సంపాదకీయం

‘నవ’చైనా నయవంచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరఖండ్‌లోకి కూడ చైనా చొరబడడం విస్తరిస్తున్న దురాక్రమణ వ్యూహానికి మరో నిదర్శనం. మనదేశమంతటా విస్తరించిపోయిన చైనా వాణిజ్య దురాక్రమణకు వ్యతిరేకంగా స్వదేశీయ సంస్థలు ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలోనే ఈ మరో చొరబాటు బయటపడడం విస్మయకరమైన సమాంతర పరిణామం. చైనీయ వస్తువులను బహిష్కరించాలని కోరుతూ ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ వం టి జాతీయతా సంస్థలు ప్రస్తుతం ‘జనజాగరణ’ చేస్తున్నాయి. మన ప్రభుత్వం మాత్రం చైనా నుంచి దిగుమతులను తగ్గించడానికి యత్నిస్తున్న జాడ లేదు. సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేవరకు, దురాక్రమిత భారత భూభాగాల నుంచి చైనా నిష్క్రమించే వరకు చైనాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోరాదన్నది 1988 సంవత్సరం వరకు కొనసాగిన మన విధానం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిత్వంలోని అప్పటి మన ప్రభుత్వం ఈ ‘సరిహద్దుల సంరక్షణ’ బాటను వదలిపెట్టింది, ‘పథభగ్నం’ చేసింది. సరిహద్దు వివాద పరిష్కారంతో నిమిత్తం లేకుండా చైనాతో సకలవిధ సంబంధాలను పెంచుకోవాలని నిర్ధారించింది. ఈ పథభగ్న- పాత్ బ్రేకింగ్- విధానం కారణంగా చైనా భౌతిక దురాక్రమణను తొలగించే ప్రయత్నాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. సరిహద్దుల ధ్యాస మన ప్రభుత్వానికి సన్నగిల్లి పోయింది. 1989-90 నుంచి నడుస్తున్న ‘కథ’ ఇది. ఫలితంగా చైనా కొత్తకొత్త ప్రదేశాలలో మన దేశంలోకి చొరబడుతూనే ఉంది. లడక్, అరుణాచల్ ప్రాంతాలలోకి చొరబడుతున్న చైనా దళాలకు మన భద్రతా ద ళాల నుంచి ప్రతిఘటన తీవ్రవౌతోంది. అందువల్ల చైనా కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వం వ్యూహం మార్చింది. ఇ టీవల సిక్కింలోని, భూ టాన్‌లోని ‘డోకలా’ ప చ్చిక మైదానంలోకి చొరబడింది. ‘డోకలా’ లో మన ప్రతిఘటన కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ‘బారాహోటీ’ ప్రాంతంలోకి జూలై ఇరవై ఐదవ తేదీన చైనా సైనికులు చొరబడిపోయారట! సరిహద్దులకు ప్రాధాన్యం లేని ‘పథభగ్న’ విధానం దశాబ్దుల తరబడి కొనసాగిన ఫలితం ఇది! మరోవైపు చైనా వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. చైనాకు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులు చాలా తక్కువ. ఫలితంగా చైనాకు మనకు మధ్య జరుగుతున్న వ్యాపారంలో మన దేశానికి సాలీనా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల లోటు ఏర్పడుతోంది. వస్తువుల వినిమయం ద్వారా మనం చెల్లించలేని ఈ వాణిజ్యపు లోటును మన దేశం ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌చేంజ్ కరెన్సీ- ద్వారా చెల్లించవలసి వస్తోంది. అంటే మనం శ్రమించి సముపార్జించిన ధనం చైనాకు ‘లోటు’ రూపంలో తరలిపోతోంది!
ఇలా ఈ ‘పథభగ్న’ విధానం ఫలితంగా చైనా భౌతిక దురాక్రమణ ఆగలేదు. చొరబాట్లు ఆగలేదు. సమాంతరంగా చైనావారి వాణిజ్య దురాక్రమం కూడ మొదలైపోవడం మాత్రమే ఈ ‘పథభగ్న’ విధానం వల్ల మనకు దక్కిన ఫలితం! ప్రపంచంలోని ఏ ఇతర దేశం కూడ తమ శత్రుదేశాల నుంచి ఇంత పెద్ద పరిమాణంలో వస్తువులను దిగుమతి చేసుకొనడం లేదు. ఇజ్రాయిల్ ఆరబ్ దేశాల నుంచి, ఆరబ్ దేశాలు ఇజ్రాయిల్ నుంచి ఇలా వస్తువులను దిగుమతి చేసుకొనడం లేదు. జపాన్ ప్రజలు చైనా వస్తువులను, చైనీయులు జపానీ వస్తువులను మోజుపడి కొనడం లేదు. మన దేశంలో జనం చైనా వస్తువులను మోజుపడి కొనడం విచిత్రం! సిగ్గులేని రాజకీయవేత్తలు చైనా అనుకరణ విన్యాసాలను సాగిస్తున్నారు, అవగాహన లేని సామాన్య ప్రజలు చైనా వస్తువులను కొంటున్నారు. 1988కి పూర్వం చైనా భౌతిక దురాక్రమణ ప్రమాదం మాత్రమే మనకుండేది. 1989లో ఏర్పడిన ‘పథభగ్నం’ వల్ల భౌతిక దురాక్రమణకు తోడు వాణిజ్య దురాక్రమణను కూడ చైనా కొనసాగిస్తోంది. అందువల్ల ఈ పథభగ్న విధానాన్ని మనం వదిలించుకోవాలి. సరిహద్దుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వగల ‘పథ నిర్మాణ’- పాత్ బిల్డింగ్- విధానాన్ని పునరుద్ధరించుకోవాలి.
