సంపాదకీయం

వనితకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృశక్తి మరింత చైతన్యవంతంగా ప్రస్ఫుటిస్తూ ఉండడం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సముచిత నేపథ్యం. మహిళలపై వివిధ రకాల అత్యాచారాలు పెరుగుతుండడం సమాంతర వైపరీత్యం! ఉభయ తెలుగు రాష్ట్రాలలోని యువతులకు, మహిళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురస్కారాలు లభించడం, సమ్మానాలు జరగడం సాధికార పథంలో మరో ప్రగతి పదం.. అఖిల భారత స్థాయి పోటీ పరీక్షలలో కావచ్చు, పదవ తరగతి పరీక్షలలో కావచ్చు ప్రథమ, ద్వితీయ స్థానాలను యువతులు, బాలికలు సాధిస్తుండడం విస్తరిస్తున్న జాగృతికి చిహ్నం. తల్లిదండ్రులకు సంతోషం కలిగించగలవారే నిజమైన పుత్రులు, పుత్రికలు! ‘కులములోన ఒకడు గుణవంతుడుండెనా కులము వెలయు వాని గుణము చేత..’ ‘తల్లిదండ్రుల యెడ దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల’ అన్న ‘నుడు’లు ‘నానుడు’లు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కారాదన్నది భారతీయ జీవన విధానం! మహిళ, మగవాడు కుటుంబ జీవన శకటానికి, జాతీయ జీవన రథానికి రెండు చక్రాలన్నది సమానత్వం. ఈ సమానత్వానికి పట్టిన ‘గ్రహణం’ క్రమంగా తొలగిపోతోంది. భారతీయ మహిళ పురుషునితో సమానంగా అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతోంది. ‘అబలలు’ కామని ‘సబలల’మని ‘అతిబలల’మని నిరూపిస్తున్న మహిళలు సమరాంగణంలో ప్రవేశిస్తున్నారు! దేశ సరిహద్దుల రక్షణకు కంకణ బద్ధులౌతున్నారు. పాలన రంగంలో, బోధన రంగంలో, పరిశోధన రంగంలో, సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో, కళారంగం లో, క్రీడారంగంలో మ హిళ పురుషునికి దీ టుగా తేజరిల్లుతుండ డం నడుస్తు న్న చరిత్ర. భరతమాతకు వజ్రాల కొడుకులు మాత్రమే కాదు, వరాల కూతుళ్లు కూడ తమ ప్రతిభాపాటవ జ్యోతులతో హారతులిస్తుండ డం నడుస్తున్న చరిత్ర. ‘కులం పవిత్రం జననీ కృతార్థా వసుంధరా పుణ్యవతీ చతేన’ అని అన్నట్టు తమ జీవన విజయాల ద్వారా తమ సౌశీల్య ప్రవర్తన ద్వారా కుటుంబానికి, మాతృదేశానికి హర్షామోదాలను కలిగిస్తున్న మంగళకరమైన కూతుళ్ల సంఖ్య పెరుగుతుండడం ఈ ఏడాది మహిళా దినోత్సవ నేపథ్యం. ఇలాంటి భరతమాత బిడ్డలను, ఆడబిడ్డలను తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు పరిగణించి ప్రస్తుతించి సమ్మానిస్తుండడం మహిళా దినోత్సవాల్లో భాగం కావడం హర్షణీయం. మహిళ వెలుగుతోంది, మహిళ చెలగుతోంది, మహిళా చైతన్యం వికసిస్తోంది, మహిళాశక్తి విస్తరిస్తోంది..
ఈ వికాసము, ఈ విస్తరణ పురుషాధిక్యతను అతిగమించి సమానత్వాన్ని సాధించలేకపోతుండడం మహిళా సాధికారమునకు ఎదురవుతున్న ప్రధాన అవరోధం. ప్రాచీన భారతీయ సమాజంలో స్ర్తి, పురుషుల మధ్య సర్వ సమగ్రమైన సమానత్వం నెలకొని ఉండడం చరిత్ర. ఈ చరిత్ర విదేశీయ దురాక్రమణ సమయంలోను, విదేశీయుల విద్వేష పాలన సమయంలోను గ్రహణ గ్రస్తమైంది. విదేశీయ బీభత్సకారులు ప్రధానంగా జిహాదీలు మహిళలపై జరిపిన ఘోరమైన అత్యాచారాలు మన సమాజానికి, మన కుటుంబాలకు ‘అభద్రత’కు గురిచేశాయి. మహిళలకు మరింత అభద్రత ఏర్పడింది. మహిళలు గడప దాడి బయటికి రావడానికి సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది! మహిళలు క్రమంగా ఇళ్లకే పరిమితం కావడానికి ఈ విదేశీయ బీభత్సం కారణం. ఇళ్లకు పరిమితమైన మహిళలు సామాజిక కలాపాలకు దూరమైపోవడం, అన్ని రంగాలలో వెనుకబడిపోవడం తరువాత జరిగిన ఘటనా క్రమం. మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా సమాజంలోని అన్ని రంగాల్లోను పనిచేయగలిగినపుడు మాత్రమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని భావించడం అసహజం కాదు.. నిర్భయత్వం నిజమైన మహిళా సాధికారానికి, మహిళాభ్యుదయానికి వౌలిక మాధ్యమం. ఇలాంటి నిర్భయత్వం ఇప్పటికీ దేశంలో నెలకొనకపోవడం మన సభ్యతను, సంస్కృతిని నిలదీస్తున్న కఠోర వాస్తవం. మహిళలు, యువతులు, బాలికలు, ఆడశిశువులు సైతం లైంగిక బీభత్సకాండకు బలి అవుతున్న దుర్ఘటనల సంఖ్య తగ్గడం లేదు, పెరుగుతున్నాయి. ఎవరు అదుపుచేయాలి? ఎప్పుడు అదుపు చేస్తారు??
