ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ మెయిన్‌లైన్‌కు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్‌లైన్‌గా అభివృద్ధిచేసే ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నదని తెలుస్తోం ది. ఈ నెలలో కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకు అవసరమైన నిధులను కేటాయించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ సానుకూలతను వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రధా న సమస్యగా ఉన్న కాకినాడ రైల్వేలైన్‌ను మెయిన్‌లైన్‌లో విలీనం చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్టు కాకినాడ ఎంపి, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు తోట నరసింహం తెలిపారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. కాకినాడ నగరాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా ప్రకటించింది. దేశంలో పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో కాకినాడ కూడా ఉంది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన నేపథ్యంలో ఈ నగరాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతోపాటు భారీగా నిధు లు మంజూరు చేయనున్నది. కేంద్ర ప్రభుత్వం తొలి దశలోనే కాకినాడను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయడం ద్వారా ఈ నగరానికి ప్రాధాన్యతనిచ్చినట్టయ్యింది. కేంద్రం చొరవ కారణంగా రైల్వే శాఖ కూడా కాకినాడ వైపు దృష్టి సారించింది. కాగా, కాకినాడ లైన్‌ను పిఠాపురం మెయిన్‌లైన్‌లో కలపడానికి అవసరమైన స్థలాన్ని సేకరించి ఇవ్వడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకువచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థలసేకరణకు సిద్ధం గా ఉంది. పిఠాపురం-కాకినాడ మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వేలైన్‌ను నిర్మించాల్సి ఉంది. ఇందుకు గతంలో సుమారు రూ. 150 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు ఆ బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే పిఠాపురం, కాకినాడ నుండి సామర్లకోట జంక్షన్ మీదుగా రైళ్ళ రాకపోకలన్నీ జరుగుతాయి. రైల్వే ట్రాఫిక్ మొత్తం కాకినాడ మీదుగా సాగుతుంది. దీంతో కాకినాడ తీర ప్రాంతం మరింత అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి. పోర్ట్‌లు, ఆయిల్ రిఫైనరీలు, కెజి బేసిన్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కాకినాడ మెయిన్‌లైన్‌లో కలిస్తే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళతో పాటు వాణిజ్యపరమైన కార్గో కార్యకలాపాలు గణనీయంగా పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ ఏర్పాటైతే కోనసీమ ప్రాంతానికి రైలు సౌకర్యం కలుగుతుంది. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తీర ప్రాంత వాసులు, కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే అవకాశాలున్నాయి.