సంపాదకీయం

నగరాలకు ‘నమూనా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణకు, మాతృభూమికి మధ్య పోరాటం కొ నసాగుతుండడం నడుస్తున్న చరిత్ర. బహుళ జా తీయ వాణిజ్య సంస్థలు మన వ్యవసాయ భూమిని బొక్కేస్తున్నాయి, అటవీ సీమలను ఆక్రమిస్తున్నాయి, పచ్చదనాన్ని పాడు చేస్తున్నాయి. హరిత రక్షణకు ఆర్భాటంగా కార్యక్రమాలను అమలుచేస్తున్న ప్రభుత్వాలు హరిత విధ్వంసక కలాపాలను సైతం సమాంతరంగా కొనసాగిస్తుండడం భారతీయతపై ప్రపంచీకరణ సాధించిన ఆధిపత్యానికి సాక్ష్యం. ‘స్వచ్ఛత’పై ‘కాలుష్యం’ సాధిస్తున్న ‘విజయం’. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం చుట్టూ నిర్మిస్తున్న పట్టణ వాటికల- శాటిలైట్ టౌన్‌షిప్స్- ప్రాంతీయ పట్టణాల- రీజినల్ టౌన్‌షిప్స్- పథకానికి ఇదొక నేపథ్యం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కూడ ఈ పథకం ఒక పాఠం లేదా మార్గదర్శకం కావాలి. ఎందుకంటే మహానగరాల నిర్మాణ పద్ధతి కాలుష్య కేంద్రీకరణకు దోహదం చేయడం మనదేశంలో దశాబ్దుల చరిత్ర. విదేశీయ దురాక్రమణదారులు మనపై పెత్తనం చెలాయించడం ఆరంభం కాక పూర్వం శతాబ్దుల తరబడి అమలు జరిగిన నగర నిర్మాణ పద్ధతులను మనం మరచిపోవడం ఈ ‘దశాబ్దుల కొత్త చరిత్ర’కు ప్రాతిపదిక. భా రతీయమైన పద్ధతులను ప ట్టించుకోనివారు వివిధ రాష్ట్రాలలో పాలకులు కా వడం ఈ కొత్త చరిత్ర రూపొందడానికి కా రణం. నగరాలు అడ్డంగా విస్తరించడానికి వీలుగా తక్కువ అంతస్థులతో ఇళ్లను, భవనాలను నిర్మించడం భారతదేశంలో శతాబ్దుల పాటు నెలకొన్న వ్యవస్థ. పాశ్చాత్యుల ప్రభావంతో మన దేశంలో బహుళ అంతస్థుల ఆకాశహర్మ్యాలను నిర్మించడం మొదలైంది. ఫలితంగా నగరాలు నిలువున పెరిగాయి, పెరుగుతున్నాయి. అంతస్థుల భవనాలను నిర్మించడం వల్ల మాత్రమే నగరాలకు అంతర్జాతీయ స్థాయి లభించదన్న భావం లేదా భ్రాంతి మన పాలకులలో అత్యధికులను ఆవహించి ఉంది. నగరాలు నిలువున పెరగడం వల్ల భూమిపై ఒత్తిడి పెరుగుతోంది, నేలతల్లి కుంగిపోతోంది. ఒక కుటుంబం జీవించవలసిన స్థలంలో ఒక కుటుంబం నెత్తిన మరో కుటుంబం జీవిస్తోంది. ఇలా పది కుటుంబాలు లేదా కనీసం ఐదు కుటుంబాలు ఒకరి నెత్తిన మరొకరు ఎక్కి కూర్చుని ఉండడానికి ఏకైక కారణం ‘అంతస్థుల’ ఆకాశహర్మ్యాల నిర్మాణం. ఈ విపరిణామ క్రమంలో ఇరవై ఏళ్లకు పూర్వం ఒక కుటుంబం ఉన్న చోట ప్రస్తుతం కనీసం ఐదు కుటుంబాలు జీవిస్తున్నాయి. పది కుటుంబాలు జీవించడానికి వీలుగా పది పదిహేను అంతస్థుల భవనాలు కూడా వెలిశాయి. ఒక వాహనం నిలిపిన చోట ఇప్పుడు కనీసం ఐదు వాహనాలు నిలబడి ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ఒకేసారి రోడ్డెక్కేసరికి భరించలేని రోడ్లు కుంగిపోతున్నాయి. జనం రద్దీని తట్టుకోలేని రహదారులు పగిలిపోతున్నాయి. హైదరాబాద్ ‘ప్రగతి’కి ఇదీ ప్రాతిపదిక. ఈ ‘ప్రగతి’ అమరావతిలో కూడా పునరావృత్తం కావాలా? ‘అంతర్జాతీయ స్థాయి’ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకని పదే పదే ఆర్భాటిస్తున్నాడు?
