సంపాదకీయం

విస్తరిస్తున్న చైనా ‘బంధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత సాగర-పసిఫిక్ ఓషన్- పరిసరాలలో అశాంతి జ్వాలలను రగిలించిన చైనా ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కల్లోల తరంగాలను సృష్టించడానికి యత్నిస్తోంది! తమ దేశానికి దక్షిణంగా, వియత్నాం, మలేసియా, థాయ్‌లాండ్ తదితర ఆగ్నేయ ఆసియా దేశాలకు తూర్పుగా విస్తరించి ఉన్న సముద్రాన్ని చైనా ఇదివరకే ఘర్షణల నిలయంగా మార్చి ఉంది. అంతర్జాతీయ సముద్ర జలాల-ఇంటర్నేషనల్ వాటర్స్-ను చైనా తన సార్వభౌమ జలాలు-టెర్రిటోరియల్ వాటర్స్-గాను, స్వీయ ఆర్థిక జల మండలం-ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్-గాను మార్చడానికి జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణ ఈ ప్రాంతాన్ని ‘సమర సాగరం’గా మార్చివేస్తోంది. అమెరికా, జపాన్ వియత్నాం ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో ఈ సముద్ర జలాలలో తలపడడానికి చైనా కాలు దువ్వుతుండడం నడుస్తున్న ఆధిపత్య ప్రహసనం!
ఇపుడు చైనా ‘ప్రాబల్య విస్తరణ’ ఆఫ్రికా ఖండపు తీరాలను తాకింది, అంతర్జాతీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఎఱ్ఱ సముద్రం హిందూ మహా మహా సమద్రంలో కలిసే చోట ఆఫ్రికా తూర్పు తీరంలో నెలకొని ఉన్న ‘జిబౌటీ’ల చైనా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండడం ఈ ప్రకంపనలకు కారణం! కేవలం పదకొండు లక్షల జనాభా కలిగిన ఇరవై మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న చిన్న దేశమైన ‘జిబౌటీ’ రాజధాని ‘జిబేటీ’ పట్టణం సముద్ర తీరంలో ఉంది. ఈ ప్రదేశంలో చైనా తన స్థావరం ఏర్పరుచుకునట్టయితే ఈ చిట్టి దేశం చైనా శాశ్వతంగా ‘వలస’గా మారిపోవడం ఖాయం. సోమాలియా ఎరిత్రియా దేశాల మధ్య ‘కూరుకుని’ ఉన్న చిట్టి ‘జిబౌటీ’లో చైనా చేరికతో ఎఱ్ఱ సముద్రం ముఖ ద్వారం వద్ద చైన నియంత్రణ పెరిగే ప్రమాదం ఏర్పడింది. చైనా నౌకాదళాలు ‘జబౌటీ’లో తిష్ట వేయడానికి స్వదేశంనుండి బయలుదేరిపోతున్నాయట!-ఎఱ్ఱ సముద్రం అతి ప్రధానమైన అంతర్జాతీయ జల మార్గం. మధ్యధరా సముద్రాన్ని ఎఱ్ఱ సముద్రంలో కలుపుతూ ‘సూయజ్’ కాలువను తవ్విన తరువాత ఈ జలమార్గం ఆసియాకు ఐరోపా, అమెరికా, ఆఫ్రికా ఖండాలకు మధ్య ఏకైక అనుసంధాన మాధ్యమంగా మారి ఉంది. ఈ అంతర్జాతీయ జల మార్గపు హిందూ మహాసముద్ర ముఖ ద్వారం వద్ద చైనా నౌకాదళం తిష్ఠ వేయడం దీర్ఘకాల ఉద్రిక్తలకు దోహదం చేయగలన్నది నిరాకరింప జాలని నిజం..
