సంపాదకీయం

విద్రోహ విస్తరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహింగియా తెగకు చెందిన బర్మీయ పౌరులు మన దేశంలో అక్రమంగా తిష్ఠవేసి ఉండడం గురించి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ధ్యాస సన్నగిల్లిపోతోంది. ఏయే ప్రాంతాలలో ఎనె్నన్ని వేలమంది ‘రోహింగియాలు’ తిష్ఠవేసి ఉన్నారన్న విషయమై గణాంకాలు కూడ సరిగాలేవు. డెబ్బయివేలకు పైగా ‘రోహింగియా’ చొఱబాటుదారులు దేశంలోని వివిధ ప్రాంతాలలో ‘‘శరణార్థులు’’గాను, ఏ ‘హోదా’లేని వారుగాను ఏళ్లతరబడి నివసిస్తూనే ఉన్నారు. జంటనగరాల శివారులలోని రెండు శిబిరాలలో ఐదువేల మంది రోహింగియాలు నివసిస్తున్నారట. బాలాపూర్, షహీన్‌నగర్ పరిసరాలలోని ఈ రెండు శిబిరాలను ఐక్యరాజ్యసమితి శరణార్ధి వ్యవహార సంచాలక్- యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్- కార్యాలయం వారు శరణార్ధి కేంద్రాలుగా గుర్తించి ఉన్నారట. ఈ శిబిరాలలో ఉన్నవారు శిబిరాలకు పరిమితం కాక భాగ్యనగరంలోని ఇతర ప్రాంతాలకు అక్రమంగా విస్తరిస్తూ ఉండడం భద్రతకు విఘాతకరంగా మారిన విపరిణామం. ఈ ‘అక్రమ విస్తరణ’ గురించి పరిశోధించి వివరాలను అందజేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం వారు తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాశారట! ‘రోహింగియా’ అక్రమ ప్రవేశకులను ‘నిర్దేశిత’ శిబిరాలకు పరిమితం చేయాలని ఇతర ప్రాంతాలకు వారు విస్తరించకుండా నిరోధించాలని గత ఏడాది జూన్ మూడవ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఏళ్లతరబడి మన దేశంలోకి చొఱబడి అక్రమంగా తిష్ఠవేసి ఉన్న వేల మంది రోహింగియాలు భారతీయ పౌరులుగా చెలామణి కావడానికి చేస్తున్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ ‘నిర్దేశానికి’ నేపథ్యం. అక్రమ పద్ధతుల ద్వారా బ్యాంకులలో ఖాతాలు తెరవడం, ‘పాన్’కార్డులను పొందడం, వోటర్ల జాబితాలోకెక్కి గుర్తింపు కార్డులను పొందడం, వీటి ప్రాతిపదికగా ‘రేషన్’కార్డులను ఇతర సదుపాయాలను పొందడం వంటి అక్రమ చర్యలకు వివిధ రాష్ట్రాలలోని రోహింగియాలు పాల్పడుతున్నారన్నది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది గుర్తించిన వైపరీత్యం. రోహింగియాలలోని అనేక మంది అసాంఘిక, బీభత్సకలాపాలకు పాల్పడినట్టు కూడ ధ్రువపడింది. ‘‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యవ్యవస్థ’’- ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా- ఐసిస్- జిహాదీ ముఠావారికీ, రోహింగియాలలోని జిహాదీలకు అనుసంధానం ఏర్పడి ఉండడం కూడ ధ్రువపడిన వాస్తవం. ఈ అనుసంధాన వ్యవస్థకు సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’’- ఐఎస్‌ఐ! అందువల్లనే రోహింగియాలను శిబిరాలకు మాత్రమే పరిమితం చేయాలని, శిబిరాల ప్రాంగణాల వెలుపల వారు నివసించడానికి అనుమతినీయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. రోహింగియాల శరీర భంగిమల వివరాల- బయోమెట్రిక్ డేటా-ను సేకరించి నమోదు చేయాలని, ఎవ్వరికి కూడ ‘ఆధార్’ గుర్తింపు పత్రాలను జారీచేయరాదని కూడ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది..
కానీ తెలంగాణలోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోను ‘రోహింగియా’ల అక్రమ విస్తరణ కొనసాగుతూనే ఉందన్నది ఇప్పుడు బయటపడిన వాస్తవం! ప్రధానమంత్రి కార్యాలయం వారు ఈ విషయమై హెచ్చరించడంతో ఈ అక్రమ ‘విస్తరణ’గురించి తెలంగాణ ప్రభుత్వానికి ‘్ధ్యస’ పెరగవలసిన అనివార్యం ఏర్పడింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం కాని, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కాని ఈ ‘‘అక్రమ విస్తరణ’’ను తమంత తాముగా పసికట్టాలి, కేంద్ర ప్రభుత్వంవారి సహకారంతో ‘విస్తరణ’ను అరికట్టాలి- అది జరుగకపోవడం ‘రోహింగియాల’ వల్ల ఏర్పడి ఉన్న అంతర్గత ప్రమాదం పట్ల ధ్యాసలేనితనానికి నిదర్శనం. తెలంగాణ రాజధాని శివారు ప్రాంతమైన బాలాపూర్‌లోని ‘గుఱ్ఱం చెఱువు’ను అక్రమంగా ఆక్రమించుకొని పూడ్చివేసి ఇళ్లు కట్టుకోవడానికి కొందరు స్థానిక రాజకీయ వేత్తలు, ఇతర ‘ఘరానా’లు యత్నిస్తున్నారట. ఇలాంటి దురాక్రమిత స్థలంలో కట్టిన రేకుల ఇళ్లలోను, పక్కా ఇళ్లలోను పదునాలుగు కుటుంబాల ‘రోహింగియాలు’ నివసిస్తున్నారన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రానికి తెలిపిన ‘మహా విషయం.’ చెఱువులోని కొంత స్థలాన్ని ఆక్రమించుకొని పూడ్చిన ‘‘నాయకులు’’ ఈ స్థలం చుట్టూ ప్రహరీగోడకట్టి రోహింగ్యాలకు అద్దెకిచ్చారట. అద్దె స్థలంలో రోహింగియాలు ‘నివాసాలు’ నిర్మించుకున్నారట. ఇదంతా ‘రోహింగియాల’ అక్రమ విస్తరణకు సంబంధించిన పరిశోధనలో బయటపడలేదు. గుఱ్ఱం చెఱువును ఇదివరకే ముప్పయి శాతం పూడ్చేశారట. మిగిలిన ‘చెఱువు’ను రక్షించే కార్యక్రమంలో భాగంగా ‘నీటి పరిరక్షణ సమాజం’ - సేవ్ వాటర్ సొసైటీ- అన్న స్వచ్ఛంద సంస్థవారు ఈ పూడ్చివేత గురించి ఫిర్యాదులు చేశారట. తీగ లాగితే డొంక కదిలింది. ‘రోహింగియా’లు చెఱువును పూడ్చిన స్థలంలో రోహింగియాలు తిష్ఠవేసి ఉన్న సంగతి బయటపడింది.
