సంపాదకీయం

‘ఉత్తర’ సమరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి ఎన్నికల కదన కాహలి మారుమోగుతోం ది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల సంఘం-ఎలక్షన్ కమిషన్-బుధవారం సుదీర్ఘ కార్యక్రమాన్ని ఆవిష్కరించడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అస్తశ్రస్త్రాలకు మరింత పదును పెడుతున్నాయి. పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల శాసన సమరానికి ఆధికారిక శ్రీకారం ఇప్పుడు జరిగినప్పటికీ దాదాపు ఆరు నెలలుగా ఈ రాష్ట్రాలలో ప్రచార సమరం సాగుతూనే ఉంది. జనవరి పనె్నండవ తేదీన ‘నామాంకన’-నామినేషన్-నివేదన ఆరంభం కావడం నుంచి మార్చి పదకొండవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఐదు రాష్ట్రాలలోనే కాక దేశమంతటా ఉత్కంఠ కొనసాగనుంది. దాదాపు ఎనబయి ఐదు వేల పోలింగ్ కేంద్రాలలో ఐదు రాష్ట్రాల వోటర్లు తీర్పును నమోదు చేయనున్న ఈ బృహత్ ప్రహసనం ప్రభావం ఆయా రాష్ట్రాలకు పరిమితమై లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ నిర్వాహక ప్రభుత్వంపై ఇది మధ్యంతర సమీక్ష వంటిదని వ్యాఖ్యలు, విశే్లషణలు, భవిష్య వాణులు, హెచ్చరికలు ఇదివరకే మొ దలైపోయాయి. మనది ‘సమాఖ్య రాజ్యాంగ’ వ్య వస్థ కనుక శాసనసభల ఎన్నికల ఫలితాలతో కేం ద్ర ప్రభుత్వం మనుగడకు, జయాపజయాలకు సంబంధం లేదు. కానీ కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వాలను నిర్వహించే పక్షాలు, ప్రతిపక్షాల అధినాయకులే అన్ని ఎన్నికలలోను కేంద్ర బిందువులు కాబట్టి పార్టీల పట్ల ప్రజాభిమానానికి, ప్రజా వ్యతిరేకతకు ప్రతి ఎన్నిక కూడ ‘సూచిక’ అన్న అభిప్రాయం నానాటికీ బలపడుతోంది! అందువల్ల ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వంపై వోటర్ల మధ్యంతర సమీక్షలు కాగలవన్నది జరుగుతున్న ప్రచారం. అత్యంత పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని మళ్లీ సాధించాలన్న పట్టుదల ‘్భజపా’లో ప్రబలంగా ప్రస్ఫుటిస్తోంది. ‘పరివర్తన’ పేరుతో అనేక నెలలుగా ‘్భజపా’ రాష్టమ్రంతటా నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, యాత్రలు ఈ పట్టుదలకు ప్రతీకలు! ఎన్నికలు జరుగనున్న మిగిలిన నాలుగు రాష్ట్రాల లోక్‌సభ సభ్యుల సంఖ్య మొత్తం ఇరవై రెండు. ఉత్తరప్రదేశ్‌లోనే ఎనబయిమంది లోక్‌సభ సభ్యులున్నారు. ప్రపంచంలోని అత్యధిక దేశాలకంటె ఉత్తరప్రదేశ్ జనాభా రీత్యా పెద్దది. దేశంలో ప్రధానమంత్రి తరువాత అత్యధిక ప్రాధాన్యం సంతరించుకున్న ‘రాజకీయ కేంద్ర బిందువు’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి! ఇదీ ఈ ఎన్నికలకు ప్రధాన నేపథ్యం..
ప్రధాని మోదీ స్వయంగా యుపి ఎన్నికల ప్రచారానికి పార్టీ తరఫున సారథ్యం వహిస్తుండడం ‘్భజపా’ పట్టుదలకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు దేశం మొత్తం మీద కుల రాజకీయాలకు పేరుమోసి ఉన్నాయి. అయోధ్య రామజన్మభూమి మందిర పునర్ నిర్మాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సమయంలో ఈ కుల రాజకీయాలకు అతీతంగా వోటర్లు జాతీయతా భావాన్ని ప్రకటించడం చరిత్ర! 1992లో ‘్భజపా’ ప్ర భుత్వం ఏర్పడడం, ఆ తరువాత ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో ఎదగడం, పతనం కావడం కుల రాజకీయ ప్రాబల్యానికి ‘విలోమ నిష్పత్తి’లో సంభవించిన పరిణామ క్రమం! గత లోక్‌సభ ఎన్నికలలో యుపిలోని ఎనబయి లోక్‌సభా స్థానాలలో డెబ్బయిమూడు చోట్ల ‘్భజపా’ విజయం సాధించడం కుల రాజకీయ ప్రభావాన్ని ప్రాధాన్యాన్ని ‘కుదించి వేసిన’ పరిణామం! ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఊహాగానాలకు, అంచనాలకు, జ్యోతిషాలకు 2014 నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితం ‘గీటురాయి’గా మారడం అందువల్ల అతార్కికం కాదు! లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శాసనసభ ఎన్నికలలో పునరావృత్తం అయినట్టయితే దాదాపు పదిహేను ఏళ్ల తరువాత ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ ‘్భజపా’ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం! ఈ పరిణామాన్ని నిరోధించగల వ్యూహం కాని, కార్యక్రమం కాని ‘్భజపా’ ప్రత్యర్థి పక్షాలకు ఏర్పడకపోవడం వల్ల యుపి ఎన్నికల తరువాత ‘్భజపా’ ప్రభుత్వం ఏర్పడడం కేవలం లాంఛనమన్న ప్రచారం జరుగుతోంది. 2007- 2012 మధ్య అధికారాన్ని నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’-బసపా-కాని, 2012 నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సమాజ్ వాదీ పార్టీ- సపా-కాని ‘్భజపా’ను నిరోధించగల స్థితిలో లేవన్నది బహిరంగ రహస్యం..
