సంపాదకీయం

బలిగొన్న ‘తెల్ల తోడేలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని కెన్‌సాస్ రాష్ట్రంలో ఓలిత్ నగరంలో పనిచేస్తుండిన కూచిభొట్ల శ్రీనివాస్ అనే భారతీయుడిని ఒక శే్వత వర్ణ దురహంకారి కాల్చి చంపడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఉసిగొల్పే విధానాలకు నిదర్శనం. క్రౌర్యం, కరుడుకట్టిన స్వభావం కలిగిన డొనాల్డ్ ట్రంప్ గత జనవరి ఇరవయ్యవ తేదీన అమెరికా అధ్యక్షుడిగా చెలామణి కావడం ఆరంభమైన నాటినుంచి తమ దేశంలోని విదేశీయుల పైకి ‘తోడేళ్ల’ను ఉసిగొల్పుతున్నాడు! ఈ ‘తోడేళ్లు’ తెల్లని చర్మం కప్పుకుని ఉన్న అమెరికాలోని బీభత్సకారులు! అమెరికాలోని ఐరోపా సంతతి ప్రజల సమష్టి స్వభావం తమది కానిదాన్ని ద్వేషించడం, మట్టుపెట్టడం, నిర్మూలించడం! ఇలా నిర్మూలించడం శతాబ్దులపాటు ఐరోపావారు నడిపించిన చరిత్ర. ఈ చరిత్ర అమెరికాలోని తెల్లరంగు వారికి సమష్టి వారసత్వం! ప్రజాస్వామ్య స్వభావులైన కొందరు తెల్లరంగువారు మానవీయ భావాలతో మంచి మనుషులుగా ఉంటున్నప్పటికీ అధికాధిక సంఖ్యాకులైన తెల్లవారి స్వభావం ఇతర రంగుల వారిని ద్వేషించడం, సందుదొరికితే నిర్మూలించడం! ‘నాగరికత’ మాటున నిహితమై ఉన్న ఈ వర్ణ ద్వేషం తరచు బుసకొడుతూనే ఉంటోంది, అప్పుడప్పుడు విషం కక్కుతోంది! ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే మానవ రూపంలోని తెల్లతోడేలు! అందువల్ల అతగాడి విధానాల ఫలితంగా అమెరికా అంతటా శే్వతేతర వర్ణ మానవులపై దాడులు చేయడానికి తెల్ల తోడేళ్లు సిద్ధమవుతున్నాయి. తెల్లరంగులేని వారిని చంపడమే లక్ష్యంగా అమెరికాలో కొన్ని బీభత్సపు ముఠాలు అమెరికా స్వ తంత్ర దేశంగా అవతరించిన నాటినుంచి పని చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల అమెరికా నిబద్ధత కారణంగాను, న్యాయ వ్య వస్థ నియంత్రణ కారణంగాను ఈ ‘ముఠాలు’ నిద్రాణంగా ఉన్నాయి! ఇ ప్పుడు అమెరికా అధ్యక్షుడు స్వయంగా విదేశీయులను వెళ్లగొట్టడానికై చెలరేగిపోతున్నాడు కనుక విద్వేషపు ముఠాలకు ‘బలం’ వచ్చింది, ధైర్యం వచ్చింది! అమెరికా నౌకాదళంలో పనిచేసిన ‘రాజ్యాంగబద్ధుడైన’ ఒక తెల్లవాడు ఇలా ఓలిత్ నగరంలో ఇద్దరు భారతీయులపై కాల్పులు జరపడానికి ఇలా ‘ట్రంప్‌‘ ఉసిగొలిపే విధానం కారణం! ఆడమ్ ప్యూరింటన్ అనే మాజీ నావికుడు ‘రాజ్యాంగ బద్ధుడు’! కానీ యాబయి ఒక్క ఏళ్ల ఈ ‘పరిణతి’ చెందిన తెల్లవాడు వర్ణ విద్వేషంతో ఇద్దరు భారతీయులపై నిష్కారణంగా ఇలా కాల్పులు జరపడానికి ‘బలం‘, ‘ప్రేరణ’ ట్రంప్ విధానాలు! మాడసాని అలోక్‌రెడ్డి అనే భారతీయుడు తీవ్రంగా గాయపడినాడు! ‘నా దేశంనుండి వెళ్లిపోండి’ అని శ్రీనివాస్‌ను, అలోక్‌ను ప్యూరింటన్ ‘హెచ్చరించడం’ ట్రంప్ మాటల ప్రతిధ్వని...
