సంపాదకీయం

తమిళుల దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శశికళ మహిళా‘శకుని’లా మంత్రాంగం నడుపుతుండడం తమిళ రాజకీయ రంగస్థలిపై ఆవిష్కృతవౌతున్న వికృత దృశ్యం! ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయని ఈ నవలామణి దివంగత ముఖ్యమంత్రి జయలలితకున్న ప్రజాభిమానాన్ని దురుపయోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి నిచ్చెన వేసింది. ఇదే వ్యూహంతో ఆమె అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించుకుంది. ప్రభుత్వానికి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ ‘మార్గదర్శనం’ చేస్తుందన్నది ఈనెల ఐదవ తేదీ వరకూ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కొనసాగిన భావం. ఈ భావం భ్రాంతి అని ఐదవ తేదీన వెల్లడైన వాస్తవం. సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు అన్నా డిఎంకె శాసనసభ్యులందరికీ శశికళ నిర్బంధ ఆతిథ్యం సమకూర్చింది. చెన్నైలోనో తమ సొంత ఊళ్లలోని ఇళ్లలోనో ఉండవలసిన ఈ శాసనసభ్యులు ఈ ‘స్వచ్ఛంద’ నిర్బంధాన్ని ఎందుకని ఎంచుకున్నారు? శశికళ పట్ల వారి విధేయత సహజమైనదైతే వారంతా చెన్నైలోనే ఉండి ఆమెకు మద్దతుగా నిలిచేవారు. వారి విధేయత సహజం కాదని వారిని అతిథిగృహాలకు పరిమితం చే యడం ద్వారా శశికళ నిరూపించింది. వారి వి ధేయత జయలలిత పట్ల మాత్రమే. జయ వారసురాలిగా త నను తాను ప్రకటించుకున్న శశికళ పట్ల కేవలం భయంతో మాత్రమే ఈ శాసనసభ్యులు విధేయతను అభినయిస్తున్నారు. ప్రజల మద్దతు శశికళకు ఉన్నదీ లేనిదీ ఇంకా ఏ ఎన్నికల్లో కూడా నిర్థారణ కాలేదు. కానీ పన్నీర్ సెల్వం వంటి అవ్యవస్థిత చిత్తం కలవారి కారణంగా శశికళ మరింతగా బలపడిన భ్రాంతి కలుగుతోంది. శశికళ నియంత, అహంకారి.. సెల్వం నిలకడలేని బుద్ధి కలవాడు. వీరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలనేది గవర్నర్ విద్యాసాగరరావుకు ఎదురౌతున్న పరీక్ష.
ఇలా తమిళనాడు రాజకీయం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తుండడం నిరాకరింపజాలని నిజం. నడిపించినది, నడిపిస్తున్నది ఎవరన్నది బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి పదవికి ఫిబ్రవరి ఐదవ తేదీన రాజీనామా చేసిన సెల్వం మహాశయుడికి న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందా? అనే మీమాంస అర్థరహితం. సెల్వం సామాన్య మానవుడు కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని 2002 నుంచి నాలుగుసార్లు నిర్వహించిన వాడు. ఇలా నిర్వహించడానికి ప్రాతిపదిక ప్రజల మద్దతు కాదు, అన్నా డిఎంకె శాసనసభా పక్షం వారి మద్దతు కాదు. పార్టీకి తిరుగులేని నాయకురాలైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభీష్టం మాత్రమే. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన అభియోగం తదితర అవినీతి కేసుల ప్రాతిపదికగా జయలలిత అరెస్టు అయినపుడు, అభియోగాలు న్యాయస్థానాల్లో ధ్రువపడినప్పుడు మాత్రమే ‘పురచ్చితలైవి’ ప్రతినిధిగా సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించాడు. ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’ లేదా ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’ అన్న పదాలు రాజ్యాంగంలో లేకున్నా పన్నీరు మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగాను, తాత్కాలిక ముఖ్యమంత్రిగాను చెలామణి అయ్యాడు. కోరిన వెంటనే సెల్వం పదవిని ఖాళీ చేసి తనకు మళ్లీ అప్పగిస్తాడన్న విశ్వాసంతో జయలలిత సెల్వాన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఆమె మరణం తర్వాత పార్టీని తన గుప్పెట ఇరికించుకున్న శశికళ ఈ విశ్వాసంతోనే సెల్వం మరోసారి ముఖ్యమంత్రి కావడానికి బహుశా అంగీకరించింది! సెల్వం కూడా ఆమె విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఆమె కోరిన వెంటనే పదవీ త్యాగం చేశాడు. గవర్నర్‌కు రాజీనామా పత్రం పంపించాడు. ‘పరిత్యాగం’ చేసిన రెండు రోజుల తర్వాత సెల్వం తిరుగుబాటు చేయడం తర్కబద్ధంగా లేదు. తనకు ప్రజల మద్దతు ఉందన్న ఆయన ప్రకటనను ప్రజలు పట్టించుకున్న దాఖలా లేదు.
