సంపాదకీయం

షరీఫ్‌కు తగిన శాస్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేయడం పాకిస్తాన్‌లో నడిచిపోతున్న ప్రజాస్వామ్య నాటకంలో భాగం. ఈ నాటకానికి సూత్రధారి పాకిస్తాన్ సైన్యం. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడన్నది ఈ నాటకంలోని ప్రస్తుత ఘట్టం! కానీ నవాజ్ షరీఫ్‌ను సైనిక దళాల వారు వదిలించుకోవాలని భావిస్తుండడం ‘అవినీతి’ కంటే ప్రధానమైన అంశం! అవినీతిపరుడుగా శుక్రవారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిర్ధారించిన నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితం పరిసమాప్తి అయింది! పరిసమాప్తి కావాలన్నది సైనిక అధినాయక నిర్ణయం! ఇదీ నాటకంలోని ఇతివృత్తం!ప్రధానమంత్రి కాని మరో పాకిస్తానీ రాజకీయవేత్త కాని అవినీతిపరుడా? నిజాయితీపరుడా అన్నది పదవీచ్యుతకి పదవీ గ్రహణానికి ‘సాకు’ మాత్రమే, అంటే పైకి కన్పించే కారణం మాత్రమే! ప్రధానమంత్రి కాని, మలరో రాజకీయ వేత్త కాని సైనిక ళాలకు ‘ఇష్టుడా’ కాదా అన్నది రాజకీయ, అధికార పదవులు లభించడానికి కోల్పోవడానికి పాకిస్తాన్ వౌలిక ప్రాతిపదిక! పాకిస్తాన్‌లోని ‘సుప్రీంకోర్టు’ ఇతర ‘కోర్టులు’ సైనిక దళాల న్యాయ విభాగంలో భాగం మాత్రమే! పాకిస్తాన్ పౌర ప్రభుత్వం సైనిక దళాల పాలనా విభాగం. పాకిస్తాన్ చట్టసభలు సైనిక దళాల శాసన నిర్మాణ విభాగాలు! పాకిస్తాన్‌లో ‘జనాదేశం’ ప్రకారం రపాలన జరగడంలేదు, ‘సైనిక ఆదేశం’ ప్రకారం మాత్రమే పాకిస్తాన్ నడుస్తోంది! కానీ ‘సైనిక ఆదేశం’ ‘జనాదేశం’గా ప్రచారం అవుతుండడం పాకిస్తాన్‌లో ఏర్పడి ఉన్న విచిత్ర రాజ్యాంగ వ్యవస్థ! ‘సైనికస్వామ్యం’ ‘ప్రజాస్వామ్యం’గ చెలామణి అవుతోంది!నిజమైన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో సైన్యం-ఆర్మీ-, త్రివిధ రక్షణ బలాలు-ఆర్మ్‌డ్ ఫోర్సెస్-ప్రభుత్వానికి చెందిన ఒక విభాగం, ప్రభుత్వం నిర్దేశించిన రక్షణ కార్యక్రమాలను అమలు జరిపే విభాగం! కానీ పాకిస్తాన్‌లోని విచిత్ర రాజ్యాంగ వ్యవస్థలో సర్వాధికారి సైన్యం! ప్రభుత్వం, చట్టసభలు, న్యాయ వ్యవస్థ ఈ సర్వోన్నత సైనిక అధికారానికి లోబడి పరని చేస్తున్న విభాగాలు! నవాజ్ షరీఫ్‌ను గతంలో ప్రధాని పదవినుంచి తొలగించిందీ, 2013లో మళ్లీ అతగాడికి ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టిందీ, ఇప్పుడు ఆజీవన అధికార బహిష్కృతుణ్ని చేసింది సైనిక దళాల అధినాయకత్వం మాత్రమే! ‘పనామా’ పత్రాల ద్వార రట్టయిన నవాజ్ షరీఫ్ అవినీతి ఈ శాశ్వత అధికార చ్యుతికి ‘సాకు’ మాత్రమే! షరీఫ్‌కు తగిన శాస్తి జరిగింది. కాని జరగడానికి కారణం అతని అవినీతి కాదు, సైనిక దళాలకు అతని పట్ల ఏర్పడిన వ్యతిరేకత మాత్రమే! సైనికదళాలు వద్దని చెప్పి ఉంటే ‘షరీఫ్ అవినీతిపరుడని’ సుప్రీంకోర్టు నిర్ధారించి ఉండేది కాదు.
