సంపాదకీయం

న్యాయ నయనాల ‘నీరు’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయం చేయవలసిన వారు న్యాయం కోరుతుండడం విచిత్రమైన రాజ్యాంగ విషాదం. ఈ విషాద ఘట్టాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి తీర్థసింగ్ ఠాకూర్ ఆదివారం న్యూఢిల్లీలో సజల నయనాలతో స్వయంగా సమావిష్కరించడం ఎవ్వరూ ఊహించని విపరిణామం. న్యాయ వ్యవస్థకు న్యాయం కలిగించవలసిందిగా ఈ రాజ్యాంగపు విభాగపు సర్వోన్నత ప్రతినిధి రుద్ధ కంఠంతో విజ్ఞప్తి చేయడం తిలకించిన వారిని బహుశా దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటుంది. రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా భావోద్వేగ ప్రభావితుడై విలపించడానికి సిద్ధమైన దృశ్యానికి సమావేశంలో ఉపస్థితుడై ఉండిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన వీక్షకుడు. నిజానికి ప్రధాన న్యాయమూర్తి సంధించిన ఈ అర్ధవిలాప శస్త్రం గురి చూసింది ప్రధాన మంత్రినే! ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేస్తున్న కార్యనిర్వాహక రాజ్యాంగ విభాగం-ఎగ్జిక్యుటివ్-పై సర్వోన్నత న్యాయస్థానం వారు, ఉన్నత న్యాయస్థానాలవారు విమర్శలను గుప్పించడం మన ప్రజాస్వామ్య చరిత్రలో తరచుగా సంభవించే పరిణామం. ప్రజా వ్యతిరేకమైన రాజ్యాంగ విరుద్ధమైన మంత్రివర్గ నిర్ణయాలను, చట్టసభల తీర్మానాలను హైకోర్టులు, సుప్రీంకోర్టు ఎనె్నన్నోసార్లు రద్దు చేయడం చరిత్ర. ప్రభుత్వాలవల్ల అన్యాయాలకు గురి అయినవారు, అన్యాయాలకు గురి అయినట్టు భావించేవారు నిర్వహించే అసంకల్పిత ప్రతిక్రియ న్యా యస్థానాలను ఆశ్రయించడం కంచె కన్నీళ్లుపెట్టుకుని కూలపడిపోతే కర్షకుని పొలాన్ని కాపాడ గలవారు ఎవ్వరు? సర్వోన్నత న్యాయస్థానం అనేకసార్లు ప్రభుత్వాలను మందలించింది, అదలించింది, హెచ్చరించింది, ఆదేశించింది. ఇవన్నీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించడంలో భాగం, రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను, ఉత్తరువులను నిరోధించడంలో భాగం. రాజ్యాంగ నియమావళికి, రాజ్యాంగ స్ఫూర్తికి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ. రాజ్యాంగపరమైన సందేహాలు తలెత్తినప్పుడు 143వ అధికరణం ప్రకారం రాష్టప్రతికి సలహాలనిచ్చి సంక్షోభాలను నివారించగలిగినది కూడ సర్వోన్నత న్యాయస్థానమే. ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఇలా విలాప స్వరాలను పలికించడం అందువల్ల సరికొత్త సంక్షోభం! ఈ సంక్షోభానికి కారణం ప్రభుత్వం-ఎగ్జిక్యుటివ్-వారు న్యాయ శాఖను నిర్లక్ష్యం చేయడమన్నది ఠాకుర్ చేసిన ఆరోపణ. బహిరంగంగా కంట తడి పెట్టినందువల్ల కాని కన్నీరు మున్నీరుగా రోదించడంవల్ల కాని ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రజల దృష్టిలో రాజ్యాంగ వ్యవస్థలు పరిహాస భాజక్తం కావడానికి మాత్రమే అత్యున్నతుల ఇలాంటి భావోద్వేగాలు దోహదం చేస్తాయి. ప్రధాన మంత్రి సూచించినట్టు పరస్పరం చర్చించుకొనడం ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం సాధించగలరు...
ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంలో మంత్రివర్గం వారు జాప్యం చేస్తున్నారన్నది ఠాకుర్ చేసిన ఆరోపణ. ఈ ఆరోపణ అవాస్తవం కాదు. కానీ ఈ జాప్యానికి న్యాయ వ్యవస్థ నిర్వాహకుల సంఘర్షణాత్మక ధోరణి కూడ కారణమన్నది చరిత్ర చెబుతున్న సాక్ష్యం! హైకోర్టులలో న్యాయమూర్తులుగా నియమించడానికి సర్వోన్నత న్యాయ వరణ మండలి-సుప్రీంకోర్టు కొలేజీయమ్-వారు 170 మందిని ఎంపిక చేసి రాష్టప్రతికి పంపించారు. రెండు నెలలుగా ప్రభుత్వం వారు నియామకాలు జరుపకపోవడంవల్ల ఉన్నత న్యాయస్థానాలలో అపరిష్కృత వివాదాల సంఖ్య పెరిగిపోయిందట! హైకోర్టులలో దాదాపు నాలుగు వందల డెబ్బయి న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నప్పుడు 170 మందిని మాత్రమే కాలేజియమ్ వారు ఎంపిక చేసారు. ఒకవేళ ప్రభుత్వం ఈ 170 పదవులను భర్తీ చేసినప్పటికీ మిగిలిన మూడు వందల ఖాళీగానే ఉంటాయి. ఈ విలంబన ప్రక్రియకు బాధ్యులు కొలేజియమ్ వారు కాదా? ఈ సంగతిని ప్రధాన న్యాయమూర్తి ఎందుకని ప్రస్తావించలేదు. ఏళ్లతరబడి వందలాది హైకోర్టు జడ్జిల పదవులు, వేలాది జిల్లా స్థాయి, కిందిస్థాయి న్యాయమూర్తుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. దీనికి సుప్రీంకోర్టు, హైకోర్టులు బాధ్యత వహించవలసిన పనిలేదా? ప్రజా ప్రయోజనాల వివాదాల ప్రాతిపదికగా దాదాపు ప్రతిరోజు ప్రభుత్వాలకు అనేకానేక ఆదేశాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేస్తున్నాయి. జిల్లాస్థాయి, కిందిస్థాయి న్యాయ పదవులను నిర్ణీత కాల వ్యవధిలోగా భర్తీ చేయాలని సర్వోన్నత ఉన్నత న్యాయస్థానాలు తమంత తాముగా ఆదేశించి ఉండవచ్చు కదా? బహిరంగ విలాపం వల్ల ఈ ఖాళీలు భర్తీ అవుతాయా? అనేక పదవులు ఖాళీగా ఉండడంవల్లనే వివాదాలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. అమెరికాలోని ఉన్నత న్యాయమూర్తులు సగటున ఒక్కొక్కరు పరిష్కరిస్తున్న న్యాయవివాదాల కంటె మన ఉన్నత న్యాయమూర్తుల సగటు పరిష్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయట! మన ఉన్నత న్యాయమూర్తులు పనిభారంతో ఊపిరి ఆడక సతమతమవుతున్నది వాస్తవం. కానీ అమెరికా మనలను పోల్చుకొనడం మాత్రం అతార్కికం. నిజానికి న్యాయ వివాదాలు లక్షల కొలదీ పేరుకుపోవడానికి ప్రధాన కారణం జిల్లా, కిందిస్థాయిలలో తగినంత మంది జడ్జీలు లేకపోవడం. ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం యాబయి మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లోనే న్యాయ వ్యవహారాల అధ్యయన మండలి-లా కమిషన్ వారు సూచించారట. ప్రతి ఇరవై వేల మందికి ఒక న్యాయమూర్తి వుండాలన్న మాట! మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. వివాద స్వభావం జనంలో పెరిగిన నేపథ్యంలో, న్యాయ ధ్యాస విస్తరించిన నేపథ్యంలో ఈ సగటు సంఖ్య ఇంకా పెరగాలి.కానీ ప్రస్తుతం సగటున పది లక్షల మందికి కాను పదిహేను మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారట. ఈ మూడు దశాబ్దుల వైపరీత్యానికి మొత్తం బాధ్యత ప్రభుత్వానిదేనా? సుప్రీంకోర్టుకు బాధ్యత లేదా?
అత్తమీది కోపం దుత్తమీద చూపినట్టుగా ప్రధాన న్యాయమూర్తి న్యాయ వ్యవస్థలో నిహితమై ఉన్న లోపాలకు విసిగి ఉండి, ఆ నెపాన్ని ప్రభుత్వంపైన రుద్దారన్న అభిప్రాయం కలుగుతోంది. రెండునెలల విలంబనం దశాబ్దుల అలసత్వం ముందు ఎంత? హైకోర్టు మా మాట వినడం లేదు...ప్రజలెందుకు వింటారు? అని 2015 మే నెలలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు ప్రభృతులు వ్యాఖ్యానించడం న్యాయ వ్యవస్థ అంతర్గత స్థితికి అద్దం. మదరాసు హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ఇటీవల బహిరంగంగా సుప్రీంకోర్టును ధిక్కరించడం పరాకాష్ఠ! నేషనల్ జ్యుడీషియల్ అప్పాయింట్‌మెంట్స్ కమిషన్-జాతీయ న్యాయపదవుల నియుక్త వ్యవహారాల మండలి-ఎన్‌జెఎసి-ని సుప్రీంకోర్టు రద్దు చేయడం కూడ విపరీత విలంబనకు దోహదం చేయడం లేదా? సర్వోన్నత న్యాయపాలకుడు చెప్పగలగాలి...