సంపాదకీయం

మంటల పాలైన పటిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షణ విభాగానికి చెందిన స్థావరాలకే అగ్ని బీభత్సం నుండి రక్షణ లేకపోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మాయని మచ్చ. మహారాష్ట్ర వార్థా జిల్లా ఫూల్‌గావ్ పట్టణంలో నెలకొని ఉన్న సైనిక దళాల కేంద్ర ఆయుధ స్థావరం-సెంట్రల్ ఆమ్యునేషన్ డిపోలో మంగళవారం సంభవించిన భయంకర వహ్ని విలయం ఈ రక్షణలేని తనానికి మరో ఉదాహరణ. ఆధునిక పరిజ్ఞానం విస్తరిస్తుండడంతోపాటు అధికార నిర్లక్ష్యం వ్యవస్థీకృతం అవుతుండడం ఇలా దావానల కీలలు దాడి చేస్తుండడానికి ప్రధాన కారణం. ఇద్దరు అధికారులు సహా పదహారుమంది సైనికులు, సిబ్బంది ప్రమాద కీలలకు ఆహుతి అయిపోవడం ప్రమాదం విరుచుకుపడిన తరువాత వదలని అలసత్వానికి చిహ్నం. గాయపడిన మరో ముగ్గురు కూడ ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉద్యోగి ఏమయిపోయాడో అంతుపట్టడం లేదట. ఏడువేల ఎకరాల సువిశాల ప్రాంగణంలో వేలాది టన్నుల ఆయుధాలు, పేలుడు సామగ్రి శతఘు్నలు క్షిపణులు నిలువ ఉన్న గిడ్డంగులు అగ్నికి ఆహుతి కాకుండా నిరోధించదగిన వ్యవస్థ ఎందుకని ఏర్పడలేదన్నది సమాధానం లేని ప్రశ్న. ఒక గిడ్డంగి మాత్రమే పూర్తిగా ధ్వంసమైపోవడం మరో మూడు గిడ్డంగులు పాక్షికంగా మాత్రమే తగలబడిపోవడం దైవఘటన. ఎందుకంటె మంటలు విస్తరించకుండా నిరోధించడానికి జరిగిన మానవయత్నం దాదాపు శూన్యం. పదమూడు వందల క్వింటాళ్ల మందుగుండు సామగ్రిని ఆయుధాలను అమాంతం ఆరగించిన బీభత్స అనల జ్వాలలు తమంతామే శాంతించడం జరిగిన గొప్ప మేలు. అనలానికి అనిలం తోడయి ఉండినట్టయితే ప్రాంగ ణం మొత్తం బూడిద వాటికగా మారి ఉండేది. అదే జరిగి ఉండివుంటే కొనే్నళ్ల పాటు మనదేశానికి సరిహద్దులను సంరక్షించే శక్తి ఉండేది కాదట. దురాక్రమదారుల ముందు మోకరిల్లవలసిన దుస్థితి ఏర్పడి ఉండేదట. ఎందుకంటే సైనిక దళాలకున్న కేంద్రీయ ఆయుధాగారం ఇదొక్కటేనట. ఆసియాలోకెల్లా ఇది పరిమాణంలో రెండవ స్థానంలో ఉందన్న అతిశయానికి అర్థం లేదు. ఈ కేంద్రీకృత విధానాలు బ్రిటిష్ పాలకులు ప్రసాదించి వెళ్లిన వారసత్వ చిహ్నాలు. ప్రగతి కేంద్రీకృతం అవుతోంది, జనాభా కేంద్రీకృతం అవుతోంది, కాలుష్యం కేంద్రీకృతం అవుతోంది, నిర్లక్ష్యం కేంద్రీకృతమవుతోంది, అవినీతి కేంద్రీకృతమవుతోంది. ఈ కేంద్రీకృత విధానాల ఫలితమే ఒకేచోట ఇంత పెద్ద స్థలంలో ఇంతపెద్ద ఆయుధాగారాన్ని నెలకొల్పడం. అనేక పట్టణాల కంటె పెద్దదైన ఈ ఆయుధ ప్రాంగణం చిన్న చిన్న రైఫిళ్ల నుంచి ‘బ్రహ్మోస్’ వంటి అత్యాధునిక క్షిపణులను సైతం నిలువ చేస్తున్నారట. విజ్ఞత విచక్షణ లోపించిన రక్షణ విధానమిది. ప్రమాదం జరిగితే అన్నీ ఒకేసారి ధ్వంసం కాగల విపత్తు పొంచి ఉందన్నది సామాన్య పరిజ్ఞానం. నిపుణులకు, నిర్వాహకులకు దశాబ్దులుగా ఈ జ్ఞానోదయం ఎందుకు కలుగలేదో మరి?
