సంపాదకీయం

‘సుంకాల’ వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ వస్తువులపై సుంకాలను తగ్గించాలని మన ప్రభుత్వంపై తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంత దేశాలు ఒత్తడి తెస్తున్నాయట. సుంకాలను రద్దు చేయాలని కనీసం బాగా తగ్గించాలని ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సమాఖ్య పేరుతో చెలామణి అవుతున్న ఈ దేశాల వారు కోరుతున్నారట. పదహారు దేశాల ఈ విస్తృత ప్రాంతీయ సమాఖ్యలో మనదేశానికి సభ్యత్వం ఉంది. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య వ్యవహారాల ఒప్పందం కుదరడానికి వీలుగా మన ప్రభుత్వం ఈ సుంకాలను తగ్గించివేయాలని మిగిలిన పదిహేను దేశాలు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా తగ్గించడానికి అంగీకరించక పోయినట్టయితే స్వేచ్ఛా వాణిజ్య వ్యవహారాల ఒప్పందం-ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్-చర్చల ప్రక్రియనుంచి మనదేశం తప్పుకోవాలని కూడ సమాఖ్యలోని ఇతరులు మన దేశానికి తాఖీదును కూడ జారీ చేసారట! వాణిజ్య సుంకాలను తగ్గించకపోవడం మన ప్రభుత్వం అనుసరిస్తున్న సంకుచిత జాతీయ ప్రయోజన పరిరక్షణ-ప్రొటక్షనిస్ట్-ఆర్థిక విధానానికి చిహ్నమని సమాఖ్యలోని ఇతర దేశాలవారు ఆరోపిస్తున్నారట. ఇరవై మూడవ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో జరుగనున్న ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సమాఖ్య-రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్టనర్‌షిప్-ఆర్‌సిఇపి- చర్చా సదస్సులో ఈ సుంకాల వ్యవహారం మనదేశాన్ని తీవ్రమైన అసౌకర్యానికి గురి చేయనున్నదట! వాణిజ్య సుంకాలు-టారిఫ్స్-మన దేశం మాత్రమే అధికంగా విధిస్తోందా? మిగిలిన దేశాల ప్రభుత్వాలు ఈ సుంకాలను విధించడం లేదా అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఇందుకు సమాధానం ఈ ప్రాంతీయ సమాఖ్యలో నిహితమై ఉన్న జటిలమైన వైరుధ్యాలుమాత్రమే! వాణిజ్యం, సుంకాల సాధారణ ఒప్పం దం-జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్స్-పేరుతో దశాబ్దుల తరబడి కొనసాగిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ 1993వ, 1994వ సంవత్సరాలలో ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యుటిఓ-వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్-గా రూపాంతరం చెందింది. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామ్యం పొందడమే ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్- వ్యవస్థలో చేరడం. ఇలా ప్రపంచ దేశాలు మొత్తం ఒకే ఆర్థిక సమాఖ్యగా ఏర్పడి ఉన్నప్పుడు ఒకే అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవహారాల ఒప్పందం ఎందుకని కుదరడం లేదు?
కుదరకపోవడం ప్రపంచీకరణ వాణిజ్య మాయాజాలంలో భాగం. సంపన్నదేశాలు వర్ధమాన దేశాలకు భారీగా తమ ఉత్పత్తులను తరలించి విక్రయించడానికి వీలుగా ప్రాంతీయ వాణిజ్య సమాఖ్యలు, స్వేచ్ఛా వాణిజ్య మండలాలు ఏర్పడుతున్నాయి. ఈ పదహారు దేశాల ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్యంలోని పదిదేశాలు మరో సమాఖ్యగా ఏర్పడి ఉన్నాయి. అది ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి- అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్-ఆసియాన్-! థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనీ, ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, బర్మాదేశాలు ఆసియాన్‌లో భాగస్వామ్యం వహిస్తున్నాయి. వీటికి తోడు మన దేశం, దక్షిణకొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా కలిసి ఈ ఆర్‌సిఇపిని ఏర్పాటు చేసుకున్నారు. మనదేశం దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేయడంవల్ల లేదా బాగా తగ్గించడం వల్ల ఆసియాన్‌లో లేని ఈ ఐదు సంపన్న దేశాలు తమ వస్తువులతో మన దేశాన్ని ముంచెత్తవచ్చు! ప్రధానంగా ఆస్ట్రేలియా కొరియా చైనా దేశాలు మన దేశంపై పెరుగుతున్న ఒత్తడికి సూత్రధారులు. స్వేచ్ఛా వాణిజ్య వ్యవహారాల ఒప్పందం కుదరకపోయినప్పటికీ చైనా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏర్పడిపోయింది. మన దేశం మాత్రం చైనాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కాదు...ఈ భాగస్వామ్యం వల్ల ప్రతి ఏటా మన దేశానికి చెందిన దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు చైనాకు తరలిపోతున్నాయ. మన ఎగుమతులకంటె చైనానుండి మన దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ చాలా ఎక్కువ కాబట్టి! మనం విధిస్తున్న సుంకాలు ఇంకా తగ్గినట్టయితే చైనా వస్తువులు మరింత భారీగా మన దేశానికి తరలి రాగలవు. మన ఉత్పత్తులకు మన దేశంలోనే గిరాకీ మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది...
