సంపాదకీయం

పాకిస్తాన్ పిశాచక్రీడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతగాడు మొదట జిహాదీ ఉగ్రవాది, ఆ తరువాతనే పాకిస్తానీ ప్రధాని.. పేరు నవాజ్ షరీఫ్, స్వభావం పైశాచిక తత్త్వం! నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పౌర ప్రభుత్వానికి 2013లో మళ్లీ అధినేత అయిన తరువాత ‘జిహాద్’ సిద్ధాంతాన్ని మరింత పాశవిక నిష్ఠతో అమలు జరుపుతున్నాడు. పాకిస్తాన్ సైనికులు సోమవారం ఇద్దరు భారతీయ సైనికులను హత్యచేసి మృతదేహాల తలలు నరకడం ఈ జిహాదీ బీభత్సకాండలో భాగం! మరణించిన వారితో మనకు వైరం ఉండరాదన్నది భారతీయమైన జీవన వ్యవహారం. ఈ సనాతన తత్త్వం మన సైనికుల స్వభావం. అందువల్లనే భారతీయ సైనికులు మరణించిన శత్రు సైనికులపై కసి తీర్చుకున్న చరిత్ర లేదు. ఎందుకంటే శత్రువులు మరణించడంతో వారితో వైరం సమాప్తం అవుతుంది. ‘మరణాంతాని వైరాణి’ అన్నది మన జీవన వ్యవహారం. మరణించిన పాకిస్తానీ సైనికుల మృతదేహాలను మన సైనికులు ఎన్నడూ చిత్రవధ చేయలేదు. ఆ మృతదేహాలకు నిబంధనల ప్రకారం అంతిమ సంస్కారం చేయించడం లేదా బంధువులకు వాటిని అప్పగించడం మన సైనిక సంప్రదాయం. పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులు హతమైన సమయంలో సైతం మన సైనికులు మృతదేహాలను ఖండించలేదు, చిత్రవధ చేయలేదు, తలలు తుంచలేదు. తమ దేశానికి చెందిన జిహాదీ దుండగులు మన దేశంలో మరణించిన సందర్భాల్లో ఆ మృతదేహాలను స్వీకరించడానికి సైతం పాకిస్తానీ పౌర ప్రభుత్వం కాని, సైనిక ప్రభుత్వం కాని అంగీకరించక పోవడం అమానవీయతకు మ రో నిదర్శనం. ఇలా మృతదేహాలను తమ దేశానికి తీసుకొనిపోయినట్టయితే ఆ జిహాదీలు తమ దేశానికి చెందినవారని అంగీకరించినట్టు కాగలదన్న ది పాకిస్తాన్ పెత్తందార్ల భయం! అందువల్ల తాము ఉసిగొల్పుతున్న జిహాదీ హంతకులను పాకిస్తాన్ ప్రభుత్వం అనేక సార్లు అనాథ ప్రేతాలుగా మార్చింది. కానీ, శత్రువులను దొంగచాటుగా చం పడం, నిరాయుధులను, సామాన్య ప్రజలను ఊచకోత కోయడం, మృతదేహాలను కసిగా ఖండించడం, రాళ్లతో తొక్కడం, బతికిఉన్న వారి చర్మం ఒలిచి చిత్రహింసల పాలు చేయడం జిహాదీలకు శతాబ్దుల స్వభావం! ఇస్లామేతర మతస్థులను మతం మార్చడం, మహిళలను లైంగిక బీభత్సాలకు గురిచేయడం వంటి రాక్షస కృత్యాలు జిహాద్‌లో భాగం. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం చేయిస్తున్న పైశాచిక కృత్యాలు ఈ జిహాద్‌లో భాగం! తాలిబన్లు, ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’ మూకలు, ‘లష్కర్లు’, హిజ్‌బుల్ ముజాహిదీన్ ముష్కరులు, పాకిస్తాన్ సైనికులు- ఇలా జిహాదీ బీభత్సకారులందరూ మృతదేహాలపై కసి తీర్చుకుంటూనే ఉన్నారు.