ఇలా తెల్లటి చర్మం మాటున దాగిన నల్లటి విష హృదయం మరోమారు కాటేసింది. అమెరికాలో పనిచేస్తుండిన యువ ‘స్థపతి’-ఇంజనీర్-కూచిభట్ల శ్రీనివాస్‌ను బలికొనింది! ప్రజాస్వామ్యం, సర్వమత సమభావం, స్వేచ్ఛా జీవనం, వ్యక్తి స్వాతంత్య్రం, మానవ అధికారాలు-వంటి మాటలను ఐరోపా జాతులవారు శతాబ్దుల తరబడి వల్లిస్తున్నారు. అమెరికా జాతి ఐరోపా జాతుల సమాహారంగా క్రీస్తుశకం పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దులలో రూపొందింది. అందువల్ల అమెరికాలోని తెల్లరంగువారికి ఐరోపా స్వభావం తరతరాల వారసత్వం! ఇతర జాతుల వారిని, ఇతర దేశాల వారిని, ఇతర మతాల వారిని, ఇతర భాషల వారిని దోచుకొనడం నిర్మూలించడం ఐరోపా జాతుల స్వభావం! క్రీస్తుశకం పదహారవ శతాబ్ది చివరినుంచి బ్రిటన్ దేశీయులు, ఇతర ఐరోపా దేశాలవారు తాము ‘వినూతన ఖండం’గా భావించిన అమెరికాకు వేల, లక్షల సంఖ్యలో వలస పోయారు. తాము గుర్తించిన నాటినుంచి మాత్రమే అమెరికాకు చరిత్ర ఉందని భావించడం స్వీయ జాతీయ అహంకారంతో కూడిన ఐరోపా దేశాల వారి అజ్ఞానం! తమది కాని దానిని సహించలేని దుర్జన స్వభావం కలిగి ఐరోపా దేశాలవారు అమెరికాలో అనాదిగా లక్షల ఏళ్ల తరబడి జీవించిన ‘ఎఱ్ఱ భారతీయ’- రెడ్ ఇండియన్-జాతిని ఇతర వనవాసీ జన సముదాయాలను హత్య చేశారు! ఇలా తాము చొరబడిన చోటల్లా ‘స్వజాతుల’ను చంపేసి తామే ‘స్వజాతి’గా మారడం ఐరోపా దేశాల వారి దురాక్రమణ చరిత్ర! అమెరికాలో ఇదే జరిగింది, ఆస్ట్రేలియాలో అదే జరిగింది! ఇందువల్ల అమెరికాలోను ఆస్ట్రేలియాలోను ఇప్పుడున్న ‘తెల్లజాతుల’వారు అనాదిగా అమెరికాలో ఉండిన ఆస్ట్రేలియాలో ఉండిన స్వజాతులు కాదు...స్వజాతులను సమూలంగా నిర్మూలించిన ఐరోపా జాతుల వారసుల సంకరజాతులు నేడు అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను ‘స్వజాతి’గా చెలామణి అవుతున్న తెల్లవారు...
ఈ వాస్తవం, చారిత్రక సత్యం ‘ట్రంప్’కు తెలుసు, అమెరికాలోని తెల్లవారికి తెలుసు! ఈ తెల్లవారి పూర్వులు అమెరికాకు బయటనుంచి వచ్చినవారు. అందువల్ల అమెరికా తన దేశం అని విర్రవీగే నైతిక అధికారం అమెరికాలోని తెల్లవారికి లేదు. అమెరికానుంచి బయటి దేశాల వారందరు నిష్క్రమించాలన్నదే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమైతే మొదట అతగాడు అమెరికానుంచి వెళ్లిపోవాలి! ఆ తరువాత తెల్లవారందరూ-రెడ్ ఇండియన్లను సామూహికంగా హత్యచేసిన ఐరోపావారి వారసులందరూ-అమెరికాను వదిలిపెట్టిపోవాలి! అదీ చరిత్రకు జరుగవలసిన న్యాయం! భారతీయులు అనాదిగా ఏ దేశాన్ని కూడా దురాక్రమించలేదు. తొలి మానవుడు భారతదేశంలో పుట్టిపెరగడం చరిత్ర! ప్రపంచమంతటికీ మానవీయ సంస్కారాలను ఈ భారత జాతి వారు మప్పటం అంతర్జాతీయ చరిత్ర! ఇలాంటి భారతీయులు నేడు అమెరికాకు వెళ్లడం అక్కడ ఉద్యోగాలు చేయడం చొరబాటు కాదు, సంస్కార స్వభావ వ్యాప్తి మాత్రమే. పువ్వుల పరిమళం తోటలోనే ఉండదు, పరిధిని దాటి ప్రపంచమంతటా విస్తరిస్తుంది..
ఇలాంటి సంస్కార పరిమళానికి ప్రతిరూపాలైన భారతీయులు అమెరికాలో ఉండడం ఆ దేశంలోని తెల్లవారికి సైతం ధర్మం, ఆధ్యాత్మ తత్త్వం వంటి మానవీయ భావజాలం అలవడింది, అలవడుతోంది! ఈ చరిత్ర వివేకానంద స్వామి అమెరికాకు వెళ్లిన నాటిది, అంతకు పూర్వం నాటిది! ఇది సాంస్కృతిక వ్యవహారం! అమెరికానుంచి ప్రవాస భారతీయులందరు నిష్క్రమించినట్టయితే సాంకేతిక విజ్ఞానరంగం, వైద్య రంగం, స్థాపత్యరంగం, భౌతిక విజ్ఞాన రంగం విపరీతంగా నష్టపోతాయి. భారతీయ సంతతివారు అమెరికాను వదిలిపెడితే అమెరికా వాణిజ్యం దివాలా తీస్తుంది. ఇది వాణిజ్య వ్యవహారం! దీన్ని గురించి డొనాల్డ్ ట్రంప్‌కు తెలుసు! శ్రీనివాస్‌ను హత్యచేసి అలోక్‌ను గాయపరిచిన ‘ఆడమ్’కు తెలుసు! అయినప్పటికీ ‘నా దేశంనుండి వెళ్లిపొమ్మని’ ఇలాంటివారు భారతీయులను బెదిరిస్తుండడం దురహంకారం! విదేశాలలో ఒక్క అమెరికా పౌరుడు మరణించినప్పటికీ అమెరికా ప్రభుత్వం భూన భోంతరాళాలు దద్దరిల్లేలా నిరసన తెలుపుతుంది. భారతీయుల ప్రాణాలకు అమెరికా దృష్టిలో విలువలేదు! వారికి భద్రతను కల్పించడం లేదు, ఈ నిర్లక్ష్యానికి శ్రీనివాస్ బలైపోయాడు. ఈ వర్ణ దురహంకారాన్ని నిరసించిన భారతీయులను రక్షించ యత్నించిన ఇయాన్ గ్రిల్లోట్ అన్న అమెరికా పౌరుడు అభినందనీయుడు..