సంపాదకీయం

వి‘చిత్ర’ కర్ణన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థను నవ్వులపాలు చేయడానికి క లకత్తా ఉన్నత న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ప్రదర్శిస్తున్న ప్రహసనం ఎన్ని రోజులుపాటు కొనసాగుతుందన్నది అంతుపట్టని సందేహం! నిర్భయంగా, నిర్లజ్జగా అనేక నెలలపాటు సర్వోన్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తున్న కర్ణన్ మొత్తం రా జ్యాంగ వ్యవస్థను వెక్కిరిస్తున్నాడు! తనను అదుపు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం చేస్తున్న ప్రయత్నాలను కర్ణన్ ‘దీటు’గా ప్రతిఘటిస్తుండడం విస్మయం కలిగిస్తున్న విపరిణామం! తనకు వ్యతిరేకంగా అభియోగాన్ని విచారిస్తున్న సర్వోన్నత ధర్మాసనం న్యాయమూర్తులను నిర్బంధించి తన ఎదుట హాజరు పరచాలని ఉన్నత న్యాయమూర్తి కర్ణన్ మంగళవారం ఆదేశించడం ఆయన నిర్వహిస్తున్న అపహాస్య ప్రహసనంలో సరికొత్త ఘట్టం! తనకు వ్యతిరేకంగా అభియోగాన్ని విచారిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్‌ను, సుప్రీం న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, జె.చలమేశ్వర్, రంజన గగోయి, మదన్ లోకుర, వి.సి.ఘోష్, కురియన్ జోసెఫ్‌లను అరెస్టు చేయాలన్నది కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్‌కు న్యాయమూర్తి కర్ణన్ జారీ చేసిన ఆదేశం! ఇలా ‘ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆదేశాలను జారీ చేయడం’ అన్న విచిత్ర కార్యక్రమాన్ని దాదాపు ఏడాది క్రితమే కర్ణన్ ప్రారంభించాడు. ఈయనకు వ్యతిరేకంగా న్యాయధిక్కార అభియోగాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తోంది. పదే ప దే సర్వోన్నత న్యా యస్థానాన్ని కర్ణన్ ధి క్కరించడం నడసు తన్న చరిత్ర! ఒక హై కోర్టు న్యాయమూ ర్తి, రాజ్యాంగ నిపుణుడు ఇలా అనాగరిక అ జ్ఞాని వలె ప్రవర్తించడం, దేశ విద్రోహకర వ్యాఖ్యలు చేయడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి. అందువల్లనే న్యాయమూర్తి మానసిక, బౌద్ధిక సంతులనంపై అనుమానాలు తలెత్తడం సహజం! కర్ణన్ మానసిక స్థితి గురించి వైద్య పరీక్షలను నిర్వహించాలని సోమవారం సర్వోన్నత న్యాయమూర్తులు ఆదేశించడం ఔచిత్యవంతమైన చర్య. సర్వోన్నత న్యాయమూర్తులు ఇలా ఆదేశించడానికి ప్రతిక్రియ అన్నట్టుగా కర్ణన్ వారిని నిర్బంధించాలని ఆదేశించాడు. ఈ ఏడుగురు న్యాయమూర్తులూ మే నెల 28న తన ఎదుట హాజరు కావాలని ఏప్రిల్‌లో కర్ణన్ ఆదేశించాడు. ఆ తరువాత- మే ఒకటవ తేదీనాడే సర్వోన్నత న్యాయమూర్తులు తమ ఎదుట ‘నిలబడాలన్నది’ కర్ణన్ సవరించిన ఆదేశం. తన ‘ఆదేశాన్ని ధిక్కరించిన’ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అరెస్టు చేయాలన్నది ఢిల్లీ పోలీసు శాఖ ప్రధాన సంచాలకుని-డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కి కర్ణన్ జారీ చేసిన ఉత్తరువు. ఈ మేరకు ‘విడుదలకు వీలు లేని నిర్బంధం’-నాన్ బెయిలబుల్ -వారంట్‌ను జారీ చేయాలని కలకత్తా హైకోర్టు ‘రిజిస్ట్రార్ జనరల్’ను ఆదేశించాడట..