ఇలా పాకిస్తాన్‌ను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దశాబ్దుల తరబడి నియంత్రిస్తున్న సైనిక దళాలను నియంత్రిస్తున్నది పాకిస్తాన్ సమాజ సమష్టి స్వభావం, ఈ సమష్టి స్వభావం ఇస్లామేతర మతాలను విధ్వంసం చేయాలన్న జిహాదీ ప్రవృత్తి, ఈ జిహాదీ ప్రవృత్తి పాకిస్తాన్ అవతరణకు, అవతరించినతరువాత మనుగడకు ప్రాతిపదిక! ప్రపంచంలోని అన్ని ఇస్లామేతర మతాలను ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం జిహాద్ స్వభావం, లక్ష్యం! అందువల్ల సర్వమత వ్యవస్థను జిహాదీ మతోన్మాదం నిరంతరం వ్యతిరేకిస్తోంది. 1956లో పాకిస్తాన్‌లో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాని 1958లోనే ఆయూబ్‌ఖాన్ అన్న సైనిక దళాల అధిపతి ‘రాజ్యాంగాన్ని రద్దు చేసి’ నియంతృత్వాన్ని ఏర్పాటు చేశాడు! ఈ సైనిక నియంతృత్వం 1971 వరకు పాకిస్తాన్ రెండు ముక్కలై తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడే వరకు కొనసాగింది! 1970లో జరిగిన ఎన్నికలలో గెలిచిన ‘అవామీ లీగ్’కు తూర్పు పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడానికి అప్పటి పాకిస్తాన్ నియంత యాహ్యాఖాన్ నిరాకరించాడు. ఘటనా క్రమానికి అదే శ్రీకారం...సైనిక నియంత జనాదేశాన్ని అంగీకరించలేదు! అవశేష పాకిస్తాన్‌లో 1971 తరువాత జుల్ఫికర్ భుట్టో నాయకత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్లు గడవక ముందే ‘జియాఉల్ హక్’ అనే సైనిక నియంత తొలగించాడు. మళ్లీ 1980వ శతాబ్ది ఆఖరువరకు పాకిస్తాన్‌లో సైనిక నియంతృత్వం కొనసాగింది. 1990వ దశకంలో మొదలైన ప్రజాస్వామ్య ప్రక్రియను 1999లో సైనిక దళాల అధిపతి పర్‌వేజ్ ముషారఫ్ తుదముట్టించాడు! 2008వరకు ముషారఫ్ సైనిక నియంతృత్వం సాగింది!