ఆసియాన్‌కూ మన దేశానికీ మధ్య 2012 డిసెంబర్‌లోనే స్వేచ్ఛా వాణిజ్య అంగీకారం-ఎఫ్‌టిఓ-ఖరారైంది. ఈ ఒప్పందం సేవలకు, పెట్టుబడులకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ ఒప్పందాన్ని వస్తు వాణిజ్యానికి సైతం విస్తరించుకున్నట్టయితే మనకు ఈ ఆర్‌సిఇపితో కొత్తగా ఒప్పందం కుదుర్చుకోనవసరం లేదు. ఆర్‌సిఇపితో ఒప్పందం వల్ల చైనా కొరియా ఆస్ట్రేలియా జపాన్ దేశాలకు మాత్రమే లాభం ఒనగూడుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఇప్పటికే రెండు విస్తృతమైన స్వేచ్ఛా వాణిజ్య అంగీకారాలు కుదిరి ఉన్నాయి. అమెరికా ఆధ్వర్యంలో పసిఫిక్ దేశాల స్వేచ్ఛా వాణిజ్య క్షేత్రం ఏర్పడి ఉంది. ఈ ఒప్పందంలో ఆస్ట్రేలియా జపాన్‌లు భాగస్వాములు. ఐరోపా సమాఖ్యకు అమెరికాకు మధ్య కూడ ఇలాంటి అంగీకారం కుదిరింది! ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం ఏర్పడి ఉంది. ఈ నియమావళిలో భాగంగా ఏ దేశం కూడ దిగుమతులను నిరోధించే విధంగా సుంకాలు విధించరాదు. విధించినట్టయితే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యవంలో పనిచేస్తున్న వాణిజ్య న్యాయ మండలులలో అభియోగాలను దాఖలు చేయవచ్చు. కానీ అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా తమకు అవసరం వచ్చినప్పుడల్లా దిగుమతులను నిరోధించే-యాంటీ డంపింగ్- సుంకాలు విధిస్తూనే ఉన్నాయి. అభియోగాలు దాఖలయినప్పటికీ ఏళ్ల తరబడి పరిష్కారాలు లభించడం లేదు. నాటకంలో అంతర్నాటకం వలె ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య వ్యవహారాల ఒప్పందాలు ప్రచారవౌతున్నాయి. ఈ ఒప్పందాలు వర్థమాన దేశాలకు మధ్య, సంపన్న దేశాలకు మధ్య విడివిడిగా కుదిరినట్టయితే అన్ని దేశాలకు ప్రయోజనకరం కాగలదు. కానీ సంపన్న దేశాలకు వర్ధమాన దేశాలకు మధ్య కుదిరే స్వేచ్ఛా అంగీకారాలు వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను దివాలా తీయిస్తాయి.
మనదేశానికీ ఆసియాన్‌కు మధ్య మైత్రి పెంపొందకుండా చైనా అనేక ఏళ్లపాటు అడ్డుకుంది! 2001లో భారత-ఆసియాన్ శిఖర సభలు జరుపడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినప్పటికీ 2009 వరకు సమగ్రమైన అనుసంధానం ఏర్పడలేదు. మన ప్రభుత్వం ఆరంభించి లుక్‌ఈస్ట్-పూర్వ దిశా వీక్షణం-ప్రస్తుతం యాక్ట్ ఈస్ట్-పూర్వ దిశా కార్యాచరణ-గా రూపొందింది. ఆసియాన్‌తో మన సాన్నిహిత్యం పెరగడం నచ్చని చైనా మళ్లీ పావులు కదుపుతోంది...ఆర్‌సిఇపిలో విభేదాలను సృష్టించింది!