సంపాదకీయం

అంతరిక్ష మైత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వహిత స్వభావమైన భారతీయ చరిత్ర శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల యాబయి ఏడు నిముషాలకు పునరావృత్తం అయింది. మన దేశం నిర్మించిన దక్షిణ ఆసియా ఉపగ్రహం ‘జిసాట్ 09’ అంతరిక్షంలోకి దూసుకొని వెళ్లింది. భారత శాస్త్ర విజ్ఞాన పతాకం వినీల అంబరంలో మరింత ఎత్తున రెపరెపలాడడం మొదలైంది. ‘దక్షిణ ఆసియా’గా చెలామణి అవుతున్న ఇరుగు పొరుగు దేశాల పట్ల మన దేశానికి కల శుభ మైత్రీ భావాన్ని సంతరించుకున్న ‘జిసాట్ 09’ ఉపగ్రహం ‘్భ సమాంతర అంతరిక్ష నౌక’- జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09-ను అధిరోహించి గగన ప్రస్థానం చేయడం చరిత్రలో మరో వినూతన అధ్యాయానికి శ్రీకారం. భూ సమాంతర కక్ష్యలో పరిక్రమిస్తున్న ఈ ఉపగ్రహం దక్షిణాసియా దేశాలకు సమాచార వరం. భారతీయ విజ్ఞాన గరిమ విశ్వహితానికి దోహదం చేయడం సహస్రాబ్దుల చరిత్ర. భారతీయ విజ్ఞాన గరిమకు శతాబ్దుల పాటు గ్రహణం పట్టడం కూడా చరిత్ర. ఈ గ్రహణం విదేశీయుల దురాక్రమణ ఫలితం! విదేశీయ దురాక్రమణ నుండి విముక్తి కలిగిన తరువాత దాదాపు రెండు దశాబ్దుల పాటు కదలిక లేక నిద్రావస్థలో ఉండిన మన ఖగోళ విజ్ఞానం మళ్లీ వికసించడం మొదలు పెట్టింది. తొలి ఉపగ్రహం ప్రయోగించడానికి విదేశీయ అంతరిక్ష నౌకను ఉపయోగించ వలసి వచ్చిన మన దేశం వివిధ దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలో నిక్షిప్తం చేయగల స్థాయికి ఎదగడం నలబయి ఏళ్ల చరిత్ర. గత ఫిబ్రవరిలో ఒకే అంతరిక్ష నౌకలో నూట నాలుగు ఉపగ్రహాలను ప్రతిష్ఠించి గగనానికి చేర్చి, వివిధ భూ స మాంతర కక్ష్యలలో ప్రవేశపెట్టగలిగిన మన శా స్తవ్రేత్తలు ‘ఆర్యభటు ని’ వారసత్వ స్ఫూర్తికి మరోసారి సార్థకతను కలిగించారు. వరాహ మిహిరుని వారసులు వారు! ఆర్యభట్టు కలియుగాబ్ది కలియుగం నాలుగవ శతాబ్దిలో జీవించాడు. ఇప్పటికి దాదాపు నాలుగువేల ఏడు వందల అరవయి ఏళ్లకు పూర్వుడు. ప్రస్తుతం కలియుగంలో యాబయి రెండవ శతాబ్ది నడుస్తోంది. వరాహ మిహిరుడు రెండువేల వంద ఏళ్లకు పూర్వం నాటి వాడు. కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో అఖండ భారత దేశాన్ని పాలించిన విక్రమ సమ్రాట్టు ఆస్థానంలోని వాడు వరాహ మిహిరుడు. ఇప్పుడు ‘దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య’- సార్క్- గా ఏర్పడి ఉన్న దేశాలు ఈ ‘అఖండ భారత్’లో భాగమై ఉండడం వరాహ మిహిరుని సమకాలం నాటి భౌగోళిక వాస్తవం!