ఈ కేంద్రీయ ఆయుధ, విస్ఫోటన ద్రవ్య స్థావరాన్ని వికేంద్రీకృతం చేసి విభాగాలుగా ఏర్పరచి దేశంలోని అనేక చోట్ల నెలకొల్పి ఉండవచ్చు. అలా జరిగి ఉంటే అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుపానుల వంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. దేశంలో ముప్పయితొమ్మిది ప్రాంతీయ ఆయుధ స్థావరాలు, శతఘు్నల కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, విస్ఫోటన పదార్థాల వాటికలు ఉన్నాయట. అందువల్ల ఈ కేంద్రీకృత ఆయుధాల గిడ్డంగుల సముదాయాన్ని ‘్ఫల్‌గావ్’లో మాత్రమే కాక మరిన్ని చోట్ల ఏర్పాటు చేసి వికేంద్రీకృతం చేసే ప్రక్రియను రక్షణ మంత్రిత్వశాఖ వారు ఇప్పుడైనా మొదలుపెట్టాలి. కేంద్రీకృత ప్రాంగణాలను ధ్వంసం చేయడం సులభం. సైనిక దళాల వ్యవస్థలకు మాత్రమే కాదు పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలకు అగ్ని ప్రమాదాలు నిరంతరం ఆందోళన కలిగిస్తుండడానికి ప్రధాన కారణం కేంద్రీకరణ. నిలువున ఆకాశం అంటే విధంగా భవనాలను నిర్మించడం, కేంద్రీకరణకు మరో ఉదాహరణ. ఫూల్‌గావ్ మంటల పేలుళ్ల విషాద మృతుల చిటపటలు ఇంకా రగులుతున్న సమయంలోనే దక్షిణ ముంబయి కొలాబా ప్రాంతంలోని ఒక బృహత్ భవనంలో గురువారం మరో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలుగు రాష్ట్రాలలోని నగరాలు, పారిశ్రామిక వాటికలు, కర్మాగారాలు సహా దేశమంతటా ఎక్కడో అక్కడ దారుణమైన విషాగ్ని విస్ఫోటనాలు చెలరేగుతూనే ఉండడం నిరంతర ప్రక్రియ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్‌లు గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు, సిగరెట్లు పీల్చి ఆర్పకుండా పారేయడాలు, చెట్లు విరిగి పడడాలు, విద్యుత్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా తీగలను జనావాసాల మధ్య పడేసి వెళ్లడాలు..ఇలా అగ్ని ప్రమాదాలకు అనేక కారణాలు. కానీ వికేంద్రీకృత గ్రామాలలో కంటె కేంద్రీకృతమైన కట్టడాలు వ్యవస్థలు కల నగరాలలోనే ఈ ప్రమాదాల తీవ్రత హెచ్చుగా ఉంది.
