సంపాదకీయం

పాకిస్తాన్‌కు శృంగభంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికపై అభిశంసించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. అమృతసర్‌లో ఆదివారం జరిగిన ‘అఫ్ఘానిస్థాన్ సంబంధ ఆసియా సదస్సు’- హార్ట్ ఆఫ్ ఆసియా- హెచ్‌ఓఏ- కాన్ఫరెన్స్-లో పాకిస్తానీ లష్కర్ ఏ తయ్యబా- ఎల్‌ఇటి-, జాయిష్ ఏ ముహమ్మద్- జెఇఎమ్-లను అభిశంసిస్తూ తీర్మానించడంతో ఈ విజయం ప్రస్ఫుటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసికొల్పుతున్న సీమాంతర ఉగ్రవాదం అటు అఫ్ఘానిస్థాన్‌కు ఇటు మన దేశానికి ప్రమాదకరంగా పరిణమించడం ఈ సదస్సుకు నేపథ్యం. 2002లో అఫ్ఘానిస్థాన్‌లో అల్ ఖాయిదా, తాలిబన్ ‘జిహాదీ’ ముఠాల బీభత్సకాండను నిర్మూలించడంలో అండగా నిలచినట్టు అభినయించిన పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు అఫ్ఘానీ జిహాదీలను ప్రోత్సహించడం సమాంతర పరిణామం! అయితే ఈ సమాంతర పరిణామాలు సంభవిస్తుండిన సమయంలో అఫ్ఘానిస్థాన్ పౌర ప్రభుత్వం పాకిస్తాన్ తీరును నిరసించలేక పోయింది. ఇప్పుడు అమృతసర్ సదస్సు సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యలను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ పరుష పదజాలంతో నిరసించడం మనకు లభించిన దౌత్య విజయం. పాకిస్తాన్ ప్ర భుత్వ జిహాదీ బీభత్స వికృత రూపాన్ని ఘనీ ఇలా తీవ్రంగా దుయ్యబట్టడం పట్ల సదస్సులో పాల్గొన్న ఇరాన్ ప్రతినిధులు కాని సౌదీ అరేబియా ప్రతినిధులు కాని అభ్యంతరం చెప్పకపోవడం కూడా మన ప్ర భావం విస్తరిస్తోందనడానికి చిహ్నం. ఎందుకంటే సౌదీ అరేబియా, ఇరాన్ రెండూ పాకిస్తాన్‌కు మిత్రదేశాలు. పాకిస్తాన్‌లో ‘శిక్షణ’ పొంది ఇటు మన దేశంలోకి, అటు అఫ్ఘానిస్థాన్‌లోకి చొరబడుతున్న జిహదీలకు సైద్ధాంతిక ఆర్థిక సహాయం అందజేస్తున్నది సౌదీ అరేబియా. ఇరాన్ కూడా దశాబ్దుల తరబడి మనక వ్యతిరేకంగా పాకిస్తాన్‌ను సమర్థించింది. ఇరాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా మన దేశానికి ‘ఇంధన వాయువు’ను సరఫరా చేయటానికి గొట్టపు మార్గాన్ని నిర్మించే పథకం భగ్నమైంది కూడా. ఈ గొట్టపు మార్గం- పైప్‌లైన్- ఇరాన్ నుండి పాకిస్తాన్ వరకూ నిర్మాణమై పోయింది కూడా. ఇలా పరస్పరం బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీలు పాకిస్తాన్‌ను సమర్థించడం సుదీర్ఘ చరిత్ర. యెమన్‌లో తాలిబన్ తండాలను ఇరాన్ సమర్థిస్తుండగా సౌదీ అరేబియా మాత్రం వ్యతిరేకించింది. కానీ ఈ రెండు దేశాలు ఇప్పుడు అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్‌ల మధ్య సమాన దూరాన్ని పాటిస్తుండడం అమృతసర్ సదస్సుకు నేపథ్యం. అమృతసర్ సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘానీ అధ్యక్షుడు అషఫ్ ఘనీ పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను నిరసించడాన్ని ఇరాన్, సౌదీ అరేబియా ప్రతినిధులు వ్యతిరేకించ లేదు. పశ్చిమ ఆసియా దౌత్యరంగంలో ఇటీవలి కాలంలో వచ్చిన పరివర్తన ఇందుకు కారణం! ఈ పరివర్తన కూడా మన దౌత్య విజయం.
