సంపాదకీయం

‘వాల్‌మార్ట్’ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వాల్‌మార్ట్’ సంస్థ తెలంగాణలో పది కొత్త దుకాణాలను ప్రారంభించనున్నదట. అందువల్ల అమెరికాకు చెందిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం వెళ్లగొట్టలేదన్నది ఇప్పటికి స్పష్టంగా నిర్ధారణ అయింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోను ఘరానా ‘చిల్లర’ దుకాణాలను నడిపిస్తున్న ‘వాల్‌మార్ట్’ అతి పెద్ద అంతర్జాతీయ ‘కిరాణా దుకాణాల సమాఖ్య’గా పేరు మోసింది. అతి పెద్ద అవినీతి సామ్రాజ్యంగా ఈ సంస్థ అవతరించడం సమాంతర విపరిణామం. ఈ సంస్థ ‘దుకాణాల’ను తమ దేశం నుండి తొలగించాలని కోరుతూ అనేక దేశాల్లో ప్రదర్శనలు జరిగాయి, నిరసనలు చెలరేగాయి. రాజకీయ, రాజకీయేతర ప్రముఖులకు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు భారీగా లంచాలను సమర్పించడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ వౌలిక స్వభావం. ఇలా లంచాలను ఇవ్వడాన్ని ‘ప్రచారం ఖర్చు’గా సంపన్న దేశాలకు చెందిన అనేక ప్రభుత్వాలు కూడ గుర్తించడం ప్రపంచీకరణ మాయాజాలం. అందువల్ల వాల్‌మార్ట్, మోనసాంటో, నెజల్ వంటి బహుళ జాతీయ సంస్థలు- మల్టీ నేషనల్ కార్పొరేషన్‌లు- ఈ అవినీతి ప్రచారాన్ని, ప్రచార అవినీతిని వర్ధమాన దేశాలలో విస్తరించగలుగుతున్నాయి. ఈ ఘరానా విదేశీయ సంస్థలు మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలో తమ చిల్లర దుకాణాలు తెరవడం వల్ల స్వదేశీయ వ్యాపారులు ప్రధానంగా తమ దుకాణాలను మూసుకోవలి వస్తోంది. చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీయ సంస్థలు చొరబడడానికి వీలు కల్పించరాదన్నది జాతీయ హితం. కానీ, ‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కిన తరువాత ‘జాతీయ హితం’ ‘సంకుచిత’- ప్రొటక్షనిస్ట్- ప్రయోజనంగా ప్రచారమైంది. ‘అంతర్జాతీయ హితం’ వి స్తృత ప్రయోజనమన్న ది, దాని కోసం అన్ని దేశాల వారూ సమష్టిగా కృషి చేయాలన్నది ‘ప్రపంచీకరణ’ నీతి! కానీ ఈ ‘నీతి’ని ప్రవర్ధమాన దేశాలు మాత్రమే అమలు చేయాలన్నది ‘ఆచరణ సూత్రం’. ప్రపంచ హితమంటే సంపన్న దేశాల హితం మాత్రమే, అగ్రరాజ్యాల ఆధిపత్య విస్తరణ మాత్రమేనన్నది ఆచరణలో నిగ్గుతేలిన నిజం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిజాన్ని మరింత ‘పెద్ద నోటి’తో ‘రాక్షసుని గొంతు’తో చాటి చెపుతున్నాడు. చాపకింద విషంలా పదిహేనేళ్లకు పైగా చైనా వాణిజ్య ఆధిపత్యం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా విస్తరించి పోయింది. అమెరికా వాల్‌మార్ట్ తెలంగాణ ప్రాంతంలో కొత్తగా పది దుకాణాలను ఏర్పాటు చేయడానికి పూనుకొనడం ఈ ‘అంతర్జాతీయ ప్రయోజన’ విస్తృతిలో భాగం. సంపన్న దేశాల అక్రమ వాణిజ్య సంస్థల ఆధిపత్యపు ఉక్కుపాదాల కింద మన దేశపు చిల్లర వ్యాపారులు నలిగి పోవడం ఈ విస్తృతి! విదేశీయ కబంధ బంధంలో మన కర్షకులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి కావడం ఈ విస్తృతి!
