సంపాదకీయం

గో వైరుధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడి పశువుల పరిపోషణ పరిరక్షణ పట్ల పాలకులలో నిష్ఠ పెరుగుతోంది! ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి శివారులో శనివారం ‘పశు ఆరోగ్య మేళా’ ప్రారంభం కావడం ఈ నిష్ఠకు మరో నిదర్శనం! పాడి పశువుల పరిరక్షణ పశుపాలకుల ఆర్థిక ప్రగతికి వ్యవసాయ వికాసానికి గ్రామీణ సంక్షేమానికి దోహదం చేయగలదన్నది ‘మేళా’కు హాజరయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట! ఈ మాట తరతరాల వాస్తవానికి పునరుద్ఘాటన మాత్రమే! వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి పశువులను పెంపొందించడానికి, పాల ఉత్పత్తిని విస్తరింపచేయడానికి కృషి చేస్తుండడం ప్రాకృతిక సమతుల్య స్థితిని పరిరక్షించడానికి దోహదం చేయవచ్చు! గోసంతతి సంఖ్య తగ్గిపోవడంవల్ల, పాడిపశువుల సంఖ్య తగ్గిపోవడంవల్ల వ్యవసాయ భూమికి ‘సత్తువ’నిచ్చే పేడ లభించడంలేదు. కృత్రిమ రసాయన విషాలు నిండిన ఎరువుల కారణంగా ప్రకృతిలో కాలుష్యం పెరుగుతోంది. భూమి కాలుష్యగ్రస్తమవుతోంది. ‘ఎండోసల్ఫాన్’ వంటి విషాలు నిండిన భూములలో పండిన పంటలు తిన్నవారికి విచిత్రమైన వ్యాధులు సంక్రమించినట్టు ధ్రువపడింది! అందువల్ల ప్రకృతిలో సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి పాడిపశువుల సంరక్షణ దోహదం చేయగలదు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి పాడి పశువుల సంఖ్య పెరగడం మొదటి మెట్టు! పాడి పశువుల పేడను అడవులలోని ఆకులను ఎఱువులుగా వాడడం సేంద్రియ వ్యవసాయం! సేంద్రియ వ్యవసాయం భూమి స్వచ్ఛతను, ప్రకృతి స్వచ్ఛతను పరిరక్షించడానికి దోహదం చేయగలదన్నది అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్న వాస్తవం! ‘గంగ’ అన్న జాతికి చెందిన ఆవుల పాలు స్వచ్ఛతకు మారుపేరుగా బలవర్ధక ఔషధమన్నది విశ్వాసం మాత్రమే కాదు, వాస్తవం కూడ! ఈ ‘గంగ‘ జాతికి చెందిన దాదాపు మూడు వందల ఆవులు దూడలు కోడెలు వారణాసి సమీపంలోని ఒక గోశాలలో జీవిస్తున్నాయట! శనివారం నరేంద్ర మోదీ ఈ ‘గోశాల’ను సందర్శించడం స్వచ్ఛ్భారత్ పునర్‌నిర్మాణానికి మరింత స్ఫూర్తి! ఈ గంగా గోశాలను దర్శించిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! అంతరించిపోతున్న అపురూపమైన ఈ ‘గంగ’ గోవులకు దేశంలో ఏర్పడి ఉన్న ఒకే ఒక పరిరక్షణ కేంద్రం వారణాసి శివారులోని ఈ గోశాల! కర్నాటకలోని ‘రామచంద్ర మఠం’వారు ఇరవై ఎనిమిది ‘దేశవాలీ’ ఆవుల జాతులను సంరక్షిస్తున్నారట! ఇదంతా ‘స్వచ్ఛత’ను పెంచడానికి మార్గం! ‘గవ్యాలు’-గోమూత్రం, గోమయం, గోక్షీరం, దధి, ఘృతం-ఆరోగ్యాన్ని పెంచే ఔషధాలు!