తన బీభత్స వికృత ముఖానికి దౌత్యం రంగు పులుముకొనడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం అమృతసర్‌లో ఘోరంగా విఫలమైంది. మన ప్రభుత్వం ఒకవైపు, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు మరోవైపు పాకిస్తాన్ ‘అభినయాన్ని’ తిప్పికొట్టడం అమృతసర్‌లో సంభవించిన ప్రధాన పరిణామం. ఆదివారం నాటి సదస్సులో పాల్గొనడానికై శనివారమే అమృతసర్ చేరుకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి విదేశీ సలహాదారు సర్తాజ్ అజీజ్ అమృతసర్‌లోని హర్‌మందిర్ సాహిబ్- బంగారు దేవాలయాన్ని- సందర్శించటానికి చేసిన యత్నం విఫలమైంది. మన ప్రభుత్వం అనుమతించక పోవడం సర్తాజ్ అజీజ్‌కు చెంపపెట్టు. స్వర్ణ దేవాలయాన్ని దర్శించడం ద్వారా తమ జిసాదీ స్వభావాన్ని దాచుకుని సర్వమత సమభావ భంగిమలను అభినయించాలన్నది అజీజ్ దుస్తంత్రం! కానీ జిహాదీ బీభత్సకాండను విడనాడే వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలనూ జరపరాదన్న మన ప్రభుత్వ విధానం అమృతసర్ సదస్సు సందర్భంగా మరోసారి ధ్రువపడింది. మన ప్రభుత్వ జాతీయ భద్రాతా వ్యవహారాల సలహాదారుడు అజిత్ దోవల్‌తో మాటలు కలపడానికి సర్తాజ్ అజీజ్ చేసిన యత్నం కూడా బెడిసికొట్టింది. మన ప్రభుత్వం బీభత్స పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్న వాస్తవం అమృతసర్ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులకు మరోసారి స్పష్టమైంది.
అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ మరింత తీవ్రంగా సర్తాజ్ అజీజ్‌కు చీవాట్లు పెట్టడం పాకిస్తాన్ ప్రభుత్వం బహుశా ఊహించని పరిణామం! సదస్సు జరిగింది- అఫ్ఘానిస్థాన్‌లో శాంతిభద్రతలను పెంపొందించడానికి, ఆర్థిక సౌష్టవం కలిగించే పథకాలను అమలు జరపడానికి వీలైన చర్చల నిర్వహణకు! ఈ చర్చలలో పాకిస్తాన్ పాల్గొనడానికి సైతం అఫ్ఘానిస్థాన్ నిరసించడం పాక్‌కు జరిగిన శృంగభంగం. నిజానికి పాకిస్తాన్ కొమ్ములు విరగలేదు, కోరలు విరిగిపోయాయి. అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు ఇలా ‘కోరలు’ విరిచిన దృశ్యం సౌదీ అరేబియా, రష్యా తదితర దేశాల ప్రతినిధులకు అబ్బురపాటు కలిగించి ఉండవచ్చు! ఒం టరి అయిపోయిన పాకిస్తాన్‌కు రష్యా నుంచి ఓదార్పు లభించడం ఒ క్కటే సమావేశం పరిధిలో ఇమడని విపరిణామం. ఈ ‘ఓదార్పు’- నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వహిస్తున్న అమెరికా వ్యతిరేక విధానంలో భాగం మాత్రమే. అమెరికా నుంచి దూరంగా జరుగుతున్న పాకిస్తాన్ రష్యాకు చేరువగా వెడుతోంది. అఫ్ఘానిస్థాన్ అభివృద్ధి కోసం దాదాపు మూడువేల ఐదువందల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలన్న పాకిస్తాన్ ప్రతిపాదనను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు స్వయంగా వ్యతిరేకించడం పాకిస్తాన్ పరాభవానికి పరాకాష్ఠ! అఫ్ఘానిస్థాన్‌లోను, ఇరుగు పొరుగు దేశాలలోను శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పాకిస్తాన్ మొదట విడనాడాలన్నది అషఫ్ ఘనీ చేసిన హెచ్చరిక!
మన ప్రభుత్వం బహిష్కరణకు, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుని అభిశంసనకు గురైన పాకిస్తాన్ ప్రతినిధిని మిగిలిన ప్రతినిధులు కూడా కలసుకుని దైపాక్షిక చర్చలు జరుపలేదు. సదస్సుకు ముందు, తర్వాత సర్తాజ్ అజీజ్ గంటల తరబడి తన హోటల్ గది ముందు కూర్చుని ఉండిపోయాడు. మన దేశంలో పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్‌తో మాత్రమే ఆయన ‘చర్చలు’ జరిపాడు. చౌబహార్ ఓడరేవు అభివృద్ధి పథకాన్ని మన ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా ఇరాన్ పాకిస్తాన్‌కు ఇదివరకే ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు పాకిస్తాన్ బీభత్స చర్యలను నిరసించిన తీర్మానాన్ని ఇరాన్ వ్యతిరేకించ లేదు! ఒకప్పుడు అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను ‘సోదర దేశం’గా ప్రకటించింది. ఇప్పుడిలా శత్రుదేశంగా భావించడం ప్రాం తీయ దౌత్యరంగంలో సంభవించిన విప్లవం.