గత ఐదేళ్ల ‘సపా’ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో వివిధ అరాజక శక్తులు ప్రబలిపోవడం చరిత్ర. మతోన్మాదులు, లైంగిక, అసాంఘిక బీభత్సకారులు, జిహాదీలు ప్రబలిపోయారు. విద్యాధికుడైన సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉత్తరప్రదేశ్ జీవన గతిలో విప్లవాత్మక పరివర్తన రాగలదన్న ప్రచారం జరిగింది. కానీ అఖిలేశ్ యాదవ్ ఐదేళ్ల పాలనలో ఉత్తరప్రదేశ్ కేవలం ము లాయం కుటుంబం వారి జాగీరుగా మారిపోయిం ది. 1990 నుంచి ముఖ్యమంత్రిగాను, విపక్ష నా యకుడిగాను ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కేం ద్ర బిందువుగా మారిన సమాజ్‌వాదీ అధినేత ములాయం 2012 నాటి శాసనసభ ఏన్నికల తరువాత తాను ముఖ్యమంత్రి కాలేదు, ఆ పదవిని తనయుడైన అఖిలేశ్‌కు కట్టబెట్టడం ద్వారా కుటుంబ వారసత్వ రాజకీయాలను వ్యవస్థీకరించాడు. ‘అయ్యవారిని చేయబోతే కోతి అయిందా?’ లేక ‘మొదటినుంచి అది కోతేనా’ అన్న మీమాంసకు ఇప్పుడు కాలదోషం పట్టింది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది కనుక.. 2007 నుండి 2012 వరకు పాలించిన బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి రాజకీయాలతో ఉత్తరప్రదేశ్ ప్రజలు విసుగెత్తిపోయారు. అందువల్లనే 2012 నాటి శాసనసభ ఎన్నికలలోను, 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలోను ‘బసపా’ ఘోర పరాజయం పాలైంది! గత ఐదేళ్లుగా ‘సపా’ పాలన ‘కుటుంబం’లో ఆధిపత్యం పోరాటానికి ఆలవాలమైంది! పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనడానికి, ప్రజల దృష్టిని వైఫల్యాల నుంచి మళ్లించడానికి వీలుగా ములాయం కుటుంబం వారు వైరుధ్యాలను అభినయిస్తున్నారా? లేక నిజంగానే కుటుంబం చీలిపోయిందా? అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు! బహిష్కరణలు, పదవుల నుంచి తొలగింపులు, సయోధ్యలు, చర్చలు గత ఆరు నెలలకు పైగా సమాజ్‌వాదీ నాటకాన్ని ఉత్కంఠ భరితం చేయడం మాత్రమే స్పష్టమైంది! ఎన్నికల తరువాత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోదన్నది కూడ స్పష్టమైంది! ఉత్తరప్రదేశ్ వోటర్లు నిజమైన పరివర్తనను కోరుతున్నారు. ‘బసపా’, ‘సపా’ల పదేళ్ల పాలన తరువాత వోటర్లు ‘్భజపా’కు అవకాశం ఇవ్వాలని భావించడం ఆశ్చర్యకరం కాదు..
లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్నది ప్రచారం అవుతున్న ఆదర్శం. కానీ ఈ ‘ఆదర్శం’ ఆకృతి దాల్చడానికి రాజ్యాంగపరమైన రాజకీయపరమైన సంస్కరణలు, సవరణలు జరగవలసి ఉంది. 1980 జనవరిలో కేవలం రెండు దశలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. అప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ ‘సాగతీత’ గురి అవుతోంది. యుపిలో ప్రస్తుతం ఏడు దశలలో పోలింగ్ జరగవలసి వస్తుండడం ఈ ‘సాగతీత’కు పరాకాష్ఠ! ఒకటి,రెండు దశలలో పోలింగ్‌ను పూర్తి చేయడం సాధ్యం కాకపోవడం మన ప్రజాస్వామ్య సామర్ధ్యాన్ని వెక్కిరిస్తున్న వైపరీత్యం.