సంపాదకీయం

వ్యూహం మార్చిన ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జరిగిన చివరి విడత పోలింగ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఒక రైలులో జరిగిన బాంబుపేలుళ్లు వికృత నేపథ్యం! రాజధాని భోపాల్ నుంచి ఉజ్జయినికి వెడుతుండిన రైలుబండిలోని సాధారణ తరగతి పెట్టెలో ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ (ఐసిస్) జిహాదీ సంస్థకు చెందిన దుండగులు పేలుళ్లు జరపడం భద్రతా దృష్టిని మళ్లించడంలో భాగం! ఈ పేలుళ్ల ఫలితంగా తొమ్మిదిమంది ప్రయాణీకులు గాయపడ్డారట! ఇలా ‘్భద్రత’ దృష్టి మధ్యప్రదేశ్ వైపు మళ్లగానే చివరి విడత పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పెద్దఎత్తున పేలుళ్లు జరపడం ఈ ‘జిహాదీ’ దుండగుల ఎత్తుగడ కావచ్చు! ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన ఈ ‘ముఠా‘ బీభత్సకారులు ఇందుకు సాక్ష్యం! మన ‘్భద్రత’ అప్రమత్తమైంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం తప్పింది. ఊహించని చోట దూకడం తోడేలు సహజ లక్షణం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ తోడేళ్లు మధ్యప్రదేశ్‌లో దూకడం అందువల్ల ఆశ్చర్యకరం కాదు. రకరకాల పేర్లతో చెలామణి అవుతున్న జిహాదీ బీభత్సకారుల స్వభావం ఒక్కటే, లక్ష్యం ఒక్కటే! అందువల్ల ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’-ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా -ఐఎస్‌ఐఎస్-ఐసిస్-పేరుతో చెలామణి అవుతున్న జిహాదీ దుండగులు మధ్యప్రదేశ్‌లోని సహజాపూర్ జిల్లా ‘కాలాపీపల్’-యాబ్దీ స్టేషన్ల మధ్య బీభత్సకాండకు పాల్పడడం ఆశ్చర్యకరం కాదు. ఉజ్జయినికి వెడుతుండిన రైలులో ఐసిస్ హంతకులు వాడిన ‘బాంబులు’ గతంలో ‘ఇండియన్ ముజాహిదీన్’ ముష్కరులు వాడిన బాంబుల వంటివేనట! ఇప్పుడు ‘ఇం డియన్ ముజాహిదీన్’ ము ఠా విచ్ఛిన్నమైపోయినట్టు ప్రచారం జరుగుతోంది! విచ్ఛిన్నమైపోయిందా? లేక ‘ఇండియన్ ముజాహిదీన్’ ముఠాలోని వారందరూ ‘ఐసిస్’ హంతకులు గా రూపాంతరం చెందా రా? అన్నది మన నిఘా విభాగాల వారు, నేర పరిశోధన సంస్థలు నిర్ధారించాలి! ఎందుకంటే మన దేశంలో దశాబ్దుల తరబడి వివిధ రకాల పేర్లతో బీభత్సకాండను సృష్టించిన, సృష్టిస్తున్న జిహాదీ ముఠాలన్నీ పాకిస్తాన్ ప్రభుత్వం వారి ‘ఐఎస్‌ఐ’-ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-కి అనుబంధ సంస్థలు మాత్రమే! ‘ఐఎస్‌ఐ’ వ్యూహం మార్చినప్పుడల్లా ‘కొత్త పేరు’తో కొత్త ముఠా ప్రచారవౌతోంది! మన ‘నిఘా’ నయనాలు దీర్ఘకాలం పాటు ఒకే జిహాదీ ముఠాపై కేంద్రీకృతం కాకుండా నిరోధించడానికే పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ కొత్త కొత్త ముఠాలను రంగంలోకి దించుతోందని భావించడం అతార్కికం కాదు!
మధ్యప్రదేశ్ రాజధానికీ భారతదేశపుప్రాచీన రాజధాని ఉజ్జయినీకి మధ్యగల రైలుమార్గంలో జరిగిన మంగళవారం నాటి బీభత్స ఘటన రెండు విధాలుగా మన ‘్భద్రత’ దృష్టిని మళ్లించడానికి జరిగిన ప్రయత్నంలో భాగం కావచ్చు! మొదటిది తాత్కాలికమైనది! జమ్మూ కశ్మీర్‌లో నిరంతరం బీభత్స కాండ జరుగుతోంది, జమ్మూ కశ్మీర్‌ను దేశం నుండి విడగొట్టి స్వతంత్ర దేశంగా మార్చాలనుకుంటున్న విద్రోహపు ముఠాల వారు వీధులలో నిర్భయంగా ఊరేగుతున్నారు, భారత వ్యతిరేక నినాదాలను చేస్తూనే ఉన్నారు! ఇలా మన దృష్టిని జమ్మూ కశ్మీర్ వైపు మళ్లించగలిగిన జిహాదీలు ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పెద్దఎత్తున రక్తపాతం సృష్టించడానికి కుట్రపన్నారు! దానికి పూర్వరంగంగా మధ్యప్రదేశ్ వైపు మన భద్రతా ధ్యాసను మళ్లించడానికే ఉజ్జయినీకి వెడుతుండిన రైలులో పేలుళ్లు జరిపారు! జిహాదీల వ్యూహం అమలు జరిగి ఉండినట్టయితే బుధవారం ఎన్నికలు జరిగిన ప్రాంతంలో బహుశా పెద్దఎత్తున పేలుళ్లు జరిగి ఉండేవి, ఇంతవరకూ వివిధ దశలలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ చివరి దశలో రక్తసిక్తమై ఉండేది! అయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల ‘బీభత్స వ్యతిరేక భద్రతా దళాల’ అప్రమత్తత వల్ల, పరస్పర సహకారం వల్ల ఉత్తరప్రదేశ్‌లో జిహాదీల ఆటలు సాగలేదు. ఘోర హంతకులు పట్టుబడ్డారు. మరి కొందరు పట్టుబడే అవకాశం ఉంది కూడ.. మన దృష్టిని మళ్లించడానికి పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ చేసిన ప్రయత్నం మొదటి అంశం..