అయితే ప్రజాస్వామ్యంపట్ల ప్రజాస్వామ్య రాజ్యాంగ పద్ధతుల పట్ల అంతర్జాతీయ సమాజంలో నానాటికీ ఆదరణ పెరుగుతోంది, గౌరవం పెరుగుతోంది! దీన్ని గ్రహించిన సైనిక నియంతలు దాదాపు దశాబ్దిగా పాకిస్తాన్‌లో ‘ప్రజాస్వామ్య’ అభినయం చేస్తున్నారు! ఎన్నికలు జరిపిస్తున్నారు. కాని 2008లోను 2013లోను జరిగిన ఎన్నికలలో తాము ‘బలపరిచిన’ పార్టీ మాత్రమే విజయం సాధించే విధంగా సైనిక దళాలవారు వారిని నియంత్రిస్తున్న ‘జిహాదీ’ మతోన్మాద ప్రముఖులు ప్రజాభిప్రాయాన్ని నిర్దేశించగలిగారు! 2008 నాటి ఎన్నిలలో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ‘ముస్లింలీగ్’ గెలవకుండా అప్పటి సైనిక నియంత ముషారఫ్ ‘నాటకం’ నడిపించాడు! 2013లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించడానికి కూడ అప్పటి సైనిక దళాల అధిపతి అఫ్‌పాక్ పరవేజ్ కయాని మద్దతు కారణం! ‘ప్రజాస్వామ్యం’ ముసుగును తగిలించుకున్నట్టయితే తమ ‘సైనిక నియంతృత్వానికి’ ప్రపంచంలో గౌరవం పెరుగుతుందన్న ఆశతోనే 1999లో నవాజ్ షరీఫ్ పౌరప్రభుత్వాన్ని పడగొట్టిన సైనిక నియంత ముషారఫ్ ఆ తరవాత ‘ప్రజాస్వామ్యవాది’గా మారాడు. ‘ఎన్నికలు జరిపించి’ అధ్యక్షుడుగా చెలామణి అయ్యాడు, దేశంనుండి తాను వెళ్లగొట్టిన నవాజ్ షరీఫ్‌ను తిరిగి రావడానికి 2008నాటి ఎన్నికలలో పోటీ చేయడానికి ముషారఫ్ అనుమతి ఇచ్చింది కూడ ఈ ప్రజాస్వామ్య నాటకంలో భాగం...
అఫ్‌పాక్ పర్‌వేజ్ కయానీ ‘సైనిక అధిపతి’గా ఉన్న సమయంలో సైనిక వ్యూహం మారింది! పౌర ప్రభుత్వాన్ని రద్దు చేసి తామే ప్రత్యక్ష పాలన చేపట్టడం వల్ల చెడ్డపేరు వస్తుంది, బాధ్యతను వహించవలసి వస్తుంది!కీలుబొమ్మ వలె వ్యవహరించే పౌర ప్రభుత్వం కొనసాగడానికి అనుమతి ఇవ్వడంవల్ల తమ దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్న మంచి పేరు వస్తుంది, బాధ్యతలేని అధికారాన్ని మాత్రమే తాము చెలాయించవచ్చు...2008 నుంచి పాకిస్తాన్ సైనిక అధినాయకుల వ్యూహం ఇదీ!!
ఇప్పుడు నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు చేత శిక్షింప చేయడం ద్వారా తమదేశంలో గొప్ప ప్రజాస్వామ్య పద్ధతులు వ్యవస్థీకృతమైపోయాయన్న భ్రాంతిని కలుగచేయడానికి పాకిస్తాన్ సైనిక దళాలు యత్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని పదవినుంచి నవాజ్ షరీఫ్‌ను తొలగించిన సుప్రీంకోర్టు అవినీతిపరులైన సైనిక అధికారులను మాత్రం పదవినుంచి తొలగించలేదు! 2012లో న్యాయ ధిక్కార నేరంపై అప్పటి ప్రధాని యూసుఫ్ రజా గిలానీని కూడ సుప్రీంకోర్టు పదవినుంచి తొలగించింది! అప్పుడూ ఇప్పుడూ కూడ సైనిక దళాల అధినాయకత్వం ‘మనోభీష్టం’ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నోటు ఆవిష్కృతం కావడం విచిత్ర న్యాయం. షరీఫ్ నిజానికి ‘బద్మాష్’ అన్నది నిరాకరింప జాలని నిజం, ఇతగాడు ప్రచ్ఛన్న బీభత్సకారుడు కాని ‘సంపదను’ రహస్యంగా ఉంచిన నేరానికి, విదేశాలలో పెట్టుబడులను అక్రమంగా పెట్టిన నేరానికి సుప్రీంకోర్టు అతగాడికి మొదట జైలు శిక్ష విధించాలి! ఇలా దోషిగా నిర్ధారితుడైనవాడు పదవికి సహజంగానే రాజీనామా చేస్తాడు! కానీ అలాంటి శిక్షను షరీఫ్‌కు పాకిస్తాన్ కోర్టు విధించలేదు. అతడి ప్రధాని పదవిని మాత్రమే రద్దు చేసింది...! జీవితాంతం పదవీ బహిష్కృతుడ్ని చేసింది!