సంపాదకీయం

సీమాంతర వైపరీత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో 2008లో మొదలైన ‘సీమాంతర వాణిజ్యం’ సీమాంతర బీభత్సకాండ మరింత విస్తరించడానికి దోహదం చేయడం ధ్రువపడిన వాస్తవం! ఈ వాస్తవం ఇప్పుడు మరోసారి ధ్రువపడింది. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో నుండి ‘అధీనరేఖ’ను దాటి వస్తున్న వాణిజ్య వాహనాలలో సరకుల మధ్య అక్రమ ఆయుధాలు, బాంబులు తదితర బీభత్స సామగ్రి నక్కి ఉందన్నది మన ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’-నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఎ- నిగ్గు తేల్చిన నిజం! పాకిస్తాన్ వైపునుండి తరలివస్తున్న ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బాంబులు, పేలుడు పదార్ధాలు చైనాలో తయారైనట్టు కూడ ధ్రువపడడం సీమాంతర వాణిజ్యం ముసుగులో ముంచుకొస్తున్న ముప్పునకు మరో నిదర్శనం! పాకిస్తాన్ దురాక్రమిత జమ్ము కశ్మీర్‌కు, మన అధీనంలో మిగిలి ఉన్న జమ్ము కశ్మీర్‌కు మధ్య ‘మానవ సంబంధాలు’ నెలకొల్పాలన్న సిద్ధాంతం ఉభయ ప్రాంతాల మధ్య రహదారులు ఏర్పడడానికి ప్రాతిపదిక! ఇలా రహదారుల ‘పునరుద్ధరణ’ వల్ల ఉభయ ప్రాంతాల మధ్య బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలు పయనించడానికి వీలు కలగడం వల్ల ‘అధీన రేఖ’కు ఇటు అటు ఉన్న జమ్ము కశ్మీర్ ప్రజల మధ్య మానవ సంబంధాలు ఏర్పడి స్నేహం వెల్లి విరియగలదన్నది సిద్ధాంతం! ఈ ‘సిద్ధాంతం’లోని వౌలిక లోపం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావం! రహదారుల పునరుద్ధరణ వల్ల బస్సులెక్కి, లారీలెక్కి జిహదీ బీభత్సకారులు మరింత సులభంగా మన వైపునకు చొరబడడానికి ‘సౌకర్యం’ కలుగుతుందని 2008వ సంవత్సరానికి పూర్వమే ధ్రువపడింది. ఎందుకం టే సరిహద్దులోని ‘ఇ నుప కంచె’ను ఛే దించి చొరబడుతున్న ‘జిహాదీ పాకిస్తానీ’లకు ట్రక్కులలో, బస్సులలో మా రువేషాలతో మారుపేర్లతో ఎక్కడం ఒక లెక్క కాదు. సామాన్య వ్యాపారుల వలె నటిస్తూ ‘కుంకుమ పువ్వు’ బుట్టలలో బాంబులను దాచి తీసుకుని రావడం తేలిక, కూరగాయల మధ్యలో తుపాకులను దాచడం మరింత తేలిక! అయినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు 2008లో ‘సీమాంతర’ వాణిజ్యాన్ని అంగీకరించారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ‘పాకిస్తానీ’లు, పాకిస్తానీ తొత్తులు వ్యాపారుల ముసుగులో జమ్ము కశ్మీర్‌లోకి చొరబడ్డారు. కొందరు పట్టుబడినప్పటికీ పట్టుబడని వారు ఎందరన్నది ఎప్పటికీ తేలదు...
