సంపాదకీయం

కశ్మీర్‌లో ‘ఫునరావృత్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్‌లో భద్రతాదళాలపై రాళ్లు రువ్విన దేశద్రోహులకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చారిత్రక పునరావృత్తికి మరో నిదర్శనం. పాకిస్తాన్‌లో జిహాదీ మూకలు సరికొత్త బలాన్ని పుంజుకోవడం ఈ విచిత్ర పునరావృత్తికి వికృత నేపథ్యం. గతంలో, మన్‌మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో, ఇలా కశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన ముష్కరులను పెద్ద సంఖ్యలో విడుదల చేయడం చరిత్ర. ఆ ముష్కరులకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను ప్రభుత్వం రద్దు చేసింది. జైళ్లనుండి విడుదల పొందిన ‘శిలాయుధుల’కు పునరావాసం కల్పించింది, ఉపాధిని కల్పించింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా కృషి చేయడం చరిత్ర! ఈ పునరావాసం కోసం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కూడ సమకూర్చింది. అప్పటి దేశ వ్యవహారాల శాఖ మంత్రి పళనియప్పన్ చిదంబరం నాయకత్వంలో ఆవిష్కృతమైన ‘అష్టసూత్ర ప్రణాళిక’లో - ఈ ‘శిలాయుధులు’ - రాళ్లు రువ్వినవారు -ను క్షమించడం, వారికి ఆర్థిక సహాయం అందించడం ప్రధానమైన అంశం! ఇలా ప్రభుత్వ ధనంతో, భారత ప్రజల ధనంతో తిని మదమెక్కిన ‘‘రాళ్లు రువ్వినవారు’’ మరింత తీవ్రమైన జిహాదీ బీభత్సకారులుగా మారడం చరిత్ర! ఈ ‘వికృత చరిత్ర’ మరోసారి మొదలుకావడానికి ఇప్పుడు మళ్లీ ‘రాళ్లు రువ్విన దేశద్రోహుల’ను క్షమించి వారిపై అభియోగాలను ఎత్తివేయడం ప్రాతిపదిక కాగలదు. ఇదీ చారిత్రక పునరావృత్తి...! పాకిస్తాన్‌లో ‘జిహాదీ’లు మరింత భయంకరంగా భారత వ్యతిరేక బీభత్సకాండకు సన్నద్ధం అవుతుండడం ఈ పునరావృత్తికి వికృత నేపథ్యం. హఫీజ్ సరుూద్‌ను విడుదల చేయించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నేపథ్యానికి రూపకల్పన చేసింది. ‘జిహాదీ బీభత్సకాండ’ను కొనసాగించడంలో తాము ఎవ్వరికీ తీసిపోమని పాకిస్తాన్ రాజకీయవేత్తలు పరస్పరం పోటీపడుతుండడం నడుస్తున్న చరిత్ర... మాజీ సైనిక నియంత పరవేజ్ ముషారఫ్ రంగ ప్రవేశం చేయడం ఊహించని విపరిణామం! హఫీజ్ సరుూద్ నడిపిస్తున్న ‘లష్కర్ ఏ తయ్యబా’ ‘జమాత్ ఉద్ దావా’ జిహాదీ ముఠాలకు తన ‘‘గొప్ప’’ మద్దతును ఈ మాజీ సైనిక నియంత మంగళవారం రాత్రి ప్రకటించాడు. పాకిస్తాన్ నుంచి పారిపోయి దుబాయిలో తలదాచుకుంటున్న ముషారఫ్ ‘‘కశ్మీర్‌లో భారత సైనిక దళాలతో తలపడుతున్న భారీ శక్తులైన ‘జమాత్’ పట్ల, ‘లష్కర్’ పట్ల తనకు ఎంతో ప్రేమ అభిమానం ఉన్నాయని పరవేజ్ ముషారఫ్ ప్రకటించాడు. హఫీజ్ సరుూద్ తనకెంతో ఇష్టుడని అతగాడిని తాను గతంలో కలుసుకున్నానని ముషారఫ్ చెప్పుకొచ్చాడు! లష్కర్, జమాత్ ముఠాలు కూడ తన పట్ల మక్కువ కలిగి ఉన్నాయని అవి తనకోసం - తాను పాకిస్తాన్‌కు తిరిగిరావడం కోసం - చూస్తున్నాయని ముషారఫ్ ప్రకటించాడు...