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌నుంచి పాకిస్తాన్‌లోని గ్వాడార్ వరకు ఇదివరకే చైనా ప్రభత్వం జలసమర వ్యూహాన్ని రచించింది. బర్మాలోని రంగూన్, శ్రీలంకలోని హంసన తోట, మాలా ద్వీపాల-మాల్ దీవుల మీదుగా మన దేశానికి మూడు వైపులా ఉన్న సముద్ర జలాలలో యుద్ధ నౌకలను నడపడం ప్రశాంత మహాసాగరం నుండి తూర్పు ఆసియానుండి, హిందూ మహాసముద్రం వరకు ఆఫ్రికా ఖండం వరకు తన దురాక్రమణ వ్యూహాన్ని విస్తరించడానికి చైనా పూనుకుంది! ‘చిట్టగాంగ్-గ్వాడార్ మార్గం’ లోపలి వలయం...పసిఫిక్ పరిసరాలనుండి జిబౌటీ వరకు ఇప్పుడు వెలుపలి వలయాన్ని చైనా బిగిస్తోంది! ఆర్థిక దురాక్రమణతో తెగబలిసి ఉన్న చైనా లక్షలాది కోట్ల రూపాయలను ప్రపంచ ఆధిపత్య సాధనకోసం ఖర్చు పెడుతుండడం ‘జిబౌటీ’ స్థావరానికి నేపథ్యం! సోమాలియా సముద్ర తీరం ఓడ దొంగలకు ఆలవాలం. ఆప్ఘానిస్థాన్‌నుంచి తరిమి వేతకు గురి అయిన ఆల్‌ఖాయిదా తాలిబన్ మూకలు యెమెన్‌లో ప్రధాన స్థావరాలను ఏర్పరుచుకున్నాయి. ఫలితంగా సోమాలియా తీరంలోని ఓడ దొంగలకు, జిహాదీ ఉగ్రవదులైన తాలిబన్ అల్‌ఖాయిదా మూకలకు మధ్య అనుసంధానం ఏర్పడింది. ఈ అనుసంధాన కర్త పాకిస్తానీ ప్రభుత్వ అధికార బీభత్స సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ-!! ఈ అనుసంధానం కుదిరినప్పటి నుంచి ఓడ దొంగలు కేవలం ఓడ దొంగలు కాదు, ఇస్లామేతర మతాల వారిని మట్టుపెట్టడం లక్ష్యమైన జిహాదీలు కూడ! ఓడ దొంగలను అదుపు చేసే సాకుతో చైనా అరేబియా సముద్ర ప్రాంతంలో తన నౌకా దళాలను నిరంతరం నడుపుతోంది! ఓడ దొంగల వేషంలోని జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతున్నది పాకిస్తాన్..నియంత్రించే అభినయాన్ని సాగిస్తున్నది చైనా! ఈ తోడు దొంగల ఉమ్మడి వ్యూహం మన దేశాన్ని నలువైపులనుంచి దిగ్బంధించడం! జమ్ము కశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో కొనసాగుతున్న కల్లోల కాడను చైనా ఉసిగొల్పుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి శనివారం ప్రకటించడానికి ఈ ‘తోడుదొంగల’ ఉమ్మడి షడ్యంత్రం నేపథ్యం...
చైనా జిబౌటీలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయగలగడం అమెరికా, ఐరోపా దేశాల వ్యూహాత్మక వైఫల్యం. అమెరికాకు అతి మిత్రదేశమైన సౌదీ అరేబియ చైనా స్థావరాలను అడ్డుకునే ప్రయత్నం చేయకపోడం ఆ దేశానికి పాకిస్తాన్‌తో కల ‘సిద్ధాంత’ సమానత్వం కారణం కావచ్చు! ఎఱ్ఱ సముద్రానికి ఈశాన్యంగ సౌదీ అరేబియా, యెమెన్ ఏర్పడి ఉన్నాయి, నైరుతి దిశలో జిబౌటీ నెలకొని ఉంది!సౌదీ అరేబియాకు ఈశాన్యంగా పర్షియా సింధు శాఖ ఉంది.ప ర్షియా సింధు శాఖలో ఇదివరకే చొరబడి ఉన్న చైనా నౌకాదళం జిబౌటీకి కూడ చేరడం మనదేశ ప్రయోజనాలకు భంగకరమైన విపరిణామం. ‘జిబౌటీ’, ‘గ్వాడార్’ ల మధ్య చైనా యుద్ధ నౌకలు నిరంతరం సంచరించడానికి రంగం సిద్ధమైంది! ఈ చైనా నౌకాదళాల ‘గురి’ మన దేశపు పడమటి సముద్ర త ఈరం ఆఫ్రికా దేశాలు చైనా వారి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రాబల్యానికి ఇప్పటికే గురి అయి ఉన్నాయని. వందలాది కోట్ల రూపాయల విలువైన ఏనుగు దంతలను చైనా ఆఫ్రికానుంచి అక్రమంగ తరలించుకొని పోతోంది! ఇందుకు నిరసనగా కెన్యా ప్రభుత్వం గత ఏడాది మే నెలలో వంద టన్నుల ఏనుగు దంతాలను రాశులుగా పోసి తగులబెట్టింది. చైనా ముఠాలనుంచి పట్టుబడిన ఈ దంతాలు భయంకర ‘గజహననానికి’ ప్రతీకలు! అందువల్ల చైనాను అసహ్యించుకోవలసిన ‘జిబౌటీ’ ఇలా స్థావరాలను కల్పించడానికి కారణం దౌత్య దౌర్జన్యం!
మన ప్రభుత్వం ఈ చైనా దురాక్రమణ షడ్యంత్రం ముందు మోకరిల్లడంలేదు, గతంలో వలె వౌనం వహించడంలేదు. మూడేళ్లుగా మన ప్రభుత్వం చైనా వికృత విస్తరణను ప్రతిఘటిస్తోంది! గ్వాడార్ ఓడరే సమీపంలో ఇరాన్‌లో ఉన్న చేబహార్ ఓడరేవును ఆధునీకరించడానికి పూనుకుంది. ఎఱ్ఱ సముద్రం పశ్చిమ ముఖ ద్వారం సమీపంలో మధ్యధరా తీరంలో నెలకొని ఉన్న ఇజ్రాయిల్‌తో మన మైత్రి పట్టిం కావడం చైనా విస్తరణకు మరో ప్రతిఘటన! అమెరికా జపాన్‌లతో మనం జరుపుతున్న సమష్టి నౌకా విన్యాసాలు కూడ ఈ ప్రతిఘటనకు సంకేతాలు! కానీ చైనా కూడ ‘విస్తరణ’ను మరింత తీవ్రతరం చేస్తోంది. డోక్‌లామ్ చొరబాటు ఇందుకు కొనసాగుతున్న సాక్ష్యం.