గృహహింస కూడ పెరిగిపోతుండడం మహిళలకు వ్యతిరేకంగా నెలకొంటున్న సామాజిక దుస్థితికి నిదర్శనం. వరకట్నం రుగ్మత మాత్రమే గృహహింసకు కారణం కావడం లేదు. ‘్భరతీయత’ను పరిమార్చుతున్న ‘ప్రపంచీకరణ’ వాణిజ్య జీవనం కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది! భార్యాభర్తలు కలసి మెలసి వంద శరత్తుల పాటు జీవించాలి, వంద వసంతాల మాధుర్యాన్ని చవిచూసి ఆనందించాలన్న ‘్భరతీయత’ అడుగంటిపోతుండడానికి కారణం సాంస్కృతిక జీవనాన్ని వాణిజ్య వికృతులు మింగి వేస్తుండడం! కుటుంబ తత్త్వానికి విస్తృతికి సామాజిక సామరస్యం, సామాజిక సామరస్యానికి విస్తృతి జాతీయ కుటుంబం, జాతీయ పరివార భావానికి మరింత విస్తృతి వసుధైక కుటుంబం. వసుంధరా పరివారం విశ్వవ్యవస్థలో అనుసంధానమై ఉండడం సృష్టిగత సమన్వయం! ఈ సమన్వాయానికి కు టుంబంలో కేంద్ర బిం దువు మహిళ.. మాతృమూర్తి! సమాజంలో కేంద్ర బిందువు మాతృభూమి. అందువల్ల మా తృశక్తి మాతృదేశ జాతీయశక్తిగా వసుంధరా పరివార సమన్వయ దీప్తిగా విస్తరించడం నిజమైన మహిళా సాధికారత. ఇలాంటి సాధికార మహిళ సృష్టిగత మూలశక్తికి, ఆదిశక్తికి మానవ రూపంగా, మానవీయ దీపంగా విరాజిల్లగలదు.. అదీ మహిళా సాధికారానికి చరమ లక్ష్యం, పరమ లక్ష్యం.. వివిధ రంగాల్లో మహిళ విజయం సాధించడం ఈ లక్ష్య సాధనకు పరిణామక్రమం!
సామాజిక సర్వాంగణ వికాసానికి మహిళా సాధికారత అనివార్యం. జాలితోకాక, సానుభూతితో కాక అనివార్యమైన పరిణామ క్రమంలో భాగంగా మా త్రమే మహిళలకు చట్టసభలో మూడవ వంతు స్థానాలను రాజ్యాంగబద్ధంగా కేటాయించాలన్న ప్రతిపాదన తార్కికమైనది! ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరిగిన ‘జాతీయ మహిళా పార్లమెంటు’ సదస్సులో ఈ తర్కం వినబడింది. దశాబ్దుల తరబడి ఇలా మహిళలకు ‘ఆరక్షణలు’ లభించకపోవడం రాజకీయ పురుష పుంగవుల చిత్తశుద్ధి రాహిత్యానికి అద్దం! ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు సైతం దాదాపు మూడేళ్లుగా- ఈ దిశగా అడుగులు వేసిన జాడ లేదు. ఈ ‘దినోత్సవం’ వేదిక నుంచైనా ప్రభుత్వం వారు, ప్రతిపక్షం వారు ఈ విషయమై స్పష్టీకరించాలి. విద్యాలయాల్లో ఏటా ఒక రోజున ‘మాతృ వందనం’ నిర్వహించడం ప్రశంసనీయం. చట్టసభల్లో ‘మాత’ సంఖ్యను పెంచడం కూడా అభిలషణీయం..