విజయనగరం

ఫిబ్రవరిలోగా వ్యవసాయాభివృద్ధి పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 23: జిల్లాలో చేపట్టిన వ్యవసాయయాభివృద్ధి పనులు ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ మండలస్థాయి వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి తక్కువ వ్యవధి ఉన్న కారణంగా లక్ష్యాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల స్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సంబంధిత శాఖ అధికారులతో శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి కోసం అమలుచేస్తున్న పథకాలను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అధికారులు కృషిచేయాలని చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి, పంట సంజీవని, మైక్రో ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు తదితర పథకాల కోసం రైతుల నుండి దరఖాస్తులు తీసుకుని అర్హులను ఎంపికచేయాలని చెప్పారు. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రైతుకు సోలార్ పంపుసెట్లు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలోని కొన్ని మండలాలలో శాఖాపరమైన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తక్కువగా ఉందని చెబుతూ ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ జాయింట్ డెరెక్టర్ లీలావతి, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణం పనులపై
ప్రత్యేకశ్రద్ధ పెట్టండి
జిల్లాలో చంద్రన్నబాట కార్యక్రమం కింద చేపట్టే రోడ్లనిర్మాణాలపై ప్రత్యేకదృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాలలో ఈ పనులను ప్రారంభించి వెంటవెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలస్థాయి ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను సోమవారం నాటికి ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని, బుధవారం నుంచి పనులు ప్రారంభించాలని తెలిపారు. మార్చి 31నాటికి కేటాయించిన నిధులను ఖర్చుచేయాలని, పనులు పెండింగ్‌లో పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడేలా పనులు పారదర్శకంగా, నాణ్యతగా చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎస్‌ఇ వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైవి శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డున పడిన
ఆరోగ్యమిత్రలు
విద్యార్హతలు ఉండాలని ప్రభుత్వ జీవో
* ఉద్యోగాలు కోల్పోనున్న వందలాది మంది
* ఆందోళన ప్రారంభించిన ఆరోగ్యమిత్రలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 23: రాష్ట్రప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోగ్య మిత్రలు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో వైద్యఅరోగ్య శాఖలో సేవలు అందిస్తున్న సుమారు 200మంది ఆరోగ్య మిత్రలు అవసరమైన విద్యార్హతలు లేవనే కారణంతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్త్తూ ఆరోగ్యమిత్రల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగాలు లభించే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వక పోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆరోపించారు. అవసరమైన విద్యార్హతలు లేవనే నెపంతో తమను రోడ్డుకు ఈడ్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిరాజు ఆరోగ్యమిత్రల నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి పార్టీ తరపున మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే అప్రజాస్వామ్య విధానాలు అమలవుతున్నాయని, యువతను రోడ్డున పడవేసే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయడం అటుంచి ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, రోజువారి వేతనంపై పనిచేస్తున్న ఉద్యోగులను ఊడబెరుకుతున్నారని విమర్శించారు. ఆరోగ్యమిత్రల ఆందోళనకు తమపార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

అభివృద్ధి పనులకు కదలిక
* ఆంధ్రభూమి వార్తకు స్పందన
* రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: నగరంలో ఎట్టకేలకు అభివృద్ధి పనులలో కదలిక వచ్చింది. నగర పాలక సంస్ధ పరిధిలో నిధులు పుష్కలంగా ఉన్నా, అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. దీనిపై శనివారం ఆంధ్రభూమిలో ప్రచురితమైన ‘నిధులు పుల్...పనులు నిల్’ అనే వార్తకు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఈ మేరకు ఆదరాబాదరాగా శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరంలో 5, 17,12, 34 వార్డులలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ శంకుస్థాపన చేశారు. త్వరితగిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ సన్యాసిరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆదుర్తి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబరానికి సన్నాహాలు
* శంబర పోలమాంబ జాతరకు ముమ్మర ఏర్పాట్లు
మక్కువ, జనవరి 23: శంబర పోలమాంబ అమ్మవారి జాతర సమీపించడంతో శనివారం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం దేవాదాయశాఖ ఇవో నాగార్జున ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లను పకడ్బందీగా ఏర్పాటుచేశారు. భక్తులకు ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే క్యూలైన్లు, వినోధ కార్యక్రమాలు, సర్కస్ గ్రామానికి చేరుకున్నాయి. ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద 35వేల లడ్డూ ప్రసాదం, పులిహోర ఇప్పటికే సిద్ధం చేశామని ఇవో తెలిపారు. లడ్డూ ప్రసాదాన్ని ఇవొ నాగార్జున పరిశీలించారు. భక్తుల సేవల కోసం దేవాదాయశాఖ సిబ్బంది, సేవా సంఘ ప్రతినిదులు, సభ్యులు చేరుకుంటున్నారు. ప్రధాన ఆలయం ప్రాంగణంలో తలనీలాలు తీసేందుకు, మరుగుదొడ్లు, డ్రస్సింగ్ రూముల ఏర్పాటు చేస్తున్నారు. మామిడిపల్లి, శంబర రోడ్ల మరమ్మతులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగిస్తున్నారు.

