ఆంధ్రప్రదేశ్‌

కొడుకు చేతిలో తండ్రి హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: మద్యం మత్తులో ఉన్న కుమారుడి చేతిలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సంజీవ్ అనే వ్యక్తి మద్యం సేవించి గ్రామంలో గొడవ చేస్తుండగా కుటుంబ సభ్యులు అతనిని వారించారు. తండ్రి రామాంజనేయులు కూడా ఘర్షణ వద్దని కొడుక్కి నచ్చజెప్పాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సంజీవ్ తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు. గ్రామస్థులు ఆస్పత్రికి తరలిస్తుండగా తండ్రి రామాంజనేయులు మరణించాడు.