రాష్ట్రీయం

ఏపి, తెలంగాణలో విద్యుత్ చార్జీల వడ్డన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: తెలుగు రాష్ట్రాలు విద్యుత్ చార్జీలు వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిస్కాంలు రూ.783 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని ఏపిఇఆర్‌సిని కోరాయి. తెలంగాణ డిస్కాంలు ఎకాఎకిన రూ.1958 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని టిఎస్‌ఇఆర్‌సిని కోరుతూ ప్రతిపాదనలు ఇచ్చాయి. ఈ నెలాఖరులోపల బహిరంగ విచారణలు నిర్వహించి తమ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లు ప్రకటించాల్సి ఉంది. ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం దాదాపు రూ.3000 కోట్ల సబ్సిడీని ఇచ్చేందుకు అంగీకరిస్తూ వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఏపి విద్యుత్ రెవెన్యూ లోటు రూ. 5148 కోట్లు ఉంది. ఇందులో తమకు రాష్ట్రప్రభుత్వం రూ.4364 కోట్ల సబ్సిడీ ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నామని, దీంతో రూ.783 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచకతప్పదని డిస్కాంలు పేర్కొన్నాయి. ఏపి ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో మూడు వేల కోట్ల రూపాయలనే సబ్సిడీ కింద ప్రతిపాదించింది. దీంతో దాదాపు రూ.2148 కోట్ల మేర లోటు ఇంకా మిగిలి ఉంది. మరో రూ.1400 కోట్ల మేర సబ్సిడీ భారాన్ని ఆంధ్రప్రభుత్వం భరించే స్ధితిలో లేదు.
తెలంగాణ విద్యుత్ సంస్థలు తమకు రూ. 30207 కోట్ల రెవెన్యూ అవసరమని, ప్రస్తుతం రూ.21418 కోట్ల ఆదాయం వస్తోందని పేర్కొన్నాయి. దాదాపు రూ.8789 కోట్ల లోటును భర్తీ చేసుకోవాల్సి ఉందని, ఇందులో ప్రభుతవం నుంచి సబ్సిడీ పోగా దాదాపు రూ. 1958 కోట్ల మేరకు లోటు భర్తీకి టారిఫ్ పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 100 యూనిట్ల పైబడి విద్యుత్‌ను వినియోగించే వారికి విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రతిపాదించారు. దాదాపు మొత్తం 9.14 శాతం మేర టారిఫ్ పెంచాలని డిస్కాంలు ప్రతిపాదించాయి.