సంపాదకీయం

చిల్లరకొట్టుకు చిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని చిన్న వ్యాపారాలు సమూలంగా అంతరించిపోవడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది! ఆహార రంగంలోని చిల్లర వ్యాపారంలోకి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలు చొరబడడానికి 2012లోనే ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందువల్ల ‘రసాయన సంకర ఆహార పదార్థాల’-ప్రాసెస్డ్ ఫుడ్-ను అమ్మడానికై బహుళ జా తీయ వాణిజ్య సంస్థలు దుకాణాలు తెరిచాయి, తెరుస్తున్నాయి. వీటి ‘ఆకర్షణ’ వలలో పడిన వినియోగదారులు క్రమంగా స్థానిక చిల్లర దుకాణాలకు వెళ్లడం మానుకుంటున్నారు! కృత్రిమమైన మెరుగులతో వినియోగదారులను సమ్మోహితులను చేస్తున్న ‘బహుళ జాతీయ’ విదేశీయ సంస్థల దుకాణాలతో తరతరాలుగా ‘పాతబడిపోయిన’ చిల్లర వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం వక్రీకరిస్తోంది. చిల్లర వ్యాపారంలోకి భారీ ఎత్తున చొరబడిన విదేశీయ సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు స్థానికంగా ఉన్న కిరాణా కొట్టు వ్యాపారులతో పోటీ పడలేకపోతున్నాయట! ఇది కేంద్ర ప్రభుత్వానికి మిక్కిలి ఆందోళన కలిగిస్తున్న విషయమని ‘సంకర ఆహార’-్ఫడ్ ప్రాసెసింగ్- వ్యవహారాల మంత్రి హరిస్మరత్ కౌర్ బాదల్ ప్రకటించడం దివాలాకోరు ఆర్థిక విధానానికి చిహ్నం. ఈ దివాలా కోరు ఆర్థిక విధానం మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపొందింది. దేశంలోని కోట్ల చిల్లర వ్యాపారుల పొట్టలు కొట్టి, విదేశీయ ఘరానా వ్యాపారుల పెట్టెలు నింపడం ఈ విధానం లక్ష్యం.. అ యితే, విదేశీయ వ్యాపారుల పెట్టెలు పూర్తిగా నిండడం లేదని, స్థానిక ‘చిల్లర’ వ్యాపారులు సర్వ సమగ్ర నిర్మూలనకు ఇంకా గురి కాలేదని మంత్రిణి పదే పదే ఆందోళన వ్యక్తం చే స్తుండడం నడచిపోతున్న వైచిత్రి. మంగళవారం హరిస్మరత్ కౌర్ బాదల్ మరోసారి వాపోయారు. తినుబండారాలను అమ్ముతున్న స్థానిక వ్యాపారులు తమ చిల్లర దుకాణాలలో ఆహారేతర వస్తువులను, పదార్థాలను అమ్మి అధిక లాభాలను ఆర్జిస్తున్నారట! పక్కనే నెలకొని ఉన్న విదేశీయ బృహత్ సంస్థల చిల్లర దుకాణాలలో కేవలం తినుబండారాలను మాత్రమే అమ్ముతున్నారట! ఎందుకంటే ఈ చిల్లర దుకాణాలలో కేవలం తినుబండారాలను అమ్మడానికి మాత్రమే మన ప్రభుత్వం విదేశీయ సంస్థలకు అనుమతినిచ్చింది! ఫలితంగా విదేశీయ సంస్థలు నష్టపోతున్నాయన్నది ‘బాదలమ్మ’ బాధకు ప్రాతిపదిక! అందువల్ల విదేశీయ సంస్థల వారు స్వదేశీయ ‘అర్భక’ వ్యాపారులతో పోటీ పడడానికి వీలైన పథకాన్ని ‘సంకర ఆహార’ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు రూపొందించారు!