మన రక్షణ వ్యవస్థపై నిర్లక్ష్య జ్వాలలు దాడి చేయడం మొదటిసారి కాదు. విమానాలకు నిప్పంటుకోవడం, గస్తీ నౌకలు తగలబడి పోవడం, నౌకాదళ స్థావరాలలో మంటలు చెలరేగడం, పునరావృత్తవౌతున్న భయంకర ఘటనలు. గత డిసెంబర్‌లో విశాఖ పట్టణంలోని నౌకాదళం ఆయుధ స్థావరంలో పేలుళ్లు సంభవించి మంటలు చెలరేగాయి. నలుగురు గాయపడ్డారు. గత పదిహేనేళ్లలో రక్షణ విభాగానికి చెందిన దాదాపు ఎనిమిది ఆయుధ గిడ్డంగులలో మంటలు చెలరేగాయి. 2007 ఆగస్టులో కశ్మీర్‌లోని ఒక సైనిక ఆయుధాగారం అంటుకొని పధ్నాలుగు వందల కోట్ల విలువైన రక్షణ సంపత్తి ఆహుతైంది. పంతొమ్మిది మంది సైనికులు సజీవ దహనం కావడానికి, మరో నలబయి మంది క్షతగాత్రులు కావడానికి, దోహదపడిన ఆ విషాగ్ని కీలలు ప్రమాద వశాత్తు చెలరేగి ఉండవచ్చు, లేదా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదులు రహస్యంగా కుట్ర పన్ని ఉండవచ్చు. నిర్థారణ కాలేదు. ఇప్పుడు ఫూల్‌గావ్‌లో జరిగిన ప్రమాదం తీవ్రత గతంలో జరిగిన దానికంటే మిక్కిలి ఉద్ధృతంగా ఉంది. పైకప్పులు పగిలిపోయి అనేక మీటర్ల ఎత్తునకు ఎగిరిపోయి దూరంగా కుప్పలు కుప్పలుగా పడ్డాయట. ప్రాంగణానికి సమీప గ్రామాల ప్రజలు ‘‘మిన్ను విరిగి మీద పడుతున్న’’ వానలేని పిడుగులజడి విరుచుకు పడుతున్న భయోత్పాతానికి గురైపోయారట. సమీప గ్రామాలకు అగ్ని శకల సమూహాలు విస్తరించక పోవడం కూడ భగవంతుని కృప మాత్రమే. ఇలా వరుసగా దాదాపు రెండేళ్లకోసారి సగటున ఆయుధాల గిడ్డంగులు అంటుకున్న నేపథ్యంలో ఫూల్‌గావ్ ప్రాంగణాన్ని అగ్ని నిరోధక కవచంతో కప్పడానికి ‘రక్షణ’ ప్రయత్నించి ఉండాలి. ఫూల్‌గావ్ అతి ప్రధానమైనది కాబట్టి..‘రక్షణ’ వ్యవస్థలో ఆ‘్ధ్యస’ ఉదయించలేదని ఇప్పుడు స్పష్టమైంది..
ప్రపంచంలోని అత్యంత పటిష్ఠమైన బృహత్ రక్షణ వ్యవస్థలలో మనది ఒకటి...మనకు దురాక్రమణ కాంక్షలు గతంలో లేవు, భవిష్యత్తులో ఉండవు. కానీ మన రక్షణ వ్యవస్థను భంగపరిచే దురాక్రమణ పటిమ కూడా ఏ ఇతర దేశానికి లేదు. కానీ ఇలాంటి అంతర్గత ప్రమాదాలను నిరోధించలేకపోవడం అంతర్జాతీయ అపహాస్యానికి గురి అవుతున్న పరిణామం. పూరిపాకలు తగలబడడం తగ్గింది. కానీ అక్కడ ప్రతాపం చూపలేని ప్రమాదాగ్ని ఆధునిక ప్రాంతాలైన నగరాలపై దాడి చేసింది. ఇదేం ప్రగతి? ప్రభుత్వాలు ఆలోచించాలి...్ఫల్‌గావ్ ప్రమాదానికి దేశద్రోహుల దుశ్చర్య కారణమా? అన్న కోణలో కూడా పరిశోధన జరగాలి...