సంపాదకీయం

‘నకిలీ’ల నాటకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధ్యయనం, పరిశోధన కేవలం ముసుగులు... ఈ ‘ముసుగు’లను తొడిగిన వివిధ అంతర్జాతీయ ‘బౌద్ధిక’ బీభత్స సంస్థలు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి తరచు వివిధ నిర్ధారణలు చేస్తున్నాయి. ‘మానవ అధికార పరిరక్షణ’- ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్- పేరుతో ఈ తథాకథిత- సోకాల్డ్- స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న నిర్ధారణలు దీర్ఘకాల పథకంలో భాగం. ఈ దీర్ఘకాల పథకం లక్ష్యం మన దేశాన్ని మళ్లీ ఎదగకుండా నిరోధించడం! ఇలా ఎదగకుండా నిరోధించే దస్తంత్రం బ్రిటన్ దురాక్రమణకారులు మన దేశంనుంచి నిష్క్రమించిన నాటినుంచి కొనసాగుతోంది. క్రీస్తుశకం 1947లోను అంతకుముందు మన దేశాన్ని ముక్కలు చెక్కలు చేసిన బ్రిటన్ వారి ‘‘వ్యూహం’’ మన దేశం మళ్లీ అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకోకుండా నిరోధించడంలో భాగం... ఇప్పటివరకూ ఈ కుట్ర కొనసాగుతోంది! మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు అనుకూలంగా నిర్ధారణలు చేయడం, ప్రకటనలను గుప్పించడం ఈ కుట్రలో భాగం. మతోన్మాద జిహాదీ భూమికపై ఏర్పడి ఉన్న పాకిస్తాన్ ఎప్పటికీ ప్రగతిని సాధించ లేదు, ఆర్థిక పరిపుష్టిని పొందలేదు, మానవీయ సంస్కారాల నిలయం కాలేదు! అందువల్ల పాకిస్తాన్‌ను నిరంతరం మన దేశానికి పక్కలో బల్లెంగా రూపొందించడం పాశ్చాత్య దేశాల పన్నాగం, గత కొన్ని దశాబ్దులుగా చైనా పన్నాగం! పాకిస్తాన్‌ను ఇలా నిరంతర ‘నిరోధకం’గా ఉపయోగించడం ద్వారా మన దేశాన్ని బలహీనపరచడం ఈ విదేశాల దీర్ఘకాల పథకం! అందువల్లనే 2001లో అమెరికాపై ‘అఫ్ఘానీ’ అల్‌ఖాయిదా మూకలు దాడి చేసే వరకు పాశ్చాత్య దేశాలకు ‘జిహాదీ బీభత్సం’ సమస్య కాలేదు, పాకిస్తాన్ ప్రభుత్వం నిరంతరం మన దేశంలోకి జిహాదీ హంతకులను ఉసిగొల్పడం 1947నుంచి నడుస్తున్న చరిత్ర! 2001వరకు ఈ బీభత్సకాండ గురించి అమెరికా, ఐరోపా దేశాలు పట్టించుకోలేదు, పాకిస్తాన్‌ను నిరసించలేదు. ఇప్పుడు కూడ ‘‘పాకిస్తాన్‌తో కూడ కలసి’’ అఫ్ఘానిస్థాన్‌లో బీభత్సకాండను నిరోధించడానికి, నిర్మూలించడానికి మాత్రమే అమెరికా ప్రాధాన్యం ఇస్తోంది, ఐరోపా దేశాలు అత్యధికం ఈ విషయంలో అమెరికాకు తాన తందాన...
మన దేశంలో ‘‘లేని సమస్యలను’’ ఉన్నట్టుగా చిత్రీకరించడం దశాబ్దుల వైపరీత్యం! పాకిస్తాన్‌లో ‘ఉన్న సమస్య’ను పట్టించుకొనక పోవడం ఈ దుస్తంత్రంలో భాగం! పాకిస్తాన్‌లో ఇస్లాం మతంవారు అధిక సంఖ్యాకులు! ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ఏ దేశంకూడ ‘సర్వమత సమభావ వ్యవస్థ’ లేదు, ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది. ‘ఇండోనేసియా’వంటి ఇస్లాం బాహుళ్య దేశాలలో కొన్ని దశాబ్దుల క్రితంవరకూ ఇస్లామేతర మతాల వారికి రక్షణ ఉండేది. కానీ అంతర్జాతీయ జిహాదీలకు సైద్ధాంతిక భూమిక అయిన సౌదీ అరేబియా ఒత్తిడి కారణంగా ఇండోనేసియాలో కూడ ఇస్లాం మతేతరులను వేధించే కార్యక్రమం మొదలైంది. పాకిస్తాన్‌లో ఇస్లాం మతేతరులను హింసించి, హత్యచేసి, లైంగిక బీభత్సానికి గురిచేసి నిర్మూలించే కార్యక్రమం డెబ్బయి ఏళ్లకు పైగా నడుస్తోంది. అందువల్లనే ఇస్లామేతర మతాలవారు మన దేశంలోకి దశాబ్దుల తరబడి శరణార్థులై వస్తున్నారు. ఇలా వస్తున్నవారికి మానవీయ దృక్పథంతో మన దేశపు పౌరసత్వాన్ని మన ప్రభుత్వం కల్పిస్తోంది! పాకిస్తాన్‌లో దశాబ్దుల తరబడి ఇస్లామేతర మతాలవారు నిర్మూలనకు గురిఅవుతున్నప్పటికీ అంతర్జాతీయ ‘‘మానవ అధికారాల సంస్థలు’’ నోరు విప్పలేదు, ‘ఐక్యరాజ్యసమితి’ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభిశంసించలేదు. కానీ ఇలా పాకిస్తాన్‌లో మతోన్మాద జిహాదీ మృగాల బారినుంచి తప్పించుకొని మన దేశంలోకి వచ్చేసిన శరణార్థులకు మన దేశపు పౌరసత్వాన్ని కల్పించడం పట్ల ఈ తథాకథిత ‘‘మానవ అధికార సంస్థలు’’ వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నాయి, ఐక్యరాజ్యసమితి మన ప్రభుత్వాన్ని విరోధిస్తోంది...
