సంపాదకీయం

విలక్షణ తెలుగు తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి కానుండడం తెలుగు ప్రజలకు ఆనందదాయకమైన పరిణామం! భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం రాత్రి వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఆయన దేశంలోని రెండవ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ఖాయమని స్పష్టమైపోయింది, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉప రాష్టప్రతిని ఎన్నుకుంటారు కనుక.. పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులలో భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’-ఎన్‌డిఏ-కు మెజారిటీ ఉంది కనుక! 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన వెంకయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థాన పథంలో సాధించిన ప్రగతికి పరాకాష్ఠ సోమవారం నాటి ‘్భజపా’ నిర్ణయం! ఈ ‘ప్రగతి’ కఠోర పరిశ్రమకు చిహ్నం నైతిక మూల్యాల పట్ల సడలని నిష్ఠ నిదర్శనం, అనుశాసన నిబద్ధతకు అద్భుతమైన తార్కాణం.. వెంకయ్యనాయుడు జాతీయ తత్త్వజ్ఞుడు, ఇదీ వౌలికమైన అంశం, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు మాత్రమే కాక యావత్ భారత జనావళి ఆమోదించిన చారిత్రిక వాస్తవం! ఆయన రాజకీయ వేత్త కావడం తరువాతి అంశం.. ఆయనలోని రాజకీయ వేత్త జాతీయ తత్త్వజ్ఞుడిని దిగమింగలేదు! ఇదీ వెంకయ్య నాయుడి జీవన స్వభావం వల్ల లభించగల స్ఫూర్తి. ఈ జాతీయ తత్త్వజ్ఞతకు ప్రేరకం ఆయన చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వ యం సేవక సం ఘంలో ఎదగడం, స్వయం సేవకుడు కావడం! ఈ స్వ యం సేవకత్వాన్ని రాజకీయం మ రింత పరిపుష్టం చే సింది. బలహీన పరచలేదు!! అందువల్లనే వెంకయ్యనాయుడు సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ‘జాతీయ తత్త్వజ్ఞుడు’గా ఎదగగలిగాడు! ఉప రాష్టప్రతి పదవికి కేవలం ఒక రాజకీయ వేత్త- పాలిటేషియన్ - కాక ఒక ‘జాతీయ తత్త్వజ్ఞుడు’- స్టేట్స్‌మేన్ ఎన్నిక అవుతుండడం వర్తమాన చారిత్రక ఘట్టం..
నిరంతరం క్రియాశీలతకు నిరుపమానమైన సజీవ విగ్రహం వెంకయ్యనాయుడు! ఈ క్రియాశీలత నెల్లూరులో ఆయన ‘రాష్ట్రీయ స్వయం సేవక్’ సంఘ కార్యకర్తగా పనిచేసిన గతం నాటిది, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ‘్భజపా’ ప్రభుత్వ విధానాల కార్యక్రమాల ప్రధాన ప్రచార కర్తగా దేశ ప్రజల ప్రశంసలను అందుకుంటున్న వర్తమాన ప్రవర్తనకు సంబంధించినది! కేవలం తన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధికి మాత్రమే పరిమితమైన రాజకీయవేత్త కాలేదు వెంకయ్య! తన మంత్రిత్వశాఖ పరిధిలో లేని అనేకానేక జాతీయ సమస్యలపై నిరంతరం స్పందించగలిగిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వెంకయ్య! జమ్మూ కశ్మీర్‌లో రగులుతున్న బీభత్సకాండ కావచ్చు, కులభూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ అన్యాయంగా నిర్బంధించడం కావచ్చు, గోరక్షణ ఉద్యమం కావచ్చు, ‘వస్తు సేవల పన్నుల’ వ్యవస్థ కావచ్చు, డోక్‌లామ్‌లో చైనీయుల చొరబాటు కావచ్చు, ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం కావచ్చు, మాతృభాషా పరిరక్షణకు గల ప్రాధాన్యం కావచ్చు, ‘అమరావతి’ నిర్మాణం కావచ్చు, విదేశాలలోని భారతీయుల సమస్యతో కావచ్చు... వెంకయ్యనాయుడి ప్రతిస్పందన నిరంతరం జాతీయ రూపమెత్తింది! ‘ప్రధాని నరేంద్ర మోదీ తాను నిద్రపోడు, సహచర మంత్రులను నిద్రపోనీయడు’ అని చెప్పినవాడు వెంకయ్యనాయుడు. ఇలా ప్రభుత్వం నిరంతర జాగరూకతతో జనం కోసం పనిచేస్తోందన్నది వెంకయ్యనాయుడు వివరించిన తీరు, ఆయన కేవలం వివిరించ లేదు, ఆచరించి చూపించాడు! బహుముఖమైన బహు విధమైన ఆయన క్రియాశీలత, కార్యకుశలత అందువల్లనే ఆశ్చర్యకరం! నరేంద్ర మోదీ దేశానికి భగవంతుడిచ్చిన వరం అన్నది వెంకయ్య పదేపదే చెప్పినమాట! నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేవుడిచ్చిన వరం వెంకయ్యనాయుడు! ఈ ‘వరం’ ఉప రాష్టప్రతి ‘హోదా’లో రాజ్యసభను సమన్వయంతో నడిపించనుండడం ధ్రువపడనున్న వాస్తవం.. ‘సమన్వయమే’ ప్రజాస్వామ్యానికి ప్రాణం!
