రాష్ట్రీయం

పెరిగిన తెలంగాణ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని శాఖల్లో పెరిగిన రాబడి
దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు
రిజిస్ట్రేషన్ శాఖలో 30 శాతం పెరుగుదల
రవాణాలో 20 శాతం..ఎక్సైజ్‌లో 18శాతం వృద్ధి
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 7: వివిధ ప్రభుత్వ శాఖల్లో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని శాఖల్లోనూ గత సంవత్సరంతో పోలిస్తే దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.
ఆదాయాన్ని అర్జించే శాఖల కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సచివాలయంలో సోమవారం సమీక్ష జరిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, అటవీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖల కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. వారి శాఖల ఆదాయంపై సమీక్ష జరిపారు. అన్ని రంగాల్లోనూ ఆదాయం పెరిగిందని ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నవంబర్ చివరి కల్లా సుమారు 21వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించినట్టు సమీక్షలో తేలింది. వ్యాట్ సేల్స్ ట్యాక్స్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం పెరుగుదల కనిపించింది. ఎక్సైజ్ శాఖలో 3320 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం కన్నా ఇది 18 శాతం ఎక్కువ. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఆదాయం 30శాతం పెరిగింది. రవాణాశాఖ ఆదాయం 1460 కోట్ల రూపాయలు గత సంవత్సరం కన్నా 20 శాతం ఎక్కువ. 2016-17 బడ్జెట్‌కు అన్ని శాఖలు సిద్ధం కావాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. అమ్మకం పన్ను, వృత్తి పన్ను, పన్ను చెల్లించకుండా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం పై దృష్టిసారించాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. మైనర్ మినరల్స్ లీజులను సులభతరం చేయాలని, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
ఏడాది పాటు పూర్తి పన్నుల ఆదాయం, ఖర్చుల ఆధారంగా వచ్చే బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. 2016-17 బడ్జెట్‌పై దృష్టిసారించాలని కోరారు. రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై పూర్తి అవగాహనతో రూపొందిస్తున్న తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆర్థిక మంత్రి కోరారు.