సంపాదకీయం

చిన్నారులకు తిండి ‘పొట్లం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌష్టికాహార లోపం వల్ల ఎదురౌతున్న సమస్యలు సామాజిక హిత నిష్ఠ కలవారికి ఆందోళన కలిగించడం సహజం! ప్రత్యేకించి బాల బాలికలకు శిశువులకు పౌష్టికాహారం లభించకపోవడం ప్రధాన సమస్య! అందువల్ల శిశు సంరక్షణ సమాచారాన్ని సేకరించి ప్రచారం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం వారి ఆకాంక్ష అభినందనీయం. అయితే చిన్న పిల్లల ఆరోగ్యానికి హానికరమైన పోషకాహార విధానాన్ని అనుసరించాలని కేంద్రం నిర్ణయించడం సమాంతర విపరిణామం. ఈ పరస్పర విరుద్ధమైన విధానాలను కేంద్ర మహిళా శిశు ప్రగతి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అమలు జరపడానికి నిర్ణయించారన్నది జరిగిపోతున్న ప్రచారం! ముందుగా శుద్ధి చేసి సిద్ధంచేసిన ఆహారపు పొట్లాల-ప్రీపాకేజ్డ్ ఫుడ్-ను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేయాలని మహిళా శిశు ప్రగతి వ్యవహారాల మంత్రిణి మేనకా గాంధీ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారవౌతోంది! ఇదే నిజమైతే ఇలాంటి నిర్ణయం సర్వోన్నత న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తరువులకు వ్యతిరేకం! చిన్న పిల్లలకు అప్పటికప్పుడు వండిన వేడి వేడి భోజనాన్ని వడ్డించాలని సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించింది! ఇందుకు భిన్నంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ముందుగా ప్యాక్ చేసిన తినుబండారాలను సరఫరా చేయాలని మంత్రిణి ఆదేశించడం ఆశ్చర్యరం! ఆమె నిజంగా ఇలాంటి ఆదేశాన్ని జారీ చేశారా? చేసి ఉండినట్టయితే సర్వోన్నత న్యాయనిర్దేశాల గురించి మంత్రిణికి ధ్యాసలేదా? భోజనాన్ని చేతితో ముట్టుకుని కలియబెట్టకుండా పరికరాల సహాయంతో మాత్రమే పరిశుద్ధమైన పాకెట్లలో నింపాలనడం మంచిదే! ఈ ఆహారపు పొట్లాలు సరిహద్దులలో విధులను నిర్వహిస్తున్న సైనికులకు సరఫరా అయ్యే ప్యాకేజ్డ్ ఫుడ్ స్థాయిలో ఆరో గ్య ప్రమాణాలకు అనుగుణంగా తయారు కావాలట! ఇది కూడ మం చిదే! కానీ సరిహద్దులలో వంట చేసుకోలేని స్థితిలో, పరిసరాలలో, వాతావరణంలో పనిచేసే సైనికులకు నిలువచేసిన ఆహారం-ప్యాకేజ్డ్ ఫుడ్-సరఫరా చేయడం అనివార్యం. కానీ అంగన్‌వాడీ కేంద్రాలలో శిశువులకు, గర్భవతులకు ఎప్పటికప్పుడు వండిపెట్టడానికి వీలైన వ్యవస్థ ఉంది. అలాంటప్పుడు ఈ పద్ధతిని మానేసి నిలువచేసిన తినుబండారాలను సరఫరా చేయడం ఎందుకు? ఆరోగ్యకరమైన శుచికరమైన సమాన పరిస్థితులలో తయారైన నిలువతిండి కంటే వేడి వంటకాలు రచికరం మాత్రమే కాదు, మరింత పౌష్టికం! అన్నం రొట్టె పప్పు పులుసు పచ్చడి కూర మజ్జిగ వంటి ప్రధాన ఆహార పదార్ధాల ద్వారా మాత్రమే పోషకాలు ఎక్కువగా లభిస్తున్నాయి. నిలువ పదార్ధాలు ఎండిపోయి ఉండడమే కాక పోషకాలను కోల్పోతున్నాయన్నది సాధారణ అనుభవం! చేతులుపెట్టి తిండి పదార్ధాలు కలపరాదని, చేతులతో కాక పరికరాలతో వడ్డించాలని కొత్తగా ఎవ్వరూ చెప్పనక్కరలేదు! తరతరాలుగా భారతీయ జీవన వ్యవహారం దీన్ని నిర్దేశిస్తోంది. చేతులతో వడ్డించరాదని, గరిటెలను చెంచాలను ఉపయోగించాలని ధర్మశాస్త్రం సైతం నిర్దేశించింది! ఎటొచ్చీ మన పద్ధతులను మనం మరచిపోవడం వైపరీత్యం! కుడి చేతితో తినడం భారతీయ పద్ధతి. కానీ ఇప్పుడు చేతిని పక్కకునెట్టి చెంచాలతోను, కత్తులతోను కటార్లతోను తినడం ఫ్యాషన్ అయిపోయింది! ఎడమచేత్తో తినడం కూడ ఆధునిక విచిత్ర నాగరికతలో భాగమైపోయింది..