ఈ ‘సమన్వయ’ తత్త్వం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు చిన్న రాష్ట్రాలుగా పునర్ వ్యవస్థీకృతం కాగలిగింది. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ఆర్థిక సామాజిక రాజకీయ ప్రగతి వికేంద్రీకృతం కాగలదని, వేగవంతం కాగలదని భావించినందువల్లనే ‘్భజపా’ పునర్ వ్యవస్థీకరణకు అంగీకరించింది. ఈ ‘సూత్రాన్ని’ 2014లో రాజ్యసభలో ఆమోదింపచేసిన వాడు వెంకయ్యనాయుడు! ఈ ‘సమన్వయతత్త్వం’ రాజకీయ పరిధులను అతిక్రమించిన జా తీయ హితం.. ‘జా తీయ హితం’ ఆ యన స్వభావమైం ది! చిన్ననాటి నుం చి ఆయన నాయకత్వం వహించిన ఉద్యమాలకు ఈ సమష్టి హితం ప్రాతిపదిక అయింది. ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ కార్యకర్తగా ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించినా, 1975 నాటి ‘అత్యవసర పరిస్థితి’- ఎమెర్జెన్సీ - సృష్టించిన చీకటిపై ‘ప్రతిఘటన’ వెలుగుల శరాలను సంధించిన ఈ సమష్టిహితభావ పథం నుంచి పక్కకు తొలగని జాతీయతానిష్ఠ వెంకయ్యనాయుడిది! పరాజయాలు ఎదుర్కొన్నప్పుడు ఆయన క్రుంగిపోలేదు, విజయాలు వరించినప్పుడు పొంగిపోనూ లేదు, సంయమన శీలం ఆయన రాజకీయ జీవన తత్త్వమైంది. అందువల్లనే రాజకీయ ప్రత్యర్థులు వెంకయ్యనాయుడిని వ్యక్తిగతంగా వ్యతిరేకించ లేకపోయారు.. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నెల్లూరు జిల్లాలోని పదకొండు స్థానాలలో పదిచోట్ల ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ గెలిచింది! ఈ ప్రభంజనానికి ఎదురొడ్డి ‘ఉదయగిరి’లో విజయకేతనం ఎగురవేయగలిగిన ‘యువవీరుడు వెంకయ్య’! ఆ యువకుడు ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఉప రాష్టప్రతి పదవికి చేపట్టనుండడం ఆకృతి దాల్చిన సిద్ధాంతం.. ఈ సిద్ధాంతమే జాతీయత..
సర్వేపల్లి రాధాకృష్ణన్, వరాహగిరి వెంకటగిరి వంటి తెలుగువారు ఉప రాష్టప్రతి పదవికి ఎన్నిక కాగలిగారు, ఆ ‘పరంపర’ను నిలబెట్టగలిగిన తెలుగువాడు వెంకయ్యనాయుడు, తెలుగు మాతృభాష అయిన భారతీయుడు.. జాతీయతా పథంలో అవిశ్రాంత పురోగమనుడు...