హైదరాబాద్ పదిహేనేళ్ల క్రితమే ‘ఆదర్శ నగరం’, ‘నమూనా నగరం’- అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేకసార్లు ప్రకటించాడు. కానీ అప్పటికీ, ఇప్పటికీ కూడా హైదరాబాద్ గొప్ప కాలుష్య ప్రాంగణంగానే అలరారుతోంది. దీనికి కారణం ముప్పయి ఏళ్లపాటు నగరంలోని మధ్య ప్రాంతం- కోర్ సిటీ-లో ఒక ఇంటిని పడగొట్టి అదే స్థలంలో అంతస్థుల భవనాన్ని నిర్మించడం. దీని పేరు ‘్భమిని అభివృద్ధి’ చేయడమని ప్రచారమైంది. ఈ ‘అభివృద్ధి’ కారణంగా మూసీ నదిలోని వినాయక సాగర్- హుస్సేన్‌సాగర్-లోకి పరుగులు తీసిన మురికి కాలువల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అంతస్థుల భవనాల ప్రాంగణాలలో వేల అడుగుల లోతు వరకూ గొట్టపుబావులు తవ్వడం వల్ల, నీటిని తోడేయడం వల్ల భూగర్భం ఎండిపోయింది. భూగర్భ జలాలు ఇంకిపోయినట్టు, ఇంకిపోతున్నట్టు ప్రచారం అవుతున్నప్పటికీ మళ్లీ మళ్లీ అంతస్థుల భవనాలను నిర్మించడం, ప్రభుత్వాలు అనుమతినివ్వడం ‘్భగ్యనగరం’ నరకంగా మారడానికి దోహదం చేసిన వైపరీత్యాలు. నగరం మధ్య భాగంలో అంతస్థుల భవనాలను నిర్మించకుండా గతంలోనే నిరోధించినట్టయితే ఇప్పుడు తలపెట్టిన పట్టణ వాటికల స్థలం వరకూ భాగ్యనగరం సహజంగానే విస్తరించి ఉండేది.
అలా విస్తరించి ఉండినట్టయితే హైదరాబాద్ మధ్య భాగంలో జనం రద్దీ, కాలుష్యం బాధ ఉండేవి కావు, పట్టణ వాటికలను నిర్మించాల్సిన అవసరం ఉండేది కాదు. పోచారం, ఆదిభట్ల, శంషాబాద్, ముత్తంగి, మేడ్చల్, శామీర్‌పేట వంటి చోట్ల ఇప్పుడు పట్టణ వాటిక-శాటిలైట్ టౌన్‌షిప్-లను తెలంగాణ ప్ర భుత్వం నిర్మిస్తుందట. ని జానికి ఇప్పటికే హైదరాబాద్ ఈ గ్రామాల వరకూ విస్తరించింది. బీబీనగర్, షాద్‌నగర్, నరసాపూర్, తూఫ్రాన్ వంటి చోట్ల హైదరాబాద్ చుట్టూ ‘ప్రాం తీయ పట్టణాల’ను ఏ ర్పాటు చేస్తారట. కానీ ఈ పట్టణ వాటికలలోను, ప్రాంతీయ పట్టణాలలోను జనం తమంత తాముగా ఇళ్లను కట్టుకుంటారా? లేక ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ప్రజలకు కేటాయిస్తుందా? నగరం మధ్య ప్రాంతంలోని వారు ఈ వాటికలకు, పట్టణాలకు వెళ్లి స్థిరపడతారా? అందుకోసం ప్రభుత్వం కలిగించే ప్రోత్సాహకాలేమిటి? అన్నవి స్పష్టం కావలసి ఉంది. వౌలిక సదుపాయాల కల్పనకు ఆయా వాటికల్లో వంద ఎకరాల స్థలం చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుందట. ఏమైనప్పటికీ హైదారాబాద్ చుట్టూ వాటికలను నిర్మించవలసి రావడానికి దారితీసిన పరిణామ క్రమం ‘అమరావతి’ నిర్మాతలకు గుణపాఠం కావాలి.
పొలాల మధ్య ఇళ్లు, ఇళ్ల చుట్టూ పొలాలు, పండ్ల తోటల మధ్య కూరగాయల తోటల మధ్య ఇళ్లు, ఇళ్ల చుట్టూ తోటలు- ఇదీ ప్రాచీన భారత దేశంలోని ఆదర్శ నగరాల నిర్మాణ పద్ధతి. అంగళ్లలో రతనాలను అమ్మిన హంపీ విజయనగరం మధ్యలో రైతులు కూరగాయలు పండించేవారు. ఒకదానితో ఒకటి ఇమిడిన ఏడు వృత్తాకారపు ప్రాంగణాలుగా హంపీ విజయనగరం ఏర్పడింది. వీటిలో మూడు ప్రాకారాలు పచ్చని పొలాలు, పండ్లతోటలు. కాలుష్యం అంటని నగర జీవనానికి ఇదీ నమూనా. ఈ భారతీయ పద్ధతిని ఇప్పుడు విదేశాల్లో ప్రధానంగా సంపన్న దేశాల్లో పాటిస్తున్నారు. అమెరికాలోని చికాగో నగరం మధ్యలో పెద్ద అడవి ఉందట. ‘అమరావతి’ నిర్మాణం కోసం సేకరించిన ముప్పయి ఐదువేల ఎకరాల్లో కనీసం మూడవ వంతును ఇలా పంటలను, పండ్లతోటలను, అడవులను, పచ్చదనాన్ని పెంచడానికి కేటాయిస్తే భవిష్యత్‌లో నగరం చుట్టూ పట్టణ వాటికలను ఏర్పాటు చేయనవసరం రాదు. ఎనిమిది తొమ్మిది రంగాలకు చెందిన మహానగరాలను ఒకేచోట కేంద్రీకరించి ‘అమరావతి’ని కోటి జనాభాతో నింపడం వల్ల కాలుష్యం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. పాలనా నగరాన్ని మాత్రమే అమరావతిలో ఉంచి మిగిలిన వాణిజ్య, క్రీడా, విద్యా నగరాలను ఇతర జిల్లాలకు వికేంద్రీకృతం చేయడం మేలు. ‘ముచికుంద’ ఒకప్పుడు అమలిన జలవాహిని. ఇప్పుడు మురుగునీటి మూసీ! ముచికుంద ‘గతి’ కృష్ణానదికి పట్టరాదు.