పాకిస్తాన్ సైనికులు జమ్మూ కశ్మీర్‌లోని అధీనరేఖను దాటి వచ్చి దొంగచాటుగా దెబ్బతీసి మన సైనికులను హత్యచేసిన సమయంలోనే కశ్మీర్‌లోని ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ ఉగ్రవాదులు ఒక బ్యాంకుకు చెందిన వ్యాన్‌పై దాడి చేసి దోపిడీ చేయడానికి యత్నించారు. ఇద్దరు భద్రతాసిబ్బందిని ఐదుగురు పోలీసులను హత్య చేశారు. ఏడుమందిని చంపినప్పటికీ వ్యాన్ ఖాళీగా ఉండడంతో టెర్రరిస్టులు నిరాశ చెంది ఉండవచ్చు! కుల్‌గామ్ జిల్లాలోని మరో ‘బ్రాంచి’లో డబ్బు అప్పగించిన తర్వాత తిరిగి వస్తుండిన వ్యాన్‌పై ముష్కరులు దాడి చేశారు. కానీ ఏడుమందిని, సాయుధ పోలీసులను టెర్రరిస్టులు హత్యచేయ గలగడమే విస్మయకరం! ఖాళీ వ్యాన్‌ను దోచుకొనడానికి ఎవరూ ప్రయత్నించరన్న విశ్వాసం కావచ్చు, ప్రమత్తత కావచ్చు పోలీసులను బలిగొంది. కానీ టెర్రరిస్టులను పోలీసులు ఎదుర్కొనలేదన్న వాస్తవానికి ఈ ఘటన మరో నిదర్శనం. అందువల్లనే సైనికులు అడుగడుగునా జిహాదీ ఉగ్రవాదులతో తలపడవలసి వస్తోంది. మన సైనికదళాలపై పాకిస్తాన్ ముష్కరులు, కశ్మీర్‌లోని వారి జిహాదీ తొత్తులు కసి పెంచుకొనడానికి ఇది మరో కారణం...
పాకిస్తానీ ప్రభుత్వ బీభత్సకారులు దొంగచాటు దాడులు చేసి సైనికులను చంపి తలలు నరికి కసి తీర్చుకుంటున్నారు. ‘లోయ’ ప్రాంతంలోని పాకిస్తాన్ తొత్తులు మన సైనికదళాలను జమ్మూ కశ్మీర్ నుంచి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. ఎందుకంటే సైనికదళాల వారు ఎక్కడికక్కడ బీభత్సకారులతో తలపడి తిప్పికొడుతున్నారు. అందువల్ల జమ్మూ కశ్మీర్ సైనిక దళాల ఉనికి జమ్మూ కశ్మీర్‌కు మన దేశం నుంచి విడగొట్టాలన్న విష వ్యూహానికి విరుగుడు. సైనిక దళాలు వైదొలగినట్టయితే పోలీసులను సులభంగా మట్టుపెట్టి తమ విద్రోహ లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్నది పాకిస్తాన్ పెత్తందార్ల పగటికల! పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న బీభత్సకారులు నిరంతరం మన సైనికదళాలపై రాళ్లు రువ్వుతున్నారు. ఇలా రాళ్లు రువ్వుతున్నవారికి స్థా నిక ప్రాంతీయ రాజకీయ పక్షాల నాయకులు మద్దతును ప్రకటిస్తుండడం వి స్తృత జిహాదీ వ్యూహంలో భాగం. ఇలా మద్దతు పలుకుతున్న రాజకీ య నాయకులు ప్ర చ్ఛన్న జిహాదీ బీ భత్సకారులు, భారత రాజ్యాంగానికి నిబద్ధతను ప్రకటిస్తున్నట్టు అభినయిస్తున్న వీరు పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలకు మద్దతును ప్రకటిస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి.
మన సైనికదళాలను కాని, సరిహద్దు భద్రతాదళాలను కాని ముఖాముఖీ ఎదుర్కొని పోరాడడం చేతకాని పిరికిపందలైన పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు ఇలా ‘ప్రచ్ఛన్న’ సమరం జరుపుతున్నాయి. పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి ప్రాంతంలో ఒక వైపున పాకిస్తాన్ సైనికులు- రేంజర్లు- భారీ కాల్పులు జరుపుతున్న సమయంలోనే ‘సరిహద్దు నిర్వహణ బృందం’ పేరుతో చెలామణి అవుతున్న పాకిస్తానీ ముష్కరులు మరోవైపున దొంగదెబ్బ తీశారు. ఈ వంచన వ్యూహాన్ని పాకిస్తాన్ దశాబ్దులుగా అమలు జరుపుతోంది. మన సైనికుల మృతదేహాల తలలను నరకడం పాకిస్తానీ మూకలకు ఇది మొదటిసారి కాదు, 2013 జూన్‌లో హేమరాజ్ అనే మన సైనికుడిని హత్యచేసిన పాకిస్తానీలు ఆయన తలను ఖండించుకొని వెళ్లి తమ ‘విజయ సూచకం’గా ఆ తలను వీధుల్లో ఊరేగించారు. అప్పటి నుంచి అనేకసార్లు పాకిస్తానీలు ఈ చిత్రవధలకు పాల్పడుతున్నారు. ఇదంతా తమ దేశంలో తన భారత వ్యతిరేకతను నిరూపించుకొనడానికి నవాజ్ షరీఫ్ అమలు జరుపుతున్న దుస్తంత్రంలో భాగం...