క్రైమ్/లీగల్

కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం, అక్టోబర్ 24: కుటుంబ కలహాల నేపథ్యంలో నమోదైన కేసు విచారణ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఒక వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలి మృతిచెందిన ఘటన కూనవరం మండలం పొట్లవారిగూడెంలో బుధవారం కలకలం రేపింది. కేసు పెట్టిన బంధువులు, విచారణ పేరుతో పోలీసుల తీరు కారణంగానే తన తండ్రి మానసిక వ్యథతో మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి కుమారుడు బంధువులు, గ్రామస్థులతో కలిసి మృతదేహంతో రాస్తారోకోకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కుడియం గోపయ్య (58) రెండో కుమారుడు మోహన్‌కృష్ణకు, చింతూరు గ్రామానికి చెందిన చోడే శారదకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలంగా వీరిరువురికి మనస్పర్థలు రావడంతో పోలీసుస్టేషన్‌లో శారద ఫిర్యాదు చేసింది. దీనితో కేసును శారద స్వగ్రామమైన చింతూరుకు మార్పుచేయగా కౌనె్సలింగ్ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. ఇరువురి కుటుంబ సభ్యులు రాజీ చేసుకోవాలని అక్కడి పోలీసులు సూచించడంతో మంగళవారం కూనవరం నుంచి మోహన్‌కృష్ణ కుటుంబ సభ్యులు చింతూరు వెళ్లారు. అక్కడ శారద కుటుంబ సభ్యులు తమపై దాడి చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మోహన్‌కృష్ణ కుటుంబ సభ్యులను చింతూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. మోహన్‌కృష్ణ తల్లిదండ్రులు, అన్నదమ్ములను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసుస్టేషన్‌లో ఉంచారు. రాత్రి 9 గంటలకు మోహన్‌కృష్ణ మినహా మిగలినవారిని పోలీసులు పంపించేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయతే కుమారుడు మోహన్‌కృష్ణను పోలీసుస్టేషన్‌లోనే ఉంచడంతో తెల్లవార్లూ తీవ్ర ఆవేదనకు గురైన తండ్రి గోపయ్య బుధవారం ఉదయం ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని కూనవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే గోపయ్య మృతిచెందినట్టు వైద్యులు చెప్పారని మృతుడి పెద్ద కుమారుడు వెంకటకృష్ణ తెలిపాడు. తండ్రి మృతికి శారద కుటుంబ సభ్యులు, చింతూరు పోలీసులే కారణమని ఆరోపిస్తూ గ్రామస్థులతో కలిసి పొట్లవారిగూడెం గ్రామంలోని ప్రధాన రహదారిపై మృతదేహంతో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో వీఆర్ పురం ఎస్సై రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ విషయంపై చింతూరు సీఐ దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా ఇరువురి కుటుంబ సభ్యులను కౌనె్సలింగ్ నిమిత్తం పిలిపించామని, అంతే తప్ప ఎవరినీ ఇబ్బందులకు గురిచేయలేదని తెలిపారు.