శ్రీహరికోట ప్రయోగ క్షేత్రం నుంచి పైకెగసిన ‘దక్షిణాసియా ఉపగ్రహం’ ఈ ప్రాచీన స్ఫూర్తిని స్ఫురింపచేస్తోంది. వరాహ మిహిరుడు, మహాకవి కాళిదాసు, భట్టోత్పలుడు వంటి ఖగోళ విజ్ఞాన వేత్తల రచనలు, పరిశోధనలు అఖండ భారత దేశాలకు మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి వెలుగులను వెదజల్లాయి. కలియుగం పూర్వం నుంచి భారతదేశంలో ప్రచారంలో ఉండిన ‘సూర్య సిద్ధాంతం’ అనే అంతరిక్ష విజ్ఞాన గ్రంథం ప్రపంచంలోనే అతి పురాతనమైనది. సజ్జనశక్తి సమాజానికి రక్షణ, దుర్జనశక్తి సమాజ భక్షణ! ఖగోళ విజ్ఞానం సహా వివిధ విజ్ఞాన రంగాల్లో అగ్రగాములై ఉండిన భారతీయులు తమ విజ్ఞాన సంపదను వాణిజ్య వస్తువుగా మార్చలేదు. మానవీయ స్వభావంతో విశ్వహిత చింతనలో ‘వసుధ’ను ‘ఏక కుటుంబం’గా సంస్కరించ ప్రయత్నించారు. ఈ విజ్ఞాన సంపదను వివిధ సహస్రాబ్దులలో ప్రపంచంలోని వివిధ దేశాల వారు మన దేశానికి వచ్చి నేర్చుకొని వెళ్లారు. నౌకా నిర్మాణం, కాల గణనం, ఖగోళ చరాల స్యరూప స్వభావాల నిర్ణయం వంటివి కొన్ని మాత్రమే. శక్తిని ఉపయోగించి భారతదేశం ఇతర దేశాలను దురాక్రమించ లేదు. ఆర్థిక సంపదను పెట్టుబడిగా మార్చి విదేశాలలో వాణిజ్య సామ్రాజ్యాలను నిర్మించలేదు. ఆయా దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని కబళించలేదు. తమ మతాలను భాషలను జీవనరీతులను ఇతర దేశాలపై భారతీయులు రుద్దలేదు. శక్తిమంత భారత్ మాననీయ సంస్కారాలను అవనికి ప్రసాదించింది, ఆశ్రయించిన వివిధ దేశాల ప్రజలకు ఆతిథ్యం ఇచ్చింది. కలియుగం 5119 వైశాఖ శుద్ధ దశమి నాడు నింగికెగసిన ఉపగ్రహం ఈ పరంపరకు ప్రతీక. ‘్భరతీయ అంతరిక్ష పరిశోధక సంస్థ’ - ఇస్రో- నిలబెట్టిన మరో విజయ పతాక..
విశాల విశ్వం- యూనివర్స్-లోని ఉపగ్రహాలు, గ్రహాలు, గ్రహాలతో కూడిన నక్షత్రాలు, నక్షత్ర స మూహాల బ్రహ్మాండాలు- గెలాక్సీస్ పరస్పరం మైత్రీభావంతో పరిక్రమిస్తుండడం వాస్తవం. ‘ఇరుగు పొరుగు’ మైత్రి ఈ వైరుధ్య రహితమైన సమన్వయ సహితమైన నిరంతర ప్రస్థానానికి వౌలిక సూత్రం. సృష్టిగత వాస్తవాలకు అనాదిగా సామాజిక ప్రతిబింబం భారతీయ సాంస్కృతిక సమాహారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇరుగు పొరుగు మైత్రికి మరోసారి ఆచరణను కల్పిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన మంత్రివర్గ పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవానికి ‘సా ర్క్’ దేశాల ప్రభుత్వాధినేతలందరి నీ ఆ హ్వానించడం ద్వా రా మోదీ ఇరుగు పొ రుగు దేశాలలో మై త్రిని పెంపొందించుకొనడానికి మరో శ్రీ కారం చుట్టాడు. మన అంతరిక్ష పరిశోధన ఫలితాలను ‘సార్క్’ దేశాలకు సమానంగా పంచాలన్న మన ప్రభుత్వ నిర్ణయం ఈ మైత్రికి కొనసాగింపు. ‘సార్క్’ దేశాలకు ఉమ్మడిగా ఒక ఉపగ్రహాన్ని రూపొందించడానికి సంకల్పించిన కొన్ని నెలలలోనే ‘ఉపగ్రహం’ పైకెగసి కక్ష్యలో ప్రవేశించడం అద్భుతమైన పరిణామం. ‘సార్క్’ దేశాల మధ్య సంఘర్షణ- కాన్‌ఫ్లిక్ట్- కాక సహకారం- కో ఆపరేషన్-ను పెంపొందించడానికి మన ప్రధాని చెప్పినట్టు ఈ ఉపగ్రహం ప్రయోగ విజయం దోహదం చేయగలదు. విధ్వంసం- డిస్ట్రక్షన్- కాక వినూతన ప్రగతి- డెవలప్‌మెంట్- ప్రాతిపదికగా ‘దక్షిణాసియా ఉపగ్రహం’ ఇరుగు పొరుగు దేశాలను మరింత సన్నిహితం చేయగలదు.
ఈ సమైక్య అంతరిక్ష ప్రస్థాన ప్రగతి గీతాలాపనలో పాకిస్తాన్ పాలకులు స్వరం కలుపకపోవడం ఆశ్చర్యం కాదు. భారత వ్యతిరేకత పాకిస్తానీ పాలకుల మనుగడకు ప్రాతిపదిక. భారతీయ మైత్రీ పథానికి పాకిస్తాన్ దూరంగానే ఉండడం సహజం. కానీ ఇలా దూరంగా ఉండడం వల్ల ‘సార్క్’లో పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ విధానాన్ని నిరసిస్తున్న ‘సార్క్’లోని ఇతర దేశాలు ఇప్పుడు పాకిస్తాన్‌కు మరింత దూరమయ్యాయి. ‘ఇరుగు పొరుగు దేశాలకు ప్రాధాన్యం’- నైబర్స్ ఫస్ట్- అన్న మన విధానాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్‌దీవులు, ఆఫ్ఘానిస్థాన్, నేపాల్, భూటాన్ ప్రభుత్వాలు ప్రశంసించడం శుక్రవారం నాటి శుభ పరిణామం..