ఆంధ్రప్రదేశ్‌

గీత తమ్ముడు ఎస్టీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేల్చిన తూర్పుగోదావరి కలెక్టర్
సాలూరు, మార్చి 11: అరుకు ఎంపి కొత్తపల్లి గీతకు చుక్కెదురైంది. ఆమె సోదరుడు కొత్తపల్లి వివేకానందకుమార్ గిరిజనుడు కాదని, క్రైస్తవుడని(బిసి-సి) తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ నిర్దారించినట్లు సమాచారం. ఈ మేరకు ఈనెల 10న ఆయన ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గీత, ఆమె కుటుంబ సభ్యుల కులానికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2008లో రాష్ట్ర హైకోర్టు ఎంపి గీత, ఆమె కుటుంబసభ్యుల కులంపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే కలెక్టర్ ఆధ్వర్యంలోని స్క్రూటినీ కమిటీ కాలయాపన చేస్తూ వచ్చింది. 2014లో అరుకు ఎంపి కొత్తపల్లి గీత కులంపై గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పిటీషన్ దాఖలు చేశారు. గీత ఎస్సీ కాదని, ఆమె ఎన్నిక చెల్లనేరదని పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆరు నెలల్లోగా గీత కులంపై విచారణ చేసి నివేదిక పంపించాలని కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. గడువు ముగిసినా కలెక్టర్ విచారణ జరపకపోవడంతో సంఘం నాయకులు కలెక్టర్‌పై కోర్టుకు ఫిర్యాదుచేశారు. రెండు వారాల గడువు కోరిన కలెక్టర్ విచారణకు మొగ్గుచూపలేదు. మార్చి 3, 10న విచారణకు హాజరుకావాలని కోర్టు కలెక్టర్, ఎంపి గీతకు నోటీసులు పంపినా వారు హాజరుకాలేదు. తాజా పరిణామాల నేపధ్యంలో ఎంపి గీత సోదరుడు వివేకానందకుమార్ ఎస్‌సి కాదని నిర్దారిస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపి గీతకు కూడా ఇవే ఉత్తర్వులు వర్తించే అవకాశాలు ఉన్నాయని గిరిజన ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంఘం న్యాయసలహాదారు రేగు మహేశ్వరరావు అన్నారు.