సంపాదకీయం

‘బంగ్లా’లో భయం..్భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాస భారతీయులపై, భారతీయ సంతతి ప్రజలపై వివిధ దేశాలలో భయంకరమైన దాడులు జరుగుతుండడం నడుస్తున్న వైపరీత్యం. ఇస్లాం ఏకమత రాజ్య వ్యవస్థలున్న దేశాలలో అన్యమతాల నిర్మూలనలో భాగంగా భారతీయులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు, హత్య చేస్తున్నారు. ఈ హత్యాకాండకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువులు మరింతగా బలైపోతుండడం ప్రచారం కాని కఠోర వాస్తవం...బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం సమీపంలోని గోపాల్‌పూర్‌లో ఒక హిందువును ఇటీవల హత్య చేయడం పెరుగుతున్న జిహాదీ కలాపాలకు నిదర్శనం. ఈ హత్య చేసింది తామేనని ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న ఒక జిహాదీ ముఠా వారు ప్రకటించారు. గోపాల్‌పూర్‌లో దర్జీ పని చేసుకుంటుండిన నిఖిల్ చంద్ర జోవర్దార్‌ను ఆయన కార్యస్థలంలోనే ముగ్గురు జిహాదీ ముష్కరులు నరికి చంపేశారు. గోపాల్‌పూర్ పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడం, అభియోగాన్ని నమోదు చేయకపోవడం విస్మయకరం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లోని ఫ్రభుత్వ యంత్రాంగంలోని అత్యధికులు జిహాద్‌ను సమర్ధించడం దశాబ్దులుగా జగమెరిగిన వాస్తవం. రాజకీయ పక్షాలలోని అధికారులు కూడ హిందూ వ్యతిరేకతను బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. హిందువులపై మాత్రమే కాదు, షియా తెగకు చెందిన ముస్లింలపై, మానవ అధికారాల పరిరక్షణ ఉద్యమకారులపై జిహాదీలు దాడులు చేయడం పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను నిత్యకృత్యమైపోయింది. నిఖిల్ చంద్రను హత్య చేసిన వారిని అరెస్టు చేయని పోలీసులు, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందువల్లనే ఆ యనను ఐఎస్‌ఐఎస్ వారు హ త్య చేసారని నిర్ధారణ మాత్రం చేసారు. నిఖిల్ చంద్రను హత్య చేయడానికి కొన్ని నెలల ముం దుగానే కుట్ర జరిగింది.ఈ కుట్రలో పోలీసులు కూడ పాత్ర వహించడం కూడ ఆశ్చర్యం కాదు. ఏక మత రాజ్యాంగ వ్యవస్థను సమర్ధించే సమాజ సమష్టి స్వభావం అల్పసంఖ్యాకులను క్రమంగా తుదముట్టించడం అంతర్జాతీయ వైపరీత్యం. ఈ కుట్రలో భాగంగానే నిఖిల్ చంద్ర ఇస్లాంను దూషించినట్టు కొన్ని నెలల క్రితం అభియోగం నమోదైంది. ఈ ఫిర్యాదు ప్రాతిపదికగా పోలీసులు ఆయనను అనేక వారాలపాటు నిర్బంధంలో ఉంచారు! ఫిర్యాదు న్యాయ స్థానంలో ఋజువైతే ఆయనకు కనీసం ఆరు నెలల జైలుశిక్ష పడడం ఖాయం. ఈ శిక్షను గరిష్ఠంగా ఆరేళ్లపాటు విధించవచ్చు. ఇటీవల ఇద్దరు ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షను విధించారు కూడ! అయితే నిఖిల్ చంద్రకు వ్యతిరేకంగా అభియోగాన్ని దాఖలుచేసిన వారు హఠాత్తుగా తమ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. దాంతో ఆయనకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఆయనకు మరింత ఘోరమైన శిక్షను విధించాలన్న కుట్రలో భాగంగానే ఫిర్యాదు రద్దయినట్టు ఆయన హత్యవల్ల స్పష్టమైపోయింది!
