సంపాదకీయం

స్వచ్ఛ భారత స్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి స్వరూప స్వభావాలు చెరిగిపోతుండడానికి కారణం మానవులు పెంచుతున్న కాలుష్యం. కాలుష్యం కోరల నుంచి పరిసరాలను పరిరక్షించడానికి అంతర్జాతీయ సదస్సులు, గోష్ఠులు, తీర్మానాలు, నియమ నిబంధనల రూపకల్పనలు జరుగుతూనే ఉ న్నాయి. సమాంతరంగా పరిశ్రమల నుంచి, కర్మాగారాల ప్రాంగణాల నుంచి, చెత్తకుప్పల నుంచి బహిరంగ మలమూత్ర విసర్జన కలాపాల రహదారుల నుంచి భయంకరమైన కాలుష్యం వెలువడుతూనే ఉంది. కేంద్ర ప్ర భుత్వం చిత్తశుద్ధితో ఆరంభించిన ‘స్వచ్ఛ భారత్’ పునర్ నిర్మాణ పథకం చుట్టూ కాలుష్యం పొగలను కక్కుతోంది, సెగలను చిమ్ముతోంది! రాష్ట్ర ప్రభుత్వాల ‘హరిత హారాలు’, ‘చెట్టు-నీరు’ ముచ్చటలు మురుగువాసనలను మరిపింప చేయలేక పోతున్నాయి. ఆసేతుశీతనగం ప్రాకృతిక జలవాటికలు ఉన్నచోటల్లా దుర్గంధం మీరుతుండడం వర్తమాన భారతం! ప్రవహించే నదిలో ‘స్నానం’ చేయలేక పోతున్నాము. ఉరకలెత్తే వాగు నీరు తృప్తిగా తాగలేకపోతున్నాము. బావి నీరు ఇంకిపోయింది. చెఱువుల నీరు పచ్చగా పాచిపట్టిపోయింది. నదుల నీరు తాగడానికి కాదుకదా ముట్టుకోవడానికి సైతం భయపడవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. పల్లెల పరిసరాలు విషరసాయనపు ఎరువుల వాసనలతో వేడెక్కిపోయాయి, క్రిమి సంహారక ఔషధాల ప్రభావంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పట్టణాలు కాలుష్యపు గాలులతో మాడిపోతున్నాయి. నగరాలు పారిశ్రామిక విష పవనాలను వెళ్లగక్కుతున్నాయి. కాలుష్యం విస్తరించిపోతుండడం పట్ల అధ్యయన నివేదికలు, పరిశోధక పత్రాలు ప్రతిరోజూ ప్రచారం పొందుతూనే ఉన్నాయి. కాలుష్యం గు రించి ధ్యాస ఉన్న మా మూలు జనం నివారించడం తెలియక నిట్టూర్పులు వదులుతున్నారు. కాలుష్యం నియంత్రించడానికి పచ్చదనం పెంచాలన్నది ప్రభుత్వాల ఆర్భాటం! కానీ, సమాంతరంగా పచ్చదనాన్ని పరిమార్చే పరిశ్రమలకు ప్రభుత్వాలు నిరంతరం ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. పచ్చదనపు ప్రాంగణాలకు లభిస్తున్న ప్రాధాన్యం పారిశ్రామిక వాటికలకు లభిస్తున్న ప్రాధాన్యంలో వెయ్యవ వంతు లేదు. పరిశ్రమలకు ‘తథాకధిత’ ప్రగతి పథకాలను వికేంద్రీకరించి దేశమంతటా విస్తరింప చేయడం వల్ల కాలుష్యం పెరగదు. పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకరించి పారిశ్రామిక ప్రాంగణాలను ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం భయంకరంగా కేంద్రీకృతం అవుతోంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కాలుష్యం కేంద్రీకరణను వ్యవస్థీకరించడానికి నడుములను బిగించి ఉన్నాయి. ఇంకెక్కడి ‘స్వచ్ఛ భారతం’?! సుప్రీం కోర్టు ఇటీవల కాలుష్యం పంచే, దుర్గంధం పెంచే పరిశ్రమలపై కొరడా ఝళిపించడానికి ప్రభుత్వాల ఈ విధాన వైరుధ్యాలు నేపథ్యం!
