సంపాదకీయం

‘సూర్యోదయ’ సౌభాగ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య సమారాధనను ప్రతి సంవత్సరం ఆధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అద్భుతమైన పరిణామం. ప్రకృతి పరిరక్షణకు పర్యావరణ సమతుల్య స్థితికి దోహదకరం, అభినందనీయం. ఇతర ప్రాంతాల ప్రభుత్వాలకు అనుసరణీయం! సూర్యుడు ప్రపంచానికి వెలుగును ప్రసాదిస్తున్నాడు, శీతోష్ణస్థితిని నియంత్రిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, వసంత సౌందర్యశోభలను సంతరించిపెడుతున్నాడు, మానవులకు మాత్రమే కాదు సకల జీవజాలానికి భూమి అన్నం ప్రసాదిస్తోంది, ప్రాణం ప్రసాదిస్తోంది, అభ్యుదయం ప్రసాదిస్తోంది. అస్తిత్వం కల్పిస్తోంది! ఈ సమగ్ర ప్రక్రియకు ప్రేరకుడు సూర్యుడు. సూర్యుని కిరణస్పర్శవల్లనే భూమి నిద్రాణమైన స్థితి నుంచి జాగృతమై క్రియాశీలవౌతోంది, సూర్యుని అస్తమయంతో ఈ చైతన్యం విశ్రమిస్తోంది! అందువల్ల జీవజాలం అస్తిత్వానికి భూమి ఆధారం కాగా భూమి అస్తిత్వానికి సూర్యుడు ప్రాతిపదిక! వెలుగు వికసించడంవల్లనే జీవం వికసిస్తోంది. వర్షం కురవడం వల్లనే భూమిపై జీవజాలానికి ఆహారం లభిస్తోంది, సూర్యుని వేడినుంచి వెలువడుతున్న దాహకశక్తి - అగ్ని - ఆకాశంలో నీటి మేఘాలను సృష్టిస్తోంది! చినుకు చినుకుగా భూమిని స్పృశిస్తున్న ‘ఆకాశగంగ’ భూగర్భాన్ని ఆర్ద్రం చేస్తోంది పండిస్తోంది! అందువల్లనే ‘ద్యావా పృథువు’లు జీవజాలానికి తల్లిదండ్రులని అనాదిగా ‘తండ్రి తల్లి’ అని భారతీయులు గుర్తించారు! ఆకాశం తండ్రి కావడం - ద్యౌర్వఃపితా - భూమి తల్లి కావడం - పృథివీ మాతా - సృష్టిగతమైన శాస్ర్తియ వాస్తవం హేతుబద్ధమైన జీవన సత్యం! అనంతమైన, అఖండంగా వ్యాపించిన ఆకాశానికి అంతరిక్ష స్వభావానికి సజీవ స్వరూపం సూర్యుడు, వెలుగుల ప్రతీక సూర్యుడు! కనిపించని విశ్వానికి కనిపించే విగ్రహం సూర్యుడు.. ‘‘సూర్య ఆత్మా జగతః’’ - ‘‘సూర్యుడు జగత్తునకు ఆత్మ’’ -! అందువల్ల ‘‘్భమి ఆకాశం తల్లిదండ్రులు’’ అన్న విస్తృత వాస్తవానికి ఆచరణ స్థితి ‘్భమి సూర్యుడు తల్లిదండ్రులు’’కావడం!! సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుండటం వల్లనే ‘ఉదయం అనాదిగా పునరావృత్తం అవుతోంది! కాలం కదులుతోంది, జీవం వికసిస్తోంది, అభ్యుదయం ఆద్యంతరహితంగా అలరారుతోంది! ఉదయం, అస్తమయం, రాత్రి పగలు మాత్రమే కాదు నెలలు, ఋతువులు, వత్సరాలు, యుగాలుగా పునరావృత్తం అవుతుండడానికి మానవులకు కొలమానం సూర్యుడితో భూమికి ఉన్న ఈ నిరంతర బంధం.. భూమి సూర్యుడు దంపతులు, మానవాళికి జీవజాలానికి తల్లిదండ్రులు! అందువల్ల సూర్య సమారాధన తార్కికమైన ప్రగతిక్రమం..
ఈ ప్రగతిక్రమంలో వౌలికమైనది, సనాతనమైనది సౌరశక్తి! ‘సనాతనం’ అని అంటే తుదిమొదలు లేనిది అని అర్థం. సూర్యబింబం, సూర్యబింబ నిహితమైన ‘శక్తి’ ఇలా తుదిమొదలు లేనివి, సృష్టితో సమాంతరంగా సృష్టి అంతర్గతంగా సూర్యమండలం కొనసాగుతోంది. లయమైన సృష్టి మళ్లీ ప్రస్ఫుటించగానే ‘సూర్యమండలం’ సౌర కుటుంబం పునరావృత్తవౌతున్నాయి. అందువల్ల సౌరశక్తి శాశ్వతమైన శక్తి! సహజమైన ఈ సౌరశక్తిని మానవులు అనాదిగా ఉపయోగించుకుంటున్నారు! ఈ శక్తితో నిత్య జీవన వ్యవహారాన్ని అనుసంధానం చేయడం సూర్య నమస్కారం లేదా సూర్య ఆరాధన. ఈ అనుసంధానం నిత్యకృత్యం కావడం భారత జాతీయ సంస్కారం! సూర్యుడు ఉదయించే సమయంలోను అస్తమించే సమయంలోను పడుకొని ఉండరాదన్నది ఈ సంస్కారం, పడుకొని ఉండకపోవడం ఆరోగ్యం.. పడుకొని నిద్రిస్తూ ఉండడం రోగకారణం, రోగ లక్షణం, ఇదీ అనుసంధానం!
