సంపాదకీయం

సమాంతర విన్యాసం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు రాష్ట్రాల శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలు జరిపించాలన్న ‘ఆదర్శం’ అనేక ఏళ్లుగా ప్రచారం అవుతోంది. ఆదివారం దేశ రాజధానిలోని రాష్టప్రతి భవనంలో జరిగిన ‘నీతిఅయోగ్’ సమావేశంలో ఈ ఆదర్శం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన ఈ ‘ఏకకాలంలో ఎన్నికల’ ఆదర్శాన్ని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ బలపరచడంతో ‘్ధ్యస’ మరింత విస్తరించింది. కానీ అనేక ఏళ్లుగా ఈ ప్రతిపాదనను అందరూ సూత్రప్రాయంగా మాత్రమే ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ అమలులో ఉన్న మన దేశంలో శాసనసభలకు, లోక్‌సభకు ఏకకాలంలో ఎలా ఎన్నికలు జరుగుతాయి? ఏకకాలంలో మాత్రమే కాదు లోక్‌సభకు, ఆయా శాసనసభలకు నిర్ణీత సమయంలో ఎన్నికలు జరగగలవన్న రాజ్యాంగపరమైన నిబంధనలు కూడ! అనేక రాజ్యాంగ అధికరణాలను సవరించడంతోపాటు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను కూడ మార్చితే తప్ప కేంద్ర రాష్ట్రాల చట్టసభలకు సమాంతరంగా ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు!! ఇప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థ యధాతథంగా ఉన్నట్టయితే ఏకకాలంలో ఎన్నికలు జరగడం అతార్కికం మాత్రమేకాదు అసంభవం కూడ! ఏకకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నిర్వహణ వ్యయం, అభ్యర్థుల ప్రచార వ్యయం తగ్గిపోతాయన్నది ఈ ‘సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియ’ గురించి ప్రచారం చేస్తున్నవారు చెబుతున్నమాట! ఎన్నికల గురించి ఐదేళ్లపాటు ఆలోచించనవసరం లేకుండా పరిపాలనపై ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాలు దృష్టిని కేంద్రీకరించవచ్చునట! దీనివల్ల ప్రజాసంక్షేమం దేశప్రగతి మరింతగా సాధ్యం కాగలదు. ఇదంతా బాగుంది. కానీ ఐదేళ్లపాటు ప్రతి సభా కొనసాగుతుందన్న నమ్మకం ఏమిటి? ఒక పార్టీకి కానీ లేదా ఒక కూటమికి కాని లోక్‌సభలో స్పష్టమైన ‘మెజారిటీ’ లభించినపుడు ‘సభ’ ఐదేళ్లు పనిచేయడానికి వీలుంది. కానీ ఈ సుస్థిరమైన వ్యవస్థ ఎన్నికల తరువాత ఏర్పడవచ్చు. ఏర్పడకపోవచ్చు! ఏర్పడని స్థితిలో కేంద్రప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవచ్చు. లోక్‌సభకు మధ్యంతరగా ఎన్నికలు జరుగవచ్చు! ఈ ‘మధ్యంతరం’ ఒకసారి ఎన్నికలు జరిగిన తరువాత సంవత్సరానికే సంభవించవచ్చు. రెండేళ్లకు సంభవించవచ్చు. ఇలా లోక్‌సభ రద్దయినప్పుడల్లా లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు ఎన్నికలు జరిపించాలా?? 1996వ, 1998వ, 1999వ సంవత్సరాలలో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అంటే నాలుగేళ్లు పూర్తికాకముందే మూడుసార్లు ఎన్నికలు... ప్రస్తుత లోక్‌సభకు అలాంటి అస్థిరత లేదు. కానీ భవిష్యత్తులో ఏర్పడబోదన్న హామీ మాత్రం లేదు!
ఇలా లోక్‌సభ రద్దయినప్పుడల్లా శాసనసభలను రద్దు చేసి ఏకకాలంలో ఎన్నికలు జరగాలా? ఇరవై తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా శాసనసభలు ఉన్నాయి! ఈ శాసనసభలలో ప్రతిదానిలోను ఏదో ఒక ‘పార్టీ’కి కాని కూటమికికాని ప్రతి ఎన్నిక తరువాత స్పష్టమైన మెజారిటీ వస్తుందా?? రావడం వోటర్ల పరిణతికి ప్రజాస్వామ్య ఉత్కర్షస్థితికి నిదర్శనం! రాకపోవడం కూడా అంతే. అలాంటి స్థితి దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం శాసనసభ విశ్వాసాన్ని కోల్పోవచ్చు! ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు. శాసనసభకు మధ్యంతరంగా ఎన్నికలు జరుగువచ్చు. ఏడాదిపాటు రాష్టప్రతి పాలన ఏర్పడినప్పటికీ తరువాతనైనా ఎన్నికలు జరగాలి! అలాంటి స్థితిలో మిగిలిన రాష్ట్రాల శాసనసభలను, లోక్‌సభను రద్దు చేసి ఏకకాలంలో ఎన్నికలు జరిపిస్తారా?? లోక్‌సభకు కాని, శాసనసభలకు కాని ఐదేళ్లు గరిష్ఠకాల వ్యవధి మాత్రమే. ముందుగా రద్దు కారాదన్న నిబంధన లేదు. 83-2వ రాజ్యాంగ అధికరణం ప్రకారం అంతకంటే ముందుగా రద్దు కాకపోయినట్టయితే ఐదేళ్లు కొనసాగుతుంది. నూట డెబ్బయి రెండవ అధికరణం మొదడి ఉప అధికరణం మేరకు శాసనసభలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తోంది.