పచ్చదనాన్ని, పొలాలను, అడవులను, ప్రకృతిని పరిరక్షించుకుంటూ ప్రగతి పరిశ్రమలను పెంపొందించుకొనడం అనాదిగా భారతీయ వ్యవస్థ. ఇందుకు వౌలిక సూత్రం ‘వికేంద్రీకరణ’! కానీ ప్రపంచీకరణ భారతీయ వ్యవస్థ అవశేషాలను సైతం రూపుమాపుతోంది. ప్రపంచీకరణ ప్రధాన సూత్రం ‘కేంద్రీకరణ’! పరిశ్రమలన్నీ ఒకేచోట ఉండాలన్నది కేంద్రీకృత వ్యవస్థ స్వరూపం. దీని స్వభావం- విషరసాయన భరితమైన పర్యావరణం. ప్రపంచీకరణలో భాగంగా వచ్చి పడుతున్న విదేశీయ సంస్థలకు- ప్రధానంగా ‘సంపన్న దేశాల’ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు మనదేశపు పరిసరాల పరిరక్షణ పట్ల నిష్ఠ లేదు. ఈ సంస్థల లక్ష్యం తక్కువ ఖర్చుతో ఒకేచోట కేంద్రీకృతమై దోచుకొనడం. ఈ దోపిడీని కొనసాగించడానికి వీలుగా మన ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక మండలుల- స్పెషల్ ఎకనమిక్ జోన్స్- సెజ్‌లు-ను ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా పారిశ్రామిక కాలుష్యం ఒకే చోట కొన్ని వందల చదరపు మైళ్ల మేర కొలువుతీరుతోంది. కేంద్రీకృత కాలుష్య వాటికగా ‘అమరావతి’ ఏర్పడనుండడం ఒక ఉదాహరణ మాత్రమే. హైదరాబాద్ కాలుష్యం దశాబ్దాల పాటు ముచికుంద నదిని చెఱచి ‘మూసీ మురుగు’గా మార్చింది. ‘అమరావతి’లో ఇలాగే కాలుష్యం కేంద్రీకృతమైతే కృష్ణానది మరో మూసీ కాగలదు! ‘పరిపాలన’ కేంద్రంగా మాత్రమే రాజధాని ఉన్నట్లయితే కాలుష్యం కొలువు తీరలేదు.
నగరాల్లో కేంద్రీకృతమైన పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన విషాల వల్ల నదులు, చెఱువులు, సరస్సులు, బావులు ఇతర నీటి వనరులు కలుషితమవుతున్నాయన్నది సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సంజయ్ కౌల్ చేసిన పునరుద్ఘాటనం. మూడు నెలలలోగా కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేసే యంత్ర వ్యవస్థను ప్రతి పరిశ్రమలోను ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం న్యాయమూర్తులు ఆదేశించారు. అలా ఏర్పాటు చేసుకోని పరిశ్రమలను మూసి వేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. దశాబ్దుల తరబడి ఆయా పరిశ్రమలు విషరసాయన కాలుష్య వ్యర్థాలను నదులలో కలుపుతున్నాయి. ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయన్నది సుప్రీం కోర్టు ఇప్పుడు జారీ చేసిన ఆదేశాలకు నే పథ్యం. రాజకీయ అవినీతి, అధికార అవినీతి ఇందుకు కారణం. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యపు కాలువలను శుద్ధి చేయకుండా బయటికి వదిలిపెట్టరాదన్న నిబంధన దశాబ్దులుగా ఉంది. కానీ పరిశ్రమల యాజమాన్యాలు శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదు. రాజకీయ వేత్తలు, అధికారులు ఈ కాలుష్య పరిశ్రమల నిర్వాహకుల నుంచి ‘అందినంత పుచ్చుకుని’ నిబంధనలను నీరుకార్చేశారు. అవినీతి కాలుష్యపు కాలువలు జాతీయ జనజీవన స్రవంతిని కలుషితం చేస్తుండడం అసలు సమస్య. ఇప్పుడు కూడ సర్వోన్నత న్యాయస్థానం వారి ఉత్తర్వులను అమలు చేయడం కష్టమని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నసుగుతున్నాయట. మూడు నెలల్లోగా అమలు చేయడం అసాధ్యమట. కానీ సర్వోన్నత న్యాయస్థానం వారు మాత్రం తమ ఉత్తర్వును అమలు జరుపవలసిందేనని పునరుద్ఘాటించారు. ‘మానవుల బతుకులకు మాత్రమే మీ దృష్టిలో విలువ లేదు. మిగిలినవన్నీ కష్టమే’ అని సర్వోన్నత న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం ప్రభుత్వాల నిర్వాహకులకు అభిశంసన..
నగరాల్లో, పట్టణాల్లో చెత్తకుప్పలు గుట్టలు గుట్టలుగా పేరుకొని పోవడం పట్ల కూడా సుప్రీం కోర్టు ఇటీవల ఆందోళనను వ్యక్తం చేసింది, విష రసాయన వ్యర్థ పదార్థాలను కుప్పలుగా కుమ్మరించడం వల్లనే ఇటీవల బెంగళూరులోని బెల్లందూరు సరస్సు మంటల మయం అయిందని ప్రధాన న్యాయమూరిత కేహర్ అధ్యక్షతన ఏర్పడిన ధర్మాసనం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాలను తొలగించడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడ సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ‘స్వచ్ఛ భారతం’ స్వప్నమేనా?