ఈ అనుసంధానాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సూర్య ఆరాధన ఉత్సవాన్ని జరిపించనుంది. ‘‘ఆరోగ్యం భాస్కరాత్..’’ - ‘‘సూర్యునివల్ల ఆరోగ్యం’’ - అన్నది జీవన వైద్యం. ప్రతిరోజు కనీసం పదమూడు సూర్య నమస్కారాలు చేయడంవల్ల స్వచ్ఛ భారతీయులు తయారు అవుతున్నారన్నది ధ్రువపడిన వాస్తవం! సూర్య నమస్కారంలో శారీరక వ్యాయామానికి చెందిన పది భంగిమ - పోస్టర్-లు ఉన్నాయి. ఈ పది భంగిమలు పది యోగాసనాలు! అందులో ఒక సూర్య నమస్కారం పది యోగాసనాలతో సమానం! ఇలా సూర్య నమస్కారాలు ప్రతిరోజు నియమిత సమయంలో ప్రతిఒక్కరూ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మరో మేలుకొలుపు, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక పద్ధతుల ద్వారా సౌరకిరణ చైతన్యాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి కొనసాగుతున్న ఉద్యమంలో కొత్త మలుపు! ఆదివారం ఆంధ్రప్రదేశ్ అంతటా జరిగిన ‘సూర్య నమస్కార’ - సూర్య ఆరాధన - ఉత్సవం ప్రకృతి పరిరక్షణ ప్రవృత్తికి మరో శ్రీకారం! పరిరక్షించుకోవలలసినదానిని ఆరాధించడం అనాదిగా భారతీయ జీవనం! మరుగునపడిన ఈ జీవన విధానాన్ని మళ్లీ పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలవారు అనుసరించగలగాలి! నేల, నీరు, నిప్పు, గాలి, నింగి - ఈ పంచభూతాలు ప్రకృతి, మానవుడు ప్రకృతిలో భాగం! మన శరీరం పంచభూతాల కలయిక, మనచుట్టూ ఉన్నది కూడ పంచభూతాలు మాత్రమే! పాంచభౌతిక శరీరంకల మనం పంచభూతాలకు కృతజ్ఞత చెప్పడం ప్రకృతి ఆరాధన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరంభించిన ఈ ‘ప్రకృతి పూజ’ను అన్ని ప్రాంతాలలోను జాతీయ స్థాయిలోను ప్రభుత్వాలు ఆధికారిక ఉత్సవాలుగా నిర్వహించగలగాలి! సూర్య సమారాధనకు ప్రతిఒక్కరూ ప్రతిరోజు పదిహేను నిమిషాలు కేటాయించాలన్నది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట.. ఈ మాటను పాటించి ప్రతిరోజు సూర్య నమస్కారాలను చేసినట్టయితే ప్రతి ఒక్కరిలో మానసిక బౌద్ధిక శారీరక శక్తులు మరింతగా వికసించగలవు!
సూర్యుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ‘అస్తిత్వ రాయబారి’ - బ్రాండ్ అంబాసిడర్ - అని చెప్పడం చంద్రబాబు పునరావిష్కరించిన సనాతన జీవన సత్యం. సూర్యుడు అస్తిత్వ రాయబారి మాత్రమే కాదు అస్తిత్వ ప్రదాయకుడు.. ఇది ఆంధ్రప్రదేశ్‌కు, తెలుగు రాష్ట్రాలకు, భారతదేశానికి, ప్రపంచానికి అస్తిత్వం! ఈ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనడంలో భాగం ప్రకృతి ఆరాధన, సౌరశక్తి ఉత్పాదకతకు ప్రేరణ! చంద్రబాబు నాయుడు వివరించిన ‘సూర్యోదయ’ ప్రగతి ఇది! ‘అంతర్జాతీయ సౌరశక్తి దేశాల సమాఖ్య’ లక్ష్యం కూడా ఇదే! భూమధ్య రేఖకు అటూఇటూ మకర రేఖ నుంచి కర్కాటక రేఖ వరకు విస్తరించి ఉన్న దేశాలు ‘సౌరశక్తి సమాఖ్య’గా ఏర్పడడం ప్రకృతి ఆరాధన క్రమంలో మన దేశం సాధించిన విజయం. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా జపాన్ వంటి దేశాలు ఈ ‘సమాఖ్య’లో లేవు.. ఈ దేశాలు ‘మకర రేఖ’ నుండి కర్కాటక రేఖ వరకు విస్తరించిన భూభాగంలో లేవు! ఈ భూభాగం సౌరశక్తిమండలం! ఈ భూభాగంలో దేశాలవారికి ఏడాది పొడవునా పుష్కలంగా సౌరశక్తి లభిస్తోంది! సౌరశక్తి దేశాల సమాఖ్య దేశాల ప్రధాన కార్యాలయం మనదేశంలోనే ఉంది! మనదేశం సౌరవిద్యుత్ ఉత్పాదక పథంలో నిరంతర ప్రగతి సాధిస్తోంది! ‘సూర్య ఆరాధన’ ఉత్సవం ఈ ప్రగతికి ప్రేరకం..