ఈ పథకం ప్రకారం ఆహార పదార్ధాలను ప్రధానంగా తినుబండారాలను మాత్రమే అమ్ముతున్న విదేశీయ సంస్థలు తమ దుకాణాలలో ఇకపై ఆహారేతర పదార్థాలను కూడ అమ్ముకోవడానికి వీలు కల్పిస్తారట! ‘ఇకపై..’ అని అంటే ఈమంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం లభించిన తరువాత అని అర్థం! ఆహార రంగంలోని చిల్లర వ్యాపారంలో వంద శాతం పెట్టుబడులను పెట్టడానికి ఇదివరకే విదేశాల ఘరానా వర్తకులకు మన ప్రభుత్వం అనుమతినిచ్చింది! ఇప్పుడు హరిస్మరత్ కౌర్ బాదల్ సిఫార్సు ప్రకారం ఈ విదేశీయుల చిల్లర దుకాణాలలో ఆహారం, తినుబండారాలు మాత్రమే కాక వందలాది ఆహారేతర వస్తువులు కూడ అమ్మవచ్చు! సంపన్న దేశాలలోని ‘తిండి’ రంగంలో వ్యాపారం పరాకాష్ఠకు చేరి స్తంభించిపోయిందట! అందువల్ల ‘తిండి’ని అమ్మే అవకాశాలు భారీగా ఉన్న మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అనేక విదేశీయ సంస్థలు సిద్ధంగా ఉన్నాయట! అరవై ఐదు వేల కోట్ల రూపాయల విదేశీ నిధులు రెక్కలు కట్టుకుని వాలడానికి సిద్ధంగా ఉన్నాయట! అయితే తమ ‘కొట్టు’లలో తిండితోపాటు ఇతర వస్తువుల అమ్మకానికి అనుమతి ఇస్తేనే ఈ పెట్టుబడులను పెట్టగలమని విదేశీయ వాణిజ్య సంస్థల వారు నిబంధనలను విధించారట! అందువల్ల ఈ నిబంధనను అంగీకరించి తీరాలని తమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందట! అక్టోబర్‌లోగా ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వారు బాదల్‌కు హామీ కూడ ఇచ్చారట! నవంబర్‌లో జరిగే ‘్భరత సంబంధ ప్రపంచ ఆహార సదస్సు’లోగా ఈ ప్రతిపాదన అమలు జరిగిపోతుందట!
దేశంలోని చిల్లర వ్యాపారులు అంతరించిపోవడానికి దోహదం చేసే ఈ ప్రతిపాదనను రూపొందించిన హరిస్మరత్ కౌర్ బాదల్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ‘స్వదేశీయ జాగరణ మంచ్’ వారు గత మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసారు. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం వారు కాని, ఆర్థిక మంత్రి కాని ఈ ప్రతిపాదన గురించి ఇంతవరకూ నోరు మె దపలేదు! అందువల్ల బాదల్ పథకం అ మలు జరగడం ఖా యమన్నది జరుగుతున్న ప్రచారం! 2014 నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు అ ప్పుడు ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతాపార్టీ బహుళ వస్తు-మల్టీ బ్రాండ్- రంగంలోని చిల్లర వ్యాపారంలోకి విదేశీయులను అనుమతించరాదని పదే పదే కోరింది. 2011లో ‘చిల్లర’ విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యం- ఫారిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఏర్పడడానికి వీలు లేదని కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. వివిధ రాజకీయ, స్వచ్ఛంద సంస్థలు ఈ ‘్ఫరిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్’-ఎఫ్‌డిఐ-ను తిరస్కరించాయి. కానీ, 2012లో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం అప్పటి అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హుస్సేన్ ఒబామా ఒత్తడికి లొంగిపోయింది, ‘చిల్లర’ ఎఫ్‌డిఐని ప్రవేశపెట్టింది. ఆ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అమెరికాకు చెందిన ‘వాల్‌మార్ట్’ సంస్థ! ‘వాల్‌మార్ట్’ వారి దుకాణాలను తెరవనివ్వబోమని లోక్‌సభలో అప్పటి భాజపా నాయకురాలు సుషమా స్వరాజ్ ప్రతిజ్ఞ చేశారు.. ప్రస్తుతం ‘వాల్‌మార్ట్’ దేశమంతటా దుకాణాలు తెరుస్తోంది! భాజపా ప్రతిజ్ఞ ఏమయినట్టు??
‘్ఫడ్ ప్రాసెసింగ్’ పేరుతో రసాయనాలతో సంకరమైన తినుబండారాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్రక్రియను ‘ఆహార శుద్ధి’ అని పిలవడం వాస్తవానికి వక్రీకరణ. నిజానికి శుద్ధమైన ప్రాకృతికమైన ఆహారం రసాయన సాంకర్యమై ‘అశుద్ధ’మైపోతుంది! సంప్రదాయ రీతిలో ఆహారాన్ని నిలువచేసే ప్రక్రియలు అంతరించాయి. రసాయనాలతో కల్తీ అయిన తినుబండారాల వల్ల వినియోగదారులు విచిత్ర వ్యాధులకు గురి అవుతున్నారు...