సంపాదకీయం

మాదక బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర మార్గం గుండా దేశంలోకి అక్రమంగా తరలివస్తుండిన పదహైదు వందల కిలోగ్రాముల భయంకర మాదక ద్రవ్యం గుజరాత్ తీరంలో ఆదివారం పట్టుబడడం మనదేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న వాణిజ్య బీభత్సకాండలో భాగం. ఈ ‘మాదకం’ విలువ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు! దేశమంతటా తిష్ఠ వేసి ఉన్న మాదకద్రవ్య విక్రేతలైన విదేశీయ ముఠాల వారు మన దేశంలో కూడ వేలాది ముఠాలను రూపొందించడం నడుస్తున్న విష వ్యూహం! ధనవంతులైన వారి పిల్లలు మొదలుకుని కళాకారులుగా చెలామణి అవుతున్న వి‘చిత్ర జీవుల’ వరకూ మాదకం మత్తెక్కి ఊగుతుండడం నిఘా విభాగాలు, ప్రభుత్వం పూ ర్తిగా కనిపెట్టలేని వాస్తవం! పట్టుబడుతున్నది కొందరైతే పట్టుబడని అక్రమ విక్రేతలు, పంపిణీదారులు, మరిగినవారు, ఇతరులను ప్రోత్సహించి పాడు చేస్తున్న వారు ఎందరన్నది వెల్లడి కావలసి ఉంది! ఎందుకంటే ఎంతోమంది ‘మాదకం’ మనుషులను నిఘా విభాగాల వారు పట్టుకుంటున్నప్పటికీ ‘మే మింకా ఉన్నాము..’ అని ఈ వాణిజ్య ఉగ్రవాదులు దేశ ప్రజలను వెక్కిరిస్తూనే ఉన్నారు. ఎన్నో వందల వేల కిలోల ‘మత్తుమందులు’ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నప్పటికీ సేవించి మత్తెక్కిపోతున్న దౌర్భాగ్యుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. గతంలో ధూమపానానికి, మద్యానికి మాత్రమే బానిసలై విద్యార్థులు చెడిపోతున్నారని కొందరైనా గుండెలు బాదుకునేవా రు! ‘అయ్యవార్లు స్వ యంగా ప్రోత్సహించ డం వల్ల విద్యార్థులు ‘కా పీ’లు కొట్టి ఉత్తీర్ణులవుతున్నారు.. ఇలా చెడిపోగా లేనిది సిగరెట్లు, మద్యం తాగడం వల్ల కొత్తగా చెడిపోయేది ఏమిటి?’ అని మరికొందరు ముక్తాయించేవారు! ‘కళాశాల అంటే అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపించే బౌద్ధిక బీభత్స ప్రాంగణం, పెళ్లి అయిన తరువాత జరగవలసిన తతంగమంతా పెళ్లికి ముందే జరిగిపోతున్న లైంగిక బీభత్స కేంద్రం.. అని సినీ నిర్మాతలు, దర్శకులు యువజనులకు పాఠాలు నేర్పుతున్నారు. ఈ పా ఠాలు నేర్చుకున్న విద్యార్థులు, పుచ్చిపోయిన మెదడుతో సమాజంలోకి చొరబడి సంఘ విద్రోహులుగా తయారవుతున్నారు! ఇలాంటి సినిమాలను నిర్మించడానికి, ఆడించడానికి అనుమతినిస్తున్న ప్రభుత్వాలకు ధూమపానాన్ని, మద్యపానాన్ని నిషేధించే నైతిక అధికారం లేదు..’ అని మరి కొందరు ముక్తాయించారు గతంలో..! వర్తమానంలో ధూమపానం, మద్యపానం చట్టబద్ధమైంది. అందువల్ల ‘సక్ర మం’తో సంతృప్తి చెందని అక్రమబుద్ధులు నిరంతరం అక్రమాలు జరుపడానికి తహతహలాడుతున్నారు. ‘మాదకం’ మత్తు విస్తరణకు ఇదీ కారణం! గుజరాత్ తీరంలో పట్టుబడిన భారీ మాదక ద్రవ్యం ఈ విస్తరణలో భాగం..