పాడి పశువులను పరిరక్షించడానికి ఇలా కృషి జరుగుతుండడం మితిమీరిన రీతిలో పశువులను హత్య చేస్తుండడం కొనసాగుతున్న సమాంతర వైరుధ్యాలు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడిపశువుల సంఖ్యను పెంచడానికి వివిధ పథకాలను రూపొందిస్తున్నాయి. దేశంలోని మాంసాహారులు భుజించడానికి వీలుగా పశువులను వధించడం కొనసాగుతున్న వాస్తవం! సాలీన సగటున వధిస్తున్న పాడిపశువుల సంఖ్యకంటే ఎక్కువ సంఖ్యలో నూతన ‘పశు శిశువులు’ జన్మిస్తుండడం కూడ తరతరాల వాస్తవం! కానీ దేశంలో ‘్భజించడానికి’ కాక, విదేశాలకు మాంసం ఎగుమతి చేయడానికై పాడిపశువులను ప్రత్యేకించి ఆవులను, ఆవుదూడలను, కోడెలను మితిమీరి హత్య చేయడం మొదలైన తరువాతనే దేశంలో పశుసంపద అంతరించి పోతోంది! దేశంలో ఒకప్పుడు దాదాపు రెండు వందల జాతుల ఆవులు వుండేవన్నది చరిత్ర ధ్రువపరిచిన వాస్తవం! కానీ ప్రస్తుతం ఇరవై తొమ్మిది జాతుల ఆవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధ్యయనాలలో పరిశోధనలలో వెల్లడైంది! ఇలా ఆవుల, దూడల, కోడెల, ఇతర పాడి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి మాంసం ఎగుమతులు కారణం! దేశంలో కేవలం ఒకటిన్నర శాతం ప్రజలు మాత్రమే ఆవుమాంసం తింటున్నారన్నది అధ్యయనాలలో ధ్రువపడిన వాస్తవం! మరో రెండున్నర శాతం అప్పుడప్పుడు మాత్రమే ఆవుమాంసం తింటున్నారట! కానీ ఇలా తినడం ప్రాథమికమైన హక్కు కాదని ఉన్నత న్యాయ స్థానాలు ధ్రువపరిచి ఉన్నాయి! అందువల్ల ఆవులను గోసంతతిని వధించడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించడం వల్ల ఎవరి హక్కులకూ భంగం కాదు! తినదలచినవారు విదేశాలనుంచి దిగుమతి చేసుకోవచ్చు! స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ జాతీయస్థాయిలో సర్వ సమగ్రమైన గోవధ నిషేధ నియమావళితోకూడిన చట్టం రూపొందకపోవడం విదేశీయ సాంస్కృతిక దాస్యం కొనసాగుతుండడానికి నిదర్శనం.
ప్రతి ఇంటికి కొన్ని సంప్రదాయాలుంటాయి, ఈ వైయక్తిక సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ఇంటితనం! జాతీయ సంప్రదాయాలను పరిరక్షించుకోవడం ‘జాతీయత’. మహిళలను మాతృ స్వరూపంగా, భూమిని మాతృభూమిగా, నదులను పర్వతాలను, ప్రకృతిని దివ్యస్వరూపాలుగా, ఆవులను గోమాతగా భావించడం మన దేశంలో అనాది సంప్రదాయం! ఈ సంప్రదాయాలను, ఈ జాతీయతను విదేశీయులు భగ్నం చేసి పోయారు! మనదేశం విదేశీయుల దురాక్రమణనుండి విముక్తమైన స్వజాతీయ సంప్రదాయాలను పునరుద్ధరించుకొనడం సహజమైన ప్రక్రియ కావాలి! కానీ ఏడు దశాబ్దులు గడిచిపోయినప్పటికీ ఈ ప్రక్రియ ఆరంభం కాకపోవడం భావ దాస్యానికి చిహ్నం! ఆవులను, దూడలను, కోడెలను పాడిపశువులను వధించడాన్ని నిషేధించాలని రాజ్యాంగంలోని నలబయి ఎనిమిదవ అధికరణం నిర్దేశిస్తున్నప్పటికీ ఈ ‘మార్గదర్శక సూత్రం’ అమలు జరగకపోవడానికి కారణం ఈ భావదాస్యం! ప్రతి మతంవారు తమ మత సంప్రదాయాలను, ప్రాంతీయ సంప్రదాయాలను పాటించాలి, పాటిస్తున్నారు కూడ. కానీ మతాలతో, ప్రాంతాలతో భాషలతో నిమిత్తం లేకుండా దేశ ప్రజలందరూ జాతీయ సంప్రదాయాలను పాటించడం న్యాయం. జాతీయ సంప్రదాయాలకు, మత సంప్రదాయాలకు మధ్య వైరుధ్యం కలిగినప్పుడు లేదా జాతీయ సంప్రదాయాలకు ఇతర స్థానిక సంప్రదాయాలకు మధ్య అంతరం ఏర్పడినప్పుడు ప్రజలు జాతీయ సంప్రదాయాలను పాటించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి! అన్నిదేశాల వారు అంగీకరిస్తున్న ‘అంతర్జాతీయ’ సూత్రం ఇది! ‘గోసంరక్షణ’ అనాదిగా ఈ ‘జాతి’కి సంప్రదాయం...
గోరక్షణకు ఇంతవరకు జాతీయస్థాయిలో చట్టం ఏర్పడకపోవడం వల్లనే ‘గోసంరక్షణ’ వివాదంగా మారింది! ‘గోరక్షకుల’ పేరుతో ‘నకిలీలు కొనసాగిస్తున్న దౌర్జన్యం’ గురించి దేశ విదేశాలలో ప్రచారం జరుగుతోంది. ఈ దౌర్జన్య కాండకు బలైన వారికి ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించడానికి ఇదీ నేపథ్యం! కానీ ఈ వివాదం కారణంగా గో సంరక్షణకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. ‘నకిలీ’లకు ప్రచారం పెరిగింది! నకిలీలను శిక్షించాలి! కానీ గోరక్షణ కోసం రాష్ట్రాలు చేసిన చట్టాలను ఎలా ఎవరు అమలు జరపాలి?? ప్రభుత్వ యంత్రాంగాలు దశాబ్దులుగా చతికిలపడి ఉన్నాయి.