పాకిస్తాన్ దురాక్రమిత జమ్ము కశ్మీర్ మనది. అందువల్ల ‘అధీన రేఖ’కు అటువైపున ఉన్న ప్రాంతంపై పాకిస్తాన్ ప్రభుత్వ అధికారాన్ని గుర్తించడం మన సార్వభౌమాధికారానికి ప్రాదేశిక సమగ్రతకు విఘాతకరమైన పరిణామం. దురాక్రమణకు పాల్పడిన పాకిస్తాన్- ముందుగా ‘ఆక్రమిత ప్రాంతం’ నుండి వైదొలగాలి. మొత్తం జమ్ము కశ్మీర్ మన ప్రభుత్వం అధీనంలోకి రావాలి. ఇది జరిగిన తరువాత పాకిస్తాన్‌కు, మన దేశానికి మధ్య ‘సీమాంతర వాణిజ్యం-క్రాస్ బార్డర్ ట్రేడ్-ను ఏ రాష్ట్రంలోనైనా మన ప్రభుత్వం ప్రారంభించవచ్చు. గుజరాత్ నుండి కశ్మీర్ వరకు మనకు పాకిస్తాన్‌తో సరిహద్దు ఏర్పడి ఉంది! పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులు బుద్ధి కలిగి మన దేశంలోని ‘జిహాదీ తోడేళ్ల’ను ఉసిగొల్పడం మానుకుని ఆక్రమిత కశ్మీర్ నుంచి పూర్తిగా వైదొలగే వరకు సీమాంతర వాణిజ్యానికి ఎలాంటి అర్థం లేదు. సీమాంతర-క్రాస్ బార్డర్- వాణిజ్యం రెండు దేశాల మధ్య జరిగే ప్రక్రియ... అందువల్ల ‘సీమాంతర వాణిజ్యం’ అనగానే భారత, నేపాల్ దేశాల మధ్య జరిగినట్టు ‘్భరత-పాకిస్తాన్’ల మధ్య జరిగే వ్యాపారం అన్నది స్పష్టం. ఈ ప్రక్రియను మన ప్రభుత్వం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల గుండా గల సరిహద్దులలో పాకిస్తాన్‌తో ఏర్పాటు చేసుకోవచ్చు! ఎందుకంటే సరిహద్దునకు ఆవల పాకిస్తాన్ ఉంది. కానీ జమ్ము కశ్మీర్‌లో ‘అధీనరేఖ’-లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసి-కు ఆవైపున పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ ఆక్రమించుకొని ఉన్న మన జమ్ము కశ్మీర్ మాత్రమే ఉంది. మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన రెండు భూభాగాల మధ్య ‘సీమాంతర వాణిజ్యం’ ఏమిటి? అర్థరహితం తప్ప మరొకటి కాదు...
అర్థరహితమైన ఈ ‘సీమాంతర వాణిజ్యం’ ద్వారా దురాక్రమిత కశ్మీర్‌పై మన ప్రభుత్వం తాత్కాలికంగానైనా పాకిస్తాన్ ప్రభుత్వపు పెత్తనాన్ని గుర్తించినట్టయింది! మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ విధాన వైపరీత్యాన్ని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం రద్దు చేసి ఉండాలి! రద్దు చేయకపోవడం జమ్ము కశ్మీర్‌లోకి చొరబడుతున్న పాకిస్తాన్ బీభత్సకాండకు నేపథ్యం, అక్రమ ఆయుధ వ్యాపారానికి నేపథ్యం, చైనా కుట్ర కొనసాగుతుండడానికి నేపథ్య వైపరీత్యం, సైనిక దళాలపై, పోలీసులపై కశ్మీర్ లోయలో పాకిస్తాన్ తొత్తులు రాళ్లు రువ్వుతుండడానికి ప్రధాన కారణం! మంగళవారం నాడు ‘లోయ’ లో ఈ దుండగులు రాళ్ల వాన కురిపించారు. అరవై మంది పోలీసులు, నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మెతక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడలేదన్నది నిరంతరం రాళ్లు విసురుతున్న దేశద్రోహుల ధైర్యం! రాళ్లు విసురుతున్న వారిని పట్టి బంధించి న్యాయస్థానాలలో నిలబెట్టి విచారించాలి! కానీ, పళనియప్పన్ చిదంబరం దేశ వ్యవహారాల మంత్రిగా ఉండిన సమయంలో ‘రాళ్ల రాక్షసుల’నందరినీ జైళ్లనుంచి విడుదల చేయడానికి, వారిపై అభియోగాలను రద్దు చేయడానికి, వారికి పునరావాసం కల్పించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశ ప్రజల సొమ్ముతో పునరావాసం పొంది తెగతిని బలిసిన ఈ పాకిస్తానీ తొత్తులు ‘ద్విగుణీకృత ఉత్సాహం’తో మన సైనికులపైన ఇప్పటికీ రాళ్లను రువ్వుతునే ఉన్నారు.. ‘దుర్జనునికి ఎంత మేలు చేసినప్పటికీ వాడికి బుద్ధి రాదు, ప్రతిగా వాడికి అపకారం జరిగినప్పుడు మాత్రమే వాడు అణగిపోతాడు...’ అన్నది మహాకవి కాళిదాసు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన నీతి! శామ్యేత్ ప్రతి అపకారేణ ఉపకారేణ దుర్జనః - ఈ నీతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా కశ్మీర్ లోయలో అమలు జరపాలి!
ఈ తథాకథిత ‘సీమాంతర వాణిజ్యం’ జరుపడానికి దాదాపు మూడు వందల సంస్థలకు వ్యాపారులకు అనుమతి లభించిందట! ఐదు సంస్థలు దేశ ద్రోహ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయని ‘ఎన్‌ఐఏ’ నిర్ధారించింది. ఇర్షాద్ అహ్మద్ మంటూ అనేవాడు ఆక్రమిత కశ్మీర్‌లో నుండి చైనా ఆయుధాలు నిండిన ట్రక్కును తోలుకుని వస్తుండగా మార్చి నెల ఆరంభంలో పట్టుబడ్డాడు. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో 2010 నుంచి వేలాది చైనా సైనికులు తిష్ఠ వేసి ఉన్నారు.