ఈ ‘పాత్ బిల్డింగ్’ విధానం క్రీస్తుశకం 1962 నుంచి 1988 వరకూ అమలు జరిగింది. ‘మా భూమిని మాకు అప్పగించే వరకూ మీతో మాకు వాణిజ్యం వద్దు, మీ పెట్టుబడులు వద్దు, మీ వాణిజ్య సంస్థలు మా దేశంలోకి రావద్దు..’ అన్న విధానాన్ని చైనా పట్ల మన ప్రభుత్వం పునఃప్రారంభించాలి. లేనట్టయితే మన ప్రాంతాలలోకి చొరబడిన, చొరబడుతున్న చైనా దళాలను మనం ప్రతిఘటించడం కష్టం! ‘చైనా వస్తువులను విరివిగా కొని వాటితో వినోదిస్తున్న ప్రజలున్న’ ఈ దేశాన్ని- చైనా భౌతిక దురాక్రమణ నుంచి రక్షిస్తున్న సైనికులకు నైతికబలం ఎవరు సమకూర్చాలి? చైనా కలిగించిన గాయం కారణంగా భరతమాత కంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి. కన్నతల్లి కన్నీరు తుడవవలసిన బిడ్డలు చైనా వస్తువులను కొని ఆనందిస్తున్నప్పుడు క్షతగాత్ర అయిన సరిహద్దులకు రక్షణ ఎలా లభిస్తుంది? సరిహద్దులు కేవలం భౌతికమైనవి కావు, సాంస్కృతికమైన వి కూడ. ఈ సాంస్కృతిక సీమలు భారతీయు ల హృదయ క్షేత్రాలు. హృదయ క్షేత్రంపై చైనా జరుపుతున్న దురాక్రమణను దునుమాడడం, భౌతిక ప్రాదేశిక దురాక్రమణను ప్రతిఘటించడానికి, తిప్పికొట్టడానికి ప్రాతిపదిక ఇది. మన ప్రభుత్వాలు, విధానకర్తలు గ్రహించవలసిన ప్రధాన అంశం. ఎందుకంటే దూకడం మరిగిన తోడేలు ఎన్నిసార్లు తోలినప్పటికీ మళ్లీ మళ్లీ దూకడం మానదు. గోడను ఎత్తు పెంచాలి లేదా తోడేలు నడుం విరచాలి! చైనా తోడేలు నడుమును విరిచి వేయడం ఇప్పుడిప్పుడే మనకు సాధ్యం కాదు. అందువల్ల ‘గోడ’ ఎత్తును పెంచడమే మార్గం, ప్రస్తుతం ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. సరిహద్దులలో అదనపు బలగాలను మోహరించడం, అదనపు స్థావరాలను నెలకొల్పడం ఈ ప్రత్యామ్నాయంలోని ఒక అంశం. రెండవ అంశం చైనా వస్తువుల దిగుమతిని నిషేధించడం. దానివల్ల మనకు సగటున ఏటా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుంది. విదేశీయ వినిమయ ద్రవ్యం మిగులుతుంది.
ఇప్పుడు చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ స్వయంగా మన ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను హెచ్చరిస్తున్నాడు. ‘దురాక్రమణను తిప్పికొట్టగలం’ అంటూ మూడు రోజులలో రెండుసార్లు అతగాడు మనలను హెచ్చరించాడు. దురాక్రమిస్తున్న చైనా ప్రభుత్వం ఎవరి దురాక్రమణను తిప్పికొడుతుంది? అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించడంలో ఈ హెచ్చరికలు భాగం. మన ప్రభుత్వ జాతీయ రక్షణ వ్యవహారాల సలహాదారుడు అజిత్ దోవల్ చైనాలో పర్యటించి వచ్చాడు. చర్చలకు ముందే చైనా దళాలు ఉత్తరఖండ్‌లోకి చొరబడ్డాయి. నయవంచన ‘నవ’ చైనా సహజ స్వభావం..