కరీంనగర్

గతమే గొప్పది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పాత పద్ధతుల్లో సాగు లాభదాయకం
* వ్యవసాయంలో మహిళలదే కీలకపాత్ర
* కూరగాయల సాగుతో అదనపు ఆదాయం
* రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేందర్
కరీంనగర్, నవంబర్ 20:‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా గతమే గొప్పది. పాద పద్ధతుల ద్వారా ఇంటి (పెంట) ఎరువుల వాడకంతో వ్యవసాయం సాగుచేస్తే లాభదాయకంగా ఉండటంతోపాటు అందరికి ఆరోగ్యకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల విత్తనాల మినీ కిట్స్, పశుగ్రాస విత్తనాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయంలో మహిళలదే కీలకపాత్ర అని, పంట పొలాల్లో ఎక్కువగా పనిచేసేది మహిళలేనని అన్నారు. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం గ్రామాలలో రైతులు కూరగాయలు కొనేవారు కాదని, సాగుచేసి పది మందికి ఇచ్చేవారని, అలాంటిది ప్రస్తుతం పట్టణాల నుండి గ్రామాలకు కూరగాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల సాగుతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి చెందవచ్చని అన్నారు. రసాయన ఎరువులతో కూరగాయలను సాగుచేస్తే ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని, ఇంటి ఎరువు(సేంద్రియ)లతో సాగుచేస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల మిశ్రమ పంటలు పండించాలని, అందుకే 90శాతం సబ్సిడీపై మహిళా రైతులకు 12రకాల కూరగాయల విత్తనాలతో కూడిన మిని కిట్స్ అందిస్తున్నామని అన్నారు. కిట్స్‌లో బీర, వంకాయ, బీన్స్, టమాట, బెండ, మునగ, మిరప, పాలకూర, మెంతి, సోర, గోరుచిక్కుడు, కాకర విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి మహిళా రైతు ఈ కూరగాయ విత్తనాలను తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలో రసాయనిక ఎరువులు వాడకుండా సాగుచేసుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందాలని సూచించారు. కూరగాయల సాగుతోపాటు పశుగ్రాసాన్ని పెంచుకుని పాడి పశువుల ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయానికి కేంద్ర బింధువని, జిల్లా నుండి కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంత్రి రాజేందర్ ఆకాంక్షించారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ రైతులు సొంతంగా పండించే కూరగాయలతో ఆరోగ్యంగా ఉంటారని, కూరగాయల విత్తనాల కిట్స్ పంపిణీ ద్వారా మహిళా రైతులు స్వయం ఉపాధి పొందుతారని అన్నారు. ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే పెంట ఎరువులతో కూరగాయలు పండించాలని, కోతిమీర, మెంతి సాగుతో అధిక లాభాలు వస్తాయని చెప్పారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు కూరగాయల సాగు అదనపు ఆదాయాన్ని పెంచుటకు దోహదపడుతుందని, ఈ అవకాశాన్ని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మంత్రి మహిళా రైతులకు కూరగాయల మిని కిట్స్ పంపిణీ చేశారు. ఈ సమావేశంలో అదనపు జెసి నాగేంద్ర, ఎంపిపి వాసాల రమేష్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి అరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ రాంచంద్రం, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.