ప్రచారం కంటే ప్రేమాభిమానాలే మిన్న

* సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్

కొత్తవలస, జనవరి 23: చేసే పనిలో ప్రచారంకంటే ఎదుటివారికి ఇచ్చే ప్రేమాభిమానాలే ముఖ్యమని సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్టులో నక్షత్ర వనం ప్రారంభానికి విచ్చేసారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరితో కలిసి నక్షత్ర వనాన్ని, నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు ద్వారా ప్రేమానురాగాలకు మొత్తం ఆస్తిని ధారపోసి జగదీష్‌బాబు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ట్రస్టు ద్వారా వికలాంగు సేవ ఉన్నతమైన కార్యక్రమని తెలిపారు. ట్రస్టు ద్వారా సుమారు 14 వేల మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇటువంటి వారు మరింత మంది సమాజానికి అవసరమని చెప్పారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె వి చౌదరి మాట్లాడుతూ డబ్బుతో ఎన్నడూ సుఖ సంతోషాలు రావని, చేసిన పనిలో ఎదుటివారి అభిమానం, అనురాగం చూపినపుడు వచ్చిన సంతోషం ముందు అన్నీ చిన్నవేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ ధనవంతుడు బిల్‌గేట్స్ కూడా తన తన సంపదలో 99శాతాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నానని గుర్తు చేసారు. తాను ఒక్కసారి ట్రస్టు సేవలు చూడటానికి వచ్చినప్పడు ఒక అబ్బాయికి కృత్రిమ అవయవం అమర్చి నడిపిస్తుండగా వారి తల్లిదండ్రులతో పాటు అతనిలో కలిగిన కలిగిన అనందాన్ని చూసానని, అప్పటినుండి ట్రస్టు సేవలకు అభిమానిని అయ్యాయని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి ఎం ఎస్‌కె జైస్వాల్ మాట్లాడుతూ ట్రస్టు సేవాలు అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్ యార్ల గడ్డ లక్ష్మిప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పేదలు నివాసం ఉన్నచోటే
పట్టాలివ్వాలి
* 296 జీవోలో మార్పులు చేయాలి: సిపిఎం నేతలు
* ఫిబ్రవరి 8న ధర్నా
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 23: పేదలకు వారు నివాసం ఉండే చోట పట్టాలివ్వాలని, కొన్ని దశాబ్ధాలుగా వేలాదిమంది పేదప్రజలు పక్కాగృహాలు లేక పూరిపాకల్లో నివాసం ఉంటూ అష్టకష్టాలను అనుభవిస్తున్నందున వారికి తక్షణమే పట్టాలిచ్చి పక్కాగృహాలను నిర్మించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేసారు. ఎల్‌బిజి భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో పేదలు నివాసం ఉండేచోట 100గజాలు ఉచితంగా రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం 296 జీవోను జారీ చేసిందని, అయితే జీవోలో పేర్కొన్న నిబంధనలు కారణంగా పేదలకు పట్టాలిచ్చే పరిస్థితులు కనిపించడంలేదని అన్నారు. జీవోలో నిబంధనలను సడలించాలని కోరారు. 296 జీవో ప్రకారం రోడ్డు ప్రక్కన, రైల్వే స్థలాలు, దేవాదాయ, చెరువులు, విలువైన ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ అవసరాలకు పనికివచ్చే భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వకపోతే జీవో ఎందుకు పనికి వస్తుందని ప్రశ్నించారు. అదేవిధంగా గతంలో పేదలకు పట్టాలిచ్చి నేటికి వారికి స్థలాలను చూపించలేదని, దీనిపై ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 8తేది వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. విజయనగరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు అక్కడే పట్టాలివ్వాలని, సారిపల్లి, గాజులరేగ, జమ్ము, లంకాపట్నం ప్రాంతాల్లో పట్టాలిచ్చిన పేదలకు స్థలాలను చూపించాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు నారాయణరావు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
* జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ లఠ్కర్
తెర్లాం, జనవరి 23: జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కేశ్‌బాలాజీ లఠ్కర్ తెలిపారు. తోటపల్లి కాలువ పరిశీలన అనంతరం శనివారం విలేఖర్లతో మాట్లాడారు. 24 వేల మంది రైతులకు 200 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు 152 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు. బయోమెట్రిక్ ద్వారా సరకులు అందజేయడంలో రాష్ట్రంలో జిల్లా మూడవ స్థానంలో ఉందన్నారు. సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ టెక్నికల్ టీము వాటిని సరిచేసినట్టు తెలిపారు.ముందుగా తోటపల్లి ప్రధాన కాలువ నుంచి పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు భూసేకరణ నిమిత్తం ఉద్దవోలు గ్రామం వెళ్లిపరిశీలించారు. ఆ గ్రామానికి చెందిన 9 మందిరైతుల నుంచి ఎకరా 86 సెంట్ల భూమిని కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఆయనతోపాటు తహశీల్దార్ యు.రాజకుమారి, ఆర్‌ఐ ఎం.కృష్ణమూర్తిలు ఉన్నారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
* ఎంప్లారుూస్ యూనియన్ నేతల డిమాండ్
బొబ్బిలి, జనవరి 23: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లారుూస్ నాయకుడు జి. అప్పలసూరి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో జిల్లా స్థాయి కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యోగుల తో పాటు పార్ట్‌టైం కంటెంజెంట్, డైలీవేజ్ తదితర ఉద్యోగులకు భద్రత కల్పించాలని, పదో పిఆర్సీ ప్రకారం బేసిక్‌ను వర్తింపజేయాలని కోరారు. ఈ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 43 శాతం జీతాలు పెంచడంతోపాటు ఇత ర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నాలుగు జిల్లాల ప్రాంతీయ సదస్సు ఈ నెల 31న విశాఖపట్టణంలో నిర్వహించనున్నామని, అధి క సంఖ్యలో ఈ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలోయూనియన్ నాయకులు కాంతారావు, శంకరరావు, మూర్తి, శివప్రసాద్ పాల్గొన్నారు.