రచారం. అందువల్ల 29న పదవిని అధిష్ఠించడం ఊహించిన పరిణామం. ఆమె ప్రధాన కార్యదర్శి అయినప్పటి నుంచి ఐదు వారాలుగా రెండు రకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. శశికళ సమీప భవిష్యత్‌లో ముఖ్యమంత్రి కాబోదని, ఆమెకు అత్యంత విధేయతతో భృత్యుని వలె ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్న పన్నీర్ సెల్వం మరికొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగుతాడని మొదటి వర్గం ఊహాగానం. ‘చిన్నమ్మ’ పెద్దమనసు వహించి సెల్వం మంత్రివర్గానికి మార్గదర్శనం చేస్తుందని ఈ వర్గం వారి అంచనా. 2021లో శాసనసభ ఎన్నికలు జరిగేవరకూ సెల్వం పదవికి ఢోకా ఉండదన్న అత్యాశావాదులూ ఉన్నారు. ఇంతత్వరగా ‘చిన్నమ్మ’ సెల్వంను పదవీ బహిష్కృతుని చేసి తానే గద్దెనెక్కడం ఊహించని పరిణామం. కానీ, మహిళా ‘శకుని’ వలె గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతున్న ‘చిన్నమ్మ’ వ్యూహాత్మక స్వభావాన్ని గురించి తెలిసిన వారు సెల్వం మంత్రివర్గాన్ని ఆమె స్థిరపడనీయదని ప్రచారం చేశారు. ‘మన్నారుగుడి మాఫియా’ తంత్రం శశికళ ముఖ్యమంత్రి అయ్యేవరకూ విశ్రమించబోదన్నది ఈ ‘అభిజ్ఞుల’ అంచనా! ఎక్కువరోజుల పాటు సిఎం పదవిలో కొనసాగినట్టయితే ‘ఏకు’ లాంటి పన్నీర్ సెల్వం ‘మేకు’ స్వభావాన్ని సంతరించుకొని ‘బాకు’గా మారగలడన్న భయం శశికళకు కలగడం గురించి కూడ ఈ అభిజ్ఞులు ప్రచారం చేశారు. జయ బతికి ఉన్నప్పుడు మూడుసార్లు సిఎం పదవిని నిర్వహించిన పన్నీర్ సెల్వం ‘అమ్మ’ అనర్హతలు తొలగిన వెంటనే తాను పదవి నుంచి తొలగడం చరిత్ర..
ఈ చరిత్ర పట్ల శశికళకు నమ్మకం లేదని ‘అభిజ్ఞులు’ జరిపిన ప్రచారం. జయలలిత పట్ల ఉండిన విధేయత పన్నీర్ సెల్వ ంలో శశికళ పట్ల విధేయతగా మారడం అ సాధ్యమన్నది ఆ ‘అభిజ్ఞుల’ అంచనా. కొత్తకొత్తలో విధేయతను నటించినప్పటికీ కాలం గడిచే కొద్దీ సె ల్వం ఆమెను ధిక్కరించ వచ్చునట.. ఆమె చేయగల ‘అమూల్యమైన మార్గదర్శనాన్ని’ తిరస్కరించ వచ్చునట. అందువల్ల తిరుగుబాటు తలెత్తకుండా ‘చిన్నమ్మ’ పెద్దమ్మగా మారి సెల్వంని గద్దె దించడం ఖాయమని ఆమె స్వభావం గ్రహించిన అభిజ్ఞులు ప్రచారం చేశారు. అందువల్ల సెల్వం పదవీచ్యుతి, చిన్నమ్మ సిఎం కావడం వీరు ముందుగా ఊహించిన పరిణామమే! ఇంత త్వరగా ఈ పరిణామ ప్రక్రియ పరాకాష్ఠకు చేరుతుందన్నది ఈ అభిజ్ఞులు సైతం ఊహించలేదు. మాధ్యమాల్లో ప్రచారం జరగలేదు. ‘అనభిజ్ఞుల’తో పాటు ‘అభిజ్ఞులు’ ఈ హఠాత్ పరిణామానికి విస్మయగ్రస్తులై పోయారు. గత నెల రోజులుగా శశికళ ఇలా ఇప్పుడు సిఎం అయ్యే అవకాశం గురించి ప్రచారమే లేదు, ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. శనివారం ఈ ప్రచారం ఆరంభమైంది. ఆదివారం అది వాస్తవమైంది. ‘జల్లికట్టు’ తమిళ ప్రజల మనోభీష్టం. రద్దయిన ఈ గోవంశ సంరక్షణ ‘క్రీడ’ను పునరుద్ధరించడం ద్వారా ముఖ్యమంత్రిగా సెల్వం మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆయనకు మరింత మంచిపేరు రాకముందే ‘చిన్నమ్మ’గా పేరు మార్చుకున్న శశికళ ఆయనను పదవి నుంచి తప్పించింది. ఆమె ధిషణా పటిమకు, మేధాగరిమకు, వ్యూహరచనా నిపుణతకు, కార్యకర్తలపై ఆమెకున్న పట్టుకు ఈ విపరిణామం పరాకాష్ఠ. ఇది ‘శశికళాభ్యుదయం’...
జయలలిత అన్నా డిఎంకె సంస్థాపక అధినేత, మాజీ సిఎం ఎంజి రామచంద్రన్‌కు అత్యంత సన్నిహితురాలు. కానీ, 1987లో ఎంజిఆర్ దివంగతుడైన తర్వాత జయకు ఆయన రాజకీయ వారసత్వం వెంటనే లభించలేదు. దాదాపు రెండేళ్లు ఆమె పార్టీలో పోరాటం సాగించాల్సి వచ్చింది. పార్టీని చీల్లడం, మళ్లీ రెండు వర్గాలను కలపడం ఈ పోరాటంలో భాగం. శశికళకు అలాంటి సంఘర్షణ జరుపవలసిన అవసరమే రాలేదు. పార్టీ పదవిని స్వీకరించాలని సిఎం సెల్వం ఆమెను ప్రాధేయపడినాడు. ప్రభుత్వ పదవిని చేపట్టాలని కూడా ప్రార్ధించాడట! శశికళ అమలు చేసిన వ్యూహం ఇది.. ఎవ్వరూ ఎదురు తిరగని వ్యూహమిది...