రెండవ రకమైన దృష్టి మళ్లింపు వ్యూహాత్మకమైనది. ఐసిస్‌ను గురించి ప్రధానంగా ప్రచారం జరగడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండకు ‘ప్రచార మాధ్యమాల’లో ప్రాధాన్యం తగ్గిపోతుంది! తద్వారా మన దేశంలో జరుగుతున్న బీభత్సకాండతో తమకు సంబంధం లేదని పాకిస్తానీ పౌర ప్రభుత్వం వారు, సైనిక దళాలవారు మరింత ‘గొప్ప’గా బుకాయించడానికి వీల కలుగుతుంది! పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా జరిపిస్తున్న జిహాదీ బీభత్సకాండను పూర్తిగా నిలిపివేయాలని మన ప్రభుత్వం దశాబ్దులుగా కోరుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేయలేదు, ఉగ్రవాదపు తోడేళ్లను మన దేశంపైకి ఉసి కొల్పడం మానుకోలేదు! ఉభయ దేశాల మధ్య ‘చర్చలు’, ‘కరచాలనాలు’, ‘విందులు’, ‘చిరునవ్వులు’ జరిగిపోతూనే ఉన్నాయి. సమాంతరంగా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు మన దేశంలో హత్యాకాండలు సాగించారు! ఈ వైపరీత్యానికి గత రెండేళ్లుగా మన ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది! పాకిస్తాన్ ప్రభు త్వం వారు తమ బీభత్స స్వభావాన్ని విడనాడనంత వరకు ఆ దేశంతో ‘చర్చలు’ జరిపే ప్రసక్తి లేదని మన ప్ర భుత్వం స్పష్టం చేస్తోం ది! అంతర్జాతీయ సమా జం కూడ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘బీ భత్స వ్యవస్థ’గా అంగీకరించడానికి విముఖతను ప్రదర్శించడం లేదు! టెర్రరిస్టులను ఎగుమతి చేస్తున్నారన్న అనుమానంతో కొన్ని ఇస్లాం దేశాల వారి ‘ప్రవేశం’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆంక్షలను విధించడం పాకిస్తాన్ ప్రభుత్వానికి కలవరం కలిగిస్తోంది. నిషిద్ధ ‘ఇస్లాం’ దేశాల జాబితాలో పాకిస్తాన్‌ను అమెరికా ప్రభుత్వం చేర్చలేదు! చేర్చే అవకాశం ఉన్నట్టు పాకిస్తానీ ప్రభుత్వం విభాగమైన ఐఎస్‌ఐ భయపడింది, పాకిస్తాన్ సైనిక దళాలవారు భయపడుతున్నారు! అందువల్లనే ‘ఐఎస్‌ఐ’ వ్యూహం మార్చింది! ఈ మారిన వ్యూహంలో భాగంగానే ‘ఐసిస్’ మన దేశంలో బీభత్సకాండను ఆరంభించింది! మంగళవారం నాటి ఘటనతో ఇది ధ్రువపడింది..
భారత్‌లో ‘ఉగ్ర’కాండను మేము జరిపించడం లేదు, మా దేశం వారు జరపడం లేదు, ‘ఐసిస్’ జరుపుతోంది, ‘ఐసిస్’తో మాకు సంబంధం లేదు- అని ‘ఐఎస్‌ఐ’ ఇప్పుడు అభినయించవచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయించవచ్చు! గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం అనేకసార్లు ఇలా వ్యూహాన్ని మార్చింది! ‘లష్కర్ ఎ తయ్యబా’ ‘జమాత్ ఉద్ దవా’ ‘జాయిష్ ఏ మహమ్మద్’ వంటి పాకిస్తానీ ముఠాలు కాక దేశంలోనే తయారైన పాకిస్తానీ తొత్తులు ‘ఇండియన్ ముజాహిదీన్’ పేరుతో హత్యాకాండ జరిపించినట్టు ప్రచారమైంది! ఇప్పుడు ‘ఐసిస్’ వచ్చి పడింది, కాని నడిపిస్తున్నది ‘ఐఎస్‌ఐ’, పాకిస్తాన్ ప్రభుత్వం..