సంపాదకీయం

చారిత్రక ‘అభినయం’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగా యమునా నదుల మధ్య ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో బయటపడిన ‘రాగి’ పనిముట్లును, ఉపకరణాలను చూసి ‘్భరతీయ’ చరిత్ర పరిశోధకులు-ఇండాలజిస్టులు- ఆశ్చర్యపోతున్నారట. ఆశ్చర్యపోవడం కూడా చారిత్రక పరిశోధనలలో భాగం కావడం మనకు బ్రిటన్ సామ్రాజ్యవాదులు ప్రసాదించిన వారసత్వం! తమకు తెలిసినది మాత్రమే విజ్ఞానమని తమ పరిగణనను పొందినది మాత్రమే ‘అస్తిత్వమని’ భావించడం ఐరోపా మేధావుల దురహంకారం! అందువల్ల తమకు తెలియని లక్షల ఏళ్ల ‘్భరతీయ చరిత్ర’ను లేనట్టుగా ఐరోపా మేధావులు నిర్ధారించడం క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది నాటి వైపరీత్యం! ఈ వైపరీత్యం వారసత్వమైంది! 1947వ సంవత్సరం తరువాత ఈ భావ దాస్య వారసత్వ నిష్ఠ మరింతగా ప్రస్ఫుటిస్తోంది! యుగాలు, మహా యుగాలు, మన్వంతరాలు, కల్పాలు గడిచిపోవడం విశ్వవ్యవస్థ చరిత్ర! ఈ సనాతనమైన అంటే శాశ్వత సత్యాన్ని గుర్తించిన భారతీయులు కోట్లాది సంవత్సరాలను తమ ‘పంచాంగ’ పద్ధతి ద్వారా లెక్క పెట్టారు, లెక్కపెడుతున్నారు! కానీ మన దేశాన్ని వంచనతో జయించిన వాణిజ్య బీభత్సకారులైన బ్రిటన్ వారికి ఇతర ఐరోపా జాతుల వారికి కొన్ని శతాబ్దుల క్రితం వరకు ఈ వాస్తవం తెలీదు! ప్రపంచ చరిత్ర కేవలం ఆరు వేల ఏళ్ల క్రితం మాత్రమే మొదలైందని వారు శతాబ్దుల పాటు భ్రమించారు. ఆ దశలో మన దేశాన్ని దురాక్రమించిన బ్రిటన్ దొరలు కోట్లాది సంవత్సరాల చరిత్రను అంగీకరించలేదు, అంగీకరించడానికి వారి దురహంకారం అడ్డు వచ్చింది. అహంకారం, అజ్ఞానం కలిసిన బ్రిటన్ చరిత్రకారులు యుగాల చరిత్రను ‘ఆరువేల సంవత్సరాల’ పరిధిలోకి ఇరికించారు! ఇలా ఇరికించడంవల్ల అసంఖ్యాక చారిత్రక వాస్తవాలు కేవలం కల్పిత కథలన్న భ్రాంతి ఏర్పడింది! వసిష్ఠుడు, దిలీపుడు, వాల్మీకి, భగీరథుడు, రఘురాముడు, యదుకుల కృష్ణుడు, వేదవ్యాసుడు, సమ్రాట్ విక్రముడు వంటి అసంఖ్యాక చారిత్రక పురుషులు పుట్టనే లేదని, కల్పిత పాత్రలని ఇలా ‘ఇరికించిన’ బ్రిటన్ చరిత్రకారులు చెప్పిపోయారు! అందువల్ల తవ్వకాలలో ఆరువేల సంవత్సరాల కంటె పూర్వపు చారిత్రక అవశేషాలు బయటపడినప్పుడల్లా బ్రిటన్ పరిశోధకులు ‘హాశ్చర్య’పోయేవారు. భారత దేశానికి ఆరువేల సంవత్సరాలకంటె ఎక్కువ చరిత్ర ఉందని మాత్రం వారు అంగీకరించలేదు! వారు వెళ్లిపోయిన తరువాత కూడ దేశంలో డెబ్బయి ఏళ్లుగా ‘పురాతత్వ’ విభాగం వారు తవ్వకాలు జరుపుతునే ఉన్నారు. కానీ బ్రిటన్ చరిత్రకారులు నిర్ధారించిన ‘ప్రాతిపదికల’ ‘గీటురాళ్ల’ భావదాస్యపు పరిధినుంచి మన ‘తవ్వకాల’ పరిశోధన బయటపడలేదు! అందువల్లనే మన పరిశోధకులు మన చరిత్ర ‘నిడివి’ని ఆరువేల ఏళ్లనుంచి ఎనిమిది వేల ఏళ్లకు పదకొండు వేల ఏళ్లకు పెంచినప్పటికీ ఆశ్చర్యపోవడం మాత్రం మానుకోలేదు!