బగర్‌హాట్ అనేచోట ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను ఇస్లాంను దూషించాడన్న ఆరోపణపై స్థానిక ప్రజలు పాఠశాలలోనే అనేక గంటలపాటు నిర్బంధించారట. ఆయనపైన ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణపాద వౌళి అనే మరో హిందువుమీద స్థానికులు దౌర్జన్యకాండకు కూడ ఒడిగట్టారట! ఈ నిర్బంధం గురించి సమాచారం అందిన తరువాత సంబంధిత సబ్ డివిజినల్ మాజిస్ట్రేట్ హుటాహుటిన అక్కడికి వెళ్లి విచారణ జరిపించాడట. ఈ సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్ న్యాయాధికారి కాదు, పరిపాలనాధికారి. అయినప్పటికీ ఈ అధికారి తానే సంచార న్యాయస్థానంగా వ్యవహరించి విచారణ జరిపేశాడు, ఉపాధ్యాయులిద్దరికీ ఆరు నెలల జైలు శిక్షను విధించాడు! ఆ ఉపాధ్యాయులిద్దరు గత ఏప్రిల్ ఆరవ తేదీనుండి కారాగార వాసాన్ని అనుభవిస్తున్నారు! ఇలా ఇస్లాంను దూషించినట్టు అల్పసంఖ్యాక హిందువులపై అభియోగాలు బనాయించి శిక్షిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం వారు అక్కడక్కడ శిథిలావస్థలో ఉన్న హిందూ దేవాలయాలను మాత్రం రక్షణ కల్పించడం లేదు. ఈ హైందవ మందిరాల మనుగడ జిహాదీల దృష్టి వాటిమీద పడనంత వరకే. గత రెండేళ్లలో ఎనిమిది ఆలయాలను జిహాదీలు నేలమట్టం చేసిన సంగతి కూడ చాలా ఆలస్యంగా బయటికి పొక్కింది. సామాజిక మాధ్యమాల-సోషియల్ మీడియా ద్వారా మత సామరస్యాన్ని బోధిస్తున్న హిందువులను, ముస్లింలను, సూఫీ-్భక్తి-ఉద్యమకారులను కూడ జిహాదీలు గత రెండేళ్లుగా హతమర్చుతున్నారు. బగర్‌హాట్‌లో ఈ ఇద్దరు ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షించిన రోజుననే ఇద్దరు సామాజిక మాధ్యమాల కార్యాకర్తల-బ్లాగర్స్-ను జిహాదీలు పొడిచి చంపేశారు! గత ఏడాదినుంచి ఎనిమిది మంది బ్లాగర్స్‌ను జిహాదీలు చంపేశారు. వీరిలో ఆరుగురు హిందువులు...గత అక్టోబర్‌లో షియాల మతయాత్రపై ఢాకాలో జరిగిన దాడిలో ఒకరు మరణించారు. వందమంది గాయపడ్డారు. ఈ దాడులను తామే నిర్వహించినట్టు ఐఎస్‌ఐఎస్ జిహాదీలు ప్రకటించారు. ఈ నెల ఏడవ తేదీన ఒక సూఫీ మత గురువును అపహరించిన జిహాదీలు ఆయనను గొంతు పిసికి చంపేశారు.
ఇలా, హిందువులను మాత్రమే కాక ఉదారవాదులైన షియా, సూఫీ ముస్లింలను సైతం నిరంతరం హత్య చేయడం ద్వారా మతసహనం మొలకెత్తకుండా నిరోధించడం జిహాదీల వ్యూహం. జమాల్‌ఏ ఇస్లామీ వంటి కరుడుగట్టిన మతోన్మాద సంస్థలు దశాబ్దులుగా హిందువులపై దాడులు చేస్తున్నాయి! ఈ దాడుల ఫలితంగా బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో హిందువులు దాదాపు అంతరించిపోయారు. పల్లెలలో ఎవరు హిందువో ఎవరు ఇస్లాం మతస్తులో తెలిసిపోతుంది. అందువల్ల జిహాదీలకు హిందువులను హత్య చేయడం తేలిక. ఈ ప్రమాదాన్ని నిరోధించడానికై అల్పసంఖ్యాకులైన హిందువులు ఇళ్లను ఆస్తులను పొలాలను ఆలయాలను వదిలిపెట్టి పట్టణాలకు వలసపోయారు. దశాబ్దులుగా ఈ వలసలు కొనసాగాయి. మరికొందరు హిందువులు ఇస్లాం మతంలోకి మారిపోయి పల్లెలలోనే జీవిస్తున్నారు. పాకిస్తాన్ 1947 ఆగస్టు 15 నాటికి మొత్తం జనాభాలో ఇరవై నాలుగు శాతం హిందువులు. ఈ హిందువులను మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని ముస్లింలీగ్ వారు ఆరు నెలలలో నిర్మూలించారు, చంపారు, మతం మార్చారు, భారత్‌కు తరిమేశారు. ఫలితంగా 1948 నాటికే పాకిస్తాన్‌లో హిందువుల జనాభా రెండు శాతానికి పడిపోయింది. బంగ్లాదేశ్-తూర్పుపాకిస్తాన్‌లో దేశ విభజన 1947లో జరిగిన నాటికి దాదాపు మూడవ వంతు హిందువులు! ఈ హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుల సంఖ్య ఎనిమిది శాతం కంటె తక్కువకు దిగజారింది...
దేశ విభజన తరువాత, అంతకు పూర్వం యుగాలుగా కొనసాగిన సర్వమత సమభావ వ్యవస్థ మనదేశంలో యథాతథంగా అమలు జరుగుతోంది. ఫలితంగా మనదేశంలో అన్ని మతాలవారు హాయిగా జీవిస్తున్నారు. కానీ ఈ యుగాలనాటి సర్వమత సమభావ వ్యవస్థ పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను అంతరించిపోయింది. బంగ్లాదేశ్‌లోని అల్పసంఖ్యాక హిందువుల దుస్థితికి, పాకిస్తాన్‌లోని అత్యల్పసంఖ్యాక హిందువుల దుస్థితికి ఇదీ కారణం! మన దేశంలో వలెనే ఈ పొరుగు దేశాలలో సర్వమత సమభావ రాజ్యాంగం ఏర్పడకపోవడానికి కారణం ఏమిటి? అధ్యయనం జరగాలి, పరిశోధన జరగాలి, చర్చ జరగాలి...