సంపాదకీయం

‘మాదకం’ మాటున బీభత్సం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాణిజ్య ప్రపంచీకరణతో సమాంతరంగా బీ భత్స ప్రపంచీకరణ కొనసాగుతుండడం అం తర్జాతీయ సమాజాన్ని ఆవహించి ఉన్న భయంకర ప్రమాదం. గుజరాత్ సమీపంలో ఇటీవల పట్టుబడిన ‘ఎమ్‌వి హెన్రీ’ లేదా ‘ప్రిన్స్-2’ అన్న బీభత్స నౌక ఇందుకు కారణం! ఈజిప్టు నుంచి పాకిస్తాన్ వరకు గల సువిశాల ప్రాంతం ‘మాదకం’ ముఠాల స్వేచ్ఛా విహార భూమిగా మారిపోయింది! ఈ ప్రాంతంలోని మాదక ద్రవ్యాల దొంగ రవాణా తండాలతో మనదేశంలోని నేరస్థులు అనుసంధానమై ఉండడం ఈ ఓడ పట్టుబడడం వల్ల మరోసారి ధ్రువపడింది! ఈ అంతర్జాతీయ అనుసంధానం ప్రధానంగా మన దేశానికి వ్యతిరేకంగా వ్యవస్థీకృతవౌతుండడం మనకు ఆందోళన కలిగించవలసిన వ్యవహారం! పైకి భిన్న భిన్నమైన ముఠాలుగా కన్పిస్తున్న అక్రమ కలాపాల బృందాలు అంతర్గతంగా అనుసంధానమై ఉండడం ప్రచారం కాని వ్యవహారం! ఈ అనుసంధానానికి సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ‘ఇంటర్‌పోల్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’-ఐఎస్‌ఐ! సొమాలియా దేశం తీరంలో తిష్ఠ వేసి అరేబియా సముద్రంలోను, హిందూ మహాసాగరంలోను వాణిజ్యనౌకలను కొల్లగొడుతున్న ఓడ దొంగల ముఠాలవారు అంతర్జాతీయ అసాంఘిక శక్తులు! పాకిస్తాన్, ఇరాన్, ఐక్య అరబ్ సంస్థానాలు-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యుఏఇ-వంటి దేశాలలో తిష్ఠ వేసిన ‘మాదకం’ ముఠాలు హిందూ మహాసాగర ప్రాంత భద్రతకు మరింత ప్రమాదకరంగా మారిన పైశాచిక శక్తులు! ఈ రెండురకాల ముఠాలకు కేవలం అ క్రమ ఆర్థిక లాభాలను ఆర్జించడం పరమావధి. తమ కలాపాలను అడ్డుకునేవారిని, ఆటంకం కలిగించేవారిని తుదముట్టించడం ఈ ముఠాల భ యంకర ప్రవృత్తి! ఈ ప్రాంతంలో సంచరిస్తు న్న మూడవ రకం నేరస్థులు జిహాదీ ఉగ్రవాదులు! మొదటి రెండు రకాల ముఠాలవారు ఆర్థిక బీభత్సకారులు! జిహాదీలు భౌతిక ఉగ్రవాదులు. ఇస్లామేతర మతాల వారిని నిష్కారణంగా నిష్కరుణగా చంపేయడం జిహాదీ బీభత్సకారుల ఏకైక కార్యక్రమం, ఏకైక లక్ష్యం! మనదేశానికి పశ్చిమంగాను నైరుతి దిశలోను విస్తరించి ఉన్న సముద్ర ప్రాంతంలో-అరేబియా సముద్రంలోను, హిందూ మహాసాగరంలోను ఈ మూడు రకాల ముఠాలు విడివిడిగా పనిచేయడం గత చరిత్ర. ప్రస్తుతం ఈ ముఠాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయి! ఈ అనుసంధాన కర్త ఐఎస్‌ఐ. గుజరాత్ వద్ద సముద్ర జలాలలో జూలై ముప్పయ్యవ తేదీన పట్టుబడిన మాదకం నౌక కేవలం వాణిజ్య బీభత్స కాండకు చిహ్నం కాకపోవచ్చు, పరోక్షంగాను, ప్రత్యక్షంగాను ఓడ దొంగలకు మాదకం ముఠాలకు ‘జిహాదీ’ బీభభత్సకారులతో ఉన్న ‘స్నేహ బంధాల’ ‘విస్తృతి’, ‘గాఢత’ ఎంతన్నది పరిశోధించవలసిన వ్యవహారం!