ఇప్పుడు కొత్తగా ‘్భరతీయ చరిత్ర పరిశోధకులు-ఇండాలజిస్టులు-ఆశ్చర్యపోవడానికి కారణం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలోని సాకేత్‌పూర్ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో నాలుగు వేల సంవత్సరాల నాటి రాగి గొడ్డళ్లు తదితర ఉపకరణాలు బయటపడడం. ఆ ‘రాగి’ పనిముట్లు నాలుగు వేల ఏళ్లనాటివా? నలబయి వేల ఏళ్ల నాటివా? అన్న ప్రశ్నలకు ‘బొగ్గు పరీక్ష’ ద్వారా సరైన సమాధానం దొరకదు. ఎందుకంటే ఈ ‘బొగ్గు పరీక్ష’-కార్బన్ టెస్ట్-కూడ మానవ చరిత్ర ఆరువేల లేదా ఎనిమిది వేల ఏళ్లకు మించి లేదన్న నిర్ధారణ ప్రాతిపదికగా రూపొందినది! అందువల్ల యుగాల మహాయుగాల చరిత్రను ఈ ‘బొగ్గుపరీక్ష’ ద్వారా నిర్ధారించడం అసంభవం. అయినప్పటికీ ఈ పనిముట్లను చూసి పరిశోధకులు ఎందుకని ఆశ్చర్యపోతున్నారు! ఇప్పటికే జరిగిన తవ్వకాల వల్ల భారతదేశానికి కనీసం పదకొండువేల ఏళ్ల చరిత్ర ఉందని నిర్ధారణ జరిగింది! గుజరాత్ తీరంలోని సముద్ర జలాల్లో జరిగిన తవ్వకాల ఫలితంగా 2001లో బయటపడిన చెక్కముక్క క్రీస్తునకు పూర్వం ఎనిమిది వేల ఏళ్ల నాటిదని ధ్రువపడింది. ఈ ‘చెక్కముక్క’ ప్రతీక! చెక్కముక్క దొరికిన ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న ‘శిథిలనగరం’ అసలు వాస్తవం! కానీ ఈ నగరం ఇలా పదివేల ఏళ్ల నాటిదని పాశ్చాత్య చరిత్రకారులు ఇప్పటికీ అంగీకరించలేదు! ఆ చెక్కముక్క ఎక్కడినుంచో కొట్టుకొని వచ్చి ఉండవచ్చునట- అన్నది ఊహాగానం! అక్కడిదే ఎందుకు అయి ఉండకూడదు? అన్న ప్రశ్నకు సమాధానం లేదు! ఏమయినప్పటికి భారతీయ చరిత్రకారులలో అత్యధికులు ఈ ‘నగరం’ పది పదకొండు వేల ఏళ్ల నాటిదని నిర్ధారించారు. సరస్వతీ నదీ పరీవాహ ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో కూడ క్రీస్తునకు పూర్వం పది పదకొండు ఏళ్లనాటి మానవ నాగరిక అవశేషాలు బయటపడినాయి.
