సంపాదకీయం

నకిలీలపై న్యాయ‘ఖడ్గం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీ గోరక్షకుల వల్ల గోసంతతికి జరిగిన, జరుగుతున్న నష్టానికి ఇదంతా నిదర్శనం! నకిలీ గోరక్షకులను కఠినంగా అణచివేయాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడానికి కారణం ఈ నకిలీలు జరిపిన అత్యాచారాలు! సర్వోన్నత న్యాయస్థానం ధ్రువీకరించింది కనుక దేశమంతటా ఇలాంటి నకిలీ గోరక్షకులు గోమాంసం తినదలచిన వారిపై అత్యాచారాలు జరుపుతున్నారని విశ్వసించవలసి వస్తోంది! గోరక్షణ కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టాలు చేసి ఉన్నాయి. సమగ్ర గోవధ నిషేధం అమలు జరిగే విధంగా పార్లమెంటు జాతీయ స్థాయిలో చట్టాన్ని రూపొందించకపోవడం అసలు సమస్య! నకిలీ గోరక్షకుల అత్యాచారాల కారణంగా అసలు సమస్య మూ లపడే ప్రమాదం ఏర్పడిపోయింది! సుప్రీం కోర్టు బుధవారం జారీ చేసిన ఆదేశం వల్ల గోవధను చట్ట ప్రకారం నిరోధించడానికి కూడ వీలు లేదన్న భ్రాంతి కలుగడానికి అవకాశం ఏర్పడింది! దేశంలోని అనేక రాష్ట్రాలలో దశాబ్దులుగా గోవధను నిషేధిస్తున్న చట్టాలను ప్రభుత్వ యంత్రాంగాలు అమలు చేయకపోవడం నిజానికి మూలభూతమైన సమస్య! పోలీసులు, ప్రభుత్వ అధికారులు ‘గోవధ నిషేధాన్ని’ సం బంధింత చట్టాలను అనుగుణంగా అమలు జరిపి ఉండినట్టయితే గోసంతతి రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఆరంభమై ఉండేవి కావు! ఈ దశాబ్దుల ప్రభుత్వాల వైఫల్యం అసలు సమస్య! ఒక చిన్న ట్రక్కులో నిలబడడానికి సైతం వీలులేని విధంగా ఆవులను, ఎద్దులను, పెయ్యలను, దూడలను ఇతర పశువులను కుక్కి పల్లెల నుంచి వధశాలలకు తరలించడం శతాబ్దుల తరబడి దేశమంతటా కొనసాగిన వె పరీత్యం. దీన్ని పోలీసులు నిరోధించలేదు, ప్రభుత్వాలు నిరోధించలేదు. అందువల్లనే జీవ కారుణ్య సంస్థల వారు, ఇతర స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు అలాంటి ట్ర క్కులను, వాహనాలను నిరోధించి నిందితులను పోలీసులకు అప్పగించడం మొదలైంది! ప్రభుత్వాలు, పోలీసులు నిర్వహించిన నిర్వహిస్తున్న గో పరిరక్షణ కేంద్రాలకు పట్టుబడిన అలాంటి పశువులను తరలించడం ఆరంభమైంది! కానీ అవినీతి యంత్రాంగం కారణంగా నిందితులు తప్పించుకున్నారు. వారిపై పోలీసులు న్యాయస్థానాలలో అభియోగాలు దాఖలు చేసిన సందర్భాలు చాలా తక్కువ! పట్టుబడిన పశువులను ప్రభుత్వ యంత్రాంగం పరిరక్షించలేదు, ఆ పశువులను అధికాధిక సందర్భాలలో నిందితులకు తిరిగి అప్పగించేవారు! అలా గోరక్షణ ఉద్యమాలను ప్రభుత్వ యంత్రాంగాలే నీరు కార్చాయి. పశువులు, పాడిపశువులు యధావిధిగా వధశాలలకు చేరిపోయాయి!
ఇదంతా దశాబ్దుల పాటు కొనసాగిన ఘోరం! ఈ ఘోరం కొనసాగిన సమయంలోనే నకిలీ గోరక్షకులు కూడ తయారయ్యారు! అక్రమంగా రవాణా అవుతున్న పశువులను అడ్డగించి రక్షించడం-ఆ తరువాత పోలీసులు, రవాణా చేస్తుండినవారు, అడ్డగించినవారు పరస్పరం కుమ్మక్కయిపోవడం.. ఇలాంటి ఉదంతాలు కూడ జరిగాయి. ఇలా జరిగిన సమయంలో వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలవారు జోక్యం చేసుకున్నారు. గోసంతతిని, పశుసంతతిని పరిరక్షించవలసిన అవసరం గురించి వివరించారు! ప్రతి గ్రామంలోను గోసంపదను, పశు సంపదను పెంపొందించడానికి కృషి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2012 ఆగస్టు 21వ తేదీన ఉన్నత న్యాయస్థానం ఆదేశించిది. మానవ సంపద కంటే పశుసంపద కనీసం పదినుంచి ఇరవై శాతం ఎక్కువ ఉన్న జిల్లాలలో మాత్రమే కొత్తగా వధశాలలను నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాలని కూడ అప్పటి హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి ఆదేశించారు. కానీ ఈ ఐదేళ్లలో ప్రభుత్వాలు ఆ ఆదేశాన్ని ఏ మేరకు అమలు జరిపాయి?
