సంపాదకీయం

ఆలయ భూమికి ‘స్వాములు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడి మాన్యాలను సంప్రదాయేతర కలాపాలకు మ ళ్లించే ప్రయత్నాలను హైదరాబాద్ ఉన్నత న్యా యస్థానం నియంత్రించడం ముదావహం. నోరులేని దేవుడి భూములను నోరున్నవారు, నోటిలో కోరలున్నవారు కాజేస్తుండడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశమంతటా కొనసాగుతున్న వైపరీత్యం! ఈ వైపరీత్యం ఇక సాగరాదన్నది బుధవారం ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, షమీమ్ అక్తర్ జారీ చేసిన తత్కాల ఆదేశాల సారాంశం. అనేక దేవాలయల భూములను ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు విచ్చలవిడిగా అన్యాక్రాంతం చేస్తుండం ఈ న్యాయాంకుశ ప్రయోగానికి నేపథ్యం! ఈ తాత్కాలిక న్యాయ నిర్ణయం వల్ల ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యే వైపరీత్యం పూర్తిగా తొలగిపోదు. అయినప్పటికీ నియంత్రణకు గురి కావడం ఖాయం. వివిధ దేవాలయేతర కలాపాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవాలయ భూములను కేటాయించడంలో నిహితమై వున్న వి ధాన లోపాన్ని హైకోర్టు న్యా యమూర్తులు ప్రస్తావించా రు. ఆలయ భూములను ఇతరులకు కేటాయించే అధికారం ప్రభుత్వాలకు లేదన్న వాస్తవం ఈ తీర్పుతో మరోసారి ప్రస్ఫుటమైంది! ఈ భూములను ప్రభుత్వాలు ఇతరులకు ధారాదత్తం చేయడానికి వీలుగా ప్రభుత్వాలకు ఆలయాల అధికారులు అనుమతిని ప్రదానం చేస్తున్నారట! ఈ విధానం పట్ల న్యాయమూర్తులు విస్మయం ప్రకటించడం ప్రభుత్వాలకు అభిశంసనం వంటిది. ఆలయాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల అదుపాజ్ఞలలో పని చేసే వ్యవస్థకు చెందిన వారని, ఈ అధికారులు ప్రభుత్వానికి అనుమతి ఎలా ప్రసాదించగలరని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ వైపరీత్యాన్ని కొనసాగనివ్వబోమని న్యాయమూర్తులు స్పష్టం చేయడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి.
ఆలయాల భూములను అన్యాక్రాంతం చేయడం, లభిస్తున్న పరిహారం సొమ్మును ప్రభుత్వం వారి దేవాదాయ ధర్మాదాయ విభాగం ఖాతాలలో జమ చేసే పద్ధతిని కూడ హైకోర్టు న్యాయమూర్తులు తప్పుపట్టారు. దీనివల్ల ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు పాలుపడిన అవకతవకలు బయట పడ్డాయి. శతాబ్దుల క్రితం సహస్రాబ్దుల క్రితం పాలకులు, ప్రజలు ఆయా దేవాలయాలకు ప్రదానం చేసిన భూములు ఆ ఆలయాల స్వంత ఆస్తులు. అందువల్ల భూములపై లభించే ఫలసాయాన్ని ఆయా ఆలయాలలో ధూప దీప నైవేద్యాలకు అర్చకుల తదితర ఆలయ నిర్వాహక ఉద్యోగుల పోషణకు మాత్రమే ఉపయోగించాలన్నది సంప్రదాయం. సమగ్రమైన ఆలయ వ్యవస్థ ద్వారా దాదాపు పద్దెనిమిది వృత్తులవారి పరిపోషణ జరగడం చరిత్ర. ఈ చరిత్రను మొత్తం విదేశీయ దురాక్రమణ దారులు చెరచిపోయారు. భావదాస్యగ్రస్తులైన స్వదేశీయ పాలకులు దురాక్రమణ పూర్వస్థితిని పునరుద్ధరించకపోవడం ఆలయాలు పాడుపడడానికి, పండిన భూములు ఎండిన బీళ్లుగా మారడానికి నేపథ్యం! పండుతున్న భూములను అసాంఘిక శక్తులు ఆక్రమించుకుని దేవుడికి సున్న చుట్టడం దేశమంతటా కొనసాగుతున్న దుస్థితి! భూములను అన్యాక్రాంతం చేయడం వల్ల లభించే పరిహారం సొమ్మును ఆయా ఆలయాల ఖాతాలలోనే జమకట్టాలన్న హైకోర్టు ఆదేశం ఆలయాల ఆర్థిక దుస్థితిని కొంతైనా తొలగించడానికి దో హదం చేయగలదు!
