సంపాదకీయం

హిమాలయ తాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కూర్చొని తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయన్న’ది జీవన వ్యవహారం. హిమాలయ పర్వతశ్రేణి కరగిపోతుండడం వేడిమి వ్యవహారం! కాలుష్యాన్ని భోంచేస్తున్న ప్రకృతి దాన్ని జీర్ణించుకోలేక వేడిమిని వెళ్లగక్కుతోంది. ఈ వేడిమి హిమాలయ పర్వతశ్రేణిని కరగించి వేస్తూండడం దశాబ్దులుగా వేధిస్తున్న సమస్య. ‘హిమాలయ నగాధిరాజు’నే కరగించి వేస్తున్న వేడిమి జన జీవనాన్ని కదిలించి వేయడంలో, కల్లోల పరచడంలో ఆశ్చర్యం లేదు. హిమాలయానికి ఇది పాత సమస్య! కానీ, కొండచరియలు విరిగి పడుతుండడం సరికొత్త ఆవిష్కరణ. ఈ సమస్య కూడ పాతదే కాని ఇటీవల ఈ సమస్యను శాస్తవ్రేత్తలు గుర్తించారు. భూమి ప్రకంపనల వల్ల పర్వతాల చరియలు విరిగి పడడంతో ఉక్కువంటి రాళ్లు, రాళ్లగుట్టలు ఏర్పడుతున్నాయట. ఈ రాళ్లు మన దేశం వైపు దొర్లుతున్నాయి. నదులలో కలసి హిమాలయ పర్వతం పైనుండి పెద్ద పెద్ద శిలా శకలాలు దొర్లుకుంటూ వస్తున్నాయట! ఇలా దొర్లుతున్న ఈ రాళ్లు నదుల ప్రవాహాలను అడ్డగించి వరదలు సంభవించడానికి దోహదం చేస్తున్నాయట! ప్రధానంగా గంగానదీ గమనాన్ని, ఉపనదుల ప్రవాహగతిని కూడ ఈ మహాశిలలు నిరోధిస్తున్నాయి. దీనివల్ల వరదలు వెల్లువెత్తడం మాత్రమే కాదు నదుల ప్రవాహవేగం, ప్రవాహగతి మారిపోతున్నట్లు బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందట. విపరీతంగా మంచు క రగిపోవడం వల్ల ‘హి మాయలం’- ‘శిలాలయం’గా మారుతుండడం మొదటి స మస్య. ఇలా బయటపడిన కొండంత రాళ్లు ముక్కలు చెక్కలుగా మారి నీటిలో కలిసి కిందికి దొర్లడం రెం డవ సమస్య. ఇలాంటి కఠిన శిలలు దొర్లడం మన దేశం వైపునకే ఎక్కువగా సంభవిస్తోంది. హిమాలయ దక్షణపు చరియలు విరిగిపడి ఈ రాళ్లు గంగలోను, ఇతర నదులలోను కలిసి ఇరవై కిలోమీటర్ల మేర కొట్టుకొని వచ్చి మైదాన ప్రాంతంలో పేరుకుంటున్నాయట. ఉక్కువంటి శిలలు ప్రవాహ వేగానికి ముక్కలుగా చెక్కలుగా మారి అడ్డుగోడల వలె నదీ గర్భంలో నిలుచుండి పోతున్నాయట! నదుల్లో నీటి ఉద్ధృతి ఇలా రాళ్లను కరిగిస్తోంది. కానీ చిన్న చిన్న గుండ్రాళ్లుగా మారిన ఈ ‘సమూహం’ నదులను నిరోధిస్తోంది. ఇది విచిత్రమైన వ్యవహారం! పెద్ద రాళ్లను ముక్కలు చేయగల నీటిని చిన్న చిన్న రాళ్లగుట్టలు నిరోధిస్తున్నాయి! జల ఖడ్గానికి, శిలాకుడ్యానికి ఇలా సంఘర్షణ జరుగుతుండడం వరదలకు కారణం..