వాణిజ్య నౌకలలో మత్తు మందులు దొంగరవాణా జరగడం శతాబ్దుల కథ. నౌకల యజమానులకు ఈ దొంగ రవాణా గురించి తెలిసేది కాదు. కొన్ని సందర్భాల్లో నౌకల సిబ్బంది మాదకం ముఠాలతో లాలూచీ పడేవారు, కానీ ఇప్పుడు మాదకం ఉత్పత్తిదారులు, పంపిణీదారులు స్వయంగా ఓడలను నిర్వహిస్తున్నారు! గుజరాత్ తీరంలో పట్టుబడిన ఈ ‘ప్రిన్స్-2’నౌక ఇందుకు నిదర్శనం. ఈ నౌక యజమాని ఇరాన్ పౌరుడైన సరుూద్ అలీ మనోరి. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవులో మాదకం ద్రవ్యాన్ని ఎక్కించుకుని ఈజిప్టుకు చేర్చవలసిందిగా ఈ ఓడ యజమాని సిబ్బందిని పురమాయించాడట! ఈ ‘విషపు మత్తు’ పదార్థాలను పాక్ నుంచి ఈజిప్టుకు చేర్చినందుకు ఈ యజమానికి, సిబ్బందికి ఐదు వందల కోట్ల రూపాయల ‘శుల్కం’ లభిస్తుందట! ఈ ‘మాదకం’ విలువ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలట! తమకు లభించే ఐదువందల కోట్ల రూపాయలను పంచుకునే విషయంలో యజమానికి, సిబ్బందికి మధ్య ఏర్పడిన తగాదా వల్లనే నౌక పట్టుబడింది! ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ ‘శుల్కం’లో ‘మనోరి’ వాటా మూడు వందల యాబయి కోట్లరూపాయలట! నౌక ప్రధాన చోదకుడు-కాప్టన్-సుప్రీత్ తివారీకి కేవలం యాబయి కోట్ల రూపాయల వాటా లభించిందట! దీంతో ఆగ్రహించిన సుప్రీత్ తివారీ ఓడను ఈజిప్ట్‌వైపు కాకుండా మన దేశం వైపు నడుపుకొని వచ్చాడు, గుజరాత్ తీరంలో పట్టుబడ్డాడు! ‘హెన్రీ’ అన్న ఓడపేరును ఇరాన్‌కు చెందిన సరుూద్ మనోరి ‘ప్రిన్స్’ అని మార్చగలిగాడు. ఓడను నడిపిన వాడు ఓడ పేరును మళ్లీ ‘హెన్రీ’ అని మార్చాడు!
నౌకను ఈజిప్ట్‌కు తీసుకుని వెళ్లకుండా తివారీ మనదేశానికి ధైర్యంగా నడుపుకుని రావడానికి కారణం ముంబయిలో నివసిస్తున్న ఘరానా నేరస్థుడు ‘విశాల్’. ఇతగాడు గతంలో దుబాయి కేం ద్రంగా ‘మాదకం’ వ్యాపారం చేశాడట! గ్రీసులో పట్టుబడి రెండేళ్లు జైలుశిక్ష అనుభవించాడట! ఖలీల్ మొహమ్మద్ అనే పాకిస్తాన్ జాతీయుడు, ముస్త్ఫా అనే మరో ఇరాన్ పౌ రుడు ఈ ముఠాలోని వారట! ఇలా వివిధ దే శాలకు చెందిన మా దకం దొంగలు అనుసంధానం అవుతుండడం ‘మాదక ప్రపంచీకరణ’! ఈ మాదకం ముఠాలలోను, ఓడ దొంగల ముఠాలలలోను చేరిపోతున్న ‘జిహాదీ’ ఉగ్రవాదుల లక్ష్యం మన దేశాన్ని బద్దలు కొట్టడం మా త్రమే! ఇప్పుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా కూడ భారత వ్యతిరేక జిహాదీ బీభత్సకారులకు అండదండలను అందిస్తోంది! ‘జాయిష్ ఏ మొహమ్మద్ జిహాదీ’ ముఠాలోని మొదటి హంతకుడు అఝార్ మసూద్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్య తీసుకోకుండా చైనా అడ్డుపడడం ఇందుకు ప్రత్యక్ష ప్రమాణం! ‘అల్ ఖా యిదా’ జి హాదీ ముఠా జమ్ము-కశ్మీర్‌లోకి చొరబడిందన్నది పరోక్ష ప్ర మా ణం! మనదేశంలో అటవీ సంపదను కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముష్కర మూకలలో చైనా వారు చేరి ఉండడం నడుస్తున్న చరిత్ర..
మాదకం ముఠాలలోను, ఓడ దొంగల ముఠాలలోను ఎంతమంది ‘జిహాదీ’ ఉగ్రవాదులు చేరిపోయా ర్న విషయంపై మన నిఘా విభాగాల వారు, సముద్ర తీర భద్రతా దళాల వారు పరిశోధక నయనాలను సారించవలసి ఉంది. 2008 నవంబర్‌లో పాకిస్తాన్ నుంచి దూసుకుని రాగలిగిన నౌకనుంచి వచ్చిన జి హాదీలు ముంబయిలో మారణకాండ జరపగలిగారు! అప్పటి నుంచి తీరంలో భద్రత, నిఘా పటిష్టం కావడం ఓడ దొంగలకు, మాదకం ముఠాలకు తె లుసు! ‘హెన్రీ’-‘ప్రిన్స్’- నౌకను గుజరాత్ తీరం వైపు నడుపుకుని రావడం ఈ నేరస్థుల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. పట్టుబడని ‘దొంగనౌకలు’ కొన్ని మన తీరాన్ని చేరుతున్నాయేమోనన్న అనుమానం అతార్కికం కాజాలదు! హెన్రీ -ప్రిన్స్ నౌక ద్వారా జిహాదీలు దూసుకుని వస్తూ ఉండవచ్చునని మన సముద్ర భద్రతా దళాలవారు అనుమానించారట కూడ!