సంపాదకీయం

‘రోహింగియా’ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రోహింగియా’ తెగవారి కడగండ్లకు ఏకైక కారణం ‘రోహింగియా’ జిహాదీలు! ఇతర మతాల వారిని మట్టుపెట్టడానికై బీభత్సకాండ జరుపుతున్నది ‘రోహింగి యా’ తెగకు చెందిన ‘జిహాదీలు’. ఫలితంగా ఇతర మ తాల వారి ప్రతిక్రియకు గురి అవుతున్నది ‘రోహింగియా’ తెగకు చెందిన సా మాన్య ముస్లింలు. బర్మాలోని ‘రక్షణ’- రఖెనీ- ప్రాంతంలో శతాబ్దులుగా నివసిస్తున్న ‘రోహింగియా’లు ఇప్పుడు చెల్లాచెదరు కావడానికి కారణం దశాబ్దుల ‘జిహాదీ’ బీభత్సకాండ! బర్మాలోని బౌద్ధ మతస్థులను, ఇతర ఇస్లామేతర మతస్థులను మట్టుపెట్టడానికి దశాబ్దులుగా ‘రోహింగియా’ జిహాదీలు యత్నిస్తున్నారు. బర్మాలోని ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న ప్రాంతాలను బర్మా నుంచి విడగొట్టి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్నది రోహింగియా జిహాదీల దశాబ్దుల పగటికల! ఈ కలను జిహాదీలు క్రీస్తుశకం 1937లో బర్మా ప్రత్యేక దేశంగా ఏర్పడిన నాటి నుంచి కంటూనే ఉన్నారు. అనాదిగా ‘అఖండ భారత్’లో భాగమైన బర్మాను బ్రిటన్ సామాజ్య్రవాద దురాక్రమణదారులు మన దేశం నుంచి విడగొట్టారు. అప్పటి నుంచి బర్మాను మత ప్రాతిపదికపై ముక్కలు చేయాలన్నది ‘రోహింగియా’ జిహాదీల ప్రయత్నం. అందువల్ల ‘రోహింగియాల’లోని అనేకమంది బీభత్సకారులుగా ఏర్పడి రక్తపాతం సృష్టిస్తున్నారు. బౌద్ధుల మీద, బర్మా ప్రభుత్వ కార్యాలయాల మీద, పోలీసుల మీద, సైనిక స్థావరాల మీద దాడులు చేస్తున్నారు. దశాబ్దుల ఈ జిహాదీ బీభత్స చరిత్రలో సరికొత్త ఘట్టం గత వారం ఆరంభమైంది. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ‘రఖెనీ’ ప్రాంతంలోని ముప్పయికి పైగా పోలీసు ఠాణాలపై ‘రోహింగియా’ జిహాదీలు దాడులు చేశారు. ఇరవై మూడవ తేదీన మొదలైన ఈ దాడుల ఫలితంగా అల్పసంఖ్యాకులైన బౌద్ధులు ఈ ప్రాంతం నుంచి బర్మా- మ్యాన్‌మార్- లోని ఇతర ప్రాంతాలకు పారిపోతున్నా రు. బర్మాలో బౌద్ధ మతస్థులు అత్యధిక సంఖ్యాకులు. కానీ ‘రఖెనీ’ ప్రాం తంలో మాత్రం బౌద్ధులు అల్ప సంఖ్యాకులు, ‘రోహింగియాలు’ అధిక సంఖ్యాకులు. రోహింగియా విద్రోహులు సృష్టించిన భయంకర బీభత్సకాండను బర్మా భద్రతాదళాల వారు అంతే కఠినంగా అణచివేస్తుండడం ప్రస్తుతం నెలకొని ఉన్న దృశ్యం. హింసాకాండకు వందమందికి పైగా బౌద్ధులు, రోహింగియా ప్రజలు