పార్టీ కార్యకర్తల మద్దతు కాని ప్రజల మద్దతు కాని సెల్వానికి లేవన్నది బహిరంగ రహస్యం. ఉందన్న విశ్వాసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే సమయానికి ఆయనకు సైతం లేదు. శాసనసభా పక్షం సమావేశంలో శశికళను ఎన్నుకొనడానికి వీలుగా ఆయన తన పదవికి ఎందుకు రాజీనామా చేశాడు? విశ్వాసం లవలేశం కూడ ఆయనకు లేదు. అందుకని పదవీ త్యాగానికి నోరు మెదపకుండా అంగీకరించాడు. రెండురోజుల తర్వాత తనకు శాసనసభ్యుల మద్దతు ఉందన్న విశ్వాసం ఆయన అభినయించడం ఆయన స్థాయిని మరింత దిగజార్చింది. పార్టీ ఎమ్మెల్యేల్లో అధికులు ఆయనకు మద్దతు ఇవ్వడం నిజమైతే ము ఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని ఆయనను వారు కోరి ఉండేవారు. రాజీనామా చేసేవరకూ సెల్వంను సమర్ధించని ‘మె జారిటీ’ ఎ మ్మెల్యేలు రాజీనామా చేశాక మనసు మార్చుకొని సమర్థిస్తారని భావించడం తనను తాను వంచించుకొనడం మాత్రమే. సెల్వం స్థిరచిత్తుడు కాదన్నది ఈ మొత్తం ప్రహసనంతో రుజువైపోయింది. ‘మెజారిటీ’ సభ్యుల మద్దతు నాకుంది, అందువల్ల నేను రాజీనామా చేయను- అని సెల్వం శాసనసభ్యుల సమావేశంలో చెప్పి ఉండాలి. ఆ సమావేశంలో వోటింగ్‌ను కోరి ఉండాలి. శశికళ సమక్షంలో అలా కోరే ధైర్యం ఆయనకు లేదు. సమావేశం ముగిశాక పదవికి రాజీనామా చేయకుండా యథావిధిగా పాలనావిధులకు హాజరై ఉండాలి. అలా జరిగినట్టయితే శశికళ ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఉండగలిగేది కాదు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించగలిగేది శాసనసభ. అందువల్ల సెల్వం తన పదవికి రాజీనామా చేసి ఉండరాదు. ‘శాసనసభను సమావేశ పరచండి.. సభ విశ్వాసం పొందుతాను..’ అని ఆయన గవర్నర్‌ను అభ్యర్థించినట్టయితే సభలో బలప్రదర్శన ముగిసేవరకూ రాజీనామా చేయనక్కర్లేదు. సెల్వం అలాంటి తెలివిని ప్రదర్శించలేదు. ఇప్పుడు వ్రతం చెడినా ఫలితం దక్కని త్రిశంకు స్థితిని కొనితెచ్చుకున్నాడు.
పార్టీ నాయకత్వానికి విధేయత ప్రకటించడం మాత్రమే సెల్వం ఇంతవరకూ పాటించిన వ్రతం! జయలలిత స్థానంలో శశికళను నాయకురాలిగా ఆయన అంగీకరించినట్టు స్వయంగా ప్రకటించి ఉన్నాడు. ‘అన్నా డిఎంకె పార్టీని సైనిక క్రమశిక్షణతో నడపడం కోసం శశికళ నాయకత్వం అవసరం. ‘అమ్మ’ జయలలిత లేని లోటును శశికళ భర్తీచేయాలి’ అని సెల్వం డిసెంబర్ ఎనిమిదవ తేదీన ప్రకటించాడు. అందువల్ల శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టితీరాలన్నది సెల్వం చేసిన నిర్థారణ. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శికి విధేయతను ప్రకటించే వ్రతాన్ని కొనసాగిస్తున్నాడన్నది మాత్రమే ఐదవ తేదీన ఆయన రాజీనామా చేసిన సమయంలో అందరికీ కలిగిన భావం. రాజీనామా చేయక పూర్వం ఆయన ఈ వ్రతాన్ని వీడి ఉంటే ఫలితం దక్కేది. రాజీనామాను గవర్నర్ ఆమోదించాక వ్రతం చెడిన సెల్వం మహాశయునికి ఫలితం దక్కడం బహుశా కల్ల! ఆయన మళ్లీ అన్నా డిఎంకె శాసనసభా పక్షం సమావేశాన్ని నిర్వహించి, మరోసారి నాయకుడిగా ఎన్నికైతే కాని గవర్నర్ ఈయనకు ‘మెజారిటీ’ సభ్యుల మద్దతు ఉందని విశ్వసించడానికి వీలు లేదు. కానీ ఆ ‘అద్భుతం’ జరిగే అవకాశం కనిపించడం లేదు. గవర్నర్ ఆమోదించిన రాజీనామాను సెల్వం ఎలా ఉపసంహరించుకుంటాడు? రాజ్యాంగ ప్రక్రియకు అది విరుద్ధం. సెల్వం, శశికళ ఇలా ‘దొన్నూ దొనే్న’..