ఈ రెండు అధికరణాలను సవరించి, లోక్‌సభ, శాసనసభలు ఎన్నికయినప్పటి నుంచి ఐదేళ్లపాటు విధిగా కొనసాగాలని, మధ్యలో రద్దు కారాదని నిర్దేశించడంవల్ల మాత్రమే ఎన్నికలు జరపడానికి వీలుంది. అలాంటి రాజ్యాంగ సవరణ జరిపించినట్టయితే, 2019లో లోక్‌సభ ఎన్నికలతోపాటు దేశంలోని అన్ని శాసనసభల ఎన్నికలు జరిపించడానికి వీలుగా, గడువుపూర్తికాని శాసనసభలను రద్దు చేయవలసి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల శాసనసభలకు ఈ ‘బాధ’ లేదు. కానీ ఇలా ఒకసారి ఈ చట్టసభలన్నింటికీ ఎన్నికలు జరిపిన తరువాత ఆయా ప్రభుత్వాలకు ఐదేళ్లపాటు ‘సభ’ల విశ్వాసం లభిస్తుందన్న హామీ ఎవ్వరివ్వగలరు?? అధ్యక్ష ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న అమెరికా వంటి చోట్ల ‘ప్రభుత్వాల’ మనుగడ ‘దిగువ సభల’ విశ్వాసంపై ఆధారపడి లేదు. ప్రజలు ప్రత్యక్షంగా కార్యనిర్వాహక అధ్యక్షులను, రాష్ట్ధ్రానేతలను ఎన్నుకుంటున్నారు. విడిగా చట్టసభలను ఎన్నుకుంటున్నారు. ఈ ‘ప్రత్యక్ష’ ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వం, చట్టసభలు నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకు మనుగడ సాగించగలవు. కానీ ‘పార్లమెంటరీ’ ప్రభుత్వ వ్యవస్థ ‘ప్రాతినిధ్య’ ప్రజాస్వామ్యం ప్రజలెన్నుకున్న ప్రతినిధుల సభలు నిరంతరం మంత్రివర్గాలను నియంత్రిస్తున్నాయి. మన రాజ్యాంగంలోని డెబ్బయి ఐదవ అధికరణంలోని మూడవ ఉప అధికరణం మేరకు కేంద్రమంత్రివర్గం మనుగడ లోక్‌సభ మద్దతుపై ఆధారపడి ఉంది. నూట అరవయి నాలుగవ అధికరణం మేరకు రాష్టమ్రంత్రివర్గం మనుగడ శాసనసభ మద్దతుపై ఆధారపడి ఉంది. అందువల్ల శాసనసభలకు, లోక్‌సభకు నిర్దిష్ట కాల వ్యవధి ఏర్పడినప్పటికి మంత్రివర్గాలు ‘సభల’ మద్దతను మధ్యంతరంగా కోల్పోవచ్చు! ఇలాంటి ‘సంక్షోభాన్ని’ ఎలా అధిగమించగలరు?? ‘కూటమి’ చీలిపోవచ్చు. అధికార రాజకీయ పక్షం చీలిపోవచ్చు! 1969లోను, 1979లోను కేంద్రంలో అధికార పక్షాలు చీలిపోలేదా?? 1990లోను, 1997లోను ‘కూటమి’ చీలిపోయింది...
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారి... దేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభల గరిష్ఠ కాలవ్యధి ఐదేళ్లు! జమ్మూకాశ్మీర్ శాసనసభ మాత్రం ముందుగా రద్దుకాకపోయినట్టయితే ఆరేళ్లపాటు కొనసాగుతుందని ఆ రాష్ట్ర రాజ్యాంగం నిర్దేశించింది. 1975 నాటి ‘ఎమర్జెన్సీ’ నాటి వారసత్వ అవశేషం ఇది. ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి శాసనసభల వ్యవధిని ఆరేళ్లకు పెంచింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కూడ తమ శాసనసభ వ్యవధిని పెంచింది! మురార్జీదేశాయ్ ప్రభుత్వం ఈ వ్యవధిని ఐదేళ్లకు దించింది. కానీ కశ్మీర్ ప్రభుత్వం ఆరేళ్లను కొనసాగిస్తూనే ఉంది.