బహిరంగ ధిక్కారానికి ఒడిగట్టిన కర్ణన్‌ను నిర్బంధించి తమ సముఖానికి రప్పించడానికి వీలుగా ‘నాన్ బెయిలబుల్ వారెంట్’ను జారీ చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం వారు తటపటాయించారు. సర్వోన్నత న్యాయమూర్తులను అరెస్టు చేయించడానికి కర్ణన్ తటపటాయించడం లేదు. ఎందుకంటే సుప్రీం న్యాయమూర్తులు న్యాయ ప్రక్రియ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న కర్ణన్‌కు నిబంధనలు అవసరం లేదు, రాజ్యాంగ సూత్రాలు అవసరం లేదు. మతిస్థిమితం లేని ఉన్మాది వలె ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఈ విచిత్ర ప్రవర్తన 2016 ఫిబ్రవరిలో ఆయనను ‘మదరాసు హైకోర్టు’ నుంచి ‘కలకత్తా హైకోర్టు’కు బదిలీ చేయడంతో మొదలైంది. తనను బదిలీ చేయడం పట్ల కర్ణన్ దురాగ్రహం వ్యక్తం చేశాడు. సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తరువును నిలిపివేస్తూ తానే స్వయంగా ఉత్తరువును జారీ చేశాడు!
ఇలా తనను బదిలీ చేయడం దళితులకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రవర్తిస్తోందనడానికి నిదర్శనమని కర్ణన్ ఆరోపించడం న్యాయవ్యవస్థకు ఆయన చేసిన ఘోరమైన అపచారం! సర్వోన్నత న్యాయమూర్తులను, మదరాసు హైకోర్టు న్యాయమూర్తులను నిందించడంతో కర్ణన్ సంతృప్తి చెందలేదు. ఈ దేశంలో పుట్టడం వల్ల తనకు తీరని అన్యాయం జరిగిందని జరుగుతోందని బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా మాతృభూమి పట్ల కృతఘ్నతను ఆవిష్కరించాడు. ఈ దేశంలో పుట్టడం తన దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించడాన్ని మానసిక సంతులనం కలిగి ఉన్న సామాన్య ప్రజలు కాని, మేధావులు కాని హర్షించరు. ఒక హైకోర్టు న్యాయమూర్తి మాత్రమే కాదు, మతి ఉన్న నిరక్షరాస్యుడు కూడ ఇలాంటి దేశ వ్యతిరేక ఆలోచనలకు లోనుకాడు! రాజ్యాంగ వ్యవస్థను ఏడాదికి పైగా ధిక్కరిస్తున్న కర్ణన్ ఉన్మాదానికి లోనయి ఉన్నాడన్న సందేహం కలగడం సహజం సతార్కి కం. ఆయన మానసిక స్థితిని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు జరపాలన్న సర్వోన్నత న్యాయాదేశం సముచితం, అనివార్యం! నిజానికి కర్ణన్ మానసిక ఉన్మాదానికి గురి కానట్టయితే ఆయన రాజ్యాంగ వ్యతిరేకి, దేశ వ్యతిరేకి.. గత ఏడాది జరిగిన ‘బదిలీ’ని కొన్నాళ్లపాటు ధిక్కరించిన కర్ణన్ ఆ తరువాత కలకత్తా హైకోర్టులో బాధ్యతలను స్వీకరించాడు. అప్పటి నుంచి కూడ ఆయన సర్వోన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తునే ఉన్నాడు! తనను సర్వోన్నత న్యాయస్థానంలో హాజరు కావాలని జారీ అయిన ఉత్తరువును ఆయన పదే పదే ధిక్కరించాడు! అనుసూచిత కులాల, అనుసూచిత సముదాయల వ్యతిరేక అత్యాచార నిరోధక చట్టం-ఎస్‌సిఎస్‌టి-ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్-ప్రకారం ఈ ఏడుగురు సర్వోన్నత న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అభియోగాద్ని దాఖలు చేయాలని కర్ణన్ ఆదేశించడం ఈ అరాజక ప్రహసనంలో భాగం...
అవినీతికి పాల్పడిన, అసమర్ధతకు గురి అయిన ఉన్నత న్యాయమూర్తులను పార్లమెంటు అభిశంసించవచ్చు. అలా అభిశంసనకు గురి అయిన తరువాత మాత్రమే రాష్టప్రతి ఇలాంటి హైకోర్టు న్యాయమూర్తులను తొలగించగలరని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కర్ణన్ ‘మానసిక రోగి’ అని ధ్రువపడితే ఆయన అసమర్ధతకు గురి అయినట్టు ధ్రువపడుతుంది. అంతవరకు కర్ణన్ ప్రదర్శిస్తున్న విచిత్ర నాటకాన్ని వీక్షించక తప్పదేమో! వైద్య పరీక్షకు కర్ణన్ అంగీకరించకపోవడం ఈ నాటకంలో వర్తమాన విచిత్రం!