ఈ వాణిజ్య కబంధ బంధాన్ని ఛేదించగల ‘రామలక్ష్మణులు’ మన దేశంలో ఉద్యమించకపోవడం వౌలిక వైపరీత్యం. విదేశీయ సంస్థల వస్తువులను కొనుగోలు చేయడం మనం కూర్చున్న కొమ్మలను మనమే నరికివేయడం వంటిదన్న ధ్యాస మనకు లేదు, మధ్య తరగతి ప్రజలకు లేదు, సామాన్యులకు లేదు! ఈ ధ్యాసను పెంచవలసిన జాతీయతావాదులు, స్వదేశీయ ఉద్యమకారులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్ర పోతున్నారు. అందువల్ల వాల్‌మార్ట్ వంటి సంస్థలు విచ్చలవిడిగా విస్తరించిపోవడానికి వీలు కలుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ విదేశీయ సంస్థవారు కొత్తగా యాబయి దుకాణాలను తెరవనున్నారట. తెలంగాణలో పది ‘టోకు’ దుకాణాలను వాల్‌మార్ట్ వారు ప్రారంభిస్తారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వాల్‌మార్ట్ దుకాణాలు నడుస్తున్నాయట. ఒక్కొక్క దుకాణంపై వాల్‌మార్ట్ అరవై ఐదుకోట్ల రూపాయల నుంచి డెబ్బయి ఎనిమిది కోట్ల వరకూ పెట్టుబడి పెడుతుందట. ఇవి టోకు దుకాణాలని, వ్యవసాయదారుల వద్ద అధిక ధరలకు కొని చిల్లర కిరాణా దుకాణాల వారికి అతి తక్కువ ధరలకు అతి మేలైన వస్తువులను వీరు సరఫరా చేస్తారట! ఈ వాల్‌మార్ట్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని మరే ప్రాంత ప్రభుత్వం కాని అంగీకరించడం ఆశ్చర్యకరం కాదు. కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది!
వాల్‌మార్ట్ దుకాణాలను మన దేశంలో తెరవనివ్వబోమని 2014 నాటి లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతాపార్టీ వారు భీషణ ప్రతిజ్ఞ చేశారు. భాజపా తదితర ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత కారణంగానే 2011లో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాల్‌మార్ట్‌ను చిల్లర వ్యాపారంలోకి ప్రవేశపెట్టలేకపోయింది. బహుళ వస్తు- మల్టీ బ్రాండ్- చిల్లర వ్యాపారంలోకి విదేశీయ వాణిజ్య సంస్థల చొరబాటును అనుమతించరాదన్నది భాజపా అప్పుడు చేసిన ప్రచారం. కోట్లమంది చిట్టి వ్యాపారుల పొట్టలను కొట్టడానికై పొంచి ఉన్న విదేశీయ వాణిజ్య బీభత్సకారులు దేశంలోకి చొరబడకుండా అడ్డుకున్న భాజపాను జాతీయతా నిష్ఠ కలవారు అప్పుడు ప్రశంసించారు. చిల్లర వ్యాపారంలో ‘విదేశీయ ప్ర త్యక్ష భాగస్వా మ్యం’- ఫారిన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ- ఆగినందుకు అమెరికా ఆగ్రహించింది. ‘వాల్‌మార్ట్’ వంటి తమ వాణిజ్యపు ముఠాల ఒత్తిడికి లొంగిన అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హుస్సేన్ ఒబామా 2012 నాటి తమ ఎన్నికలు ముగిసేలోగా ‘చిల్లర ఎఫ్‌డిఐ’కి మనదేశంలో అనుమతినిప్పించడానికి ‘తెరవెనుక’ కృషి చేశాడు. ఫలితంగా 2012లో మన ప్రభుత్వం ప్రతిపక్షాల వ్యతిరేకతను లెక్కచేయకుండా ‘చిల్లర ఎఫ్‌డిఐ’ని అనుమతించింది. తాము అధికారంలోకి వస్తే ‘వాల్‌మార్ట్’ దుకాణాలకు మూత వేయిస్తామని లోక్‌సభలో అప్పటి భాజపా నాయకురాలు సుషమా స్వ రాజ్ ప్రకటించడం చరిత్ర.. ఇప్పుడీ చరిత్ర ప్రజలకు గుర్తులేదు. ‘్భజపా’ వారికే గుర్తులేదు.
తమ ‘ప్రవేశాని’కి అనుమతి రాకముందే ‘వాల్‌మార్ట్’ సంస్థ దొడ్డిదారిన చిల్లర వ్యాపారంలోకి ప్రవేశించింది. ఈ విషయమై దర్యాప్తు చేయాలని 2012లో కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకును కోరింది కూడ. 2010లోనే దాదాపు ఆరువందల యాబయి కోట్ల రూపాయల మేరకు ‘వాల్‌మార్ట్’ మన దేశంలో చిల్లర వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిందన్నది ఆరోపణ! ఈ ఆరోపణలోని నిజానిజాలు ఇంతవరకూ నిగ్గు తేలలేదు. ప్రస్తుత ప్రభుత్వం గత మూడేళ్లుగా ‘చిల్లర ఎఫ్‌డిఐ’ గురించి రకరకాల ప్రకటనలు జారీ చేసింది.. ‘వాల్‌మార్ట్’ ప్రకటించిన ఇప్పటి విస్తరణకు ఈ గందరగోళం నేపథ్యం. మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం చేసింది తప్పు.. దాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొనసాగిస్తే అది ‘ఒప్పు’ అవుతుందా..?