నల్లమందు, గంజాయి వంటివి మన దేశంలో తయారవుతున్న మాదకాలు. ‘గంజాయి’ అన్నది క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలోనో, ఆ తరువాతనో భౌతిక బీభత్స తండాలు విదేశాల నుంచి మన దేశంలోకి మోసుకొచ్చిన విషపు మొక్క. దీనికంటే భయంకరమైన ‘పొగాకు’ను ఐరోపా దురాక్రమణదారులు మోసుకుని వచ్చి మన నెత్తిపోయారు. పొగ తాగడం మరిగినవారి వారసులు బ్రాందీ విస్కీ స్కాచ్ జిన్ను-ఇంకా వివిధ విచిత్రమైన పేర్లున్న మద్యాలను మరిగారు. మన దేశంలో శతాబ్దాలుగా మద్యం తయారైనా ఈ మద్యాలన్నీ ఈత, విప్ప, తాటి, ద్రాక్ష వంటి చెట్ల నుండి, తీగల నుంచి వచ్చిన పదార్థాలు. కృత్రిమ రసాయన విషాలతో కలిసిన సారా, బ్రాందీ వంటివి విదేశీయులు వదిలి వెళ్లిన వారసత్వ వైపరీత్యాలు! ఈ వైపరీత్యాలను మన ప్రభుత్వాలు 1947 తరువాత నిషేధంచి ఉన్నట్టయితే అక్రమాలకు పాలుపడాలన్న బుద్ధికలవారు ‘మద్యం’, ‘పొగాకు’ వంటి అక్రమాలను సాధించడానికి పరిమితమై ఉండేవారు! ఈ అక్రమాలు రెండూ ‘సక్రమాలు’గా ప్రభుత్వాలు నిర్దేశించిన తరువాత అక్రమాలు చేయడం స్వభావం అయినవారు కొత్త ‘అక్రమం’ గురించి అనే్వషించారు. ఈ కొత్త విషం మాదకం-హీరాయిన్, బ్రౌన్ సుగర్, మరిజువానా, హషీష్ ఇంకా అనేక పేర్లున్న విచిత్రమైన వికృతమైన పదార్ధం!
విమానాశ్రయాలలో మాదకం రవాణా చేస్తున్న ముఠాలవారు దశాబ్దులుగా పట్టుబడుతున్నారు. సముద్ర తీరంలో విదేశీయులు, విదేశాలకు మాదకాలను చేరవేస్తున్న స్వదేశీయులు పట్టుబడుతూ ఉన్నారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ ముఠాలు పట్టుబడడానికి కారణం మన ‘నిఘా’ పెరగడం! ఎంతమంది పట్టుబడుతున్నప్పటికీ కొత్తవారు పట్టువదలకుండా మన దేశంలోకి ప్రవేశిస్తునే ఉన్నారు. మన దేశం అంతర్జాతీయ నేరస్తుల ముఠాలకు, మాదకం దొంగ రవాణా కేంద్రంగా మారిపోయిందన్నది విదేశాలలో జరుగుతున్న ప్రచారం. ఒక విదేశం నుంచి మన దేశంలోకి మా దకం ద్రవ్యాలను చేరవేయడం, మన దేశం నుండి ఇతర దేశాలకు చేరవేయడం చాలా సు లభమన్నది ఈ విదేశీయ ప్రచారం. అందువల్ల ఇప్పుడు నౌకలలో మాదకాన్ని నిర్భయంగా తరలించుకుని వస్తున్నారు! ఇతర వస్తువులను తీసుకుని వెడుతున్న నౌకలలో లేదా ప్రయాణీకులను తీసుకుని వెడుతున్న నౌకలలో, ఓడలలో రహస్యంగా కొందరు ‘మాదకాల’ను తరలించడం గతంలో జరిగేది, ఈ మాదకాలతో నౌకల యజమానులకు, సిబ్బందికి సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు నౌకల యజమానులు, సిబ్బంది ఈ అక్రమ కలాపంలో చురుకైన భాగస్వాములైపోయారు. గుజరాత్ తీరంలో పట్టుబడిన మాదకం నౌక ఇందుకు నిదర్శనం. నౌక సిబ్బంది-ఎనిమిది మంది-ఈ మాదకాన్ని మోసుకుని వచ్చారన్నది సముద్ర తీరపు గస్తీ అధికారులు నిర్ధారించిన నిజం!
పట్టుబడుతున్న ‘మాదకం’ నిల్వలను అధికారులు వెంటనే ధ్వంసం చేయకుండా కొన్నాళ్లు అట్టిపెట్టడం వల్ల ఈ ‘మాదకాని’కి మళ్లీ కాళ్లు వస్తున్నాయట! దేశంలో పనిచేసుకోవడం కోసం, వ్యాపారం చేయడం కోసం వస్తున్న వారు కొందరు ‘వీసా’ గడువు ముగిసిన తరువాత తమ దేశాలకు తిరిగి వెళ్లడం లేదు. మన దేశంలోనే తిష్టవేసి ‘కనబడకుండా’ మనగలుగుతున్నారు. ఇలాంటి వారు ప్రధానంగా చేస్తున్నపని మాదక ద్రవ్యాల పంపిణీ! అధికారులు ఈ సంగతిని అనేకసార్లు నిర్ధారించి ఉన్నారు. మన భాగ్యనగరంలోనే ఇలాంటి వారు రెండు వందల మంది వున్నారని గత ఏప్రిల్‌లో వెల్లడైంది. వెల్లడి కానివారు వేలమంది దేశమంతటా విస్తరించి ఉన్నారు. నైజీరియా నుంచి వచ్చిపడుతున్న వారు వీరిలో పేరుమోసినవారు. ఓడ దొంగలు, జిహాదీ తీవ్రవాదులు, మాదకం ముఠాలవారు పరస్పరం అనుసంధానమై ఉన్నారు!