సంపాదకీయం

వల్లభ స్ఫూర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్దార్ వల్లభ భాయి పటేల్ జయంతి ఉత్సవాలు వారం రోజులపాటు దేశవ్యాప్తంగా జరుగుతుండడం దేశ భద్రత పట్ల, వౌలిక జాతీయ అస్తిత్వం పట్ల పెరుగుతున్న ధ్యాసకు నిదర్శనం.. బ్రిటన్ దురాక్రమణ ముక్త భారతదేశానికి సమైక్య స్వభావ ప్రదాయకుడు వల్లభ భాయి పటేల్, సమగ్రతా స్వరూప సంధాయకుడు సర్దార్ పటేల్! రాజకీయం, రాజ్యాంగం, మతం, భాష, ఆహారం, ఆహార్యం, భావజాలం, అనుభూతుల సమాహారం- ఇదీ, ఇలాంటి ఇంకెన్నో అంశాలు వౌలిక జాతీయతలో భాగం. స్వజాతీయ సంస్కృతిలో నిహితం! వీటిలో ఏ ఒక్కటీ సమగ్ర జాతీయ తత్త్వం కాదు, ఇవన్నీ సమాహారమైన సమగ్ర అస్తిత్వం జాతీయత! వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని ఈ అద్వితీయమైన జాతీయ సాంస్కృతిక అస్తిత్వం అనాదిగా ఈ దేశపు సమష్టి జనజీవనం. వందల ఏళ్ల విదేశీయ దురాక్రమణ, ప్రధానంగా బ్రిటన్ సామ్రాజ్యవాదుల ‘విభజించు పాలించు’ దుస్తంత్రం ఈ అద్వితీయ జాతీయ స్వభావాన్ని, ప్రాదేశిక సమగ్ర రూపాన్ని భంగపరిచింది, కృత్రిమ వైరుధ్యాలను కల్పించింది! ఈ అద్వితీయ జాతీయ అస్తిత్వాన్ని కృత్రిమ వైరుధ్యాలను విముక్తం చేసి వైవిధ్యాల మధ్య సహజ సమన్వయాన్ని మళ్లీ సాధించిన కారణ జన్ముడు సర్దార్ వల్లభుడు.. భరతమాత వరాల బిడ్డడు.. ఆయన ఉపప్రధాన మంత్రి కావడం, రాజకీయవేత్త కావడం ఆయన జీవన సకలంలో ఒక ‘శకలం’ మాత్రమే! రాజకీయాలను అతిగమించిన, రాజకీయ అధికార ‘లాలసత’కు అతీతమైన సనాతన జాతీయ పురుషుడు-స్టేట్‌మన్.. ఈ లోహ పురుషుడు.. వసిష్టుని వలె, వేద వ్యాసుని వలె, దిలీపుని వలె, యదుకుల కృష్ణుని వలె, పుష్యమిత్రుని వలె, ఛత్రపతి శివాజీ వలె, ఆది శంకరాచార్యుని వలె వివేకానందుని వలె ఈ సనాతన జాతీయ తత్త్వ పరిరక్షకుడు వల్లభుడు, పరిపోషకుడు.. రాజనీతిజ్ఞుడు-పొలిటికల్ సైంటిస్ట్- రాజకీయ వేత్త-పొలిటీషియన్- వంటి హోదాలు ఆయన హిమశృంగ సమాన వ్యక్తిత్వ నిర్వచనానికి సరిపోవు! దేశ హితం కోసం 1946లో ప్రధానమంత్రి పదవిని పరిత్యాగం చేయగలిగిన సర్దార్ పటేల్, దేశ హితం కోసం 1947-1950 సంవత్సరాల మధ్య అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను పదే పదే ఢీకొనడం చరిత్ర.. మొదటిది వైయక్తిక స్వార్ధం అంటని నిరాడంబరత్వం, రెండవది సమష్టి ప్రయోజనం పరమావధి అయిన సౌశీల్యం! కుటుంబంలో, సమాజంలో, మానవుడు ఎలా ప్రవర్తించాలన్న జీవన నిబంధనలకు, ఆధునిక సమాజంలో నిరుపమాన ‘ప్రతీక’ సర్దార్ పటేల్ స్వభావ దీపిక..
వ్యవసాయం జీవనమైన గుజరాతీ కుటుంబంలో జన్మించిన పటేల్ మహాశయుని ‘జీవన వ్యవసాయ’ లక్ష్యం జాతీయ క్షేత్రాన్ని సమగ్రతా హరిత శోభలతో నింపడం, సమైక్య ఫలాలను సంతరించిపెట్టడం! ఈ లక్ష్యాన్ని సాధించడానికే 141 ఏళ్ల క్రితం ఆయన జన్మించాడు! ఆయన జన్మించకపోయి ఉండినట్టయితే బ్రిటన్ ముక్త భారతదేశంలో మరో 566 ‘స్వతంత్ర’ దేశాలు ఏర్పడి ఉండేవి! ఆయనే వివరించినట్టు ‘మాతృదేవి’ శరీరంపై ‘పుండ్లు’-వ్రణాలు-వంటి ఈ విచిత్ర స్వతంత్ర దేశాలు అద్వితీయ అనాది జాతీయతను తూట్లు పొడిచి ఉండేవి! ఆయన జన్మించడంతో ఆ ప్రమాదం తప్పింది! అందువల్లనే ఆయన ‘జయన్తి’ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరపడం మాతృభూమికి మంగళకరం! బార్డోలిలో బ్రిటన్ వ్యతిరేక సత్యాగ్రహంలో అంకురించిన ఈ సమైక్యతా స్ఫూర్తి నిజాం నిరంకుశత్వం నుండి ‘హైదరాబాద్’కు లభించిన విముక్తితో పరిమళించింది. జీవనలక్ష్యాన్ని సాధించగలిగిన చరితార్థుల సరసన నిలబడి సనాతన-శాశ్వతమైన-స్ఫూర్తిని నిలబెట్టిన మాతృదేవి ముద్దుబిడ్డడు వల్లభుడు!