హిమాలయాల ఉత్తర ప్రాంతంలో కూడ మంచు కరిగి రాళ్లగుట్టలు బయటపడినాయి. కానీ, ఈ రాళ్లు మెత్తని రాళ్లు, సున్నపురాయి వంటి ఈ శిలా శకలాలు నదుల వేగానికి చాలా తొందరగా కొట్టుకొని పోతాయి, పిండిపిండిగా మారి ఇసుక రూపంలో నదీ గర్భంలో నిక్షిప్తవౌతున్నాయి. అందువల్ల కైలాస పర్వతానికి, మానస సరోవరానికి ఉత్తరం వైపుగా ప్రవహించే నదుల గతికి, వేగానికి కదలుతున్న కరగుతున్న శిలా సమూహాల వల్ల అవరోధం ఏర్పడడం లేదట! ఈ ఉత్తర ప్రాంత నదులు వంద కిలోమీటర్లకు పైగా ప్రవహించిన తరువాతనే మైదాన ప్రాంతం చేరుతున్నాయి. బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి నదులు తూర్పుగా వంద కిలోమీటర్ల దూరం ప్రవహించిన తరువాత కాని మైదాన ప్రాంతానికి చేరడం లేదు. అందువల్ల మంచు విపరీతంగా కరగిపోవడం, రాళ్లు కొట్టుకొని రావడం వల్ల దక్షిణ ప్రాంతంలోని మన దేశపు మైదానాలకే వరదల ప్రమాదం ఏర్పడుతోంది. చైనా ప్రభుత్వం టిబెట్‌లో జరిపిన దశాబ్దుల తవ్వకాలు హిమాలయ కాలుష్యానికి, వేడిమి పెరగడానికి ఒక ప్రధాన కారణం. చైనా దుశ్చర్యల ఫలితంగా మన దేశంలోని పర్యావరణం పాడైపోయింది. టిబెట్‌లో చైనా నిర్మించిన కృత్రిమ జలాశయం వల్ల, వాగుల గమనం మారడం వల్ల మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ ప్రాంతాలను కృత్రిమ వరదలు ముంచెత్తుతున్నాయి. అతిగా ప్రకృతిని కాలుష్య గ్రస్తం చేస్తున్న దేశాలలో చైనా ఒకటి! ఈ దుష్ప్రభావం మనకు వరదలను సృష్టించింది..
హిమాలయ పర్వత శ్రేణి భారత జాతీయ సంస్కృతికి శైశవ డోలిక! భౌతిక నదీనదాలు మాత్రమే కాదు సాంస్కృతిక స్రోతస్విని కూడ హిమాలయ ‘మానస’ పుత్రిక! గంగానది, మాతృ గంగానది హిమాలయ పుత్రికలు కావడం జలసుధల చరిత్ర. ‘మాతృగంగ’ ఒడ్డున థాయిలాండ్- సయాం- వికసించింది. థాయ్ భాషలో ‘మాతృగంగ’ మెకాంగ్- మా గంగొ- గా మారడం చరిత్ర. మాతృగంగ టిబెట్ నుంచి వియత్నాం వరకూ ప్రవహిస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లోని హేలమందా- హే ల్మండ్- నది, బర్మాలోని ఐరావతి నది హిమాలయ పుత్రికలు. అఫ్ఘానిస్థాన్ నుంచి బర్మా వరకూ విస్తరించిన ‘హిమాలయ నగాధిరాజు’ తూర్పు పడమర సమద్రాలలోకి చొచ్చుకొనిపోయి భూ మిని కొలిచే ‘మానదండం’ వలె ఉత్తర దిక్కున నెలకొని ఉన్నాడని మహాకవి కాళిదాసు అభివర్ణించాడు- క్రీస్తునకు పూర్వం ఒకటవ శాతాబ్దిలో! ‘అస్తి ఉత్తర స్యాందిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజుః పూర్ల పరౌతోయ నిధీవ గాహ్య స్థిత పృథివ్యాః ఇవ మానదండః- ఆయన కొలుస్తున్న భూమి భరతభూమి! పార్వతీదేవి హిమాలయ పుత్రిక కావడం సంస్కార సుధల చరిత్ర. ఇలా జలాలకు, సంస్కార జలాలకు, ఓషధులకు, రత్నాలకు జన్మభూమి అయిన మహాయజ్ఞ స్వరూపం హిమాలయం! మంచు పేరుకొనిపోవడం, మళ్లీ కరగడం జీవజలాలను యుగాలుగా ప్రసాదిస్తున్న సహజ ప్రాకృతిక ప్రక్రియ! వేసవిలో మంచు కరగడం వల్లనే హిమాలయ నదీనదాలు ఏడాది పొడవునా సజీవంగా ఉంటున్నాయి.
కానీ, ‘తాపం’ పెరగడం వల్ల హిమాలయ శ్రేణి అతిగా కరగిపోతోంది. దీనివల్ల నదులు పట్టని నీరు పరివాహ ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతోంది. కురిసిన మంచు పరిమాణం కంటె ఏటా కరగిపోయే మంచు పరిమాణం పెరగడంతో క్రమంగా హిమ శకలాలు అంతరించిపోతున్నాయి. రాళ్ల గుట్టలు బయటపడుతున్నాయి. క్రీస్తుశకం 2001 నాటికి హిమాలయ శ్రేణులలోని మన భూభాగంలోని మంచుగడ్డలలో పదమూడు శాతం అంతరించి పోయాయట! ఈ పదహారు ఏళ్లలో ఎంత శాతం మంచు కరగిపోయిందన్న వివరాలు లేవు. 2001 నుంచి హిమ శకలాల పరిమాణం యథాతథంగా ఉందని 2015 డిసెంబర్ 14వ తేదీన పర్యావరణ పరిరక్షణ వ్యవహారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో ప్రకటించాడు. ఈ ప్రకటనకు కొన్ని చోట్ల జరిగిన అధ్యయనం ప్రాతిపదిక. అధ్యయనం జరగని చోట్ల హిమ శకలాలు కరగిపోతున్నాయా? లేదా??