సంపాదకీయం

ఆఫ్రికా ‘ఊరబ్బ నారబ్బ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా ప్రాంతంలో ఆఫ్రికన్లపై దాడులు జరగడం చెదరు మదురు ఘటనలలో ఒకటి. కానీ ఈ దాడులను వర్ణ దురహంకారానికి ప్రతీకగా చిత్రీకరించడానికి ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు కొన్ని యత్నిస్తుండడం అనభిజ్ఞతకు నిదర్శనం. ఈ ‘అనభిజ్ఞత’- ఇగ్నోరెన్స్- కారణంగానే ఆఫ్రికా దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు భారతీయుల స్వభావాన్ని వక్రీకరిస్తున్నారు. మన ప్రభుత్వం తమ దేశాల పౌరులపై జరుగుతున్న దాడులను నిరోధించడం లేదన్నది ఆఫ్రికా దేశాల రాయబారులు చేస్తున్న మరో అసత్య ఆరోపణ! దాడులు జరిగిన వెంటనే మన ప్రభుత్వం నిందితులను నిర్బంధించింది. వారిపై ఆరోపణలను నమోదు చేసి నేర విచారణ ప్రక్రియను ప్రారంభించింది. దాడులు పునరావృత్తం కావడం లేదు. నిందితులకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం చర్యలను తీసుకోవడం లేదన్నది ఆఫ్రికా దేశాల వారు చేస్తున్న అసత్య ప్రచారం. ‘మన ప్రభుత్వం నిష్పాక్షికంగా నేర విచారణ జరపడం లేదు కాబట్టి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నేర విచారణ జరిపించాల’ని ఆఫ్రికా దేశాల రాయబారుల సమాఖ్య కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో కోరడం ఈ దేశాల దుందుడుకుతనానికి నిదర్శనం! మనదేశానికి చెందిన వారిపై అనేక దేశాల్లో నిరంతరం దాడులు జరుగుతున్నాయి. నిరోధక చర్యలను తీసుకోవలసిందిగా మన ప్రభుత్వం కోరుతోంది. ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకొనిపోతామని మన ప్ర భుత్వం ఆయా దేశాల ప్రభుత్వాలను బెదిరించడం లేదు. పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను క్రీస్తుశకం 1947 నుంచి హిం దువులపై దాడులు జరుగుతుండడం దేశ విభజనతో ముడివడి ఉ న్న సమస్య. ఈ విషయమై కూడ ఆ హిందువులను రక్షించవలసింది గా బాధ్యత కలిగిన మన ప్రభుత్వం పాకిస్తాన్, బం గ్లాదేశ్ ప్రభుత్వాలకు వ్య తిరేకంగా ఫిర్యాదు చేయలేదు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ గల అనేక దేశాలలో భారతీయులపై హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. సౌదీ అరేబియా వంటి పశ్చిమ ఆసియా దేశాలలో భారతీయ ఉద్యోగులను, శ్రామికులను పశువుల కంటె హీనంగా చూస్తున్నారు. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ మన ప్రభుత్వం అత్యంత సహనం వహించి ఆయా దేశాలతో చర్చలు జరుపుతోంది. ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడానికి మాత్రం మన ప్రభుత్వం పూనుకోలేదు. కానీ ఆఫ్రికా దేశాలు పూనుకుంటున్నాయి.
దాడులకు గురైన నైజీరియా పౌరులు నిరపరాధులు కావచ్చు. అపరాధులైనప్పటికీ వారిని మన దేశపు చట్టాల ప్రాతిపదికగా శిక్షించవలసింది ప్రభుత్వాలు మాత్రమే, ప్రజలు కాదు. అందువల్ల ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నైజీరియన్లపై జరిగిన దాడులు గర్హనీయం. నైజీరియా పౌరులు వందలాదిమంది మన దేశమంతటా ఉన్నారు. వీరిలో అత్యధికులు ‘ప్రవేశ అనుమతి’-వీసా- గడువు పూర్తయిన తర్వాత కూడా మన దేశంలో ఉంటున్నట్టు అనేకసార్లు ధ్రువపడింది. అనేకమంది నైజీరియా వాసులు ‘వీసా’లు లేకుండానే మన దేశంలో చొరబడి ఉన్నట్టు గతంలో ధ్రువపడింది. ఇలాంటి అక్రమ, సక్రమ ప్రవేశకులలో కొందరు మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తూ పట్టుబడ్డారు. దేశమంతటా వివిధ రకాల నేరాలను నైజీరియా పౌరులు కొనసాగిస్తున్నట్టు వెల్లడైంది. ఈ సంగతులను పట్టించుకోని నైజీరియా ప్రభుత్వం కాని, ఇతర ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలు కాని స్థానిక దౌర్జన్యకారులు జరిపిన దాడులను మాత్రం గోరంతను కొండంతగా చిత్రీకరిస్తున్నాయి.