మన దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందని, ఇలాంటి నకిలీ అంతర్జాతీయ ‘‘స్వచ్ఛంద’’ సంస్థ ఒకటి ఇటీవల నిర్ధారించడానికి ఇదంతా నేపథ్యం. ‘‘మన దేశంలో భావవక్తీకరణ స్వేచ్ఛకు మన ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంద’’ని ఈ కుహనా సంస్థ ఆరోపించిందట!! ప్రచారం జరుగుతోంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, ఉద్యమాలు జరిపే అవకాశాలు నశించిపోయిన అట్టడుగు ఐదు దేశాల జాబితాలో మన దేశం కూడ ఉందని ఈ నకిలీ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించడం కొనసాగుతున్న అంతర్జాతీయ షడ్యంత్రం... పౌరసత్వ సవరణ చట్టంవల్ల ‘జాతీయ పౌర సూచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్-వల్ల అల్పసంఖ్య మతస్థుల హక్కులు హరించుకొనిపోతున్నాయన్నది ఈ ‘బౌద్ధిక బీభత్ససంస్థ’ చేసిన నిర్ధారణ! అనాదిగా సర్వమత సమభావ స్వభావం అఖండ భారత్‌లో వ్యవస్థీకృతమై ఉంది. ఈ స్వభావం 1947 తరువాత ‘అవశేష భారత్’లో కూడ కొనసాగుతోంది. అందువల్లనే మన దేశంలో ‘అల్పసంఖ్య’ మతాలవారు ‘అధిక సంఖ్య మతస్థుల’లో సమానంగా హాయిగా జీవిస్తున్నారు. వేధింపులకు, బీభత్సకాండకు గురిఅయిన లక్షల మంది అల్పసంఖ్య మతాలవారు, ఇస్లాం మతేతరులు పాకిస్తాన్ నుంచి పారిపోయి మన దేశానికి వచ్చారు, వస్తున్నారు. మన దేశంనుంచి అల్పసంఖ్య మతస్థులు ఒక్కరు కూడ ఇలా వేధింపులకు గురై ఇతర దేశాలకు పారిపోలేదు. ఇదీ అంతరం, పైపెచ్చు అల్పసంఖ్య మతస్థులకు మన దేశంలో ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణలు కొనసాగుతున్నాయి. అందువల్ల మన దేశపు జనాభాలో అల్పసంఖ్య ప్రజల-మైనారిటీస్- శాతం నానాటికీ పెరుగుతోంది. ఇందుకు విపరీతంగా అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటిచోట్ల దశాబ్దుల తరబడి అల్పసంఖ్య ప్రజల శాతం తగ్గిపోయింది!
కానీ ఏకమత, ఏకమతోన్మాద బీభత్స రాజ్యాంగ వ్యవస్థలలో అల్పసంఖ్య ప్రజలు నిర్మూలనకు గురిఅవుతున్న వాస్తవాన్ని పట్టించుకోని ఈ ఐరోపా, తదితర పాశ్చాత్య స్వచ్ఛంద సంస్థలు మన దేశాన్ని దుయ్యబడుతున్నాయి. మన దేశంలో తమకు ఎలాంటి ఇబ్బంది కాని, అసౌకర్యం కాని కలగలేదన్నది అల్పసంఖ్య మతస్థులకు తెలుసు! ‘‘అందు మన దేశంలో అల్పసంఖ్య మతాలవారికి అన్యాయం జరుగుతోందన్న’’ విదేశీయ ప్రభుత్వాల, సంస్థల నిర్ధారణలు వాటి స్వభావంలో నిహితమై ఉన్న భారత వ్యతిరేకతకు ప్రతీకలు! ఇలాంటి నిర్ధారణలను చేస్తున్న ‘స్వచ్ఛంద సంస్థల’ను సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- పెంచి పోషిస్తున్నాయి, మన దేశం పైకి ఉసిగొల్పుతున్నాయి! పాశ్చాత్య దేశాలకు మనపట్ల కల ఈ ప్రచ్ఛన్న శత్రుత్వం శతాబ్దుల నాటిది! సర్వమత సమభావం భారతదేశం! ఏక మతోన్మాదం ఐరోపా స్వభావం, ఇస్లాం మత రాజ్యకూటమి స్వభావం! వెలుగును ద్వేషించడం చీకటి నైజం! భారతదేశం వెలుగు, సర్వమత సమభావ సమాజం వెలుగు... ఐరోపా దేశాల మతోన్మాదం, ఇస్లాం కూటమి దేశాల అన్యమత విద్వేషం చీకటి!! శతాబ్దులపాటు ఈ విదేశాలు భారతదేశంపై దాడి చేశాయి, ధ్వంసం చేశాయి, బ్రిటన్ దురాక్రమణ ముగిసేసరికి మన దేశం వట్టిపోయిన ఆవు... మళ్లీ మన దేశం ‘కామధేనువు’గా మారుతోంది! దీన్ని నిరోధించడం నకిలీ అంతర్జాతీయ ‘స్వచ్ఛంద’ ముఠాల లక్ష్యం...