ఆవులను, గోసంతతిని చంపడం తీవ్రమైన నేరం- నాన్ బెయిలబుల్ అఫెన్స్-గా పరిగణించి నేరస్థులను శిక్షించాలని ఈ ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్ హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి బి.శివశంకరరావు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించారు. ఆరోగ్యవంతమైన ఆవులను బక్రీద్ పండుగ సందర్భంగా వధించాలన్నది ప్రాథమిక రాజ్యాంగపు హక్కు కాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతిని కూడ ఆయన గుర్తు చేసారు. తల్లికి దేవుడికి ఆవుప్రతీక అని కూడ న్యాయమూర్తి శివశంకర్ రావు స్పష్టం చేసి ఉన్నారు. ఆవు ఔషధ స్వరూపమని, ఆవును జాతీయ ప్రాణిగా గుర్తించి ఆధికారికంగా ప్రకటించాలని, గోహంతకులకు యావజ్జీవ కారాగృహ శిక్షను విధించేలా చట్టాన్ని సవరించాలని రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం గత మే నెల 31వ తేదీన ఆదేశించింది! గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు జరుపవలసిందిగా అనేక ఉన్నత న్యాయస్థానాలు ఇలా ఆదేశించి ఉన్నాయి! గో హంతకులకు పదునాలుగేళ్ల కారాగృహ నిర్బంధ శిక్షను విధించాలని నిర్దేశించే బిల్లును గత మార్చిలో గుజరాత్ శాసనసభ ఆమోదించింది! ఈ న్యాయ నిర్ణయాలను కాని, ప్రభుత్వాల చట్టాలను కాని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చే యలేదు! అందువల్ల గో వధ నిషిద్ధమన్నది అం దరూ గ్రహించవలసిన వాస్తవం!
ఈ నేపథ్యంలో వ ధించడం కోసం ఆవులను సంతలలో అమ్మరాదని, కొనరాదని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గత మే ఇరవై ఆరవ తేదీన కొత్త నియమావళిని జారీ చేసింది! ఆ నిబంధనావళి అమలు జరగరాదని నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గత జూలై పదకొండవ తేదీన తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది! అందువల్ల ఈ తాత్కాలిక ఆదేశాలను రద్దు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరి ఉండాలి లేదా వివాదాన్ని సత్వరం విచారించి తీర్పు చెప్పాలని అభ్యర్థించి ఉండాలి! ఈలోగా నకిలీ గోరక్షకులు రంగ ప్రవేశం చేసారు! గో హంతకులను, గోమాంస భక్షకులను తామే శిక్షించడనికై పూనుకున్నారు, చట్టాలను ప్రభుత్వ యంత్రాంగం, న్యాయస్థానాలు అమలు జరపాలి! గోరక్షకులు ఇందుకు సహకరించవచ్చు! కాని న్యాయస్థానాలు, పోలీసులు చేయవలసిన పనిని ఈ నకిలీ గోరక్షకులు చేయడానికి పూనుకొనడం వల్లనే సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరోసారి ఆదేశాలను జారీ చేయవలసి వచ్చింది! నకిలీ గోరక్షకులను కఠినంగా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇది హర్షణీయం! కాని అమలులోఉన్న చట్టాల ప్రకారం ఆవులు, గోసంతతి వధకు గురి కాకుండా నిరోధించడం కూడ ప్రభుత్వాల విధి. ఈ విషయమై కూడ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం అభిలషణీయం. లేనట్టయితే ఆవులను యథేచ్ఛగా చంపడానికి అవకాశం ఏర్పడిపోతుందన్న భ్రాంతి కలిగే ప్రమాదం ఉంది. నకిలీలను శిక్షించాలి! కానీ ఆవులు, గోసంతతి వధకు గురి కాకుండా ప్రభుత్వాలు నిరోధించాలి. ఈ విషయమై సర్వోన్నత న్యాయ స్పష్టీకరణ అవసరం..