హైదరాబాద్‌లోను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోను నేరాలకు పాల్పడిన నైజీరియా పౌరులు పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళను వంచించి మూడున్నర లక్షల రూపాయలు కాజేసిన ఇద్దరు నైజీరియా పౌరులను గత నవంబర్‌లో పోలీసులు నిర్బంధించారు. ఈ దొంగలు వివిధ దేశాలకు చెందిన ముప్పయి మందిని ఇలా ఇదివరకే వంచించారట! మనదేశంలో దోచుకున్న సొమ్ముతో వీరు నైజీరియాలో భవంతులను నిర్మించారట.. దక్షిణ ఆఫ్రికా దేశానికి చెందిన ఒక మహిళ మాదక ద్రవ్యాలతో 2015 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో పట్టుబడింది. నేరం రుజువైనట్లయితే ఆమెకు పది నుంచి ఇరవై ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించడానికి వీలుంది. ‘మాదక’ వ్యాపారం చేస్తున్న విదేశీయులలో నైజీరియా పౌరులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. నైజీరియన్లపై దాడులు జరిగినపుడు ఆఫ్రికా ఖండపు దేశాలవారు నిరసన తెలపడం ఆ దేశాల ఐక్యతకు నిదర్శనం. నైజీరియన్లు మన దేశంలోకి అక్రమంగా చొరబడకుండా నిరోధించడానికి మాత్రం ఆ దేశపు ప్రభుత్వం కాని, ఆఫ్రికా దేశాలవారు కాని చర్యలు తీసుకున్న దాఖలా లేదు. అయినప్పటికీ నేరస్థుల చర్యలకు నైజీరియా ప్రభుత్వం కాని, ఆ దేశ ప్రజలు కాని బాధ్యులని మన ప్రభుత్వం ఆరోపించలేదు. కొంతమంది దుశ్చర్యలను మొత్తం నైజీరియా సమష్టి సమాజానికి అంటగట్టలేదు. నోయిడాలో కొంతమంది చే సిన దాడులను మొత్తం భారతీయ సమాజానికి అంటగట్టే ప్రయత్నాన్ని ఆఫ్రికా దేశాలు చేస్తుండ డం ఘోరమైన వైపరీత్యం. వర్ణ దురహంకా రం- ఒక దేశపు ప్రజల లేదా అత్యధిక ప్రజల సమష్టి స్వభావం మా త్రమే! ఇలాంటి వర్ణ దురహంకార స్వభావం భారతజాతికి అనాదిగా లేదు, ఇప్పుడు కూడా లేదు. వైవిధ్యాల మధ్య వె రుధ్యం లేని సర్వ సమన్వయాత్మక ప్రవృత్తి భా రత జాతీయ జీవనంలో అనాదిగా నిహితమై ఉం ది. భారతీయులు- విదేశీయుల ప్రధానంగా ఐరోపా జాతుల వర్ణ దురహంకారానికి, విదేశీయ మతోన్మాదుల బీభత్సానికి శతాబ్దుల పాటు బలి కావడం చరిత్ర. కానీ వర్ణ దురహంకారాన్ని భారతీయులు ప్రదర్శించిన చరిత్ర లేదు. ఆఫ్రికాలోని నల్లజాతుల వారు బ్రిటన్ తదితర ఐరోపా తెల్లజాతుల వర్ణ దురహంకారానికి బలయ్యారు. ఈ వర్ణ దురహంకారానికి వ్యతిరేకంగా భారతీయులు ఆఫ్రికా నల్లజాతులకు మద్దతునివ్వడం చరిత్ర. మహాత్మాగాంధీ దక్షిణ ఆఫ్రికాలో జరిపిన సంఘర్షణ ఒక ఉదాహరణ మాత్రమే. దక్షిణ ఆఫ్రికాలో ‘తెల్లవారి’ వర్ణ దురహంకార ప్రభుత్వం తొలగిపోయే వరకూ ఆ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం అన్ని రంగాల్లోను బహిష్కరించిన చరిత్రను ఆఫ్రికా దేశాలు మరచిపోవడం శోచనీయం..
గతంలో గోవా ప్రభుత్వం అక్రమంగా చొరబడిన ఆఫ్రికన్లను నిర్బంధించినపుడు ఆఫ్రికా దేశాలు ‘ఊరబ్బ నారబ్బ’ రీతిలో మన దేశంపై దుమ్మెత్తి పోశాయి. గత ఏడాది ఒక ఆఫ్రికా పౌరుడిపై దాడి జరిగినపుడు అనేక ఆఫ్రికా దేశాలలో భారత వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. కాంగోలో అనేకమంది భారతీయుల దుకాణాలను దుండగులు ధ్వంసం చేశారు. మన ప్రభుత్వం జరిపిన ఆఫ్రికా దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆఫ్రికా సమాఖ్య దేశాల రాయబారులు బెదిరించారు కూడా. అమెరికాలో భారతీయులను వరుసగా హత్య చేస్తున్నా ఇప్పటికీ మన దేశంలో నిరసన ప్రదర్శనలు జరుగవు.. ఆస్ట్రేలియాను, సౌదీ అరేబియాను మనం సమష్టిగా నిరసించడం లేదు.. ఎవరి విధానం న్యాయమైనది..?