సంపాదకీయం

‘నిష్క్రమణ’ నీడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా సమాఖ్య నుంచి ‘బ్రిటన్ నిష్క్రమణ’- బ్రెక్జిట్- ప్రహసనం ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ వాణిజ్య, రాజకీయ ప్రకంపనలు ఇరవై తొమ్మిది దేశాల ‘ఐరోపా సమాఖ్య’- యూరోపియన్ యూనియన్ -ఇయు- పరిధిని దాటి అంతర్జాతీయ సీమలలో హోరెత్తుతుండడం నడుస్తున్న చరిత్ర. బ్రిటన్ ప్రధాని, అధికార ‘కన్సర్వేటివ్ పార్టీ’ నాయకురాలు థెరీసా మేయ్‌కు ఎదురౌతున్న వైఫల్య పరంపర ఈ నడుస్తున్న చరిత్రలోని ప్రధాన వైపరీత్యం. బ్రిటన్ పార్లమెంటు ‘సామాన్యుల సభ’లో బుధవారం రాత్రి ఆమె సభ్యుల విశ్వాసం పొందడం మాత్రమే ఈ పరాజయ పరంపరకు అపవాదం- ఎక్సెప్షన్-! మంగళవారం నాడు సామాన్యుల సభ- హౌస్ ఆఫ్ కామన్స్- మన లోక్‌సభ వంటిది-లో నిష్క్రమణ ఒప్పందాన్ని ఘోరంగా తిరస్కరించడం థెరీసా మేయ్‌కు తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బ. ఈ ఒప్పందాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఐరోపా సమాఖ్యతో కుదుర్చుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం బ్రిటన్‌లో జరిగిన ‘జనవాక్య సేకరణ- రెఫరెండమ్- లో వెలువడిన ఫలితం మేరకు బ్రిటన్ రానున్న మార్చి ఇరవై తొమ్మిదవ తేదీలోగా ‘ఐరోపా సమాఖ్య’ నుంచి నిష్క్రమించాల్సి ఉంది. ‘నిష్క్రమణ’ తరువాత బ్రిటన్‌కూ మిగిలిన ఐరోపా సమాఖ్య దేశాలకు మధ్య కొనసాగవలసిన దౌత్య, వాణిజ్య, రాజకీయ, ప్రజాసంబంధాల గురించి ‘మేయమ్మ’ ప్రభుత్వం ‘సమాఖ్య’తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ‘సామాన్యుల సభ’ ప్రతినిధులు తిరస్కరించారు. థెరీసా సొంత పార్టీకి చెందిన అనేకమంది సభ్యులు ఆమె ప్రతిపాదనలను తిరస్కరించారు. సామాన్యుల సభలో అధికార కన్సర్వేటివ్ పార్టీకి మూడువందల పధ్నాలుగు మంది సభ్యులుండగా, నూట పద్దెనిమిది మంది ‘నిష్క్రమణ’పై కుదిరిన ఒప్పందాన్ని తిరస్కరించారు! ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీలో సైతం ‘నిష్క్రమణ’ ఒప్పందంపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఫలితంగా ‘ఒప్పందానికి అనుకూలంగా రెండువందల ఇద్దరు, వ్యతిరేకంగా నాలుగు వందల ముప్పయి ఇద్దరు సభ్యులు వోటు వేశారు. ‘ఒప్పందం’ ధ్రువీకరణ- రాటిఫికేషన్-కు నోచుకోకపోవడంతో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్- ఎలాంటి ద్వైపాక్షిక అంగీకారం కుదరకుండానే- నిష్క్రమించవలసిన దుస్థితి ఏర్పడింది. తాను ప్రతిపాదించిన ఒప్పందం ‘సభ’ తిరస్కరణకు గురైన వెంటనే థెరీసా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఉండాలి. అలా చేసి ఉండినట్టయితే గతంలో ‘నిష్క్రమణ’ వివాదం ప్రాతిపదికగా పదవి నుంచి తప్పుకున్న మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ వలె ఈమె కూడా ‘చారిత్రక గరిమ’ను గడించి ఉండేది. ప్రధాన ప్రతిపక్షం ‘లేబర్ పార్టీ’ నాయకుడు జెరిమీ కోర్బిన్ ప్రధాని పదవి నుంచి మేయ్ రాజీనామా చేయాలని సూచించాడు కూడా! ఆమె తప్పుకోలేదు. ప్రతిపక్షం వారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చునని ఆమె సూచించింది. కోర్బిన్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూడువందల ఆరుగురు తీర్మానాన్ని సమర్ధించగా మూడువందల ఇరవై ఐదు మంది థెరీసా మేయ్ ప్రభుత్వాన్ని సమర్ధించారు! అందువల్ల ఆమెకు గండం గడిచింది..