ఇలా దాదాపు పదమూడు వేల చరిత్ర-ఐరోపా వారి కొలమానాల ప్రకారం-మనకుండగా ఉత్తరప్రదేశ్‌లో నాలుగు వేల సంవత్సరాల నాటి పనిముట్లు దొరకడం పట్ల తవ్వకాలు జరిపించిన చారిత్రక నిపుణులు ఆశ్చర్యం అభినయించడం ఎందుకు?? వీరు అభినాశ్చర్య విన్యాసాలను ప్రకటిస్తున్న సమయంలోనే ‘హరియాణా’లో జరిగిన తవ్వకాలలో ఆరువేల ఏళ్ల నాటి నాగరిక అవశేషాలు బయటపడినట్టు మరో ‘సంచలన’ సమాచారం ప్రచారమైంది! ఈ ‘హరియాణా’ ప్రాంత సరస్వతీ నదీ ప్రాంతపు ‘నాగరికము’ హరప్పా మొహంజొదారో ‘నాగరికము’ కంటె ప్రాచీనమైనది కావడం సంచలనానికి కారణమట! ‘మన దేశంలోని మొదటి నాగరికము ‘హరప్పా’, ‘మొహంజొదారో’ అన్న రెండు నగరాలకు వాటి పరిసరాలకు పరిమితమై ఉండేదని, ఈ మొహంజొదారో నాగరికము క్రీస్తునకు పూర్వము మూడు వేల సంవత్సరాల నాటిదని ‘బ్రిటన్ నికృష్ట మేధావులు నిర్ధారించారు!’ ఆ తరువాత ‘ఆర్యులు’ ఈ నాగరికతను నిర్మూలించి ‘వేద’ నాగరికాన్ని స్థాపించారని ఋగ్వేదాన్ని క్రీస్తునకు పూర్వం పదిహేను వందలు, పనె్నండు వందల సంవత్సరాల మధ్య వ్రాశారని’ కూడ ఐరోపా బౌద్ధిక బీభత్సకారులు నిర్ధారించారు! అందువల్ల దాదాపు ఐదు వేల ఏళ్ల కిందట ‘హరప్పా మొహంజొదారో’ నాగరికము ప్రబలిన సమయంలో మిగిలిన దేశంలో ‘నాగరికం’ లేదని దేశమంతా మానవ రహితంగా బోసి పోయి ఉండేదని బ్రిటన్ దుండగులు చేసిన నిర్ధారణ! అందువల్ల ఈ భావదాస్య పరిధి నుంచి బయటపడని వారు ‘గంగా యమునా నదుల మధ్య నాలుగు వేల ఏళ్లనాడు నాగరికం ఉండేదన్న’ వాస్తవం బయటపడగానే ఆశ్చర్యంతో తికమక అయిపోయారు. బ్రిటన్ మేధావుల నిర్ధారణ ప్రకారం ఆ సమయంలో ఆ ప్రాంతం బోసిపోయి ఉంది మరి...జనం లేరు! రాళ్లు రప్పలూ కప్పలూ చిప్పలూ ఉండేవట!
క్రీస్తునకు పూర్వం 3,138వ సంవత్సరంలో మహా భారత యుద్ధం జరిగింది! ఈ వాస్తవాన్ని ఇప్పుడు అమెరికా, ఐరోపా మేధావులు కూడ అంగీకరించారు. అంతకు పూర్వమే యదుకుల బలరామకృష్ణులు యమునా తీరంలో ఆడుకున్నారు! క్రీస్తునకు పూర్వం రెండు వేల ఏళ్లనాటి నగరాల అవశేషాలు బయటపడినందుకు కొందరు శాస్తవ్రేత్తలు ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఏమిటి? ‘రోగం’ ఇది కాదు, పాశ్చాత్య కల్పిత ‘కోతి యుగం’, ‘రాతి యుగం’ వంటి అబద్ధాల చట్రంలో నుండి మనం బయటపడకపోవడం! మనవైన కృత త్రేతా ద్వాపర కలియుగాల ప్రాతిపదికగా చరిత్ర పునర్ నిర్మాణం జరగాలి. ‘మొహంజొదారో హరప్పా’ నాగరికం అనాది వేద సంస్కృతిలో భాగం! ఈ వాస్తవం విస్తరించాలి, వినపడాలి...