సంపాదకీయం

‘డోక్‌లా’ సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోక్‌లా పచ్చిక మైదానం నుంచి తన దళాలను ఉపసంహరించుకొనడానికి చైనా అంగీకరించ డం మన ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం! చైనా అక్రమ విస్తరణకు, వ్యూహాత్మక దురాక్రమణకు తీవ్రమైన అవరోధం ఏర్పడిందనడానికి ఇది మరో నిదర్శనం! 2012లో కుదిరిన ఒప్పందంలోని నియమ నిబంధనలకు విరుద్ధంగా మన దేశంలోను, భూటాన్‌లోను విస్తరించి ఉన్న డోక్‌లా-డోక్‌లామ్-మైదానంలోకి గత జూన్ పదహారవ తేదీన చైనా దళాలు చొరబడడంతో మొదలైన వివాదం తాత్కాలికంగా పరిష్కారం అయినట్టే! క్రీస్తుశకం 1962 నాటి సరిహద్దులను మార్చడానికి సైనిక చర్య ద్వారా ప్రయత్నించరాదన్నది 2012 నాటి ఒప్పందం స్ఫూర్తి! ఈ ‘స్ఫూర్తి’ని నీరుకార్చి డోక్‌లామ్‌లోకి చొరబడి రోడ్లను నిర్మించడానికి యత్నించిన చైనాకు భూటాన్ ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలిపింది, మన భద్రతా దళాలు ‘రహదారి’ నిర్మాణ కార్యక్రమాన్ని అడ్డుకుని నిలిపివేయగలిగాయి! గతంలో వలెనే తమ ‘చొరబాట్ల’ను భారత ప్రభుత్వం నిరసిస్తుందని, భౌతికంగా ప్రతిఘటించబోదని భావించిన చైనాకు మన ‘్భరత టిబెట్ సరిహద్దు పోలీసు’ ద ళాలు, సైనికులు తమ సైనికులతో తలపడుతున్న దృశ్యాలు మింగుడు పడడం లేదు. లడక్‌లోకి దశాబ్దుల పాటు దాదాపు ప్రతిరోజు చొరబడిన చైనీయ ముష్కర మూకలను మన సైనికులు ప్రతిఘటించకపోవడం 2014 మే 26వ తేదీ వరకు నడిచిన కథ! ఆ తరువాత గత మూడేళ్లకు పైగా ఈ ‘కథ’ మారిపోయింది.! దీప్‌సంగ్, చుదూర్, వనగంగా ప్రాంతాలలోకి చొరబడిన చైనీయ మూకలను మన దళాలు తీవ్రంగా ప్రతిఘటించడం గత మూడేళ్ల కథ! గతంలో ఈ ప్రాంతంలోకి చొరబడిన చైనీయ దళాలు రోజుల తరబడి గుడారాలను వేసుకుని తిష్ఠ వేయడం చరిత్ర! మన భద్రతాదళాలు ‘వౌనం’గా చూ స్తూ వుండిపోవడం మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు చైనాపట్ల అవలంబించిన మెతక వైఖరికి నిదర్శనం.. గత మూడేళ్లుగా మన ప్రభుత్వం ‘చొరబాట్ల’ను గట్టిగా ప్రతిఘటించాలన్న నిర్ణయాత్మక విధానాన్ని అవలంబిస్తోంది! ఫలితంగా లడక్‌లోని వివిధ ప్రాంతాలలో వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-ను అతిక్రమించి మన వైపునకు చొరబడుతున్న చైనా ముష్కరులను మన భద్రతా దళాలవారు ‘మెడలు పట్టుకుని నెట్టుకుంటూ వెళ్లి’ వాస్తవ అధీన రేఖకు ఆవలివైపున కూలేసి వస్తున్నారు. పదే పదే ఈ ‘దృశ్యాలు’ పునరావృత్తం అయిన తరువాత చైనా ‘వ్యూహం’ మార్చింది! ‘డోక్‌లా’లోకి చొరబడింది. దృష్టిని మళ్లించడం చైనా వ్యూహంలో భాగం, కొత్త వివాదాలను రాజేసి మన స హనాన్ని, ప్రతిస్పందనను పరీక్షించడం ఈ వ్యూహంలో భాగం! అందువల్లనే ‘డోక్‌లా’లో మన ప్రతిఘటన పటిష్ఠంగా వ్యవస్థీకృతం అయిన తరువాత చైనా దళాలు జూలైలో ‘ఉత్తరఖండ్’లోని చమోలీ ప్రాంతంలోకి చొరబడినాయి. ఇదంతా కొత్త తగాదాలను సృష్టించడంలో భాగం..