గండం గడిచినప్పటికీ థెరీసా మేయ్ విధాన వైఫల్యం ‘గొప్పగా గోచరిస్తోంది!’. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణ తప్పదు. కానీ నిష్క్రమణ ‘తీరు’కు, ‘నిష్క్రమణ’ తరువాతి పరిణామాలకు సంబంధించి ఆమె సమాఖ్యతో కుదుర్చుకున్న ఒప్పందం మాత్రం ‘జాతీయ వైపరీత్యం’అని ప్రతిపక్ష నాయకుడు జెరిమీ కోర్బిన్ వ్యాఖ్యానించడం ప్రస్ఫుటిస్తున్న ‘ఐరోపా అంతర్గత వైరుధ్యానికి’ నిదర్శనం. ఐరోపా సమాఖ్యలో పెరుగుతున్న విభేదాలు,వైరుధ్యాలు ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-వల్ల పుట్టలు పగిలిన వాణిజ్య వైపరీత్యాలకు ప్రతిబింబాలు. అందువల్ల ‘మేయమ్మ’ రచించిన నిష్క్రమణ ఒప్పందం నీరుకారిపోవడం కేవలం వైయక్తిక వైఫల్యం కాదు, బ్రిటన్ జాతీయ వైఫల్యం.. ‘సమాఖ్య’ వైరుధ్యాలకు ప్రతిబింబం. ‘సమాఖ్య’లోని బీటలు ‘ప్రపంచీకరణ’ కుడ్యాలకు ఏర్పడిన ఛిద్రాలకు ప్రతిరూపాలు.. సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగుతుండడానికి పూర్వరంగం బ్రిటన్‌లో కొనసాగుతున్న అంతఃకలహం! 2014 సెప్టెంబర్‌లో బ్రిటన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ‘స్కాట్‌లాండ్’ ప్రజలు యత్నించారు. స్కాట్‌లాండ్‌లో జరిగిన జనాభిప్రాయ సేకరణలో యాబయి ఐదు శాతం ప్రజలు తమ ప్రాంతం బ్రిటన్‌లోనే ఉండాలని కోరడంతో ఆ ‘విభజన’ ప్రమాదం తృటిలో తప్పింది. దేశాలను, ఖండాలను విభజించి ‘దొంగలు ఊళ్లను పంచుకున్నట్టు’ కొల్లగొట్టిన దోపిడీ చరిత్ర బ్రిటన్, ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలది. ఆ చరిత్ర ఇప్పుడు ‘ఐరోపా సమాఖ్య’లోను బ్రిటన్‌లోను స్పెయిన్‌లోను, ఐరోపా దేశాలలోను ‘‘పునరావృత్తం’’ అవుతుండడం కాలమహిమ! ‘సమాఖ్య’ నుంచి విడిపోవాలని బ్రిటన్ ప్రజలు నిర్ణయించిన తరువాత స్కాట్‌లాండ్‌లో ‘స్వాతంత్య్ర ఉద్యమం’ పుంజుకొంది. స్కాట్‌లాండ్ ప్రజలు మరోసారి ‘అభిప్రాయ సేకరణ’ జరగాలని ఉద్యమిస్తున్నారు..
‘ఐరోపా సమాఖ్య’ నుంచి విడిపోవాలని 2016 జూన్ 23న జరిగిన ‘అభిప్రాయ సేకరణ’లో బ్రిటన్ ప్రజలు నిర్ణయించారు. ‘యాబయి రెండు శాతం’ ప్రజలు నిష్క్రమణను కోరగా నలబయి రెండు శాతం సమాఖ్య భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కోరారు. అప్పటి బ్రిటన్ ప్రధాని, కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు డేవిడ్ కామెరాన్ ‘నిష్క్రమణ’ను వ్యతిరేకించాడు. తన విధానం వీగిపోయినందుకు ‘ప్రతి క్రియ’గా ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. నిజానికి ఆ ‘జనాభిప్రాయం’ ప్రాతిపదికగా కామెరాన్ తన పదవికి రాజీనామా చేయవలసిన పనిలేదు. కానీ పదవి కంటె ‘జాతీయ హితం’ తనకు ప్రధానమని కామెరాన్ చాటగలిగాడు, ప్రధానమంత్రి పదవి నుంచి మాత్రమేకాక, రాజకీయాల నుంచి నిష్క్రమించడం ద్వారా తన రాజకీయ నైతిక నిష్ఠను నిలబెట్టుకున్నాడు. అంతకు పూర్వం 1970వ దశకం చివరిలోను, 1980వ దశకంలోను కన్సర్వేటివ్ పార్టీలో తిరుగులేని నాయకురాలిగా చెలామణి అయిన మార్గరెట్ థాచర్ కూడ అర్ధాంతరంగా ప్రధాని పదవికి రాజనామా చేసింది.. అందుకు కారణం ‘పరాజయం’ కాదు, తన విధానాలకు విఘాతం కలుగుతోందని ఆమె భావించడం! మేయ్ కూడ ‘నిష్క్రమణ’ ఒప్పందం వీడిపోయిన తరువాత ‘‘నిష్క్రమించి’’ ఉండనట్టయితే ఈ ‘పరంపర’ నిలబడి ఉండేది. కానీ ‘పదవిని పట్టుకుని వేళ్లాడడం’అన్న సామెతకు మేయ్ గత రెండేళ్లుగా ప్రతిరూపంగా మారి ఉంది..