జంట నగరాల ప్రాంగణం ‘రోహింగియా’లకు మాత్రమేకాక వివిధ దేశాల అక్రమ ప్రవేశకులకు ‘అడ్డాగా’మారి ఉండడం ప్రచారం కాని కఠోర వాస్తవం. ఈ అక్రమ ప్రవేశకులలో ‘మాదక ద్రవ్యాల’ దొంగ వ్యాపారులు, జిహాదీ బీభత్సకారులు ఉండడం బహిరంగ రహస్యం. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌నుంచి నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల నుంచి ‘యాత్రికుల’ పేరుతో ‘వ్యాపారుల’ పేరుతో వస్తున్నవారు ‘ప్రవేశ అనుమతి పత్రం’ గడువు ముగిసిన తరువాత తిరిగి తమ దేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ఉండిపోతున్నారు. జనంలోకి కలిసిపోయి వివిధ అక్రమ కలాపాలను సాగిస్తున్నారు. ఇలాంటి వారిని పసికట్టి ప్రభుత్వాలు వారిని దేశం నుండి తరలిస్తున్నారు. బయట పడుతున్న వారికంటె బయట పడనివారు చాలా ఎక్కువ. జనంలోకి కలసిపోయినవారు మన దేశపు పౌరులుగా చెలామణి కావడానికి పలుకుబడి కలిగిన దేశద్రోహులు సహకరించడం నడుస్తున్న చరిత్ర. దేశమంతటా రోహింగియాలు విస్తరించిపోతుండడానికి ఇదీ కారణం. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొఱపడిన దాదాపు రెండు కోట్ల అక్రమ ప్రవేశకులు బర్మా-మ్యాన్‌మార్-లోని ‘రోహింగియా’లకు ‘‘స్ఫూర్తి’’ ప్రదాతలు. క్రీస్తుశకం 1937లో బ్రిటన్ దురాక్రమణదారులు బర్మాను మన దేశం నుంచి విడగొట్టారు. 1948లో బర్మా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ బర్మాలోని ఇస్లాం మతస్థుల కోసం ప్రత్యేక స్వతంత్ర దేశం ఏర్పాటు కావాలని ‘జిహాదీ’లు కోరుతున్నారు. ఈ కోరికను నెరవేర్చుకొనడంలో భాగంగా జిహాదీలు బర్మాలోని బౌద్ధులను, ఇతర హిందువులను దశాబ్దుల తరబడి హత్యచేశారు. బర్మా జనాభాలో బౌద్ధమతం వారు సంఖ్యాధికులు- మెజారిటీ-! కానీ మన దేశానికి ఆనుకొని ఉన్న ‘అరకాన్’ ప్రాంతంలోని జనాభాలో మాత్రం ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ‘అరకాన్’- రఖైన్- ప్రాంతాన్ని బర్మానుంచి విడగొట్టి ‘స్వతంత్ర దేశం’గా ఏర్పాటుచేయాలన్న ‘జిహాదీ’ల కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఈ విద్రోహ వాంఛను బర్మాలోని సామాన్య ముస్లింలు బలపరచడం లేదు. అయినప్పటికీ ‘అరకాన్’ప్రాంతంలో ‘జిహాదీ’లు సాగించిన బీభత్సకాండకు దశాబ్దులుగా వందలాది ఇస్లామేతర మతాలవారు బలైపోయారు.
ఫలితంగా అరకాన్ ప్రాంతంలోను ఇతర ప్రాంతాలలోను ఇస్లాం మతస్థులకు, బౌద్ధులకూ మధ్య విద్వేషం రగిలింది. మతఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణల ప్రాతిపదికగా ‘‘లేని భయాన్ని నటిస్తున్న’’ ‘రోహింగియా’ ఇస్లాం మతస్థులు తమకు బర్మాలో ప్రాణభయం ఏర్పడిందని ప్రచారం చేస్తున్నారు. ఈ ‘సాకు’తో వేలాది ‘రోహింగియా’లు మన దేశంలోకి చొఱబడిపోయారు. ఈ ‘రోహింగియాలు’ శరణార్థులు కారని మన ప్రభుత్వం స్పష్టంచేసి ఉంది. వీరివల్ల మన అంతర్గత భద్రతకు బీభత్సకారుల ప్రమాదం మరింత పెరిగిందని మన ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘రోహింగియా’లు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని బర్మా ప్రభుత్వం కోరుతోంది కూడ...