బలైపోయారు. భయానక ప్రాంతాల్లోని ‘రోహింగియా’ ప్రజలు కూడా భారీగా బంగ్లాదేశ్‌లోకి పారిపోతున్నారు. ఇలా తమ దేశంలోకి శరణార్థులుగా వస్తున్న ‘రోహింగియా’ ముస్లింలను బంగ్లాదేశ్ సైనికులు సరిహద్దు వద్ద నిరోధించి మళ్లీ వెనక్కి- బర్మాలోకి నెట్టివేస్తున్నారట! ఇలా నెట్టివేతకు గురి అవుతున్న ‘రోహింగియా’లలో అనేకమంది మన ఈశాన్య ప్రాంతంలోకి రావడం సంభవం. ఎందుకంటే దశాబ్దుల తరబడి ‘రఖెనీ’ ప్రాంతంలో కొనసాగుతున్న జిహాదీ బీభత్సకాండకు ప్రతిక్రియగా జరుగుతున్న దాడులకు సామాన్య రోహింగియాలు గురి అవుతున్నారు. వీరంతా వారి దేశం వదలి బంగ్లాదేశ్‌లోకి, మన దేశంలోకి వస్తున్నారు. తమ దేశంలోకి ఇదివరకే లక్షల మంది ‘రోహింగియా’లు చొరబడి పోయారన్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.
అందువల్ల పదేళ్లకు పైగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘రోహింగియా’లను తమ దేశంలోకి రానివ్వడం లేదు. 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరం సందర్భంగా దాదాపు కోటిమంది బంగ్లాదేశీయులు శరణార్థులై మన దేశంలోకి వచ్చి పడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు పైశాచిక రీతిలో జరిపిన దారుణ మారణకాండకు, లైంగిక బీభత్సకాండకు బలి కాకుండా తప్పించుకున్న వారు ఆ కోటిమంది.. ఆ కోటి మందిని మన ప్రభుత్వం, మన ప్రజలు దాదాపు పద్దెనిమిది నెలలు పోషించడం చరిత్ర! కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ‘రోహింగియా’లను తమ దేశంలోకి రానివ్వడం లేదు. మానవతా దృష్టి భేదాలు ఇలా మన దేశానికి, బంగ్లాదేశ్‌కు మధ్య నెలకొని ఉండడం ‘రోహింగియా’లు మన దేశంలోకి వచ్చి పడుతుండడానికి కారణం. ఇప్పటికే మన దేశంలో దాదాపు లక్షమంది రోహింగియాలు తలదాచుకుంటున్నారట! వీరంతా పదేళ్లకు పైగా ఇక్కడ ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలోనే మూడువేల మందికి పైగా ‘రోహింగియా’లు నివసిస్తున్నట్టు గత నవంబర్‌లో ప్రచారమైంది. ఇలా శరణార్థులుగా వచ్చిన ‘రోహింగియా’లలో జిహాదీ బీభత్సకారులు కూడ ఉండవచ్చునన్న అనుమానం అతార్కికం కాదు. కొనే్నళ్ల క్రితం బుద్ధగయ ప్రాంగణంలో జరిగిన పేలుళ్లు ఇందుకు నిదర్శనం. బర్మాలోని బౌద్ధ మతస్థులపై పగ సాధించడంలో భాగంగా ‘రోహింగియా’ జిహాదీలు బుద్ధగయ ప్రాంగణంలో ఈ పేలుళ్లు జరిపి ఉండవచ్చునన్నది జరిగిన ప్రచారం..