డోక్‌లా నుంచి తమ దళాలను ఉపసంహరించడానికి చైనా అంగీకరించడం కొంత ఆశ్చర్యకరం! ఎందుకంటే ‘డోక్‌లా’ ప్రాంతం తమ భూభాగంలోనిదని గత జూన్‌లో చొరబడినప్పటి నుంచి చైనా ప్రభుత్వం దాదాపు ప్రతిరోజూ ప్రకటిస్తునే ఉంది. మన ప్రభుత్వం, భూటాన్ ప్రభుత్వం డోక్‌లాలోకి అక్రమంగా తమ దళాలను పంపినట్టు కూడా చైనా పదే పదే ప్రకటించింది. ఈ అసత్య ప్రచారం ముందు మన ప్రభుత్వం వౌనం వహించి మోకరిల్లుతుందని కూడ చైనా భావించింది! ఎందుకంటే చైనా మన వైపునకు ‘రేఖ’ను దాటి చొరబడినప్పుడల్లా మన ప్రభుత్వం ప్రతినిధులు ‘రేఖపై అవగాహనలో ఉభయ దేశాల మధ్య కల అంతరం’ ఈ చొరబాట్లకు కారణమని ప్రకటించడం దశాబ్దులపాటు కొనసాగిన వైపరీత్యం! ఈ ‘అంతరం’ గురించి పరిష్కరించుకోవడానికి 1990 నుంచి చర్చలు జరుగుతునే ఉన్నాయి. చర్చలతో సమాంతరంగా చైనా చొరబాట్లు కూడ కొనసాగాయి. అందువల్లనే లడక్‌లో 1962 నాటి దురాక్రమణ తరువాత చైనా ఏకపక్షంగా ఏర్పాటు చేసిన ‘రేఖ’ క్రమంగా మనవైపు జరుగుతోంది! 1962లో కొన్ని కొండ వాగులకు, నదులకు తూర్పుగా ఉండిన ‘వాస్తవ అధీనరేఖ’ ప్రస్తుతం వాటికి పడమరగా మనవైపునకు జరిగి వచ్చింది!
అందువల్ల డోక్‌లా మైదానం నుంచి దళాలను ఉపసంహరించుకొనడానికి చైనా అంగీకరించడం కూడ చైనా వారి మరో దీర్ఘకాల వ్యూహంలో భాగమా? అన్నది కూడ మన ప్రభుత్వం సమాధానం అనే్వషించవలసిన ప్రశ్న! ఎందుకంటే మాటిమాటికీ మాట మార్చడం చైనా కమ్యూనిస్టు నియంతలకు దశాబ్దుల అలవాటు! ‘డోక్‌లా’ నుంచి మనదళాలు ఉపసంహరించుకోవాలని, లేనట్టయితే 1962 నాటి గుణపాఠం మళ్లీ మనకు చెప్పవలసి ఉంటుందని చైనా జూన్ 29వ తేదీన మన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కానీ 2017 నాటి ప్రస్తుత భారత్- 1962 నాటి భారత్ వలె బలహీనమైనది కాదని చైనా దురాక్రమణను తిప్పికొట్టగలదని మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ఆ మరునాడు సమాధానం చెప్పడంతో చైనా ప్రభుత్వం మళ్లీ 1962 నాటి దురాక్రమణ గురించి ప్రస్తావించడం లేదు. ఇలా ‘పా ఠం’ చెప్పగలమని బెదిరించిన చైనా నియంతలు ‘్భ రత్ టిబెట్‌ను కబళించడానికై వల బిగిస్తోంది..’ అని భయాన్ని కూడ నటించిం ది! ఇలా ఒక దానితో మ రొ క దానికి పొంతన లేని ప్రకటనలను చైనా ప్రభుత్వం ప్రచారం చేస్తుండడానికి కా రణం చైనా నియంతలు ఊహించని మన ప్రతిఘటన! ‘డోక్‌లా’ చొరబాటుపట్ల నిరసన తెలిపి మన ప్రభుత్వం మిన్నకుండిపోతుందన్నది చైనా ఊహించని పరిణామం! కంగుతిన్న చైనా యుద్ధం గురించి హెచ్చరించింది. ‘యుద్ధానికి సైతం మేము సిద్ధం..’ అన్న రీతిలో మన ప్రభుత్వం వ్యవహరిస్తుండం చైనా ‘గొంతులో పడిన పచ్చి వెలగకాయ..’ అందువల్ల చైనా తాత్కాలికంగా తోక ముడిచింది! ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో మన దేశాన్ని ఓడించడం సాధ్యం కాదన్నది చైనా గ్రహించిన పాఠం!!
డోక్‌లాలోకి చొరబడిన తరువాతనే చైనా ఆఫ్రికాలోని ‘జిబౌటీ’లో అతి పెద్ద నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటుచేసింది. ఎఱ్ఱ సముద్రం అరేబియా సముద్రంతో కలిసే చోట ‘జిబౌటీ’ దేశం నెలకొని ఉంది. మన కేరళ తీరానికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా నౌకాదళ స్థావరం చైనా వ్యూహాత్మక దురాక్రమణలో భాగం! అయితే మన ప్రభుత్వం ఈ వ్యూహత్మక దురాక్రమణను సైతం ప్రతిఘటించడానికి పూనుకుంది. ‘పూర్వ దిశా కార్యాచరణ’-యాక్ట్ ఈస్ట్-విధానంలో భాగంగా మన ప్రభుత్వం వియత్నాం, జపాన్ తదితర తూర్పు ఆసియా దేశాలతో జట్టు కడుతోంది! అందువల్ల చైనా ‘వేచి చూడాలి..’ అన్న వ్యూహాన్ని అమలు జరుపుతోందా? అన్నది కూడ మన ప్రభుత్వం సమాధానాన్ని అనే్వషించదగిన ప్రశ్న.. ఏమైనప్పటికీ డోక్‌లా నుంచి మన దళాలను కూడ మనం ఉపసంహరించడానికి అంగీకరించడం విచిత్రం కాగలదు. మన భూభాగం నుంచి మన దళాలను మనం ఎందుకు ఉపసంహరించాలి?