ఇలా పరిహారం సొమ్మును ఆయా దేవాలయాల ఖా తాలలో జమ చేసిన తరువాత మాత్రమే ఆయా ఆలయాల భూములను అన్యాక్రాంతం చేయడానికి వీలుందని హైకోర్టు నిర్దేశించడం వల్ల ఇకపై విచ్చలవిడిగా దేవుడి మాన్యాలను కాలుష్య వాటికల నిర్మాణాలకు కేటాయించడం కుదరదు. ఆలయ భూములు ప్రభుత్వ భూములన్నంత ధీమాగా రాజకీయ నిర్వాహకులు, ఉన్నత అధికారులు వాటిని పరుల పరం చేయడం చరిత్ర! నగరాలలోను, పట్టణాలలోను బస్‌స్టాండ్‌లు నిర్మించడానికి, వాణిజ్య వాటికలను నిర్మించడానికి భూమి కావలసి వచ్చినపుడల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మొదట అన్యాక్రాంతం అవుతున్నది ఆలయ భూములే! ఆలయ భూమిని ప్రభుత్వ ఆస్తిగా భావించి అమ్మివేసే విధానాన్ని కూడ హై కోర్టు తీర్పు నియంత్రించింది. 2013 నా టి భూమిసేకరణ చ ట్టంలో నిర్దేశించిన ప్ర క్రియను పూర్తి చేసిన తరువాత మాత్రమే ఆలయాల భూములను ఇతర కలాపాల కోసం సేకరించాలన్న ది ఈ తా త్కాలిక తీర్పు సా రాంశం. అయితే, ఈ చట్టం ప్రకారం ఆలయ భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి అనుమతిని తీసుకోవాలన్నది ప్రశ్న. ఈ సందేహా న్ని కూడ ఉన్నత న్యాయస్థానం నివృత్తి చేయవలసిన అవసరం వుంది. 2013 నాటి భూమి సేకరణ చట్టం ప్రకారం భూమి యజమానుల అనుమతి పొందిన తరువాత మాత్రమే వారి భూమిని వ్యవసాయేతర కార్యక్రమాల కోసం స్వీకరించవచ్చు! గ్రామాన్ని ఒక విభాగంగా భావించి ఆ విభాగంలోని డెబ్బయి శాతం యజమానుల అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రభుత్వం నిర్వహించే ప్రజాహిత కార్యక్రమాల కోసం భూమిని సేకరించవచ్చు! ప్రభుత్వేతర సంస్థల కోసం భూమిని సేకరించేటప్పుడు ఎనబయి శాతం యజమానుల అనుమతి అనివార్యం. అందువల్ల ఆలయాల భూములను సేకరించినపుడు ఎవరు అనుమతించాలి? తమ అనుమతి లేకుండానే దేవాలయ భూములను ప్రనుత్వం కానీ, దేవాదాయ ధర్మాదాయ విభాగం గానీ, ఆలయాల నిర్వాహకులు కానీ అమ్మివేయరాదని ఉన్నత న్యాయస్థానం వారు ఇదివరకే నిర్ణయించి ఉన్నారు. ఇది ఆలయాల భూములను ప్రభుత్వాలు వేలం ద్వారా విక్రయించడానికి సంబంధించిన వ్యవహారం. ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల కోసం మాత్రమే కాక కొనుగోలు దారుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడ ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి! ఇలా ఆలయ భూములను నిష్కారణంగా విక్రయించే ప్రహసనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి వారసత్వం! హైకోర్టు ఈ విక్రయాలను నియంత్రించింది. 2013 నాటి చట్టం ప్రకారం నిర్దిష్ట కార్యక్రమం కోసం భూమిని స్వీకరిస్తున్నారు-ప్రభుత్వాలవారు! మరి ఈ సేకరణను జరుపవచ్చునని కాని, జరపరాదని కానీ ఆలయం తరపున ఎవరు నిర్ణయించాలి! ఆలయ అధికారులు అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది కనుక.
ఆలయ భూములను అమ్మడాన్ని కానీ తథాకథిత ప్రజాహిత కార్యక్రమాలకు సేకరించడాన్ని కాని పూర్తిగా నిషేధించడం వల్ల మాత్రమే ఆలయ వ్యవస్థకు ఇక ముందైనా భద్రత ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సెంటు భూముని కాని, కుంట స్థలాన్ని కాని ఆలయాలకు కేటాయించడం లేదు. పూర్వం పాలకులు, భూస్వాము లు, వదాన్యులు శతాబ్దులపాటు ఆలయాలకు భూములను కేటాయించారు! ఆ భూములలో పండే పంట అన్నంగా మారి దేవుడికి నైవేద్యం కావాలని, అన్నార్తులకు ప్రసాదం కావాలని ఆ దాతలు ఆకాంక్షించారు! దేవాలయాలలో నైవేద్యం పెట్టిన తరువాత కొంతసేపు గంటలను మోగించడం ఎందుకు? ఆకలికొన్న వారు వచ్చి భోజనం చేసి వెళ్లాలన్నది ఈ గంటల సంకేతం! ఈ ఆకలికొన్నవారు బాటసారులు, యాత్రికులు కావచ్చు, ఇళ్లలో భోజనం లభించని వారు కావచ్చు! ఆలయ భూ ములను శాశ్వతంగా ఆలయల అధీనంలో ఉంచి పంటలు పండించాలి!