వైయక్తిక ప్రయోజనం కాక సమష్టిహితం లక్ష్యంగా జీవించడం పటేల్‌కు ఆజీవన వ్రతం.. ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లి బారిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని భావించాడు! ప్రయాణానికి సర్వం సిద్ధమైంది! అప్పటికే ఆయన స్వదేశీయ పరీక్షలో పట్టాపొందిన న్యాయవాది! ఆయన సోదరుడు విఠల్‌భాయ్ పటేల్ కూడా న్యాయవాది. బారిస్టర్ పట్టా పొందితే న్యాయవాదుల గౌరవ ప్రతిష్టలు పెరగడం ఖాయం. కానీ పెద్దవాడు విఠల్ భాయి పటేల్ ముందుగా బారిస్టర్ పట్టా పొందడం న్యాయమని చిన్న వాడైన వల్లభ భాయి పటేల్ నిర్ధారించుకున్నాడు! అందువల్లనే మొదట అన్నకు ఈ అవకాశం కల్పించాడు! ఇది కుటుంబం పట్ల సర్దార్ పటేల్ పాటించిన మర్యాద.. 1946లో కాంగ్రెస్ పార్టీలోని అత్యధికులు సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కావాలని నిర్ణయించారు. ప్రాంతీయ కాంగ్రెస్ విభాగాలలో మూడు తప్ప మిగిలిన అన్ని విభాగాల వారు సర్దార్‌ను సమర్ధించారు! ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా 1946లో సర్దార్ పటేల్ దేశానికి ప్రధాన మంత్రి కావలసి ఉంది. కానీ మహాత్మా గాంధీ మాత్రం మరో విధంగా నిర్ణయించాడు. జవహర్‌లాల్ నెహ్రూకు ప్రధానమంత్రి పదవిని అప్పగించమని సర్దార్ పటేల్‌ను ఆదేశించాడు! పార్టీలోను, ప్రజలలోను అత్యధికులు తననే ప్రధానమంత్రి కావాలని కోరుతున్నప్పటికీ మహాత్ముని మాటను శిరసావహించి పటేల్ ఆ పదవిని త్యాగం చేశాడు! నెహ్రూకు అత్యంత సన్నిహితుడుగా పేరుమోసిన 1946నాటి బ్రిటన్ రాణీ ప్రతినిధి, గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ ప్రభుత్వం సైతం నెహ్రూ కంటే పటేల్ గొప్పనాయకుడు అని కొనియాడడం చరిత్ర.. ‘పటేల్ భూమి మీద నడుస్తున్న నాయకుడు, నెహ్రూ మేఘాలలో విహరిస్తున్నాడు!’ అని వౌంట్ బాటన్ వ్యాఖ్యానించాడు! భూమి మీద నడచిన నాయకుడు కనుకనే పటేల్ భరత భూమి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ వారసత్వం.. వైయక్తిక సామాజిక సౌశీల్యం! అలనాటి కాంగ్రెస్ ప్రముఖుల అవినీతి కలాపాలను పటేల్ నిరోధించాడు, పార్టీ పేరుతో అక్రమంగా నిధులను సేకరించిన వారిని నిరసించాడు! బ్రిటన్ జీవన పద్ధతులను విముక్తుడై స్వదేశీయ పద్ధతిలో జీవించిన అలనాటి నాయకులలో అగ్రగణ్యుడు సర్దార్ పటేల్.. స్వస్థానం పట్ల కల ఈ అనురక్తి ఆయనను సమగ్రతా సాధనకు పురికొల్పింది. బ్రిటన్ ప్రభుత్వం అఖండ భారతాన్ని ముక్కలు చేసింది. అవశేష భారత్ మరిన్ని ‘చెక్కలు’ కాకుండా నిరోధించిన సమైక్యతా సాధకుడు సర్దార్..
బ్రిటన్ రాజకీయ బీభత్సకారులు 1947 వరకు మనదేశంపై రెండువిధాలుగా పెత్తనం చెలాయించారు! 55 శాతం భూభాగంపై, 70 శాతం జనాభాపై వారు ప్రత్యక్షంగా పెత్తనం చెలాయించారు! ఈ భూభాగాన్ని ‘ప్రాంతాలు’-ప్రావినె్సస్-గా విడగొట్టి ‘గవర్నర్’ల అదుపులో ఉంచారు. మిగిలిన 45 శాతం భూభాగాన్ని, 30 శాతం ప్రజలను బ్రిటన్ పరమోన్నత అధికారం-పారవౌంటసీ-అంగీకరించిన ‘రాజులు’, ‘సామంతులు’ పాలించారు. ఇలాంటి భూభాగాలకు ‘సంస్థానాలు’ -స్టేట్స్-అని బ్రిటన్‌వారు పేరుపెట్టారు! ఈ సంస్థానాలు భారత్‌లో కలిసిపోవచ్చునని లేదా గతంలో వలె స్వతంత్ర రాజ్యాలుగా ఉండవచ్చునని 1947లో బ్రిటన్ ప్రభుత్వం నిర్దేశించింది. అలాంటి 566 ‘స్వతంత్ర సంస్థానాల’ను అ వశేష భారత్‌లో మళ్లీ విలీనం చేయగలిగిన జాతీయ పు రుషుడు వల్లభ అమాత్యుడు! ప్రాతః స్మరణీయుడు!