బర్మాలో దాదాపు పదకొండు లక్షల మంది రోహింగియాలు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు పది లక్షల మంది చిన్న పాలనా విభాగమైన ‘రఖెనీ’లోనే ఉంటున్నారు. అందువల్ల దాదాపు పదిహేను లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ‘రోహింగియా’లే అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. బంగ్లాదేశ్‌కు, మన ఈశాన్య ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఈ ‘రఖెనీ’ ప్రాంతం 1937 నుంచి కల్లోలకాండకు నిలయమై ఉంది. రోహింగియాలు ఆరబ్ తెగలకు చెందిన వారని, శతాబ్దుల తరబడి వాణిజ్య నౌకలలో బర్మాకు వచ్చిన ఈ తెగలవారు అక్కడ నివాసం ఏర్పరచుకున్నారని చరిత్ర చెబుతోంది. రోహింగియాలు మొదట అరేబియా నుంచి అఫ్ఘానిస్తాన్‌కు వలస వెళ్లి ఆ తరువాత బర్మాకు చేరిపోయారని కూడ కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. కానీ విదేశాల నుంచి వచ్చిన రోహింగియాలు స్వజాతీయ సమాజంలో కలసి మెలసి జీవించలేకపోవడం చారిత్రక వైపరీత్యం. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన సమయంలో అ నేక వేలమంది ‘రఖెనీ’ ప్రజలు మన బెంగాల్‌లో కూ డ స్థిరపడ్డారు. ఎందుకంటే బ్రిటన్ దొరలు ‘రఖెనీ’ని బెంగాల్ రాష్ట్రంలో భాగంగా పాలించారు. క్రీస్తుశకం 1891 నాటికి ఈ అరకాన్- రఖెనీ- ప్రాంతంలో కేవలం యాభై ఎనిమిదివేలు ఉండిన ముస్లింల జనాభా 1927 నాటికి ఐదులక్షలకు చేరింది. ఫలితంగా ఈ ప్రాంతంలో మతాలవారీ జనాభా నిష్పత్తి మారిపోయింది. 1891లో బౌద్ధులు అధిక సంఖ్యాకులుగా ఉండిన ఈ ప్రాంతంలో 1927 నాటికి ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులై పోయారు. బర్మా నుంచి ఈ చిన్న ప్రాంతాన్ని విడగొట్టాలన్న కోరికకు ఇదీ కారణం. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాలను ‘అఖండ భారత్’ నుండి విడగొట్టి పాకిస్తాన్‌గా ఏర్పాటు చేయడానికై ‘ముస్లిం లీగ్’ ‘కృషి’ చేసింది. పాకిస్తాన్ ఏర్పడడం ఈ ‘కృషి’కి పరాకాష్ఠ! ఈ ‘విభజన’ స్ఫూర్తితో బర్మా నుంచి విడిపోవడానికి ‘అరకాన్’ ప్రాంతంలో జిహాదీలు బీభత్సకాండను ఆరంభించడం ‘రోహింగియా’ల కడగండ్లకు కారణం. ‘ముజాహిద్’ అన్న రాజకీయ పార్టీ 1947 నుంచి బహిరంగంగానే జిహాద్‌ను సమర్థించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక జిహాదీ బీభత్సపు ముఠాలు ఈ ప్రాంతంలో పుట్టుకొచ్చాయి. ‘ హరఖ్ అల్ యాకిన్’- హెచ్‌ఎవై- య్యా- అన్న కొత్త జిహాదీ ముఠా ఒకటి పుట్టుకొచ్చినట్టు గత డిసెంబర్‌లో ప్రచారమైంది.
బుద్ధగయలో 2013 జూలై ఏడవ తేదీన బీభత్సకాండను జరిపించిన వారే ఈ కొత్తముఠాగా ఏర్పడి ఉన్నారన్నది జరిగిన ప్రచారం. ‘అరకాన్ రోహింగియా సాల్వేషన్ ఆర్మీ’ అన్న ముఠా గత శుక్రవారం నాడు బర్మాలో పెద్దఎత్తున దాడులు జరిపింది. ఇంకా అనేక రోహింగియా ముఠాలు బీభత్స చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ జిహాదీ ముఠాలు పాకిస్తాన్‌లోని జిహాదీ ముఠాలతో అనుసంధానమై ఉన్నాయి. అనుసంధాన కర్త పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’!