అంగన్‌వాడీ కేంద్రాలలో వంటలను గ్రామీణ బృందాలవారు కాని, మహిళా మండలుల వారు కాని, స్వయం సహాయ బృం దాలు కాని నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది. ప్రభుత్వేతర సంస్థలవారికి, వాణిజ్యపు దళారీలకు ఈ వంటలను, సరఫరాలను అప్పగించరాదని కూడ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి మంత్రిణికి గుర్తు ఉన్నట్టు లేదు. అందువల్ల వేడి భోజనం నుండి నిలువ ఉన్న తిండికి అంగన్‌వాడీలు మారాలని సూచించడమే కాక ఈ నిలువతిండిని సరఫరా చేసే బాధ్యతను వాణిజ్య సంస్థలకు కాని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ-ఎన్‌జివో-లకు అప్పగించాలని కూడ కేంద్రమంత్రిణి సూచించారట! ఇలా సమీకృత శిశు ప్రగతి-ఐసిడిఎస్-పథకం సమీకృత వాణిజ్య పథకంగా మారే ప్రమాదం ఏర్పడిపోయింది. గతంలో ప్యాకేజ్డ్ తిండి పదార్ధాలను అంగన్‌వాడీలకు సరఫరా చేసిన రోజులున్నాయి. ముక్కిపోయిన పాలపిండి-బేబీ ఫుడ్స్-వంటి నిలువ పదార్ధాలను తినలేక పిల్లలు అల్లాడిపోయారు. ఆ పాకెట్లలో కొన్ని పగిలిపోవడం, కొన్ని పాకెట్లలో క్రిములు గూడుకట్టి ఉండడం వంటి వైపరీత్యాలు కూడ బయటపడినాయి. ఇలాంటి వైపరీత్యాలను నిరోధించడానికి అంగన్‌వాడీలలో వంట చేసి వేడి భోజనం పిల్లలకు తినిపించే పద్ధతి మొదలైంది! అనేక అంగన్‌వాడీ కేంద్రాలలో నిర్వాహకురాండ్లకు వంట చేసి వడ్డించే సహాయికలు కూడ నియుక్తులై ఉన్నారు.అందువల్ల ఆరోగ్యకరమైన పరిసరాలలో పోషక పదార్ధాలను వండి వేడిగా పిల్లలకు తినిపించడమే మేలు..
ప్రపంచీకరణ వ్యవస్థ-గ్లోబలైజేషన్-ముదురుతున్న కొద్దీ మనదేశపు సమస్త జీవన రంగాలలో బహుళ జాతీయ వాణిజ్య సంస్థల చొరబాటు తీవ్రతరమైపోయింది! ఈ చొరబాటుకు ప్రధాన మాధ్యమం ప్యాకేజ్డ్ తిండి పదార్ధాలు. చిల్లర దుకాణాలలో పప్పులు, ఉప్పులు, బియ్యం, బెల్లం వంటి పదార్ధాలను ఎక్కువగా అమ్మడంలేదు. ఈ ప్యాకెట్ల తినుబండారాలను మాత్రమే విపరీతంగా అమ్ముతున్నారు. గతంలో ప్రముఖంగా దర్శనమిచ్చిన పప్పు లు వంటివి ఈ ప్యాకేజ్డ్ తినుబండారాల దాడిని తట్టుకొనలేక ఎక్కడో ఒక మూల గోనె సంచులలో నక్కి ఉన్న పరిస్థితి దాపురించింది! ఈ ప్యా కెట్ల తినుబండారాలు చాక్లెట్లు, పిజ్జాలు, లేస్, వేఫర్స్, చీపర్స్, కేక్స్ వంటి పేర్లతో బుడుతలను మాత్రమే కాదు వారి తల్లిదండ్రులకు, అమ్మమ్మలకు తాతయ్యలకు సైతం నోళ్లు ఊరించి నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ప్యాకేజ్డ్ తిండిని ఉత్పత్తి చేస్తున్నది ప్రధానంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు. ప్రపంచీకరణలో భాగంగా విదేశీయ సంస్థలు మన దేశంలో సిమెంటు, ఉక్కు,ఎరువులు, పెట్రోలు, బొగ్గు, విద్యుత్ చాలా ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసి మన దేశానికి లాభాలను చేకూర్చి పెడతాయని మన ప్రభుత్వాలు నమ్మించాయి. కానీ ఈ నమ్మకం వమ్మయిపోయింది. ఈ విదేశీయ సంస్థలు మన దేశంలోకి చొరబడి ఈ పాకెట్ల తిండిని, రసాయన విషాలు నిండిన తీయటి పానీయాలను, ఐస్‌క్రీములను, మసాలా దినుసులను, సేమ్యాలను, అప్పడాలను, చివరికి గోధుమ పిండిని మంచినీళ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ఈ విదేశీయ సంస్థలు ఈ ప్యాకెట్ల తిండిని ఎగుమతి చేయడం లేదు, భారీ ధరలకు మన దేశంలోనే విక్రయించి లాభాలను మాత్రం తమ దేశాలకు తరలిస్తున్నారు! ఈ విదేశీయ వాణిజ్యపు దోపిడీ ముఠాల దృష్టి అంగన్‌వాడీలపై కూడ ప్రసరించినట్టుంది...
అందువల్లనే వేడి వంటకాల కంటె పాకెట్లలోని నిలువ వంటకాలు అంగన్‌వాడీ శిశువులకు అంటగట్టాలన్న పథకం రూపొందినట్టుంది! అధికారులు రాజకీయ వేత్తలు వాస్తవాలను గుర్తించడం లేదు. ప్యాకెట్ల తిండివల్ల పెద్దలకే ఆరోగ్యం చెడిపోతోందని విచిత్ర వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యవంలో జరుగుతున్న అధ్యయనాలలో వెల్లడవుతూనే ఉంది. బహుళ జాతీయ సంస్థల నిలువ తిండి ప్రమాణాలు బాగా పడిపోయినట్టు కూడ ధ్రువపడింది! నెజల్ కంపెనీ వారి మ్యాగీ సేమ్యాలలోని రసాయన విషాలు ప్రమాణాలు లేవన్న వాస్తవానికి ఒక ఉదాహరణ మాత్రమే!