అంతర్జాతీయ సమాజాన్ని బ్రిటన్ తదితర ఐరోపా దేశాలు దాదాపు నాలుగు శతాబ్దులపాటు దోపిడీ చేయడం చరిత్ర. ఐరోపా దేశాల ‘శక్తి’ దుర్మార్గుడి చేతిలోని ‘కత్తి’వలె ఈ నాలుగు శతాబ్దులపాటు పనిచేసింది. ఇంగ్లాండు, వేల్స్, స్కాట్‌లాండ్ కలిసి ‘గ్రేట్ బ్రిటన్’గాను, ‘బ్రిటన్’ ఉత్తర ‘ఐర్‌లాండ్’ కలసి ‘ఐక్యరాజ్యం’- యునైటెడ్ కింగ్‌డమ్- యుకె గాను అవతరించడం సమాంతర పరిణామం. బ్రిటన్, పోర్చ్‌గల్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలవారు ఐరోపానుంచి ‘ఓడ దొంగలు’గా మారి వివిధ దేశాల వాణిజ్య నౌకలను కొల్లగొట్టడం క్రీస్తుశకం పదహారవ శతాబ్ది వరకు నడచిన చరిత్ర. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలోని అనాది జాతులను ‘తుపాకుల బలం’తో మూక ఉమ్మడిగా హత్యచేసిన చరిత్ర బ్రిటన్‌ది. ఈ ‘ఐరోపా దేశాలు’ ఇతర ఖండాలను పంచుకొని కొల్లగొట్టడం చరిత్ర. ఈ పంపిణీలో పైచేయి సాధించిన ‘బ్రిటన్’ ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించగలిగింది. ‘ఐరోపా హితం ప్రపంచ హితంగా’ ‘‘ఐరోపా వారి స్నానం చేయని నాగరికత ప్రపంచ సంస్కృతి’గా విపరిణామం చెందడం ఈ సామ్రాజ్య విస్తరణ కథ.. ఐరోపా దేశాల మధ్య సాగిన పోరాటాలు, ఆధిపత్య సంఘర్షణలు ‘రెండు ప్రపంచ యుద్ధాలు’గా పేరుమోయడం చరిత్ర! ఇలా ప్రపంచాన్ని దోపిడీ చేసి శతాబ్దులపాటు తెగ బలిసిన ‘బ్రిటన్’కు ఇప్పుడు ‘దోపిడీకి గురికాగలనన్న’ భయం పట్టుకుంది. ‘‘విధాత అక్కటా! ఎవ్వరినెట్లు సేయడు..?’ అన్నది మహాకవి మాట.. ఈ భయం ‘బ్రిటన్ ఐరోపా’ హంతక సంతతి అయిన అమెరికాను సైతం పట్టుకొనడం నడుస్తున్న చరిత్ర. అందువల్ల ఐరోపాలోని ఇతర దేశాల ప్రజలు తమ దేశానికి వచ్చి స్థిరపడిపోతారని, తమ వాణిజ్యం, పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోతుందని బ్రిటన్ సమాజం భయపడుతోంది! అందువల్లనే సమాఖ్య నుంచి ఈ ‘నిష్క్రమణ’.. కానీ ద్వైపాక్షిక అంగీకారం కుదరకపోతే ఐరోపాలోని ఇతర దేశాలవారు బ్రిటన్‌లోకి రావడానికి ‘వీసా’లు తీసుకోవలసి వస్తుంది. బ్రిటన్ పౌరులు కూడ ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లాలంటే మళ్లీ ఆంక్షలు తప్పవు! విస్తరించిన ‘శక్తి’ కుంచించుకొనిపోతోంది..