ఇంతకాలం ప్రచ్ఛన్న బీభత్సకారుడిగా మనుగడ సాగించిన ముషారఫ్ ‘ముసుగు’ తొలగించాడు... ప్రత్యక్ష బీభత్సకారుడుగా అవతరించాడు! ఇదీ జమ్మూకశ్మీర్‌లోని ‘పునరావృత్తి’కి పాకిస్తాన్‌లో ఏర్పడిన జుగుప్సాకరమైన నేపథ్యం... కానీ మన ప్రభుత్వం గతం నుంచి పాఠం నేర్చుకొనడం లేదు! పాకిస్తాన్ ప్రభుత్వ భారత వ్యతిరేక జిహాదీ స్వభావంతో కశ్మీర్ లోయలోని బీభత్సకాండ ప్రత్యక్షంగా ముడివడి ఉంది! సైనిక దళాలపైన, పోలీసులపైన రాళ్లు రువ్వుతున్న వారు పాకిస్తాన్ తొత్తులు, కిరాయిగూండాలు! ఈ కిరాయి గూండాలు బీభత్సకారులని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటించింది! పాకిస్తాన్ ప్రభుత్వ స్వభావంలో విప్లవాత్మక పరివర్తన వచ్చి ఉసిగొల్పడం మానినప్పుడు మాత్రమే ‘రాళ్లు రువ్విన’ జిహాదీలలో మార్పు రాగలదు. రాళ్లు రువ్వుతున్నవారు రువ్వినవారు రువ్వబోయే వారు పాకిస్తాన్ ప్రభుత్వ ఉసిగొల్పిన తోడేళ్లు... చిదంబరం ‘అష్టసూత్ర - ఎనిమిది అంశాల - ప్రణాళికలో భాగంగా జైళ్ల నుంచి విడుదల అయినవారు ‘బుద్ధిమంతుల’య్యారా? జాతీయ ప్రధాన స్రవంతిలో జలకమాడి దేశభక్తులుగా మారారా? లక్షలాది రూపాయల ప్రభుత్వ సహాయాన్ని ప్రభుత్వ భూములను పొందగలిగిన వీరంతా ఏం చేస్తున్నారు??
వారందరూ బుద్ధిమంతులు అయిపోయారని భావించినప్పటికీ, మళ్లీ వేలాది ‘శిలాయుధులు’ మళ్లీ పుట్టుకొని రావడానికి కారణం ఏమిటి?? ఇప్పుడు మళ్లీ నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది ‘రాళ్లు రువ్విన’ వారిపై కేసులు ఎత్తివేస్తున్నారు. చిదంబరం ప్రణాళిక ప్రకారం దాదాపు రెండువేల ఐదు వందల ‘జిహాదీ’లు రాళ్లు రువ్వినవారు శిక్షలను తప్పించుకొని జైళ్ల నుంచి బయటపడిన తరువాత ఐదేళ్లకు ఈ కొత్త ‘శిలాయుధులు’ తయారయ్యారు. ఇప్పుడు ఈ నాలుగు ఐదు వేల మందిని క్షమించి, వారిని ప్రజాధంతో పోషించడానికి కేంద్ర రాష్ట్రాలు పూనుకున్నాయి. మరో ఐదేళ్లలో మరో పదివేలమంది ‘శిలాయుధుల’ను పాకిస్తాన్ తయారు చేసి, చేయించి ఉసిగొల్పదన్న నమ్మకమేమిటి?? సమస్య లోయ ప్రాంతంలో పుట్టిన, పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న జిహాదీలు కాదు... వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే మనకు సమస్య... పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ స్వభావంలో మార్పు రాదు, రాబోదన్న దానికి వందల నిదర్శనాలు దశాబ్దులుగా ఏర్పడి ఉన్నాయి. అందువల్ల రాళ్లు రువ్విన వారిని, పాకిస్తాన్ తొత్తులను, క్షమించడం వల్ల ఫలితం శూన్యం... ప్రజాధనంతో తెగబలిసిన, బలియనున్న ‘శిలాయుధులు’ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగనున్నారు...
పాకిస్తాన్ రాజకీయవేత్తల మనుగడ భారత వ్యతిరేకతపై, జిహాదీ బీభత్సకాండను కొనసాగించడంపై ఆధారపడి ఉంది. ప్రభుత్వ నిర్వాహకులు ఈ భారత వ్యతిరేకతను ఏ మాత్రం సడలించినా సైనిక దళాలు వారిని అధికారంలో ఉండనివ్వవు. లాహోరు బస్సు దౌత్యం తరువాత, కార్గిల్‌లోకి చొరబాటు విఫలమైన తరువాత 1999లో నవాజ్ షరీఫ్ ‘జిహాదీ’లకు నచ్చలేదు. పాకిస్తాన్ సైనిక దళాలలో అత్యధికులు జిహాదీలు... అందువల్ల నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడై దేశ బహిష్కృతుడయ్యాడు. షరీఫ్‌ను గద్దెదింపిన ముషారఫ్ ఆ తరువాత ఉగ్రవాదాన్ని నిరసించినట్లు అభినయించాడు. 2008లో ముషారఫ్ పదవీభ్రష్టుడు కావడానికి, దేశం నుండి పారిపోవడానికి ఇదీ కారణం. ‘‘అవినీతి ఆరోపణలు...’’ దర్యాప్తులు విచారణలు ఇవన్నీ పాకిస్తాన్ సైన్యం నడిపిస్తున్న విస్తృత పన్నాగంలో భాగం! అందువల్ల ఉగ్రవాద వ్యతిరేక అభినయం సాగించిన ముషారఫ్ ముసుగును తొలగించాడు. ‘నవాజ్ షరీఫ్’ను సైన్యం నిరసిస్తోంది కనుక సైనిక దళాలకు మళ్లీ దగ్గర కావడానికి ‘ముషారఫ్’ యత్నిస్తున్నాడు! ‘షరీఫ్’ సైనిక దళాలకు ఎందుకు నచ్చడం లేదు??