బిజినెస్

ఫిట్నెస్ రంగంలోకి స్వైప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

7 నుంచి ఎఫ్-బ్యాండ్ అమ్మకాలు
ముంబయి, డిసెంబర్ 31: పుణే కేంద్రంగా పనిచేస్తున్న మొబైల్, ట్యాబ్లెట్ల వ్యాపార సంస్థ ‘స్వైప్ టెక్నాలజీస్’ ఫిట్నెస్ రంగంలోకి ప్రవేశించినట్లు గురువారం ప్రకటించింది. వినియోగదారుల కోసం రూ.1,499 ధరతో స్వైప్ ‘ఎఫ్-బ్యాండ్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘స్నాప్‌డీల్’ ద్వారా జనవరి 7వ తేదీ నుంచి వీటి అమ్మకాలు జరుపుతామని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫిట్నెస్ బ్యాండ్‌ను కొనుగోలుచేసే తొలి 100 మంది ఖాతాదారులకు 1,299 రూపాయల తగ్గింపు ధరతో దీనిని అందజేస్తామని తెలిపింది. 55 ఎంఎహెచ్ రీచార్జిబుల్ బ్యాటరీతో ఏకధాటిగా ఏడు రోజులు పనిచేసే ఈ ఈ ఫిట్నెస్ బ్యాండ్ మన శరీరంలో ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చయిందీ తెలియజేస్తుంది. (చిత్రం) మార్కెట్లో సందడి చేయనున్న స్వైప్ ‘ఎఫ్-బ్యాండ్లు’